Search
  • Follow NativePlanet
Share
» »ఒక్క ఇంటికి కూడా తలుపులే లేని అద్భుతమైన గ్రామం..!

ఒక్క ఇంటికి కూడా తలుపులే లేని అద్భుతమైన గ్రామం..!

మన దేశంలో సుప్రసిద్ద శనేశ్వర స్వామి క్షేత్రాలలో ప్రధానమైనదిగా, దేశంలో అతి ముఖ్యమైన అతి పెద్ద శనేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతున్నది శని శింగణాపూర్.ఒక్క ఇంటికి కూడా తలుపులే లేని అద్భుతమైన గ్రామం..!శిరిడి

మీరు శిరిడి సాయి బాబా దర్శనానికి వెళుతున్నారా? అయితే మీరు తప్పనిసరిగా శిరిడికి దగ్గరలో ఉన్న శని శింగనూర్ దర్శించడం మర్చిపోకండి. శని శింగనూర్ చాలా మంది యాత్రికులకు, పర్యాటకులకు తెలియకపోవచ్చు. కానీ తెలిసిన వారుమాత్రం శిరిడీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ శని శింగనూర్ లోని శనిమహాత్మను దర్శించకుండా మాత్రం తిరిగిరారు. ఇది ఒక సంప్రదాయంగా వస్తోంది.

మన దేశంలో సుప్రసిద్ద శనేశ్వర స్వామి క్షేత్రాలలో ప్రధానమైనదిగా, దేశంలో అతి ముఖ్యమైన అతి పెద్ద శనేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతున్నది శని శింగణాపూర్. ఈ క్షేత్రంలో శనేశ్వర స్వామి కొలువై భక్తుల కోర్కెలు తీర్చే కొంగుభంగారమై నిలిచాడు. మహరాష్ట్రలోని శిరిడి క్షేత్రానికి దాదాపు 70కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్వ క్షత్రం శనేశ్వరుని మహిమానిత్వాలతో ప్రసిద్ది చెందినది. ఆ దివ్వ క్షేత్ర విశిష్టత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

శనేశ్వర స్వామి క్షేత్రాలలో ప్రధానమైనదిగా,

శనేశ్వర స్వామి క్షేత్రాలలో ప్రధానమైనదిగా,

శనేశ్వర స్వామి క్షేత్రాలలో ప్రధానమైనదిగా, దేశంలోనే అతి పెద్ద శనేశ్వర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతున్న శని శింగణాపూర్ క్షేత్రంలో సాక్షాత్ శనిశ్వరుడు కొలువై భక్తులు కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. శనేశ్వర స్వామి లీలీ విశేషాలతో పునీతమైన శని శింగణాపూర్ క్షేత్రం మహరాష్ట్రలో శిరిడి పుణ్యక్షేత్రానికి దాదాపు 70కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో ఉండే సొనై గ్రామమే శని శింగణాపూర్ గా పిలుస్తారు.

హిందూ దేవుళ్ళు

హిందూ దేవుళ్ళు

హిందూ దేవుళ్ళు పవిత్రంగా భక్తి శ్రద్దలతో పూజించే నవగ్రహాలలో ఒకరు శని మహాత్ముడు. నవగ్రహాలలో శనేశ్వరునికి ఒక విశేషమైన స్థానం ఉంది. ఆయన జీవులకు ఆత్మజ్జానాన్ని ప్రభోదిస్తాడు. మనిషి కష్టాలలో ఉన్నప్పుడే, ఆత్మశక్తిని గ్రహించి, అజ్జానాందకారాన్ని విడిచిపెడతాడు. దైవం విలువ తెలుసుకుని మసలుకుంటారు. ఈ కారణం చేతనే మనిషికి ఆత్మజ్జానంను ప్రభోదించడానికి శని కష్టాలు పెడతాడని చెబుతారు.

పూర్వ జన్మలో చేసి పాపపుణ్యాలను

పూర్వ జన్మలో చేసి పాపపుణ్యాలను

అలాగే పూర్వ జన్మలో చేసి పాపపుణ్యాలను అనుసరించి శనేశ్వరుడు మనిషికి యోగ ఫలితాలను ఇస్తారని చెబుతారు. శనేశ్వరుడు సూర్యుని పుత్రుడు, మహా శక్తివంతుడు, సాక్షాత్తు మహా శివుడు సైతం శనేశ్వరుని లీలా విశేషాలు తెలుసుకోవడానికి కైలాసం వదిలి వెళ్ళినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అలాంటి మహిమాన్వితమైన శనీశ్వరరుని లీలావిశేషాలకు వేదిక శని శింగణాపూర్.

