Search
  • Follow NativePlanet
Share
» »కొండలపై ఉండాల్సిన శ్రీనివాసుడు భూగర్భంలో దాక్కున్న క్షేత్రం తెలుసా? అలా ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది

కొండలపై ఉండాల్సిన శ్రీనివాసుడు భూగర్భంలో దాక్కున్న క్షేత్రం తెలుసా? అలా ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది

కొండలపై ఉండాల్సిన శ్రీనివాసుడు భూగర్భంలో దాక్కున్న క్షేత్రం తెలుసా? అలా ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది?

మన భారత దేశం ఆధ్యాతికతకు పెట్టింది పేరు. అందకు నిదర్శనం దేశమంతటా ఆలయాలు కొలువైన పుణ్య క్షేత్రాలుండటం. ఇక్కడ ఒక్కో క్షేత్రంలోని ఒక్కో ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు మరెక్కడా ఉండవు. అందులోనూ కుంభకోణంలో ప్రతి వీధిలో ఒక్కొక్క దేవాలయం ఉంది. ప్రతి దేవాలయం పురాణాల్లో ఏదో ఒక ఘట్టంతో ముడి పడి ఉండటం విశేశం.

ఇటువంటి ప్రదేశాలయు తీర్థయాత్రలు చేసే పర్యాటకులు ఆలయాల చరిత్ర, స్థలపురాణం, ఆలయ ప్రత్యేకతల గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని కనబరుస్తుంటారు. అలా సందర్శకుల్లో ఆసక్తిని రేకెత్తించే ఆలయం ఒకటి కుంభకోణం 'తిరుక్కుడందై'లో కొలువై ఉంది.

మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటిగా 'కుంభకోణం' (తిరు కుడందై) కనిపిస్తుంది. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామివారికి 'శారంగపాణి పెరుమాళ్' .. అమ్మవారికి కోమలవల్లి తాయారు అని పేరు.

సాధారణంగా శ్రీవెంకటేశ్వర స్వామి తాను కొలువై ఉండటానికి కొండలనే ఎంచుకుంటాడు. ఎందుకనగా ఆయన ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతిలోని పచ్చదనం చూసి పరమానందభరితుడువుతుంటాడు. ప్రశాంతమైన వాతావరణం గల పవిత్రమైన కొండలపై అలరారుతూ అలసటేకుండా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి శ్రీనివాసుడు భూగర్భంలో కొలువై ఉండటం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగలక మానదు.

ఈ కారణంగానే ఇక్కడ శ్రీనివాసుడిని పాతాళ శ్రీనివాసుడుగా కొలుస్తుంటారు. శ్రీనివాసుడు దర్శనం కోసం కొండలు ఎక్కాలని మాత్రమే తెలిసిన భక్తులకు, ఆయన కోసం భూగర్బంలోకి దిగడం చిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. శ్రీనివాసుడు ఎక్కడ ఉన్నా ఆయన వైభవం ఏమాత్రం తగ్గడు. ఆయన దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గదు. అందుకు నిదర్శనంగా కనిపించేది 'తిరుకుడందై' క్షేత్రం.

తమిళనాడు రాష్ట్రంలో ఉన్న విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటిగా విలసిల్లుతోంది. మరి ఈ ఆలయ చరిత్ర, స్థలపురాణం, శ్రీనివాసుడు భూగర్భంలో ఎందుకు దాక్కోవల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శారంగపాణి పెరుమాళ్..కోమలవల్లీ తాయారు

శారంగపాణి పెరుమాళ్..కోమలవల్లీ తాయారు

ఈ క్షేత్రంలో ప్రధానదైవంగా శారంగపాణి పెరుమాళ్..కోమలవల్లీ తాయారు దర్శనమిస్తుంటారు. ఈ గర్భాలయం రథం ఆకారాన్ని పోలివుండం విశేషం. . ఈ గర్భాలయానికి రెండు వైపుల మెట్లు వున్నాయి. ఉత్తర ద్వారానికి ఉత్తరాయణ వాకిలి అనీ .. దక్షిణ ద్వారానికి దక్షిణాయన వాకిలి అని పేరు. ఉత్తరాయణంలో ఉత్తరాయణ వాకిలిని తెరవడం విశేషం.

