Search
  • Follow NativePlanet
Share
» »ఆ అనంత నిధి వెనక ఓ రాజు పశ్చాత్తాపం..స్వామిని దర్శించుకుంటే

ఆ అనంత నిధి వెనక ఓ రాజు పశ్చాత్తాపం..స్వామిని దర్శించుకుంటే

కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

By Kishore

అనంత పద్మనాభ స్వామి ఆలయం అనగానే అందరికి నిధే గుర్తుకు వస్తుంది. ఆ దేవాలయంలోని నేల మాళిగల్లో అనంత సంపద ఉందన్న విషయం అందరికి తెలిసిందే.ముఖ్యంగా వజ్ర, వైడూర్యాలు, మరకత, మాణిక్యాలు పొదిగిన ఆభారణాలు, లక్షల సంఖ్యలో బంగారు ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం లెక్కలు కడితే భారత దేశాన్ని రెండు సార్లు కొనగలుగుతామని చెబుతారు. అయితే ఈ ఆలయంలోకి అంత సంపద ఎలా వచ్చి చేరిందన్న విషయం పై మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉండి పోయింది. ఆ రహస్యంతో పాటు కేవలం నిధి, ఆరో గది గురించి మాత్రమే కాకుండా శయనించిన స్థితిలో ఉన్న విష్ణువు రూపం ఈ ఆలయంలో ఎలా ఉంది. అన్న విషయానికి సంబంధించిన వివరాలను కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.

స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడిని దర్శించుకున్నారా? అలా చేస్తేస్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడిని దర్శించుకున్నారా? అలా చేస్తే

ఆ నిధి రహస్యాలు తెలిస్తే విజయ్ మాల్యా కాలెండర్ గర్ల్స్ అంతా నీ చుట్టూనేఆ నిధి రహస్యాలు తెలిస్తే విజయ్ మాల్యా కాలెండర్ గర్ల్స్ అంతా నీ చుట్టూనే

1.దివాకర ముని

1.దివాకర ముని

Image Source:

వేల సంవత్సరాల క్రితం ప్రస్తుతం అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్న ప్రాంతానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో దివాకర ముని సన్యాసి ఉండేవాడు. ఆయన విష్ణు భగవానుడి పరమ భక్తుడు.

2.విష్ణువుని దర్శించుకోవాలని

2.విష్ణువుని దర్శించుకోవాలని

Image Source:

కనీసం ఒక్కసారైనా ఆ దేవదేవుడిని కనులారా దర్శించుకోవాలన్నది ఆయన చిరకాల కోరిక. ఇందు కోసం చాలా కాలం తపస్సు చేశాడు. నిద్రా హారాలు మాని ఆయన చేసిన తపస్సుకు మహావిష్ణువు సైతం కదిలి పోయాడు.

3.బాలుడి రూపంలో

3.బాలుడి రూపంలో

Image Source:

సన్యాసి ఆయనకు మోక్షం ప్రసాదించాలని భావించాడు. అయితే గ`హస్తుడు కాని వాడికి మోక్షం ప్రసాదించడం, వైకుంఠ ప్రవేశం నిశిద్ధం. దీంతో స్వామి వారు సమస్య పరిష్కారం కోసం ఒక చిన్నబాలుడి వలే ఆ దివాకర మహాముని వద్దకు వెలుతాడు.

4.ముచ్చటపడి

4.ముచ్చటపడి

Image Source:

ఆ బాలుడి చిలిపి చేష్టలకు ముచ్చటపడిన దివాకర ముని పళ్లు, పాలు ఇచ్చి మచ్చిక చేసుకుంటాడు. తనతో ఉండి పొమ్మని చెబుతాడు.

5.కోప్పడకూడదు

5.కోప్పడకూడదు

Image Source:

దీనికి అంగీకరించిన బాలుడుఒక షరత్తు విధిస్తాడు. దాని ప్రకారం తన పై ఎప్పుడూ కోపం ప్రదర్శించకూడదని, ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నించకూడదనిచెబుతాడు. ఇందుకు దివాకరముని అంగీకరిస్తాడు.

6.గేలి చేస్తాడు

6.గేలి చేస్తాడు

Image Source:

ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు దివాకర ముని విష్ణువు గురించి ధ్యానం చేస్తూ ఉండిపోతాడు. ఆ సమయంలో తనతో ఎవరూ ఆడుకోవడానికి లేదనిచిన్న పిల్లవాడి రూపంలో ఉన్న విష్ణువు చికాకు పడుతాడు. అంతే కాకుండా దగ్గర్లో ఉన్న ఓ సాలగ్రామాన్ని (విష్ణువుగా బావించే ఒక రాయి) తీసుకుని దివాకరుడి నోట్లో పెట్టి గేలి చేస్తాడు.