శనిశింగణాపూర్ చేరుకున్న భక్తులు

శనిశింగణాపూర్ చేరుకున్న భక్తులు

శనిశింగణాపూర్ చేరుకున్న భక్తులు ముందుగా ఓం శనేశ్వరాయ నమ: అంటూ భక్తి శ్రద్దలతో స్నానాదులు ఆచారించి స్వామివారికి అంత్యంత ఇష్టమైన పూజాద్రవ్వాలను తీసుకుని మహాత్ముని దర్శించుకుంటారు. ఆయ ముఖ ద్వారా అత్యంత అధునాతనంగా కనిపించే ఈ దర్శన ద్వారం ఈ మద్యకాలంలో నిర్మింపబడినది. ఇక్కడ ప్రవేశించిన భక్తులు తర్వాత ఓం శనేశ్వరాయ నమ: అంటూ ప్రధాన ఆలయంలోకి చేరుకుంటారు.

ప్రధాన ఆలయ ముందు భాగంలో

ప్రధాన ఆలయ ముందు భాగంలో

ప్రధాన ఆలయ ముందు భాగంలో ముందుగా ఒక త్రిశూలం భక్తులకు దర్శనమిస్తుంది. స్వామి వారికి కొబ్బరి కాయలు నల్ల గుడ్డ, ఇతర పూజాద్రవ్యాలను సమర్పించుకునే భక్తులు, మొదట ఈ త్రిశూలం దగ్గరే ఈ పూజాద్రవ్యాలను భక్తితో సమర్పించుకుంటారు. తర్వాత స్వామి దర్శనం చేసుకుంటారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రంలో శని దేవుని నామ స్మరణ తప్ప మరొకటి వినిపించదు.

శని శింగణాపూర్ లో నేరుగా శనేశ్వర స్వామిని

శని శింగణాపూర్ లో నేరుగా శనేశ్వర స్వామిని

శని శింగణాపూర్ లో నేరుగా శనేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యం కేవలం ఒక శనిదేవునికి మాత్రమే ఉంటుంది. వీరు కూడా శుచి శుభ్రతను పాటిస్తూ, కాశాయ వస్త్రాలు ధరించి స్వామిని దర్శించుకుంటారు. అయితే మహిళా భక్తులు మాత్రం స్వామిని దూరం నుండి దర్శించుకోవచ్చు

శనేస్వామి ఈ క్షేత్రంలో కొలువై ఉండటానికి

శనేస్వామి ఈ క్షేత్రంలో కొలువై ఉండటానికి

శనేస్వామి ఈ క్షేత్రంలో కొలువై ఉండటానికి ఒక పురాణ గాధ ఉంది. శని శింగణాపూర్ అనే గ్రామంలో స్వయంభుగా ఉద్భవించిన నల్లని, గంభీరమైన రాతి విగ్రహమే శనేశ్వర స్వామి. ఇక్కడ శనేశ్వర స్వామి కొలువ్వడానికి ఒక పురాణగాథ ఉంది.

పూర్వం శని శింగణాపూర్ లోకి ప్రవేశించే

పూర్వం శని శింగణాపూర్ లోకి ప్రవేశించే

పూర్వం శని శింగణాపూర్ లోకి ప్రవేశించే పనస్వానకు విపరీతమైన వరదలు రావడంతో , ఆ వరదల్లో దివ్వమైన విగ్రం కొట్టుకుని వచ్చింది. వరదల్లో కొట్టుకొని వచ్చిన ఈ విగ్రహం గ్రామంలోని ఒక పరిమి చెట్టు మద్యలో కూరికుపోయింది.

ఒక రోజు మేకలు కాచుకుంటూ

ఒక రోజు మేకలు కాచుకుంటూ

ఒక రోజు మేకలు కాచుకుంటూ అటుగా వెళుతున్న మేకల కాపరి, మరికొంత మంది యువకులు పరిమి చెట్టులో కూరుకుపోయిన విగ్రహాన్ని చూడటానికి కర్రలతో విగ్రహాన్ని జరిపే ప్రయత్నం చేసారు. ఎంత ప్రయత్నించినా విగ్రహం కదలకపోవడం, కాస్త బలంగానే కట్టితో నొక్కడం వల్ల ఆశ్చర్యంగా ఆ విగ్రం నుండి రక్తం శ్రవించడం మొదలైంది, దాన్ని చూసిన వారు భయంతో వణికిపోతు గ్రామంలోకి వెళ్ళి జరిగిన విశాయన్ని గ్రామ పెద్దలకు చెప్పారట.

