Search
  • Follow NativePlanet
Share
» »కలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా...ప్రపంచంలో అటు వంటి గ్రామం అదొక్కటే

కలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా...ప్రపంచంలో అటు వంటి గ్రామం అదొక్కటే

కలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామమైన శింగనాపూర్ గురించిన కథనం.

By Beldaru Sajjendrakishore

సాధారణంగా మన వస్తువులను సంపదను భద్రపరుచుకోవడానికి ఇల్లు కట్టుకుని దానికి తలుపులు వేయిస్తాం. అయితే ప్రపంచంలో ప్రస్తుతం నివాసయోగ్యంగా ఉన్న కేవలం ఒక్క గ్రామంలో మాత్రం ఇల్లకు ఎటువంటి తలుపులు ఉండవు. కేవలం ప్రజల ఇళ్లకే కాకుండా పోస్టాఫీసు, ఆసుపత్రి తదితర ప్రభుత్వ భవనాలకు కూడా ఎటువంటి ద్వారాలు ఉండవు. అక్కడ ఉన్న ఒక దైవం తమ సంపదను రక్షిస్తోందన్న నమ్మకమే ప్రజలను ఇంటికి తలుపులు చేయించడం లేదు.

ఇది పది, పదిహేనేళ్ల నాటి సంగతి కాదు. కలియుగం మొదటి నుంచి కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. ప్రజలు పక్క ఊరికి వెళ్లినా కూడా ఇంటికి తలుపులను బిగించి వెళ్లరు. గొళ్లెం, తాళాల ఊసే లేదు. ఈ గ్రామం మన దేశంలోనే ఉంది. ఆ గ్రామం ఏమిటి ఎక్కడ ఉంది, దిని విశిష్టతలు తదితర విషయాలకు సంబంధించిన కథనం నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

1. అనంత స్వరూపడని చెప్పే క్రమంలోనే

1. అనంత స్వరూపడని చెప్పే క్రమంలోనే

Image source:

మహారాష్ట్రలోని, శని శింగనాపూర్ లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ముఖ్య పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆ పరమాత్ముడు అరుబయటనే ఉంటాడు. ఎటువంటి ప్రత్యేక దేవాలయం ఉండక పోవడం ఇక్కడ ఉన్న విశిష్టత. తాను అనంతానంత స్వరూపడని ప్రజలకు చెప్పే క్రమంలోనే శనీశ్వరుడు తనకు దేవాలయం అవసరం లేదని ఇక్కడి వారికి చెప్పినట్లు స్థానిక కథనం

2. స్వయంభువుడు

2. స్వయంభువుడు

Image source:

శని శింగనాపూర్ అనే గ్రామం ప్రసిద్ధ పుణ్యక్షేతమైన షిరిడి నగరానికి మరియు ఔరంగాబాద్ నగరానికి మధ్యలో నెలకొని ఉంది. ఇక్కడి దైవము "స్వయంభు" అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించినదదని అర్థం. నల్లని, గంభీరమైన రాతి విగ్రహం. కచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియదు. అయినా చాలా కాలం నుంచి ఈ విగ్రహాన్ని ఇక్కడ పూజిస్తున్నారు.

3. పూర్వం ఇది ఒక కుగ్రామం

3. పూర్వం ఇది ఒక కుగ్రామం

Image source:

పూర్వం శని శింగనాపూర్ ఒక కుగ్రామం. స్థానిక పల్లెటూరికి చెందిన గొర్రెల కాపురుల చెప్పే కథనం ప్రకారం...స్వయంభువుడైన శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువైయున్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా నమ్ముతారు. అప్పటి నుంచి ఉన్నాకూడా ఇక్కడ దేవుడికి దేవాలయం లేకపోవడం విశేషం. ఎంత ప్రయత్నించినా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించలేరు.

