Search
  • Follow NativePlanet
Share
» »తిరుమల గుడిలోని ఈ రహస్యాలు మీకు తెలుసా

తిరుమల గుడిలోని ఈ రహస్యాలు మీకు తెలుసా

అనేక రహస్యాలకు నిలయమైన తిరుమల వెంకటేశ్వరుడి దేవాలయానికి సంబంధించిన విశేషాలతో కూడిన కథనం

By Beldaru Sajjendrakishore

ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన తిరుమలలోని వెంకటేశ్వరుడుని దర్శించుకోవడం జీవితం ధన్యమయినట్లు భావిస్తారు. ఏడు కొండల పై వెలిసిన ఈ దేవుడిని దర్శించుకోవడానికి భారత దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది వస్తూ ఉంటారు.

తిరుమల, తిరుపతి చుట్టూ ఎన్నో వింతలు విషేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రకతి సిద్ధంగా ఏర్పడిన శిలా తోరణం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇదిలా ఉండగా అయితే వెంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలోని గర్భగుడి కూడా అనేక వింతలకు నిలయం. ఇక వెంకటేశ్వరుడి విగ్రహానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వింతలు, ప్రశ్నలలతో కూడిన కథనం నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. అందుకే అక్కడ గంధం పూస్తారు

1. అందుకే అక్కడ గంధం పూస్తారు

Image source:


తిరుమల మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.

2. జుట్టు ఉందా

2. జుట్టు ఉందా

Image source:


వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.

3.ఆ గ్రామం నుంచి మాత్రమే

3.ఆ గ్రామం నుంచి మాత్రమే

Image source:


తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు జాకెట్లు కూడా వేసుకోరు అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితరాలతో పాటు ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది.

4.ఒక మూలకు

4.ఒక మూలకు

Image source:


స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.

5.కింద పంచె, పైన చీరతో

5.కింద పంచె, పైన చీరతో

Image source:


స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. అతి దగ్గర నుంచి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

6. విగ్రహం వెనుక జలపాతం

6. విగ్రహం వెనుక జలపాతం

Image source:

గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర ఉన్న ఒక కొలనులో పైకి తేలుతాయి.

7.సముద్ర ఘెష వినిపిస్తుంది

7.సముద్ర ఘెష వినిపిస్తుంది

Image source:


స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

8. దీపాలు కొండెక్కవు

8. దీపాలు కొండెక్కవు

Image source:


స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.

10. గుడి పై నంది విగ్రహం ఉంది

10. గుడి పై నంది విగ్రహం ఉంది

Image source:


గుడి పైన శిల్పాల్లో నంది విగ్రహం కూడా ఉంటుంది. దీంతో ఇది వైష్ణవాలయం కాదు శైవ క్షేత్రమన్న వాదన కూడా వినిపిస్తోంది.

10 పన్నెండేళ్ల పాటు మూసివేశారు

10 పన్నెండేళ్ల పాటు మూసివేశారు

Image source:

1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేశారు. అప్పటి రాజు దేవాలయం ముందు 12 మందిని చంపి వేలాడదీశాడని దోశ నివారణ కోసం ఆలయాన్ని మూసివేసినట్లు చెబుతారు. ఆ సమయంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిశారని తెలుస్తోంది.

11. అమ్మవారి విగ్రహమా

11. అమ్మవారి విగ్రహమా

Image source:


విగ్రహం వెనుక శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి రూపం ఉందని చెబుతారు. అందుకే శరన్నవరాత్రులప్పుడు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నయన్న వాదన కూడా ఉంది.

12. శ్రీ చక్రం ఎందుకు ప్రతిష్టించినట్లు

12. శ్రీ చక్రం ఎందుకు ప్రతిష్టించినట్లు

Image source:


ఆది శంకరుడు ఈ స్థలం సందర్శించినప్పుడు మూలవిరాట్టు పాదం కింద శ్రీచక్రం ప్రతిష్టించారు. విష్ణు పాదాలకు, శ్రీచక్రానికి సంబంధం ఏమిటన్న వాదన వినిపిస్తోంది.

13. స్త్రీ విగ్రహమా

13. స్త్రీ విగ్రహమా

Image source:


శిల్పశాస్ర్తజ్జుల ప్రకారం మూల విరాట్టు విగ్రహం స్త్రీ మూర్తి కొలతకు సరిపోతుంది. అందుకే వక్షస్థలం మూసివేస్తూ శ్రీదేవిని, భూదేవిని ఉంచారన్న వాదన వినిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X