commons.wikimedia.org

అలాగే సూర్య భగవానుడి కోరిక మేరకు

అలాగే సూర్య భగవానుడి కోరిక మేరకు

అలాగే సూర్య భగవానుడి కోరిక మేరకు ఇక్కడ స్వామివారు ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రానికి 'భాస్కర క్షేత్రం' అనే పేరు కూడా వుంది. పూర్వం 'సుదర్శన చక్రం'తో పోటీపడిన సూర్యుడు తన తేజస్సును కోల్పోతాడు. ఆ తరువాత ఈ ప్రదేశంలో స్వామివారి అనుగ్రహంతో తన తేజస్సును తిరిగి పొందినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

Image source: commons.wikimedia.org

ఈ క్షేత్రాన్ని దర్శించిన

ఈ క్షేత్రాన్ని దర్శించిన

సూర్యభగవానుడి కోరికమేరకు స్వామి శారంగపాణిగా ఇక్కడ ఆవిర్భవించారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించిన వారి పాపాలు పటాపంచలైపోయి, సకల శుభాలు కలుగుతాయనేది మహర్షుల మాట. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల శారంగపాణి అనుగ్రహంతో పాటు సూర్యుడి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటుంటారు.

Image source: commons.wikimedia.org

సారంగపాణి ఆలయం

సారంగపాణి ఆలయం

ఆళ్వారులు సందర్శించిన 108 వైష్ణవాలయాలు గొప్ప పుణ్యక్షేత్రాలుగా ఇప్పటికీ విరాజిల్లుతున్నాయి. వాటిలో మొదటిది శ్రీరంగంలోని శ్రీరంగనాథ ఆలయం దీనిని 12 మంది ఆళ్లారుల్లో 11 మంది సందర్శించారు. రెండవది తొమ్మిదిమంది ఆళ్వారులు సందర్శించిన తిరుమల. కాగా, మూడవది సారంగపాణి ఆలయం ఈ దేవాలయాన్ని 9 మంది ఆళ్వారులు సందర్శించి స్తుతించారు.

Image source: commons.wikimedia.org

భృగు మహర్షి భృగు మహర్షి

భృగు మహర్షి భృగు మహర్షి

భృగు మహర్షి ఒక సారి త్రిమూర్తుల సందర్శనార్థం మొదట సత్యలోకానికి వెళ్లి భంగపడుతాడు. దీనితో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని శపిస్తాడు. అటు పై కైలాసానికి వెళ్లి అక్కడ కూడా భంగపడుతాడు. దాంతో శివుడికి కేవలం లింగ రూపంలో మాత్రమే పూజలు ఉండాలని శాపం పెడుతాడు.

Image source: commons.wikimedia.org

విష్ణువు వక్షస్థలాన్ని తంతాడు

విష్ణువు వక్షస్థలాన్ని తంతాడు

చివరిగా భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లి అక్కడ కూడా అవమానం పాలవుతాడు. దాంతో కోపం పట్టలేక విష్ణువు వక్షస్థలాన్ని తంతాడు. ఈ ఘటనతో లక్ష్మీదేవికి తీవ్ర కోపం వస్తుంది. తాను కొలువై ఉన్న విష్ణువు వక్షస్థలాన్ని తన్ని ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేశాడని భృగు మహర్షి పై లక్ష్మీదేవి తీవ్ర కోపంతో ఉంటుంది.

