Search
  • Follow NativePlanet
Share
» »శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఈ రహస్యాలన్నీ మీకు తెలుసా?

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఈ రహస్యాలన్నీ మీకు తెలుసా?

తిరుమల బ్రహోత్సవాలకు సంబంధించిన కథనం.

నిత్య కళ్యాణమూర్తి అయిన వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు ఈనెల 13 నుంచి తిరుమలలో ప్రారంభం కానున్నాయి. బ్రహ్మ దేవుడు స్వహస్తాలతో జరిపే ఈ ఉత్సవాల్లో ప్రతి అడుగూ ప్రత్యేకమే. వేలాది ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా సాగుతున్న ఈ బ్రహోత్సవాల్లో ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల వెనుక అనేక రహస్యాలు ఉన్నాయి. అటువంటి రహస్యాలను తెలుసుకొంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి వివరాలన్నీ మీ కోసం...

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
చతుర్ముఖుడైన బ్రహ్మ దగ్గరుండీ తిరుపతి తిరుమల బ్రహోత్సవాలను పర్యవేక్షిస్తుంటారని చెబుతారు. అందువల్లే ఈ ఉత్సవాలకు బ్రహోత్సవాలని పేరు.

తెలుగువాడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ కు తిరుత్తణి పుణ్యక్షేత్రానికి సంబంధం తెలుసా?తెలుగువాడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ కు తిరుత్తణి పుణ్యక్షేత్రానికి సంబంధం తెలుసా?