7.కళ్లెదుటే

7.కళ్లెదుటే

Image Source:

దీంతో ఆగ్రహించిన దివాకరముని బాలుడి రూపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో చిన్నబుచ్చుకున్న బాలుడు కొద్ది దూరంవెళ్లి దివాకర ముని కళ్ల ఎదుటే మాయమవుతాడు. దీంతో దివాకర ముని తన తప్పును తెలుసుకొని తనకు మరోమారు దర్శనం ఇవ్వాలని పరిపరి విధాలుగా వేడు కుంటాడు.

8.అనంతవాడను చేరుకోమని

8.అనంతవాడను చేరుకోమని

Image Source:

దీంతో ఆకాశవాణి నీవు నన్ను ఈ విశ్వమంతా నిండిన ఆ అనంతుడిని చూడాలంటే అనంత వాడను చేరుకోవాలని చెబుతుంది. దీంతో దివాకరుడుకి జ్జానోదయం అవుతుంది. అనంతుడంటే ఈ మహావిష్ణువేనని తనతో పాటు ఇన్ని రోజులు ఉన్న బాలుడు సాక్షాత్తు మహా విష్ణువే అని గ్రహిస్తాడు.

9.కొండలు, కోనలు దాటు కొంటూ

9.కొండలు, కోనలు దాటు కొంటూ

Image Source:

దీంతో వెంటనే అనంతవాడకు బయలు దేరుతాడు.కొండలు, కోనలు, అడవులు దాటు కొంటూ కొన్ని నెలల తర్వాత అనంత వాడకు చేరుకొంటాడు. అక్కడకు చేరుకోగానే గతంలో తన వద్ద ఉన్న బాలుడు మరళా కనిపించాడు. దివాకరుడిని చూసి నవ్వి ఒక విప్ప చెట్టులోకి వెళ్లి పోతాడు.

10.తల మాత్రం కనిపిస్తుంది

10.తల మాత్రం కనిపిస్తుంది

Image Source:

అలా బాలుడు చెట్లులోకి వెళ్లాడో లేదో వెంటనే చెట్టు చెవులు చిల్లులు చేసే శబ్దంతో కూలి పోతుంది. దీంతో దివాకర ముని అక్కడకు వెళ్లి చూడగా మహావిష్ణువు తల మాత్రం కనిపిస్తుంది.
ఇక దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిప్పుడు అనే చోట ఉన్నాయి.

11.చిన్నపిల్లాడి రూపంలో

11.చిన్నపిల్లాడి రూపంలో

Image Source:

దీంతో దివాకరుడు తాను చిన్నపిల్లాడిగా ఉన్న మిమ్ముులను గుర్తించలేక పోయాను. ఈ అనంత మైన ఆకారంలో ఉన్న మిమ్ములను చూడలేక పోయాను. అందువల్ల తన పై దయ తలిచిచిన్నపిల్లాడి రూపంలో దర్శనమివ్వాలని కోరుకుంటాడు. దీంతో విష్ణువు అనంత పద్మనాభుడి ఆకారంలో ప్రస్తుతం మనం చూసే రూపులో దివాకరుడికి దర్శనమిస్తాడు.

12.బంగారు పళ్లు అవుతాయి

12.బంగారు పళ్లు అవుతాయి

Image Source:

దివాకరుడు వెంటనే దగ్గర్లోని మామిడి చెట్టు నుంచి రెండు మామిడి కాయలు తీసుకొని స్వామివారికి నైవేద్యంగా పెడుతాడు. దీంతో అవి బంగారపు పళ్లవుతాయి. ఈ విషయాన్ని స్థానిక రాజుతో పాటు పండితులకు దివాకరుడు చెప్పి అక్కడ చిన్న దేవాలయం కట్టి తన శేష జీవితాన్ని అక్కడే గడిపి చివరికి ఆ విష్ణువు వరంతో మోక్షం పొందుతాడు.

13.ట్రావెన్ కోర్ హయాంలో

13.ట్రావెన్ కోర్ హయాంలో

Image Source:

ఇక స్వామి వారి అక్కడికి వెళ్లే భక్తులకు ఆయురారోగ్యాలు తప్పక కల్పిస్తాడని భక్తుల్లో నమ్మకం పెరిగింది. ఈ క్రమంలోనే క్రీస్తు శకం 1729లో ట్రావెన్ కోర్ రాజులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పాలించే సమయంలో ఆలయ రూపు రేఖలే మారి పోయాయి.

