Search
  • Follow NativePlanet
Share
» »పాండవులు స్వర్గానికి తరలిన మార్గం ఏదో తెలుసా?

పాండవులు స్వర్గానికి తరలిన మార్గం ఏదో తెలుసా?

మహాభారతం మరియు రామాయణం భారతదేశం యొక్క ప్రసిద్ధమైన మహాకావ్యాలు. వీటిని అత్యంత పవిత్రమైన గ్రంథాలు అని కూడా పిలుస్తారు.

By Venkatakarunasri

మహాభారతం మరియు రామాయణం భారతదేశం యొక్క ప్రసిద్ధమైన మహాకావ్యాలు. వీటిని అత్యంత పవిత్రమైన గ్రంథాలు అని కూడా పిలుస్తారు. ద్వాపరయుగంలో నడిచిన మహాభారతం కథ మూలంగా మనిషైనవాడు ధర్మంగా ఎలా జీవించాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలుస్తుంది.

మహాభారతంలో మనం అనేక క్రోధాలు, అధికార మదం, ద్రోహం, వంచన, న్యాయం ఇంకా అనేకమైన విషయాలు చూడవచ్చును. అయితే పాండవులు నైతిక మార్గంలో నడిచే ధర్మరక్షకులుగా, నాయకులుగా మహాభారతంలో కనిపిస్తారు. మహాభారతయుద్ధం అనంతరం పాండవులు ఏమైనారు? ఎక్కడికి వెళ్ళారు అనే అనేకమైన ప్రశ్నలకు జవాబు ఇంకా కుతూహలంగా వుంది.

ఆ రహస్యమైన విషయాల గురించి మహాభారతం యొక్క మహాప్రస్థానికా పర్వంలో అందంగా వివరించబడి వుంది.దాని ప్రకారం చివరికి పాండవులు తమ యొక్క అన్ని అస్త్రశాస్త్రాలను త్యజించి కొన్ని తీర్థ క్షేత్రాలకు దర్శించారు. అనంతరం దేవుని దర్శించుకుని స్వర్గానికి హిమాలయాల మార్గం నుండి నడిచెరంట. ఇది ఎక్కడ వుందో తెలుసా?

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

పాండవులు వెళ్ళిన మార్గం ఏదంటే? అది ఉత్తరాఖండ్ లోని బదరీనాథ్ క్షేత్రం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో పాండవులు ప్రయాణం ప్రారంభించారు. దీనిని ముఖ్యంగా "సాతో పంథ్ ట్రెక్" అని పిలుస్తారు.

స్వర్గారోహణ

స్వర్గారోహణ

ఈ మార్గం నుండి పాండవులు తమ స్వర్గారోహణను ప్రారంభించారు. ఆశ్చర్యం ఏమంటే ఈ స్వర్గానికి వెళ్ళు దారిలో ఒక కుక్కను కూడా వారి జతలో తోడుగా తీసుకువెళ్ళిరంట.

PC:Thisguyhikes

పంచ పాండవులు

పంచ పాండవులు

ఈవిధంగా నడుచుకుంటూ వెళ్ళే సమయంలో పంచ పాండవులు ఒక్కొక్కరే ప్రాణాన్ని విడిచెరంట. చివరికి స్వర్గానికి చేరుకున్నది మాత్రం ధర్మరాజు ఒక్కడే. సామాన్యంగా ఈతరం యువకులకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం.

PC:Bharatkaistha

స్వర్గ ప్రాప్తి

స్వర్గ ప్రాప్తి

సాతో పంథ్ ట్రెక్ ను ధార్మికతలో నమ్మకం, భక్తి కలిగిన వారు వెళ్లి ట్రెక్కింగ్ చేస్తారు. పంచ పాండవులు ఆచరించిన పాదయాత్రలను మనం కూడా ఆచరిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. దీనిని బట్టి దీనిని స్వర్గారోహణం అని కూడా పిలుస్తారు.

