Search
  • Follow NativePlanet
Share
» »వరాహమూర్తి ఒంటినిండా దేవతలే !

వరాహమూర్తి ఒంటినిండా దేవతలే !

సాత్నా మధ్య ప్రదేశ్ లోని ఒక ఆసక్తికరమైన నగరం. ఈ నగరం భారతదేశ ప్రాచీన వైభవానికి గుండె వంటిది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖజురహో దేవాలయాలు ఈ నగరానికి సమీపంలో ఉన్నాయి.

By Venkatakarunasri

సాత్నా మధ్య ప్రదేశ్ లోని ఒక ఆసక్తికరమైన నగరం. ఈ నగరం భారతదేశ ప్రాచీన వైభవానికి గుండె వంటిది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖజురహో దేవాలయాలు ఈ నగరానికి సమీపంలో ఉన్నాయి. సిమెంట్ కర్మాగారాలు, డోలమైట్, సున్నపురాయి కర్మాగారాల కు సాత్నా ప్రసిద్ధి.

సాత్నా చుట్టుపక్కల ప్రదేశాలు

సాత్నా లో మరియు దాని చుట్టుపక్కల చూడటానికి ఎన్నో ధార్మిక, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో వరాహ లక్ష్మి దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందినది. సాత్నా సందర్శించటానికి వర్షాకాలం, శీతాకాలం సమయాలు సరైనవి. సాత్నా సందర్శించే ప్రతి ఒక్కరు ఇక్కడి ఆహారాలను రుచి చూడాల్సిందే ! దహీ వడ, పోహా - జిలేబి, లోతాన్ కి మన్గుడి రుచి చూడటం మరిచిపోవద్దు...!!

భార్హుట్ ఆర్ట్ గ్యాలరీ

భార్హుట్ ఆర్ట్ గ్యాలరీ

భార్హుట్ ఆర్ట్ గ్యాలరీ లో ప్రధాన ఆకర్షణ గౌతమ బుద్ధుని స్థూపం. ఈ ఆర్ట్ గ్యాలరీలో స్థూప అనుకరణలను, ఛాయాచిత్రాలను ప్రదర్శిస్తుంటారు. కళల మీద, చరిత్ర మీద ఆసక్తి గలవారికి భార్హుట్ ఆర్ట్ గ్యాలరీ తప్పక కనువిందు చేస్తుంది.

చిత్ర కృప : Biswarup Ganguly

భార్హుట్ స్థూపం

భార్హుట్ స్థూపం

భార్హుట్ స్థూపం భారతదేశ సంపన్న సంస్కృతికి నిదర్శనం. ఈ స్థూపం నాటి చారిత్రక గాధలను (క్రీ.పూ. 1500 ఏళ్లనాటి) వివరిస్తుంది. స్తూపం మెట్లు ఎర్ర రాయితో అద్భుతంగా చెక్కబడింది. అది నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.

చిత్ర కృప : Mhss

పన్ని లాల్ చౌక్

పన్ని లాల్ చౌక్

సాత్నా లో రద్దీగా ఉండే ఏరియాలలో పన్ని లాల్ చౌక్ ఒకటి. ఇక్కడ అనేక రిటైల్ దుకాణాలు, రెస్టారెంట్లు కలవు. షాపింగ్ చేసేవారికి, స్థానిక ఆహారాలను రుచి చూడాలనుకొనేవారికి ఈ ప్రదేశం సూచించదగినది.

చిత్ర కృప : Abhishek Verma

తులసి మ్యూజియం

తులసి మ్యూజియం

సాత్నా కు 16 కిలోమీటర్ల దూరంలో, క్రీ.శ. 1977 వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన తులసి మ్యూజియం పర్యాటకులకు ఆసక్తిని కలిగించే ప్రదేశాలలో ఒకటి. శిల్పాలు, టెర్రకోట, బిర్చ్ ఆర్క్, మర్రి ఆకు వంటి వివిధ మూలకాలతో తయారుచేయబడిన భాగాలను ప్రదర్శనకి ఉంచుతారు. ఉదయం 10 నుండి సాయంత్రం 7 వరకు తెరిచే ఉంచుతారు.

చిత్ర కృప : telugu native palent

శివాలయం

శివాలయం

సాత్నా కు 30 కిలోమీటర్ల దూరంలో బిర్సిన్గ్పూర్ పట్టణంలో పురాతన శివాలయం కలదు. ఇది ఎంతో మహిమ కలదని స్థానికుల అభిప్రాయం. ఏటా శివరాత్రి నాడు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

వరాహ లక్ష్మి దేవాలయం

వరాహ లక్ష్మి దేవాలయం

వరాహ లక్ష్మి దేవాలయం సాత్నా కు 100 కిలోమీటర్ల దూరంలో కలదు.ఇందులో వరాహ విగ్రహం అద్భుతంగా ఉండి, చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహం ఒంటి నిండా సకల దేవతలు ఉండటం గొప్ప విశేషం. ఇక్కడున్నట్లు విగ్రహం మరెక్కడా లేదు.

చిత్ర కృప : Rajenver

ఆలయ కాంప్లెక్స్

ఆలయ కాంప్లెక్స్

ముస్లిం దండయాత్రలో ధ్వంసం కాకుండా మిగిలిన ఆలయాలు 22 వరకు ఉన్నాయి. అందులో మాతంగేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందినది. దీనికి తప్ప మిగితా ఏ ఆలయానికి పూజలు ఉండవు.

చిత్ర కృప : Antoine Taveneaux

మాతంగేశ్వర ఆలయం

మాతంగేశ్వర ఆలయం

దేవాలయంలో కొలువైన శివుణ్ణి పానవట్టం మీద ఎక్కి అర్ధ ప్రదక్షిణ చేసి అభిషేకం చేయాలి. వింతేమిటంటే ఆలయ పూజారి, సామాన్య భక్తులు కూడా పానవట్టం మీద ఎక్కి దేవుణ్ణి దర్శిస్తారు. దగ్గరలోని శివసాగర్ లో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శిస్తారు.

చిత్ర కృప : Antoine Taveneaux

సాత్నా ఎలా చేరుకోవాలి ?

సాత్నా ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం :

సాత్నా లో విమానాశ్రయం కలదు. సమీపాన 220 కి. మీ ల దూరంలో జబల్పూర్ అనే మరో విమానాశ్రయం కలదు.

రైలు మార్గం :

సాత్నా లో రైల్వే స్టేషన్ కలదు. ఇదొక జంక్షన్. ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుండి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు మార్గం :

భోపాల్, జబల్పూర్,ఇండోర్, అలహాబాద్, వారణాసి నుండి సాత్నా కు పలు ప్రభుత్వ, ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Shaane Khan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X