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
అసలు ఈ ఉత్సవాలను మొదలు పెట్టింది ఆ బ్రహ్మే. అందుకే ఆ పేరు. ఇందుకు సంబంధించిన పురాణ కథను అనుసరించి నారాయణ పర్వతం పై పుష్కరిణీ తీరంలో సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో భాద్రపద మాసంలో శ్రీనివాసుడు తిరుమలలోని వేంకటాద్రి పై అవతరించాడు.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
దీంతో స్వామిని వెదుకుతూ బ్రహ్మతో పాటు సమస్త దేవతలు తిరుమల చేరుకొంటారు. శ్రీనివాసుడిని దర్శించిన అనంతరం ఆయన అనుమతితో బ్రహ్మ ఆధ్వర్యంలో తొలిసారి ఉత్సవాలు జరుగుతాయి. అప్పటి నుంచి ఆ ఉత్సవాలను బ్రహోత్సవాలని పిలవడం ప్రారంభించారు.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
శ్రీనివాసుడికి జరిగే వాహన సేవల్లో ముందువైపు ఖాళీగా ఒక రథం ఉంటుంది. దీనికి బ్రహ్మరథం అని పేరు. ఇందులో ఎవరూ ఉండరు. బ్రహ్మ నిరాకర రూపంలో ఉండి ఉత్సవాలను పర్యవేక్షిస్తుంటాడని చెబుతారు.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
అయితే రథోత్సవం రోజు మాత్రం బ్రహ్మరథం ఉండదు. ఆ రోజున బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారి రథాన్ని లాగుతూ ఉంటారని చెబుతారు. అ సాధారణంగా బ్రహోత్సవాలు ఏడాదికి ఒకసారి మాత్రం జరుగుతాయి.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
అధిక మాసం వచ్చిన సంవత్సరంలో మాత్రం రెండు పర్యాయాలు జరుగుతాయి. బాధ్రపదంలో వార్షిక బ్రహోత్సవాలు జరుగుతాయి. దీనినే సాలకట్ల బ్రహోత్సవాలు అని అనింటారు.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
ఆశ్వయుజ మాసంలో దసరా సమయంలో నవరాత్రి బ్రహోత్సవాలు జరుగుతాయి. ఈసారి సాలకట్ల బ్రహోత్సవాలు సెప్టెంబర్ 13 నుంచి 21 వరకూ జరగనున్నాయి.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
సాలకట్ల బ్రహోత్సవాల్లో మాత్రమే అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
తిరుమలలో బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయని మనందరికి తెలుసు అయితే సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఉత్సవాలను ప్రారంభ తిథిని ప్రాతిపదికగా తీసుకొని ఉత్సవాలు జరుపుతారు.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
అయితే తిరుమలలో మాత్రం ముగింపు రోజును లెక్కలోకి తీసుకొని బ్రహోత్సవాలను నిర్వహిసత్ారు. ఈ సారి సాలకట్ల బ్రహోత్సవాలను కన్యామాసంలో శ్రవణా నక్షత్రం రోజున చక్రస్నానం నిర్ణయించి అంతకు తొమ్మిది రోజుల ముందు నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
తిరుమలలో బ్రహోత్సవాలతో పాటు దాదాపు అన్ని సేవల్లోనూ స్వామివారి ఉత్సవమూర్తిగా మలయప్పస్వామి పాల్గొంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే వాస్తవానికి వేంకటేశ్వరుడికి నలుగురు ఉత్సవమూర్తులు ఉన్నారు.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
వారే భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మలయప్పస్వామి. తిరుమలలోని క్రీస్తుశకం 1339 ఏడాదిలో వేయించిన శాసనం ప్రకారం అప్పటి వరకూ ఉగ్ర శ్రీనివాస మూర్తి వేంకటేశ్వరుడకి ఉత్సవమూర్తిగా ఉత్సవాల్లో పాల్గొనేవాడు.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
అయితే ఒకసారి బ్రహోత్సవాల్లో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగి చుట్టు పక్కల ఉన్న ఇళ్లన్నీ తగలబడ్డాయి. తర్వాత తిరుమల పర్వతాల్లోని మలయప్పకోన లో లభించిన విగ్రహాలను స్వామివారి ఉత్సవమూర్తిగా వినియోగిస్తున్నారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
బ్రహోత్సవాలకు ముందు అంకురార్పణ జరుగుతుంది. ఆరోజు ఉత్సవాలకు స్వామి సేనాధిపతి అయిన విష్వక్సేనుడు భూమి పూజ చేస్తాడు. అనంతరం పుట్టమట్టిని సేకరించి ప్రదక్షణంగా వచ్చి ఆలయంలోకి ప్రవేశిస్తాడు. ఆ మట్టిని వినియోగించే చిన్న కుండలను తయారు చేసి వాటిలో నవధాన్యాలు పోసి అంకురార్పణ చేస్తారు.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
ఇక బ్రహోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. ఆలయంలోని ధ్వజస్తంభం పై గరుడి చిత్రం ఉన్న పసుప పచ్చని వస్త్రం ఎగురవేడయడమే ధ్వజారోహణ కార్యక్రమం.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
ఆ సమయంలో ముద్గలాన్నం అంటే పెసర పులగం నివేదిస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ధ్వజారోహణ నిర్వహించిన రోజు రాత్రి నుంచి వాహన సేవలు ప్రారంభమవుతాయి.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి వాహనాలను అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగుతాడు. ఇందులో కొన్ని వాహనాల్లో ఒంటరిగా ఊరేగగా మరికొన్నింటిలో ఇరు దేవేరులతో కలిసి అనుగ్రహిస్తాడు. స్వామి హంస వాహనం పై సరస్వతీ రూపంలో తరలి రావడం విశేషం.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
తొమ్మిది రోజుల బ్రహోత్సవాల్లో ఐదో రోజు అత్యంత ప్రధానమైనది. ఆ రోజు గరుడ సేవ జరుగుతుంది. ఈ సేవలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో గోదాదేవికి అలంకరించిన పుష్పలు తీసుకువచ్చి స్వామివారికి అలంకరిస్తారు.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
అంతేకాకుండా రాష్ట్రప్రభుత్వం సమర్పించే పట్టువస్త్రాలు కూడా స్వామివారికి ఈ రోజునే ధరింపజేస్తారు. ఆనంద నిలయంలో కొలువుదీరిన శ్రీవారి మూలవిరాట్టుకు విశేషమైన నగలను ధరింపజేస్తారు. ఆ రోజు ఉదయం పల్లకీ ఉత్సవం జరుగుతుంది. పల్లకీ ఉత్సవం ఆలయం నుంచి ప్రారంభం కావడం విశేషం.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
బ్రహోత్సవాల్లో తొమ్మిదో రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుచ్చి వాహనం పై ఊరేగుతూ వరహాస్వామి ఆలయం చేరుకొంటారు. ఈ సమయంలో శ్రీవారి ఆయుధమైన శ్రీచక్రాళ్వారు కూడా అనుసరిస్తారు.

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు

P.C: You Tube
అటు పై ఈ చక్రాళ్వారును పుష్కరిణిలోకి తీసుకెళ్లి పవిత్ర స్నానం చేయిస్తారు. దీనినే చక్రస్నానం అని అంటారు. బ్రహోత్సవాల ప్రారంభం రోజున ఎగురవేసిన గరుడ కేతాన్ని అదే రోజున కిందికి దించుతారు. దీంతో ఉత్సవాలు ముగిసినట్లు లెక్క.

స్వర్గాన్ని చేర్చే యమకోణంస్వర్గాన్ని చేర్చే యమకోణం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X