14.మార్తాండ వర్మ

14.మార్తాండ వర్మ

Image Source:

వందల ఏనుగులు, వేల సంఖ్యలో సైనికులతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద బండరాళ్లను తెప్పించి ఆలయాన్ని నిర్మింపజేసారు. ఈ విషయంలో ఆ ట్రావెన్ కోర్ వంశానికి చెందిన మార్తాండ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

15.ట్రావెన్ కోర్ రాజ్యం కూడా

15.ట్రావెన్ కోర్ రాజ్యం కూడా

Image Source:

ఇక 1758లో కులశేఖర మంటపాన్ని కార్తిక తిరునాళ్ వర్మా అనే రాజునిర్మించారు. ఆలయం రోజురోజుకు ఎలా అభివ`ద్ధి చెందిందో అదే విధంగా ట్రావెన్ కోర్ రాజ్యం కూడా విస్తరిస్తూ పోయింది.

16.కూతురు పుట్టిన రోజున

16.కూతురు పుట్టిన రోజున

Image Source:

ఇందుకు ప్రతిగా తిరునాళ్ వర్మ ప్రతి ఏడాది తన కూతురు పుట్టిన రోజున ఆమె ఎంత బరువు ఉంటుందో అంత బరువున్న బంగారు, వజ్రాల ఆభరణాలను స్వామి వారికి అందజేసేవాడు.
అదే విధానం ఆయన తర్వాత వారు కూడా అనుసరించారు.

17.అనంతమైన సంపద

17.అనంతమైన సంపద

Image Source:

అలా అనంత సంపద పోగవుతూ వచ్చింది. అలా వచ్చిన సంపదను దాచిపెట్టడానికే దేవాలయంలో నేలమాళిగలను నిర్మించారు. వాటికి పెద్ద పెద్ద తాళపు కప్పులను ఏర్పాటు చేసి కేవలం కొంత మందికి మత్రమేఆ ద్వారాలు తెరిచే అవకాశం కల్పించారు.

18.మిక్కిలి క్రూరుడు

18.మిక్కిలి క్రూరుడు

Image Source:

తిరునాళ్ వర్మ తర్వాత దాదాపు మూడు తరాల తర్వాత వచ్చిన ఓ రాజు మిక్కిలి క్రూరుడు. ఎప్పుడూ ప్రజల పై విపరీతమైన పన్నులు వేసి బలవంతంగా వసూలు చేసేవాడు. అంతే కాకుండా పొరుగు దేశాల పై
ఎప్పుడూ దండయాత్రలు చేసి మోసంతో వాటిని జయించి అక్కడి సంపదను మొత్తం దోచుకొనేవాడు.

19. సైనికుల ప్రాణాలను పనంగా పెట్టి

19. సైనికుల ప్రాణాలను పనంగా పెట్టి

Image Source:

ఈ క్రమంలో తన సైనికుల ప్రాణాలను పనంగా పెట్టేవాడు. అలా దాదాపు పదేళ్లలో కొన్ని లక్షల కోట్లు విలువ చేసే బంగారు, వజ్రాలను పోగు చేశాడు. ఇదిలా ఉండగా రాజు ఆగడాలను భరించలేని కొంతమందిఆయన సైన్యంలోని వారే రాజును చంపడానికి పథకం పన్నారు.

20. ప్రాణభయంతో

20. ప్రాణభయంతో

Image Source:

విషయం తెలుసుకున్న రాజు ప్రాణ భయంతో గుడిలోకి వెళ్లాడు. అక్కడ ఇప్పటి వరకూ తాను ఎంత మోసం చేసి డబ్బును సంపాదించి తెలుసుకొని కుమిలిపోయాడు. తన ప్రాణాలు కాపాడితే తాను ఇప్పటి వరకూసంపాదించిన సొత్తును నీకు ఇచ్చేస్తానని అనంత పద్మనాభుడిని వేడుకున్నాడు.

21.అలా పోగయ్యింది

21.అలా పోగయ్యింది

Image Source:

ఏమయ్యిందో తెలియని సైనికులు ఆలయంలోకి ప్రవేశించి భయంతో అక్కడ నుంచి వెళ్లి పోయారు. దీంతో రాజు తాను చెప్పినట్లే ఆ లక్ష్క్షల కోట్ల విలువ చేసే సొత్తును దేవాలయాలనికి ఇచ్చి సామాన్యుడి వలే జీవితం గడిపాడు. అందుకే ఆ దేవలయంలో అనంత సంపద పోగయిందని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X