గ్రామ పెద్దల కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి

గ్రామ పెద్దల కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి

గ్రామ పెద్దల కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి, ఆ విగ్రహాన్ని కదిలించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. అదే రోజు రాత్రి ఆ గ్రామంలోని ఒక వ్యక్తి కలలో శనేశ్వరుడు కనిపించి, తాను ఈ గ్రామంలో ఉన్నానని తనను వెలికి తీసి గ్రామంలో ప్రతిష్టమించమని చెప్పాడట. ఆ మర్నాడు ఆ భక్తుడు, కొందరు గ్రామస్తులతో యడ్ల బండిని తీసుకుని పోయి, విగ్రహాన్ని పైకి తీసే ప్రయత్నం చేయగా అది కదలలేదు, దాంతో ఆ భక్తుడు నిరాశగా వెనుదిరిగాడు.

మరునాడు, మేనమామ, మేనల్లుడు వరసయ్యే వారు

మరునాడు, మేనమామ, మేనల్లుడు వరసయ్యే వారు

మరునాడు, మేనమామ, మేనల్లుడు వరసయ్యే వారు వెళ్ళి ఆ చెట్టును తొలగిస్తే విగ్రం కదులుతుందని కలలో స్వామి చెప్పగా , శనేశ్వర ఆజ్జ మేరకు ఆ భక్తుడు అలాగే చేసి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. 5.6 అడుగులు పొడవూ, 1.6 అడుగుల వెడల్పు కలిగివున్న ఈ మూర్తినే కట్టపై ప్రతిష్ఠించి శనేశ్వరునిగా పూజలు చేస్తున్నారు.

అయితే గొర్రెల కాపరికి మరో సందేహం

అయితే గొర్రెల కాపరికి మరో సందేహం

అయితే గొర్రెల కాపరికి మరో సందేహం కలలో కనిపించిన శనేశ్వరున్ని ఆలయం నిర్మిచాలా అని అడుగగా, దానికి సమాధానంగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని కావున, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటంగా ఉండటకు ఇష్టపడతానని చెప్పెను.

అయితే తన విగ్రహానికి ప్రతి రోజూ పూజ చేసి

అయితే తన విగ్రహానికి ప్రతి రోజూ పూజ చేసి

అయితే తన విగ్రహానికి ప్రతి రోజూ పూజ చేసి, శనివారాల్లో తైలాభిషేకం చేయమని గొర్రెల కాపరికి కలలో శనేశ్వరుడు చెప్పాడు. అంతే కాదు నేను ఉన్న ఈ ప్రదేశంలో బందిపోటులు రారు, దొంగల భయం ఉండదని మాట ఇచ్చాడు.

 అందువల్లే ఈ రోజు వరకు

అందువల్లే ఈ రోజు వరకు

అందువల్లే ఈ రోజు వరకు (ఈ కలియుగంలో కూడా) ఏ ఇంటికి తలుపు లుండవు! దుకాణాలకు, ఇళ్ళకు, ఆలయాలకు, చివరికి ప్రభుత్వకార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు. ఇంతటి మహిమానిత్వం ఉన్న ఈ శని శింగణాపూర్ ను దర్శించడం నిజంగా అద్రుష్టమే.

శనేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది

శనేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది

శనేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగణాపూర్‌ను దర్శిస్తారు. శనివారాలలో ఈ స్థలం చాలా రద్దీగా ఉంటుంది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదే విధంగా 'అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఆయన దీవెనల కోసం వేలమంది భక్తులు ఈ ఆలయం వద్ద ఉంటారు.

ఇక ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది

ఇక ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది

ఇక ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది అదేమిటి అంటే, ప్రతి మనిషికి జీవితంలో మూడు దస్సల్లో యేలినాటి శని వస్తుంది...ఏడు సంవత్సరాలు ఉండే ఈ శని బాధల్ని, తప్పించుకోవాలి అంటే ఇక్కడ ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే శని గ్రహ బాధల్ని తొలగించుకోవచ్చు అని భక్తులు నమ్ముతారు .

ఆలయ సమయం:

ఆలయ సమయం:

అమావాస్య రోజున శని పూజలు జరుగుతాయి. శని త్రయోదని రోజున స్పెషల్ పూజలు జరుగుతాయి. ఆలయం ఉదయం 12గంటల నుండి ఉదయం 12 గంటల వరకు తెరవబడి ఉంటుంది.

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:


రోడ్:
శిరిడీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం వెలుతుంటాయి. ప్రైవేటు ట్యాక్సీలు కూడా అందుబాటు ధరల్లో దొరుకుతాయి. అహ్మద్ నగర్ నుంచి 70 కిలోమీటర్లు, రాహూరు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో శని శింగనాపూర్ ఉంటుంది.

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:

ఎయిర్:
అలాగే శిరిడికి 77కిలోమీటర్ల దూరంలో ఎయిర్ పోర్ట్ ఉంది.

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:

ట్రైయిన్:
శని శింగనాపూర్ కు 39కిలోమీటర్ల దూరంలో అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ కలదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X