Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడికి మీరు వెళితే ముని శాపం ఖచ్చితం?

ఇక్కడికి మీరు వెళితే ముని శాపం ఖచ్చితం?

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్ గురించి కథనం.

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్ పశ్చిమ కనుమల్లో ఉంది. ఈ జలపాతం చుట్టూ దట్టమైన అరణ్యం ఆవరించి ఉంటుంది. ఇది ప్రముఖ వన్యప్రాణీ సంరక్షణ కేంద్రం. ఇక్కడ ఈ జలపాతానాకి సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అటువంటి షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్

P.C: You tube

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్ చుట్టూ అనేకమంది గిరిజన, ఆటవిక ప్రజలు నివశిస్తున్నారు. రాజపలైమ్, శివకాశీ, శ్రీవిల్లిపుతూర్ తదితర ప్రాంతాలన్నీ ఈ జలపాతానికి దగ్గరగా ఉన్నవే. ఈ జలపాతం దగ్గర ఒక విష్ణు దేవాలయం కూడా ఉంది.

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్

P.C: You tube

ఇక షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్ జలపాతం తమిళనాడులోని విరుధనగర జిల్లాలోని శ్రీ విల్లిపుత్తూర్ కు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు వెళ్లడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు.

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్

P.C: You tube

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్ దగ్గర మండూహర ముని అద`ష్య శక్తిలో ఇప్పటికీ జీవించి ఉన్నారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఆయన నిత్యం తపస్సులో ఉంటారని చెబుతారు. ఒకవేళ మనం ఇక్కడికి వెళ్లినప్పుడు ఆయన తమస్సుకు భంగం వాటిల్లితే శాపానికి గురి కావాల్సి వస్తుందని చెబుతారు.

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్

P.C: You tube

ఒక వేళ ఎవరైనా ఇక్కడికి వెళ్లినా సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇక్కడ ఎవరూ ఉండరూ. ఇక్కడకు దగ్గర్లో అయ్యనార్ దేవాలయం ఉంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వీకెండ్ సమయంలో ఇక్కడకు ఎక్కువ మంది వెలుతూ ఉంటారు.

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్

P.C: You tube

అదే విధంగా ఈ జలపాతానికి దగ్గర్లో సంజీవిని బెట్ట అనే చిన్న గుట్ట ఉంది. రామ రావణ యుద్ధం సమయంలో ఆంజనేయుడు హిమాలయాల నుంచి తీసుకువచ్చిన పర్వతం ఇదేనని చెబుతారు. ఇక్కడి మూలికల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయుర్వేద వైద్యులు ఇక్కడికి వస్తుంటారు.

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్

షాన్బాగ్ తోపు మీన్వెటై పారై వాటర్ ఫాల్స్

P.C: You tube

విల్లూపురం నుంచి ఈ జలపాతాన్ని చేరుకోవడానికి రోడ్డు మార్గం చాలా బాగుంది. బస్సులు, ఆటోలు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఏడాదిలో ఎప్పుడైనా ఈ జలపాతాన్ని చూడటానికి వెళ్లవచ్చు. అయితే వర్షాకాలంలో ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X