Image source:youtube

అరికాలిలో ఉన్న కంటిని

అరికాలిలో ఉన్న కంటిని

విష్ణువు ఆ భృగు మహర్షి కాళ్లు ఒత్తే నెపంతో ఆయన అరికాలిలో ఉన్న కంటిని చిదిమేస్తాడు. దీంతో ఆ మహర్షి ఆగ్రహం తగ్గిపోయి చేసిన తప్పుకు తీవ్రంగా కుమిలిపోతాడు. లక్ష్మీదేవి తన కూతురుగా జన్మించాలని ఆమెకు సేవలు చేసి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకొంటానని వేడుకొంటాడు.

Image source: youtube

హేమ బుుషిగా జన్మిస్తాడు

హేమ బుుషిగా జన్మిస్తాడు

ఇందుకు లక్ష్మీదేవి కూడా అంగీకరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ భృగు మహర్షి భూలోకంలో హేమ బుుషిగా జన్మిస్తాడు. ఆయన కుంభకోణం దగ్గర్లోని పొట్రుమరి తటాకం వద్ద తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి తటాకంలో తామర పూల మధ్య నుంచి ఉద్భవిస్తుంది.

Image source: youtube

 కోమలాంబాళ్ అని పేరుపెడుతాడు

కోమలాంబాళ్ అని పేరుపెడుతాడు

హేమబుషి రూపంలోని భృగు మహర్షి ఆమెను స్వీకరించి కోమలాంబాళ్ అని పేరుపెడుతాడు. తండ్రివలే అన్ని సేవలు చేస్తాడు. ఇక యుక్తవయస్సురాగానే ఆమెకు వరుడిని వెదకడం ప్రారంభిస్తాడు.

Image source: commons.wikimedia.org

భూ పొరల్లో కొద్దిసేపు దాక్కొంటాడు

భూ పొరల్లో కొద్దిసేపు దాక్కొంటాడు

ఇదిలా ఉండగా లక్ష్మీదేవిని వెదుక్కొంటూ వచ్చిన శ్రీనివాసుడికి ప్రస్తుతం సారంగపాణి దేవాలయం ఉన్న చోట కోమలాంబాళ్ కనిపిస్తుంది. ఆమె లక్ష్మీదేవిగా గుర్తించిన శ్రీనివాసుడు ఆమెను ఉడికించాలనే ఉద్దేశంతో భూపొరల్లో కొద్దిసేపు దాక్కొంటాడు.

Image source: commons.wikimedia.org

పాతాళ శ్రీనివాసుడు

పాతాళ శ్రీనివాసుడు

అలా దాక్కొన్న శ్రీనివాసుడిని ప్రస్తుతం పాతాళ శ్రీనివాసుడు పేరుతో కొలుస్తున్నారు. ఆ పైన ఉన్నదే సారంగపాణి ఆలయం. ఇక అమ్మవారు ఇక్కడ తటాకంలో పుట్టింది కాబట్టి లక్ష్మిదేవి పుట్టినిల్లు ఇదే. ఈయన్ను భక్తులు ఆలయం నుంచి కొంచెం కిందికి అంటే భూగర్భంలోకి వెళ్లి చూడాల్సి ఉంటుంది.

Image source: commons.wikimedia.org

బ్రహ్మోత్సవము

బ్రహ్మోత్సవము

ఎంతో మంది మహర్షులు, మహారాజులు ఈ భూగర్భ శ్రీనివాసుడిని దర్శించి సేవించి తరించారు. ఈ ప్రాంగణంలోనే గర్భగృహంలో శ్రీనివాసుడు దర్శనమిస్తుంటారు. తన కోసం వచచే భక్తులకు చిరునవ్వులు చిందిస్తూనే వరాలను ప్రసాదిస్తుంటారు.. ఆలయంలో మకరం-మేషమాసములలో బ్రహ్మోత్సవము జరుగుతాయి. విశేషమైన పుణ్య తిథుల్లో స్వామివారి వైభవం చూసితీరాల్సిందే.

Image source: commons.wikimedia.org

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

తమిళనాడులోని అన్ని ప్రసిద్ధ పట్టణముల నుండి బస్ సౌకర్యం గలదు.

Image source: commons.wikimedia.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X