PC:Soumit ban

అత్యంత శ్రేష్ఠకరం

అత్యంత శ్రేష్ఠకరం

అయితే ఈ పవిత్రమైన యాత్ర చేయాలంటే మొదట అనుమతి తీసుకోవాలి. ఈ పాదయాత్ర అంత సులభంగా వుంటుందని అనుకోకండి. ఈ యాత్ర అత్యంత కఠినంగా వుంటుంది. అటువంటి పాండవులే 4 మంది చేరలేకపోయారంటే మీరే ఆలోచించండి ఇంకెంత కఠినమైన మార్గం అయి వుంటుంది అని.

PC:Soumit_ban

సాతో పంథ్ సరోవరం

సాతో పంథ్ సరోవరం

ఈ ట్రెక్ చేయటానికి కేవలం శారీరక ధారుఢ్యం ఉంటే చాలదు బదులుగా మానసికమైన సామర్థ్యం కూడా అతి ముఖ్యమైనది. ఇది బదరీనాథ్ నుంచి సుమారు 25కి.మీ ల దూరంలో సాతో పంథ్ సరోవరంవుంది. ఇక్కడి నుంచి సుమారు 3 రోజులు ట్రెక్కింగ్ చేయవలసివుంటుంది.

వ్యవస్థలు

వ్యవస్థలు

ఈ ట్రెక్ చేయటానికి మొదట అనుమతి తీసుకోవాలి. అయితే నిపుణుల గైడెన్స్ లేకుండా ఈ ట్రెక్ చేయటానికి సాధ్యం కాదు. ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి వసతి సౌకర్యాలు లేవు. తినటానికి ఆహారపదార్దాలు మీవెంట తీసుకుని వెళ్ళాలి.

PC:Soumit_ban

వసుధారా జలపాతం

వసుధారా జలపాతం

పుణ్యక్షేత్రం బదరీనాథ్ నుంచి సుమారు 3 కిమీ ల దూరంలోవున్న మానా నుంచి ఈ ట్రెక్ ప్రారంభమవుతుంది. ఇక్కడినుంచి ట్రెక్ ప్రారంభమౌతుంది.

PC:Kanthi Kiran

అలకానంద నది

అలకానంద నది

విశేషం ఏమంటే పవిత్రమైన అలకానంద నది ఒడ్డు నుండి వసుధారా జలపాతాన్ని సందర్శించవచ్చును. వసుధారా జలపాతం అత్యంత మనోహరంగా వుంటుంది. ఇక్కడి సౌందర్యానికి ఎలాంటివారైనా సరే మైమరచిపోవాల్సిందే.

PC:Soumit_ban

లక్ష్మీ వనం

లక్ష్మీ వనం

వసుధారానుంచి సుమారు 5 కి.మీ ల దూరంలో లక్ష్మీ వనం వుంది. అక్కడికి వెళ్ళవచ్చును అయితే ధానో అనే హిమనదిని దాటవలసివుంటుంది. ఈ మార్గం అత్యంత ప్రమాదకరం అయినా, జాగ్రత్తగా ట్రెక్ చేయవలసి వుంటుంది. దీన్ని దాటిన తరువాత వచ్చేదే లక్ష్మీ వనం.

PC:Gouravmsh

తమ ప్రాణాలను కోల్పోయిరి

తమ ప్రాణాలను కోల్పోయిరి

పాండవులలో ధర్మరాజు తప్ప మిగిలిన వారందరూ ఈ మార్గ మధ్యంలో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే ఏ మార్గంలో పాండవులు తమ ప్రాణాలను త్యాగం చేసారు అనే విషయాన్ని ఒక సారి పరిశీలిద్దాం రండి.

PC: Sharada Prasad CS

నకులుడు, సహదేవుడు ప్రాణం విడిచిన స్థలం

నకులుడు, సహదేవుడు ప్రాణం విడిచిన స్థలం

పురాణాల ప్రకారం నకులసహదేవులు ఇక్కడే తమ ప్రాణాలను త్యజించారు అని చెప్పవచ్చును. మొట్టమొదట ట్రెక్ ప్రారంభించగానే ఇక్కడున్న అందమైన వాతావరణం వల్ల ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎక్కడచూసిన పచ్చటి వనాలు.

