Search
  • Follow NativePlanet
Share
» »సంక్రాంతి సంబరాల్లో కోట్లు కొల్లగొట్టాలంటే గోదావరి వెళ్ళాల్సిందే.!

సంక్రాంతి సంబరాల్లో కోట్లు కొల్లగొట్టాలంటే గోదావరి వెళ్ళాల్సిందే.!

సంక్రాంతి పండుగకు గోదావరకి ఎందుకుంత ప్రత్యేకత అంటే, గోదావరి జిల్లాలో పల్లె సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్గు వచ్చేది కోడిపందేలు. పిల్లల నుండి వృద్ధుల వరకూ పేద, ధనిక అను తేడా లేకుండా ఇవి ఎక్కడ జరుగు

తెలుగువారికి అన్ని పండగల కంటే మకర సంక్రాంతి చాలా పెద్ద పండుగ. సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంటను లక్ష్మీ రూపంలో ఇంటికి తెచ్చుకునే పండగ. రైతులు ఆనందోత్సవాలతో జరుపుకునే పండగ. ఈ పండగను మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు తమిళనాడు కర్నాటక మరియు ఇతర రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు.

ముఖ్యంగా రాయలసీమలో ఉండే రెండు గోదావరి తీరాల్లో సంక్రాంతి పండుగను కన్నుల పండుగా, సంప్రదాయ రీతిలో ఉంటాయి. సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తు వచ్చేది గోదావరి జిల్లా. కొత్త అల్లుల్లకు , బంధువులకు చక్కని మర్యాదలు చేసే సంప్రదాయం ఇక్కడ ఉంటుందని అంటుంటారు.

అందుకే ఏ పండక్కి ఇంటికి రాని అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకుల, కోడళ్లు, మనుమలు, మనుమరాండ్లు , అక్కలు, బావలు, అత్త, మామలతో ప్రతి ఇల్లూ సందడితో పండుగ హుషారుతో ఉంటుంది. కొత్త అల్లుళ్ల సందడి సరాసరే. వారికి ఇచ్చే బహుమతుల కోసం మామలు హైరానా పడుతుంటారు. భోగి మంటల కోసం పిల్లలు, యువకులు సందడి చేస్తుంటారు. హరిదాసుల పాటలు, గంగిరెద్దుల హడావిడి అంతా ఇంతా కాదు.

సంక్రాంతి పండుగకు గోదావరకి ఎందుకుంత ప్రత్యేకత అంటే

సంక్రాంతి పండుగకు గోదావరకి ఎందుకుంత ప్రత్యేకత అంటే

సంక్రాంతి పండుగకు గోదావరకి ఎందుకుంత ప్రత్యేకత అంటే, గోదావరి జిల్లాలో పల్లె సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్గు వచ్చేది కోడిపందేలు. పిల్లల నుండి వృద్ధుల వరకూ పేద, ధనిక అను తేడా లేకుండా ఇవి ఎక్కడ జరుగుతున్నా అక్కడ వాలిపోతుంటారు.

 పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్ళు పందేలు

పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్ళు పందేలు

నెమలి, కాకి, డేగా, పింగళ ఇలా కోళ్లకు రకరకాలుగా పేర్లు పెట్టి పందేళ్లోకి దింపుతారు. ఈ క్రీడలో పాల్గొనటానికి రాష్ట్రం నలుమూల నుండే కాక కర్నాటక, తమిళనాడు, కేరళ మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా వస్తుంటారు. కోళ్ళ మీద పందేలు కాస్తారు. పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్ళు పోటీలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతాయి.

ఈ పందేలను తిలకించేందుకు ప్రజలు ఆసక్తికి కనబరుస్తారు.

ఈ పందేలను తిలకించేందుకు ప్రజలు ఆసక్తికి కనబరుస్తారు.

ఈ పందేలను తిలకించేందుకు ప్రజలు ఆసక్తికి కనబరుస్తారు. కోళ్ళ పందేలు ఎక్కువగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణాలతో పాటు ఇతర కోస్తా జిల్లాలలో జరుగుతాయి.

గోదావరి గ్రామీణ ప్రాంతాల్లో

గోదావరి గ్రామీణ ప్రాంతాల్లో

గోదావరి గ్రామీణ ప్రాంతాల్లో కోడిపందేలు నిర్వహించడం ఎన్నో వేల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. చట్టవిరుద్దమని తెలిసినా, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా కోళ్ళ పందేలు మాత్రం ఆగవు. ప్రతి సంవత్సరం కోడి పందేల పేరుతో కోట్లు చేతులు మారుతుంటాయి. సంక్రాంతి సంబరాల్లో కోడిపందేలు హైలైట్ గా నిలుస్తుంటాయి. సంక్రాంతికి కోడిపందేలు లేకపోతే పండగ వాతావరణమే ఉండదని, తమిళనాడులో జల్లికట్టు లాగే తెలుగు రాష్ట్రాల్లో కోడి పందెలు సాంప్రదాయమేనని పందెంరాయుళ్లు వాదిస్తుంటారు.

