Search
  • Follow NativePlanet
Share
» »సప్త ద్వీప సుమధుర స్వప్నాలు !

సప్త ద్వీప సుమధుర స్వప్నాలు !

మీకు ఇష్టమైన సన్ గ్లాస్ లను బయటకు తీయండ్, బీచ్ వేర్ కూడాను. ఇండియా లోనే కల ఏడు ద్వీపాలను చుట్టి వద్దాం. సప్త ద్వీపాల సందర్శన అంతులేని అదృష్టాలను తెచ్చి పెడుతుందని అంటారు. ఈ ద్వీపాల విహారంలో కల బీచ్ లలో రిలాక్స్ అయ్యే ఏర్పాట్లు చేసుకోండి. మీకిష్టమైన మంచి మ్యూజిక్ సిస్టం, లేదా రిలాక్స్ అయి బీచ్ ఒడ్డున చడుకొనే మంచి నవల మీకు ఒక మంచి బోనస్ గా కూడా వుంటాయి. వాస్తవానికి ఇండియా కు గల కోస్తా తీరంలో సుమారు వంద ద్వీపాలవరకు వున్నాయి. అయితే ప్రస్తుతానికి దిగువన ఇస్తున్న ఏడు ద్వీపాలు, మీ వేసవి సెలవుల దాహార్తిని తప్పక తీర్చ గలవని చెప్పవచ్చు.

అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు

అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు

సుమారు 572 చిన్న చిన్న దీవులు కలసి అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలుగా ఏర్పడ్డాయి. ఇవి మీకు చక్కని సుదీర్ఘ సెలవు విహారాన్ని అందిస్తాయి. ఇక్కడ కల నీల్ ద్వీపాలు, హావ్ లాక్ ద్వీపాలు, మరియు వైపర్ ద్వీపాలు, టూరిస్ట్ ల ఫేవరెట్ ద్వీపాలు.

Photo Courtesy: Venkatesh

 లక్షద్వీపాలు

లక్షద్వీపాలు

లక్షద్వీపాలు అనేవి 36 దీవుల సముదాయం. ప్రకృతి యొక్క అందం, విలాసం వీటిలో ప్రతి ప్రదేశంలోను కనపడతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి సన్నిహిత సమయం గడిపేందుకు ఈ ప్రదేశాలు ఎంతో బాగుంటాయి. స్వచ్చమైన సముద్రపు నేరు మరియు నీలి ఆకాశం కల ఈప్రదేశాలు మీ మనస్సులను ప్రశాంతంగా ఉంచుతాయి.

Photo Courtesy: Lenish Namath


విపిన్ ద్వీపాలు, కేరళ

విపిన్ ద్వీపాలు, కేరళ

పోర్చుగీస్ వారు ఏర్పరిచిన కేరళ లోని ఈ ప్రదేశంలో 'ఔర్ లేడీ అఫ్ హోప్ చర్చి ' ప్రధానమైనది. ఇక్కడ ఇంకా అనేక ఇతర మత సంస్థలు కూడా కలవు. ఈ విపిన్ లేదా వైపీన్ అనే ద్వీపం కేరళ లోని ఎర్నాకులం సిటీ కి సమీపంగా కలదు.

Photo Courtesy: Arnab J Deka

బట్టర్ ఫ్లై ఐలాండ్, గోవా

బట్టర్ ఫ్లై ఐలాండ్, గోవా

గోవా లో అన్నీ బీచ్ లు అయినప్పటికీ, ఇక్కడ చాలామందికి తెలియని కొన్ని ద్వీపాలు కూడా కలవు. వాటిలో బట్టర్ ఫ్లై ఐలాండ్ ఒకటి. ఇక్కడి బీచ్ లో డాల్ఫిన్స్ కూడా వుంటాయి. టూరిస్ట్ లు పలోలిం బీచ్ నుండి బోటు రైడ్ లో ఈ దీవికి చేరవచ్చు.

Photo Courtesy: Gili Chupak

నేత్రాని ఐలాండ్

నేత్రాని ఐలాండ్

నేత్రాని ఐలాండ్ గురించి చాలా మందికి తెలియదు. ఇది అరబియా సముద్రం ఒడ్డున కర్నాటకకు సమీపంలో కలదు. దీనిని పావురం ద్వీపం అని కూడా పిలుస్తారు. ఈ ద్వీపం, ప్రసిద్ధి గాంచిన మురుడేశ్వర టెంపుల్ కు సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరం లో వుంటుంది.
Photo Courtesy: Chetansv

రామేశ్వరం

రామేశ్వరం

ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గా పిలువబడే రామేశ్వరం ఇండియా - శ్రీ లంకల మధ్య గల గల్ఫ్ మన్నార్ లో వుంది. ఈ రామేశ్వరం ద్వీపాన్ని మెయిన్ ల్యాండ్ తో పంబన్ బ్రిజ్ కలుపుతుంది.

Photo Courtesy: tn.nic

సేక్రేడ్ ఐలాండ్స్

సేక్రేడ్ ఐలాండ్స్

కావేరి - శ్రీరంగపట్న -శివన సముద్ర మరియు శ్రీరంగం - ఆది రంగ , మధ్య రంగ, అంత్య రంగ ప్రదేశాలు, హిందువులలోని వైష్ణవులకు పవిత్ర లేదా సేక్రేడ్ ద్వీపాలుగా పేరు పడ్డాయి. శ్రీరంగం తమిళ్ నాడు రాష్ట్రంలో వుండగా, మిగిలిన రెండు పవిత్ర ద్వీపాలు కర్ణాటకలో కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X