PC:Soumit ban

అర్జునుడు ప్రాణం వదిలిన స్థలం

అర్జునుడు ప్రాణం వదిలిన స్థలం

అనంతరం లక్ష్మీ వనం నుంచి సుమారు 5 కి.మీ ల దూరంలో చక్రతీర్థం ఉంది. అక్కడికి చేరుకోవాలి. పురాణం ప్రకారం చక్రతీర్థంలోనే అర్జునుడు తన ప్రాణాలను త్యాగం చేసాడని కొందరు చెప్తారు.

భీముడు ప్రాణం వదిలిన స్థలం

భీముడు ప్రాణం వదిలిన స్థలం

ఈ విధంగా చక్రతీర్థానికి వెళ్లి స్వల్ప విశ్రాంతి తీసుకుని మరలా పాదయాత్ర సహస్ర ధారా వరకు ప్రారంభించారు. సహస్ర ధారలోనే పాండవులలో అత్యంత బలశాలి అయిన భీముడు తన ప్రాణాన్ని త్యజించినాడని చెప్తారు.

స్వర్గానికి వెళ్ళే స్థలం

స్వర్గానికి వెళ్ళే స్థలం

ఈవిధంగా సహస్ర ధారా అనంతరం ట్రెక్ ఈ విధంగా ముందుకు సాగుతూ వుంటే చివరిగా చేరుకునే ప్రదేశమే సత్యపంథ్ అనే సరోవరం. దీనిని "సత్యపంథ" అని పిలుస్తారు. ఇది ఒక అద్భుతమైన సరోవరం. సత్యానికి ప్రతిబింబమే ఈ సరోవరం అని వర్ణించబడినది. ఇక్కడే ఇంద్రుడు తన రథంతో పాటు ధర్మరాజు ముందు ప్రత్యక్షమై స్వర్గానికి తీసుకొనివెళ్ళెను అనే నమ్మకం వుంది.

PC:Soumit ban

త్రిమూర్తులు

త్రిమూర్తులు

ఈ త్రికోణాకార సరోవరం ఎంత పవిత్రమైనది అంటే ఏకాదశి సమయంలో స్వయంగా బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు ఈ సరోవరంలో నెలకొంటారంట. ఈ విధంగా ఈ పవిత్రమైన జలంలో స్నానం చేస్తారంట.

PC:Thisguyhikes

గంధర్వులు

గంధర్వులు

గంధర్వులు పక్షుల రూపంలో ఈ స్థలంలో కాపలాకాస్తుంటారు, ఇక్కడ ఒక్క గడ్డి కూడా మొలవకుండా చూసుకుంటూవుంటారు. ఇక్కడికి ఈ ట్రెక్ ముగుస్తుంది.

PC:Bharatkaistha

కుతూహలం

కుతూహలం

ఈ సరోవరానికి వచ్చిన తరువాత పంచ పాండవులలో కేవలం ధర్మరాజు మరియు కుక్క మాత్రమే ఉంటారు. అదేవిధంగా ఇంద్రుడు తన రథంతో పాటు ప్రత్యక్షమై ధర్మరాజుని మాత్రం రాథంలో ఆహ్వానిస్తాడు.

PC:Soumit ban

కుక్కను వదిలిపెట్టి రాను

కుక్కను వదిలిపెట్టి రాను

దానికి సమాధానంగా ధర్మరాజు తన జతలోనే వుంటూ దారిలో వచ్చిన కష్టాలకు జతగా, స్నేహంగా కుక్క వచ్చినందువలన దానితో పాటు అనుమతించాలి అని అనెను. లేకపోతే కుక్కను విడిచి నేను రాను ధర్మారాజు చెప్పెను.

PC:Ramanarayanadatta astri

కుక్క రూపంలో ధర్మ దేవత

కుక్క రూపంలో ధర్మ దేవత

అందుకు మెచ్చిన ఇంద్రుడే స్వయంగా ధర్మరాజునితో పాటు కుక్కనుకూడా రథంలో తీసుకొని వెళ్తాడు. నిజం చెప్పాలంటే ఆ ధర్మ దేవతే పాండవులని పరీక్షించటానికి కుక్క రూపంలో

వారిలో ఒకరిగా చేరుతుంది.

PC:Soumit_ban

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X