Search
  • Follow NativePlanet
Share
» »శనిషింగనాపూర్ - తలుపులు లేని నగరం !

శనిషింగనాపూర్ - తలుపులు లేని నగరం !

ఎండాకాలం వచ్చిందనే చాలు దొంగల బెడద అధికంగా ఉంటుంది. దీనికి తోడు పోలీసులు ఇచ్చే ఉచిత సలహా - మీరు ఎక్కడికైనా వెళితే పోలీసులకు చెప్పి వెళ్లండి అని. ఎవ్వరికీ చెప్పిన ఆంతే సంగతులు !! పోలీసులు కాదుకదా ఎవరొచ్చిన సమాజంలో దోపిడీలు ఆగక మానవు. సరేలెండి ఇది ఎప్పుడు ఉండేదే!. ఇక విషయానికి వస్తే మామూలుగా మనం రాత్రి అయితే ఎం చేస్తాం తలుపులు వేసుకొని పడుకుంటాం అంతే కదా ఎందుకు ? ఎవ్వరైనా వచ్చి ఏదైన దోచుకు వెళతాడని!. (ఎంత భయమో మనకు) ఇది పోలీసులకు కూడా వర్తించక మానదు.

మరి అటువంటపుడు, తలుపులు కూడా లేని ఇండ్లు ఉంటాయనేది నమ్ముతారా ? నమ్మాల్సిందే...నమ్మి తీరాల్సిందే ! తలుపులు లేని నగరం ఒకటి వుంది. అదే శానిషింగనాపూర్. ఈ చిన్న గ్రామం ప్రసిద్ధ పుణ్య క్షేత్రం షిర్డీ కి 70 కి. మీ. ల దూరంలో కలదు. ఈ ప్రదేశంకు నాశిక్ పట్టణం కూడా సమీపమే. నాసిక్ 75 కి. మీ. ల దూరంలో కలదు. ఈ విలేజ్ కు ఈ పేరు అక్కడ కల శని మహాత్మా టెంపుల్ వలన ఏర్పడింది. ఈ టెంపుల్ లో శనీశ్వరుడు నిత్య పూజలు అందుకుంటాడు.

శని షింగానా పూర్ - తలుపులు లేని నగరం !

ఈ టెంపుల్ లోని శనీస్వరుడి విగ్రహం ఈ గ్రామాన్ని రక్షిస్తోందని విశ్వసిస్తారు. ఈ గ్రామంలో దొంగతనాలు, దోపిడీలు జరగవు. ఇక్కడ కల ఇండ్లకు తలుపులు, కిటికీలు లేదా తాళపు ఏర్పాట్లు లేకుండానే నిర్మాణాలు జరుగుతాయి. ఎవరైనా దొంగతనం, లేదా దోపిడీ కి పాల్పడితే, ఆ వ్యక్తి గ్రామం సరిహద్దులు దాటే లోపే మరణిస్తాడని లేదా పిచ్చి వాడవుతాడని గట్టిగా నమ్ముతారు. ఇక్కడ ఎవరూ కూడా శని దేముడు ఈ రకంగా శిక్షిస్తాడనే ఆ భయం చేత అటువంటి నేరాలకు పాల్పడరు. ఇక్కడ మరొక ఆసక్తి కర విషయం ఎమేంటే, ఇక్కడ ఒక బ్యాంకు తెరచారు. దానికి సైతం తాళాలు వుండవు. ఇరవై నాల్గు గంటలూ ఆ బ్యాంకు తెరచే వుంటుంది. ప్రతి రోజూ ఈ శని మహాత్మా టెంపుల్ కు కనీసపక్షం సుమారుగా 50,000 మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు.

శనీశ్వరుడికి ప్రీతీ అయిన శనివారాలు మరియు పౌర్ణమి వంటి పవిత్ర దినాలలో భక్తుల సంఖ్య మరింత అధికమై లక్షలలో కూడా వుంటుంది. శనివారం రోజున కనుక పౌర్ణమి తిది వచ్చేందంటే, శనీస్వరుడి కి అట్టహాసంగా ఒక ఊరేగింపు నిర్వహిస్తారు. ఇంత మహత్యంకల శని శింగన పూర్ అధ్యాత్మికులైన ప్రతి వారూ చూడవలసిన ప్రదేశం. ఈ విలేజ్ కు సమీపంలో చూడవలిసిన ప్రదేశాలు కలవు. అవి 75 కి. మీ. కల దూరం లో కల షిరిడి సాయి బాబా టెంపుల్ ,నాసిక్ లోని త్రయంబకేశ్వర్ టెంపుల్, పంచవటి మొదలైనవి. ఈ ప్రదేశాలు కూడా హిందువులకు ప్రసిద్ధి అయిన పుణ్య క్షేత్రాలే.

ఇక్కడ కల టెంపుల్స్ మాత్రమే కాక, పర్యాటకులకు ఇతరంగా చూసేందుకు షిరిడి లోని దీక్షిత్ వాడా మ్యూజియం, లెండి బాగ్, నాసిక్ లోని దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ , నాసిక్ లోని శూలా వైన్ యార్డులు కూడా కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X