Search
  • Follow NativePlanet
Share
» »కలియుగాంతంలో 'తిరుపతి' అదృశ్యం ?!

కలియుగాంతంలో 'తిరుపతి' అదృశ్యం ?!

By Venkatakarunasri

ఏడు కొండల పై వెలిసిన శ్రీ వేంకటేశ్వరుని దేవాలయం విశ్వ విఖ్యాత మైంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లాలో తిరుపతి పట్టణంలో కలదు. ఈ దేవాలయాన్ని ప్రతి ఏటా లక్షలాది యాత్రికులు దర్శించుకుంటారు. భగవంతుడు శ్రీనివాసుడికి తమ ముడుపులు, కానుకలు సమర్పించి స్వామీ ఆశీస్సులు పొందుతారు.

ఈ ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం ఆంద్ర రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 600 కి. మీ. లు , బెంగుళూరు నుండి 291 కి. మీ.లు. దూరంలో వుంది. చెన్నై నగరం నుండి 138 కి. మీ. ల దూరం మాత్రమే. తిరుమల కొండలు సముద్ర మట్టానికీ సుమారు 853 మీ. ల ఎత్తు లో కలవు. ఈ ప్రదేశం సుమారు 27 చ. కి. మీ. ల విస్తీర్ణం కలిగి వుంది. ఈ పుణ్య క్షేత్ర అది దేవుడిని శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీనివాసుడు, బాలాజీ, గోవిందుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. హిందూ ధర్మ శాస్త్రాల మేరకు శ్రీ వెంకటేశ్వరుడి ని శ్రీ మహా విష్ణువు అవతారంగా భావిస్తారు.

గోవిందా...గోవింద !

ఏడు కొండలు

ఏడు కొండలు

ఇక్కడ కల ఆ ఏడు కొండలు వరుసగా శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, మరియు వెంకటాద్రిలు గా పిలువబడతాయి. ఈ ఏడు కొండలు, శ్రీ విష్ణు మూర్తి శయినించిన ఆది శేషుడి ఏడు పడగలుగా భావిస్తారు.

PC: Raji.srinivas

వెంకటాద్రి

వెంకటాద్రి

ప్రస్తుత దేవస్థానం ఏడవ కొండ ఐన వెంకటాద్రి పై కలదు. కనుక దీనిని వెంకట గిరి లేదా వెంకటాచలం అని కూడా పిలుస్తారు.

తిరుమల అంటే ?

తిరుమల అంటే ?

తెలుగు భాషలో తిరు అంటే పవిత్రం అని, మల అంటే కొండ అని పవిత్ర కొండ అని చెపుతారు. ఇక సంస్కృత భాషలో వెంకటేశ్వరుడి కి అర్ధం వెం అంటే మనలోని కర్మలు గాను కట అంటే కర్మలనుండి విముక్తి చేసే వాడుగాను ఈశ్వర అంటే మహాదేవుడి నామం గాను చెపుతారు. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వరుడి భక్తుల యొక్క పాపములను తొలగించి దర్శన భాగ్యం కలిగించి మోక్షం వచ్చేలా చేస్తాడని నమ్ముతారు.

పరమ భక్తులు

పరమ భక్తులు

కంచి పురం లోని పల్లవ రాజులు తొమ్మిదవ శతాబ్దం లోను, తంజావూరులోని చోళులు పదకొండవ శతాబ్దం లోను, విజయనగర పాలకులు పది హేనవ శతాబ్దంలోను శ్రీ వెంకటేశ్వరుడికి పరమ భక్తులు గా వుండేవారు.

PC:Wiki-uk

శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు

శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు

క్రీ. శ 1517 లో విజయనగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు ఈ దేవుడికి అనేక కానుకలు అర్పించి దేవాలయ అభివృద్ధికి పాటుపడ్డాడు. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు ఈ దేవాలయ ఆవరణలో చూడవచ్చు.

PC: gsnewid

దేవాలయ అభివృద్ధి

దేవాలయ అభివృద్ధి

విజయనగర సామ్రాజ్య పాలకుడు శ్రీ కృష్ణ దేవ రాయలు అనంతరం, మైసూరు మరియు, గద్వాల రాజులు కూడా ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేసారు.

పూజా విధి విధానాలు

పూజా విధి విధానాలు

మరాఠా సామ్రాజ్య ప్రధాన అధికారి ఒకటవ రామోజీ భోంస్లే తిరుమలకు వచ్చి దేవాలయంలో పూజా విధి విధానాలు సక్రమంగా నెరవేరేలా పర్యవేక్షించేవాడు.