PC:wikimedia.org

మరి ఈ కోడిపందేలా

మరి ఈ కోడిపందేలా

మరి ఈ కోడిపందేలా సంబరాలు చూడాలంటే ఉభయ గోదావరికి వెళ్ళాల్సిందే. పండగకు ఇక రెండు రోజులే ఉంది, అప్పుడే కోళ్ళ పందేల సందడి కనిపిస్తోంది.

ఉభయగోదావరిలో

ఉభయగోదావరిలో

ఉభయగోదావరిలో ఈ కోడి పందెలా ప్రత్యేత ఏంటంటే, ఒక సారి పుంజు పెందెంలో గెలిచిందంటే రెట్టింపు ధర పలుకుతుంది. ఎన్ని సార్లు విజయం సాధిస్తే అంతకంతకూ కోడి ధర పెరిగి వేల నుండి లక్షలకు చేరిపోతుంది. క్షణాల్లో పోటి ముగిస్తుంది, లక్షలు, కోట్లు చేతులు మారుతుంటాయి.

ఈ కోడి పందెలా చూడటానికి

ఈ కోడి పందెలా చూడటానికి

ఈ కోడి పందెలా చూడటానికి ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పందేలు కాసేందుకు వస్తుంటారు.

సంక్రాంతి మరుసటి రోజు కనుమ,

సంక్రాంతి మరుసటి రోజు కనుమ,

సంక్రాంతి మరుసటి రోజు కనుమ, కోళ్ళ పందేలు కనుమ నాడు కూడా స్థానికంగా నిర్వహిస్తుంటారు. కోడి పందేలు అనాదిగా వస్తున్న ఆచారం.

కోడి పందేలా మాట అటుంచితే

కోడి పందేలా మాట అటుంచితే

కోడి పందేలా మాట అటుంచితే , గోదావరి రుచులకు పెట్టింది పేరు. ఆతిథ్యంలో గోధావరి జిల్లాకు పెట్టింది పేరు. ఇక్కడ తయారు చేసే పిండివంటలు సున్నుండలు, జంతికలు, గోరుమీఠీలు, కొబ్బరి నూజు, ఇలంబీకాయలు, వెన్నప్పాలు, పొంగడాలను ఇప్పటికే తయారు చేసే పనిలో నిమగ్నం అయిపోయి ఉంటారు.

ఇక మాంసాహార విషయానికి వస్తే నాటుకోడి పులుసు

ఇక మాంసాహార విషయానికి వస్తే నాటుకోడి పులుసు

ఇక మాంసాహార విషయానికి వస్తే నాటుకోడి పులుసు, నాటికోడి ఇగురు, రొయ్యలు స్పెషాలిటీలు, చేపలతో తయారు చేసే కూరలకు లెక్కేలేదు. మాంసాహారుల జిహ్వను సంతృప్తి పరిచేవిధంగా ‘కోస'లు ఈ మూడు రోజులూ ఘుమఘుమలాడనున్నాయి.

రాయలసీమలో సంక్రాంతి పండుగను బాగా జరుపుకునే ప్రదేశాలు

రాయలసీమలో సంక్రాంతి పండుగను బాగా జరుపుకునే ప్రదేశాలు

విజయనగరం, వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలు.

ఈ పండగ వాతావరణంలో సంక్రాంతి సెలవులు

ఈ పండగ వాతావరణంలో సంక్రాంతి సెలవులు

ఈ పండగ వాతావరణంలో సంక్రాంతి సెలవులు మూడు నుండి 5 రోజులుండటంతో రాయలసీమంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చుట్టి రావచ్చు. అలాంటి ప్రదేశాలు దేవాలయలు తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం, అహోబిలం, బెజవాడ కనక దుర్గమ్మ, కదిరి నరసింహ స్వామి, లేపాక్షి, మహానంది, సింహాచలం, అతర్వేది, భీమవరం.

తెలంగాణా రాష్ట్రంలో కూడా

తెలంగాణా రాష్ట్రంలో కూడా

తెలంగాణా రాష్ట్రంలో కూడా సంక్రాంతి ఘనంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణా చుట్టు పక్కల చూడదగ్గ అతి ముఖ్యమైన ప్రదేశాలు, భద్రకాళి ఆలయం, హైదరాబాద్ బిర్లా మందిర్, జ్జాన సరస్వతి దేవాలయం, కర్మాన్ఘాట్, హానుమాన్ దేవాలయం, యాదగిరి గుట్ట, భద్రాచలం, వేయిస్తంభాల గుడి, కీసరగుట్ట, రామప్పదేవాలయం, సంగమేశ్వరం, అగస్తీశ్వరస్వామి దేవాలయం, చిలుకూరు బాలాజీ దేవాలయం మొదలైనవి.

PC- Vamsi Janga

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X