Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహం హైదరాబాద్ లో !

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహం హైదరాబాద్ లో !

హైదరాబాదు తెలంగాణ రాజధాని. హైదరాబాదు భారత దేశములో ఐదవ అతిపెద్ద మహానగరము. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ దక్షిణ భారత దేశంలో పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం.

 సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ? సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?

<strong>లేపాక్షిలో వ్రేలాడే స్థంభాన్ని నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ ఎవరో తెలుసా?</strong>లేపాక్షిలో వ్రేలాడే స్థంభాన్ని నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ ఎవరో తెలుసా?

శివుడు నరికిన వినాయకుని తల ఈ ప్రదేశంలో ఉందా !

<strong>మాల్డా...మ్యాంగో నగరం !! ఎక్కడ ఉందో మీకు తెలుసా?</strong>మాల్డా...మ్యాంగో నగరం !! ఎక్కడ ఉందో మీకు తెలుసా?

హైదరాబాదు తెలంగాణ రాజధాని. హైదరాబాదు భారత దేశములో ఐదవ అతిపెద్ద మహానగరము. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ దక్షిణ భారత దేశంలో పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. మూసీ నది ఒడ్డున ఉండే ఈ సుందరమైన నగరం ప్రఖ్యాత ఖుతుభ్ షా రాజవంశీయులలో ఒకరైన మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత 1591 లో ఏర్పాటయింది. స్థానిక స్థల పురాణం ప్రకారం భాగమతీ, మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా ల ఆసక్తి కరమైన ప్రేమ కథ నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఆస్థాన నర్తకి అయిన భాగమతి తో సుల్తాన్ ప్రేమలో పడతాడు. వారి ప్రేమకి గుర్తుగా ఖులీ ఖుతుబ్ షా ఈ నగరానికి భాగ్యనగరం అన్న పేరు పెట్టాడు. ఆమె ఇస్లాం మతంలోకి మారి హైదర్ మహల్ గా పేరు మార్చుకున్నాక సుల్తాన్ ని వివాహమాడారు. తదనుగుణంగా ఈ నగరం పేరు కూడా హైదరాబాద్ గా మారింది.

దక్షిణ భారత దేశం పై దండయాత్ర చేసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేత ఈ నగరం ఆక్రమించబడే వరకు హైదరాబాద్ నగరం ఖులీ ఖుతుబ్ షా రాజవంశీకుల చేతిలోనే దాదాపు ఒక శతాబ్దం వరకు ఉంది. 1724 లో ఆసిఫ్ జహి రాజవంశాన్ని స్థాపించిన తరువాత మొదటి ఆసిఫ్ జా హైదరాబాద్ ని, చుట్టు పక్కల ప్రదేశాలని అధీనంలోకి తీసుకున్నాడు. హైదరాబాద్ నిజాములుగా ఆసిఫ్ జా రాజవంశీకులు పేరొందారు. వైభవోపేతమైన నిజాముల శకానికి సంబంధించిన ఈ సుందరమైన ప్రాంతం యొక్క ఘనమైన చరిత్ర వలసవాదుల కాలం వరకు విస్తరించింది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. హైదరాబాద్ నగరం

1. హైదరాబాద్ నగరం

సాంస్కృతిక అస్థిత్వాన్ని కాపాడుకుంటూనే సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నఒకే ఒక్క నగరంగా ఈ హైదరాబాద్ నగరాన్ని చెప్పుకోవచ్చు. నానాటికి దేశంలోని ఇంజినీర్ల డిమాండ్ ని తట్టుకోవడానికి గత రెండు దశాబ్దాలలో ఈ నగరంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి.

2. హైదరాబాద్ నగరానికి సాటి ఏ నగరమూ లేదు

2. హైదరాబాద్ నగరానికి సాటి ఏ నగరమూ లేదు

వివిధ రంగాలకి సంబంధించిన ఇంజినీర్లని ఉత్పత్తి చేయడంలో హైదరాబాద్ నగరానికి సాటి ఏ నగరమూ లేదు. ఎన్నో బహుళ జాతి కంపెనీలు అభివృద్ధి సాధించడానికి ఇక్కడ శాశ్వతంగా ఆఫీసులని ఏర్పాటు చేయడమే ఇందుకు ఉదాహరణ.

3. యువతకి ఎన్నోఉపాధి అవకాశాలు

3. యువతకి ఎన్నోఉపాధి అవకాశాలు

ఇక్కడ ఏర్పాటయిన ఎన్నో ఐటి మరియు ఐటిఇయస్ కంపెనీలు దేశవ్యాప్తంగా యువతకి ఎన్నోఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. విద్యా ఉద్యోగ సంబంధిత విషయాలకోసం దేశం నలు మూలల నుండి ఎంతో మంది యువత ఇక్కడికి తరలి వస్తున్నారు. ఆధునిక సౌకర్యాలన్నీ ఇక్కడ లభ్యమవుతాయి.