PC:Ilya Mauter

ఎక్సిక్యూటివ్ ఆఫీసర్

ఎక్సిక్యూటివ్ ఆఫీసర్

ప్రస్తుతం ఈ దేవాలయం కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరుతో ఒక బోర్డు గా ఏర్పడిన సంస్థచే నిర్వహించబడుతున్నాయి. ఈ సంస్థ పాలన, ప్రభుత్వం నియమించిన ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ చే నిర్వహించబడుతుంది.

PC:Matteo

వేయి కోట్లకు మించిన ఆదాయం

వేయి కోట్లకు మించిన ఆదాయం

ప్రతి సంవత్సరం ఈ దేవాలయ ఆదాయ వ్యయాలు లెక్కించ బడి వెల్లడించ బడతాయి. భక్తులు సమర్పించే కానుకలు విలువలు కూడా వెల్లడిస్తారు. 2008 సంవత్సరంలో దేవస్థానానికి సుమారు వేయి కోట్లకు మించిన ఆదాయం చేకూరినదని వెల్లడైంది.

PC: Raji.srinivas

దిన దినాభివృద్ధి

దిన దినాభివృద్ధి

దేవాలయం నేటి రోజుల్లో దిన దినాభివృద్ధి చెందుతూ భక్తులను విశేష సంఖ్యలో ఆకర్షిస్తోంది. దేవాలయం లోని కొన్ని భాగాలను బంగారంతో తాపడం చేస్తున్నారు.

PC: Raji.srinivas

మూల విరాట్టు

మూల విరాట్టు

స్థల పురాణాల మేరకు ఈ దేవాలయ మూల విరాట్టు విగ్రహం స్వయంగా వెలసినద ని చెపుతారు.

PC:Vimalkalyan

వజ్రాలు పొదిగిన ఒక కిరీటం

వజ్రాలు పొదిగిన ఒక కిరీటం

శ్రీ వెంకటేశ్వరుడికి బంగారు వజ్రాలు పొదిగిన ఒక కిరీటం కూడా కలదు. దీనిని విశేష దినాలలో శ్రీ వారికి అలంకరిస్తారు.

PC:Vimalkalyan

 శ్రీ చందనం

శ్రీ చందనం

శ్రీ వెంకటేశ్వరుడికి చేయు అలంకరణలో శ్రీ చందనం వంటి ప్రత్యేక పదార్ధాలు వాడతారు. నామాన్ని రెండు కన్నుల పైనా అలంకరిస్తారు.

PC: vimal_kalyan

బంగారు కుండలాలు

బంగారు కుండలాలు

శ్రీవారి చెవులకు బంగారు కుండలాలు ఇరువైపులా శంఖు చక్రాలు వుండటం, ఒక చేత్తో భక్తులను ఆశీర్వదించడం చూడవచ్చు.

PC:Kiral

లక్ష్మి దేవి

లక్ష్మి దేవి

శ్రీనివాసుడి ఎడమ భుజం నుండి కుడి వైపుకు వచ్చిన యజ్ఞోపవీతం విగ్రహం కుడి వైపున లక్ష్మి దేవి ఎడమవైపు పద్మావతి అమ్మవార్లు విరాజిల్లుతూ వుండటం చూడవచ్చు.

PC: Anshuldubey

క్షేత్ర మహత్యం

క్షేత్ర మహత్యం

తిరుమల పుణ్య క్షేత్రం, భారత దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగనించ బడుతోంది. క్షేత్ర మహత్యం కారణంగా ఈ దేవాలయానికి ప్రపంచంలోని నలుమూలల నుండి భక్తులు ఆకర్షించ బడతారు.

PC: Drsreeganesh

భక్తి తో పూజిస్తే

భక్తి తో పూజిస్తే

శాస్త్రాలు, పురాణాలు, స్థల పురాణాలు, స్థల మహత్యాలు మేరకు కలియుగంలో శ్రీ వెంకటేస్వరుడిని భక్తి తో పూజిస్తే, ఎవరికైనా సరే మోక్షం లభించగలదని చెపుతారు.

PC:Bhaskaranaidu

దర్శన భాగ్యం

దర్శన భాగ్యం

శ్రీ వెంకటేశ్వరుడి దర్శన భాగ్యంతో కలిగే ప్రయోజనాల గురించి ఋగ్వేద మరియు అష్టాదశ పురాణాలలో కూడా పేర్కొనబడింది. వీటిలో శ్రీ వేంకటేశ్వరుడు ఎంతో మహిమ కల దేవుడిగా వర్ణించబడ్డాడు.