4. గొర్రెల కాపరి ద్వారా వెలుగులోకి

4. గొర్రెల కాపరి ద్వారా వెలుగులోకి

Image source:

పూర్వం గొర్రెల కాపరి అటు వైపుగా వెలుతూ తన చేతిలో ఉన్న కర్రతో ఈ రాతి పై గట్టిగా మొదాడు. వెంటనే రాతి నుంచి రక్తం స్రవించడం మొదలయ్యింది. వెంటనే అక్కడ ఒక ప్రకాశవంతమైన వెలుగు ప్రసురించింది. ఈ విషయాన్నిగొర్రె కాపరులు దిగ్బ్రాంతితో చూడసాగారు. ఈ విషయం ఆనోటా ఈ నోట గ్రామం మొత్తం చేరిపోయింది. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతాన్ని చూచేందుకు గుమికూడింది.

5. కలలో కనిపించాడు

5. కలలో కనిపించాడు

Image source:

ఆ రోజు రాత్రి శనీశ్వరుడు గొర్రెల కాపరి స్వప్నంలో కనిపించాడు. తాను "శనీశ్వరుడి"నని చెప్పెను. అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని కుడా ఆ గొర్రె కాపరికి చెప్పాడు. గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించడమే కాకుండా తన తప్పును క్షమించమని వేడుకొన్నారు. తన తప్పుకు శిక్షగా తాను స్వామికి ఆలయం నిర్మించి ఇస్తానని ప్రాధేయపడ్డాడు.

6. ఆకాశం మొత్తం తనకు నీడ అని

6. ఆకాశం మొత్తం తనకు నీడ అని

Image source:


దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ చెప్పాడు. తాను సర్వేశ్వరుడినని చెప్పడమే కాకుండా తనకు ఎటువంటి దేవాలయం అవసరం లేదని స్పష్టం చేశాడు. తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని చెప్పెను. ప్రతిరోజూ పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని శనీశ్వరుడు గొర్రెల కాపరికి చెప్పెను. దీంతో గొర్రెల కాపరి తన ప్రయత్నాన్ని విరమించాడు.

7. దొంగల భయం లేదు

7. దొంగల భయం లేదు

Image source:

అంతేకాక మొత్తం పల్లెకి బందిపోటుల లేదా కన్నములు వేసే వారు లేదా దొంగల భయం ఉండదని మాట ఇచ్చెను.అందుచే ఈరోజు వరకు కూడా శనీశ్వర స్వామిని ఎటువంటి కప్పు లేకుండా ఆరు బయట చూడవచ్చును. ఈ రోజు వరకు ఏ ఇంటికి, దుకాణముకు, ఆలయముకు కూడా తలుపులు ఉండవు. తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాల ప్రసక్తి లేకపోవడం మనం చూసి నమ్మవచ్చు.

8. ఇళ్లలతో పాటు దుకాణాలకు కూడా

8. ఇళ్లలతో పాటు దుకాణాలకు కూడా

Image source:

శనిభగవానుని యందు భయముచే, శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు. శని శింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటు వంటి స్థానికులే కాకుండా పోలీసు రికార్డులు కూడా స్పష్టం చేస్తున్నాయి.

9. అలా చేస్తే చనిపోతారు.

9. అలా చేస్తే చనిపోతారు.

Image source:


ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధరకాల శిక్షలు అనుభవించారు. ఈ విషయాన్ని అక్కడి వైద్యులు కూడా చెబుతున్నారు. ఇలా దొంగతనాకి పాల్పడే వారు ఆరోగ్యంగా ఉన్న తదుపరి వారం లోపు పేరు తెలియని రోగాలతో బాధపడి చనిపోయారని వారు స్పష్టం చేస్తున్నారు.

10 తైలాభి షేకం

10 తైలాభి షేకం

Image source:

శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగనాపూర్‌ను దర్శిస్తారు. శనివారములలో ఈ స్థలం చాల రద్దీగా ఉంటుంది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదే విధంగా 'అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఆయన దీవెనల కోసం వేలమంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమికూడతారు.

11.ఒక్క దొంగతనం కూడా జరగలేదు...

11.ఒక్క దొంగతనం కూడా జరగలేదు...