4. సాంస్కృతిక ప్రత్యేకత

4. సాంస్కృతిక ప్రత్యేకత

నగరంలోని శాంతి భద్రతలని కాపాడి ప్రజలకి సురక్షిత ప్రదేశంగా రక్షణ కలిపించడంలో సామర్థ్యం కలిగిన పోలీసు బలగాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సాంస్కృతిక ప్రత్యేకతని కాపాడుకుంటూనే నూతన మార్పులని అంగీకరిస్తున్న స్థానిక ప్రజల వల్లే ఈ అభివృద్ధి సాధ్యం అవుతోంది.

5. పర్యాటక ఆకర్షణలు

5. పర్యాటక ఆకర్షణలు

చరిత్రకారులు మరియు బ్యాక్ పాకర్స్ కోసం ఎన్నో వింతలు దాచి ఉంచడంతో పాటు పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటోంది ఈ హైదరాబాద్ నగరం. చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, సాలార్ జంగ్ మ్యూజియం మరియు హుస్సేన్ సాగర్ వంటివి హైదరాబాద్ లో ఉన్న ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణలలో కొన్ని.

6. జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులు

6. జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులు

కొన్నిసార్లు, శీతాకాలంలో కూడా ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. కాబట్టి, పర్యాటకులు వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలోనే ఇక్కడ సందర్శించడం ఉత్తమం. రైలు, రోడ్డు మరియు వాయు మార్గం ద్వారా హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలకి చక్కగా అనుసంధానమై ఉంటుంది. అందువల్ల జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులు ఈ ప్రాంతం తప్పక సందర్శించవలసిన ప్రాంతంగా మారింది.

7. సొమ్ము

7. సొమ్ము

దాదాపుగా రూ.250 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న ఈ విగ్రహానికి కావాల్సిన సొమ్ము విరాళాల రూపంలో వచ్చినట్లు నిర్మాణ సంస్థ సీఈఓ ఎస్ఎం బాలసుబ్రమణ్యం మీడియాకు తెలిపారు. ఈ విగ్రహం మొదటి దశ వచ్చే ఏడాది నవంబరు కల్లా పూర్తి అవుతుందని ఆయన వివరించారు.

8. రామానుజాచార్య విగ్రహం

8. రామానుజాచార్య విగ్రహం

ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.1000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. రామానుజాచార్య విగ్రహం పూర్తయితే హైదరాబాద్ కీర్తిలో మరో విశేషం జత అవుతుందని విశ్లేషిస్తున్నారు.

9. చైనా నుంచి దిగుమతి

9. చైనా నుంచి దిగుమతి

కాగా ఈ విగ్రహాన్ని చైనాకు చెందిన నిపుణులు తయారు చేశారు. 4 అడుగుల ఎత్తైన భవనంపై ప్రతిష్టించనున్న ఈ విగ్రహానికి చెందిన విడిభాగాలన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకోనున్నారు. చిన్నజీయర్ స్వామి ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మిస్తున్న ఈ విగ్రహం కోసం 700 టన్నుల పంచలోహాలను వాడనున్నారు. బంగారం వెండి రాగి సీసం ఇనుములతో రామానుజాచార్య విగ్రహాన్ని తీర్చిదిద్దనున్నారు.

10. నిజాముల రాజధాని

10. నిజాముల రాజధాని

బ్రిటిష్ రాజులతో పరస్పర లబ్ది దార సంది కుదుర్చుకుని నిజాం వారు హైదరాబాదుని దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించారు. 1769 నుండి 1948 వరకు ఈ ప్రాంతం నిజాముల రాజధానిగా వ్యవహరించింది.

11. యావత్తూ గర్వించదగిన నగరం హైదరాబాద్ నగరం

11. యావత్తూ గర్వించదగిన నగరం హైదరాబాద్ నగరం

ఆపరేషన్ పోలో నిర్వహించిన తరువాత ఆఖరి నిజాం పాలకుడు ఇండియన్ యూనియన్ తో జరిగిన పట్టాభిషేక ఒప్పందం పై సంతకం చేసి హైదరాబాద్ ని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, స్వతంత్ర భారత దేశం లో ని భాగం గా చేసారు. సాంస్కృతిక గుర్తింపు, విలక్షనీయత హైదరాబాద్ సొంతం. తెలుగు దేశం యావత్తూ గర్వించదగిన నగరం హైదరాబాద్ నగరం.

12. హైదరాబాద్ వేదిక

12. హైదరాబాద్ వేదిక

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహానికి హైదరాబాద్ వేదికగా కొలువుదీరనుంది. ప్రముఖ ఆధ్యాత్మితకవేత్త రామానుజాచార్య 1000 జన్మదినం సందర్భంగా 216 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేయనున్నారు.

pc:youtube

13. రెండో అతి పెద్ద విగ్రహం

13. రెండో అతి పెద్ద విగ్రహం

సమానత్వ విగ్రహం పేరుతో ప్రతిష్టించనున్న ఈ విగ్రహం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద విగ్రహం ఖ్యాతి దక్కించుకోనుంది. థాయ్ లాండ్ లో ఉన్న 302 అడుగుల గ్రేట్ బుద్ధ విగ్రహం ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం కాగా రామానుజయ విగ్రహం రెండో స్థానం దక్కించుకోనుంది.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X