PC: Bhaskaranaidu

వైష్ణవ సాంప్రదాయం

వైష్ణవ సాంప్రదాయం

ఈ దేవాలయంలో పూజా కైన్కర్యాలు అన్నీ వైష్ణవ సాంప్రదాయం మేరకు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించ బడతాయి.

PC: Bhaskaranaidu

ద్వారపాలకులు

ద్వారపాలకులు

దేవాలయంలో ప్రవేశంలో కల తిరుమామణి మంటపం నుండి బంగారు వాకిలి ద్వారా గర్భ గుడిలోకి ప్రవేశించి శ్రీనివాసుడి దర్శనం చేసుకోవాలి. ద్వారానికి ఇరువైపులా జయ విజయులనే ద్వారా పాలకుల తామ్ర విగ్రహాలను చూడవచ్చు. సుప్రభాతం గర్భగుడి ద్వారా బంధంపై బంగారం తో తాపడం చేయ బడిన విష్ణు మూర్తి దశావతారాలు చూడవచ్చు. స్వామీ వారికి సుప్రభాతం ఈ ద్వారం వద్దే జరుగుతుంది.

సుప్రభాతం

సుప్రభాతం

గర్భగుడి ద్వారా బంధంపై బంగారం తో తాపడం చేయ బడిన విష్ణు మూర్తి దశావతారాలు చూడవచ్చు. స్వామీ వారికి సుప్రభాతం ఈ ద్వారం వద్దే జరుగుతుంది.

PC:Bhaskaranaidu

విగ్రహ దర్శనం

విగ్రహ దర్శనం

గర్భ గుడిలో స్వామీ వారి సౌమ్యమైన విగ్రహ దర్శనం చేసుకొని ఆనందించ వచ్చు. స్వామీ కృపకు పాత్రులు కావచ్చు. ఇంతటి సౌమ్యమైన ఈ విగ్రహం వెలసినదిగా చెపుతారు. దీనిని ఎవరూ ప్రతిష్టించ లేదని స్థల పురాణాలు చెపుతాయి.

విగ్రహం సుమారు 8 అడుగుల ఎత్తు

విగ్రహం సుమారు 8 అడుగుల ఎత్తు

దేవాలయ పరిసరాలలో ఇంకనూ అనేక విగ్రహాలు వివిధ నామాలతో కలవు. ఈ విగ్రహాలు, వివిధ కాలాలలో వివిధ రాజ వంశాలచే దేవాలయ అభివృద్ధి సమయంలో ప్రతిష్టించబడ్డాయి. మూల విరాట్టు అయిన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం సుమారు 8 అడుగుల ఎత్తు కలిగి వుండి దేదీప్య మానంగా వెలిగి పోతూ వుంటుంది.

PC:Prasoon

పూజాది కార్యక్రమాలు

పూజాది కార్యక్రమాలు

సంప్రదాయం మేరకు ఈ దేవాలయంలోని శ్రీ వెంకటేశ్వరుడికి ప్రతి రోజూ సూర్యోదయం నుండి ఆరు సారులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైకుంట ఏకాదశి, రామనవమి, జన్మాష్టమి మొదలైన ఉత్సవ వేడుకలు ఈ ఆలయంలో వైభవోపేతంగా నిర్వహిస్తారు.

PC:Venkat

కలియుగ వైకుంటం

కలియుగ వైకుంటం

తిరుపతి పుణ్య క్షేత్రాన్ని యాత్రికులు కలియుగ వైకుంటంగా భావిస్తారు. శ్రీనివాసుడిని ఎన్ని మార్లు చూసినా తనివి తీరదని భావిస్తారు. తగిన ముడుపులు చెల్లించి తమ కోరికలు నెరవేర్చుకుంటారు.

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

తిరుపతి పట్టణం హైదరాబాద్ నుండి సుమారు 600 కి. మీ. లు, చెన్నై నుండి 138 కి. మీ. లు మరియు బెంగుళూరు నుండి 291 కి. మీ. ల దూరంలో వుంది. ఈ పుణ్య క్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి బస్సు లు, రైళ్ళు, ఇతర వాహనాలు తరచుగా నడుస్తాయి.

PC: Chandrashekhar Basumatary

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X