Image source:


2010 వరకూ ఇక్కడ ఒక్క దొంగతనం కూడా జరుగలేదు. అయితే ఆ ఏడాది కొంతమంది ఈ ఊరిలో దొంగతనానికి పాల్పడ్డారు. అయితే వారు ఊరి పొలిమేర్ల వరకూ వెళ్లగలిగారు. అటు పై ఏదో పెద్ద వెలుగు వారి పైకి వచ్చినట్లు తోచింది. అంతే వారంతా కిందికి పడిపోయారు. వైద్యులు పరీక్షించి వారు చనిపోయినట్లు నిర్థారణ చేశారు.

12. ఒక్క బ్యాంక్ మాత్రమే

12. ఒక్క బ్యాంక్ మాత్రమే

Image source:

ఈ ఘటన జరిగిన తర్వాత యూసీఓ బ్యాంక్ తన కార్యాలయానికి తలుపులు బిగించింది. అంతేకాకుండా లాకర్లకు తాలూలు కూడా వేసింది. దీంతో చాలా కాలంగా వస్తున్న సంప్రదాయాన్ని ఆ బ్యాంక్ యాజమాన్యం తోసివేసిందన్న నిరసలు వ్యక్తమయ్యాయి. అయితే బ్యాంకు యాజమాన్యం మాత్రం తన చర్యను సమర్థించుకుంది.

13. బయటి ఊర్లకు వెళ్లినా...

13. బయటి ఊర్లకు వెళ్లినా...

Image source:


ఇప్పటికీ ఈ శనిశింగనాపూర్ లో ఉన్న దాదాపు 6000 మంది ప్రజలు తమ ఇల్లకు తలుపులు బిగించుకోరు. 24 గంటలూ ఆ ద్వారాలు తెరుచుకోనే ఉంటాయి. ప్రజలు ఎటువంటి భయం లేకుండా ఉంటారు. ఇతర ఊర్లకు వెళ్లే సమయంలో కూడా తమ ఇంటికి గొళ్లెం, తాళాలు వేయరు. తాము ఎక్కడికి ఎన్ని రోజులు వెళ్లినా ఆ శనీశ్వరుడు తమ సంపదను కాపాడుతారని ఇక్కడి వారి నమ్మకం.

14.శిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్కరూ

14.శిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్కరూ

Image source:


శిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ శని శింగనాపూర్ ను చూడకుండా తిరిగిరారు. ఇది ఒక సంప్రదాయంగా వస్తోంది. శిరిడీ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో శని శింగనాపూర్ ఉంది. శిరిడీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం ఇక్కడికి వెలుతుంటాయి. ప్రైవేటు ట్యాక్సీలు కూడా అందుబాటు ధరల్లో దొరుకుతాయి. అహ్మద్ నగర్ నుంచి 70 కిలోమీటర్లు, రాహూరు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో శని శింగనాపూర్ ఉంటుంది.

15. వాయు మార్గం

15. వాయు మార్గం

Image source:


శింగనాపూర్ కు దగ్గరగా అంటే ఔరంగాబాద్. ఈ రెండునగరాలమధ్య దూరం 90 కిలోమీటర్లు. ఇక నాసిక్ ఎయిర్ పోర్ట్ శింగనాపూర్ కు 144 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల నుంచి శనిశింగనాపూర్ కు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇందు కోసం ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉంటాయి. అయితే చాలా వరకూ ప్రైవేటు ట్యాక్సీల ద్వారా వెలుతారు.

16. రైలు మార్గం

16. రైలు మార్గం

Image source:

శింగనాపూర్ కు దగ్గరగా ఉన్న రైల్వేస్టేషన్ రాహురీ. వీటి మధ్య దూరం 32 కిలోమీటర్లు. అహ్మద్ నగర్ (35 కిలోమీటర్లు), శ్రీరాంపుర (54 కిలోమీటర్లు), శిరిడీ రైల్వేస్టేషన్ 75 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆయా రైల్వే స్టేషన్ల నుంచి శింగనాపూర్ కు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడానికి సదుపాయాలు బాగున్నాయి. ముఖ్యంగా అందుబాటు ధరల్లోనే ప్రైవేటు ట్యాక్సీలు మనకు దొరుకుతాయి. వీకెండ్ కా కూడా ఈ ప్రాంతానికి వెళ్లి రావచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X