Search
  • Follow NativePlanet
Share
» »షిల్లాంగ్ టు చిరపుంజీ రోడ్ ట్రిప్ ప్రయాణంలో ..!

షిల్లాంగ్ టు చిరపుంజీ రోడ్ ట్రిప్ ప్రయాణంలో ..!

చిరపుంజిలో ఎపుడూ వర్షాలే అనే మాట వింటూ వుంటాం. కాని ఆ వర్షపు చినుకులు, ధారలే అసలైన శృంగార భరిత సన్నివేశాలను కలిగించే దృశ్యాలు చిత్రాలలో చూస్తూ వుంటాం. మరి అందులోనూ కొత్త జంటలు వాస్తవంలో హనీ మూన్ అంటూ చిరపుంజి ప్రదేశానికి బయలు దేరితే ? ప్రకృతి ఆస్వాదనలో ఎంత ఆనందం! షిల్లాంగ్ నుండి చిరపుంజి సరిగ్గా 53 కి. మీ. ల దూరం. ఎపుడు వెళ్ళినా మరోమారు వెళ్ళాలనిపిస్తుంది. షిల్లాంగ్ మేఘాలయ రాష్ట్ర రాజధాని. చిరపుంజి మేఘాలయ లో ఒక ప్రసిద్ధ టవున్. రెండు ప్రదేశాలు కూడా ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలో భాగమే. ఈ ప్రదేశాలలో ఖాసి తెగ ప్రజలు నివసిస్తారు. పేరుకు తగ్గట్టు ' మేఘాలయ' లో ఎపుడూ కారు మబ్బుల మేఘాలు దోబూచు లాడుతూ వుంటాయి. మేఘాలకు ఇది ఒక నిరంతర ప్రయాణం. షిల్లాంగ్ నుండి చిరపుంజి అన్నీ పర్వతాలే. వేలాడే బ్రిజ్ లు మిమ్మల్ని ఆశ్చర్య చకితులను చేస్తాయి. మిమ్మల్ని మరచి మీరు రిలాక్స్ అవటానికి ఖచ్చితంగా ఇటువంటి ప్రదేశమే కావాలి. అట్టి ప్రదేశమే, మేఘాలయలోని షిల్లాంగ్ నుండి చిరపుంజి .

మబ్బుల్లో పర్యటన

మబ్బుల్లో పర్యటన

గౌహతి, త్రిపుర మరియు మిజోరం, షిల్లాంగ్ పట్టణాలు కు జాతీయ రహదారులు కలవు. ఈ నగరాల అందాలు అంతా అక్కడ కల బిజి వీధులలోనే వుంది. మినీ జూ కలిగిన లేడీ హైదరి పార్క్ ఒక ప్రసిద్ధ వారాంతపు విహారం. షిల్లాంగ్ శిఖరం ప్రకృతిలోనే గొప్ప శిఖర దృశ్యం. ఈ నగర సరిహద్దులలో అనేక మ్యూజియం లు, గాలరీ లు కలవు.

మబ్బుల్లో పర్యటన

మబ్బుల్లో పర్యటన

ఫోటోలు తీస్తే అద్భుతం అనిపిస్తాయి. స్థానికంగా దీనిని నాన్ పొలాక్ అంటారు. ఇది ఒక కృత్రిమ సరస్సు మరియు గార్డెన్. షిల్లాంగ్ లోని ఈ లేక్ ఒక బ్రిటిష్ చిత్రకారుడిచే గీయబడి నిర్మించబడినది. చుట్టూ పచ్చని చెట్లచే కప్పబడిన వార్డ్స్ లేక్ మీకు అంతులేని రిలాక్సేషన్ ఇస్తుంది. ఇక్కడ మీరు సైట్ సీయింగ్, బోటు విహారం చేసి ఆనందించ వచ్చు.

మబ్బుల్లో పర్యటన

మబ్బుల్లో పర్యటన

ఖాసి భాష లో ఈ జలపాతాలను మూడు మెట్ల జలపాతాలు అంటారు. కాని బ్రిటిష్ వారు ఇక్కడి అందాలకు ఆశ్చర్యపడి, దీనికి ఎలిఫెంట్ ఫాల్స్ అని పేరు పెట్టారు. కారణం అక్కడే కల ఏనుగు ఆకారంలోని ఒక కొండ రాయి. ఆ రాయి ధ్వంసం అయ్యింది. కాని పేరు మిగిలింది. జలపాతాలు మాత్రం ఆనందాలు అందిస్తూనే వున్నాయి. తియ్యనైన ఈ జలపాతాలు షిల్లాంగ్ లో అత్యంత సుందరమైనవి.

మబ్బుల్లో పర్యటన

మబ్బుల్లో పర్యటన

చిరపుంజి వెళ్ళే మార్గంలో ఎలిఫెంట్ ఫాల్స్ నుండి 43 కి. మీ. ల దూరంలో చిరపుంజి సరిహద్దు తగులుతుంది. ఇక్కడే అద్భుత అందాల ప్రదేశం. ఈ భూమిలో భారతీయ ప్రజల జీవనం స్పర్సిన్చబడుతుంది

మబ్బుల్లో పర్యటన

మబ్బుల్లో పర్యటన

వర్షాల భూమి అయిన చిరపుంజిని స్థానికంగా సోహ్రా అంటారు. అంటే ఇది ఇక్కడి తెగల ప్రభువు యొక్క రాజధాని అని చెపుతారు. ఈ ప్రదేశంలో ఏడాది సగటు వర్షపాతం 11,777 మీ. మీ. గా వుంటుంది.

మబ్బుల్లో పర్యటన

మబ్బుల్లో పర్యటన

పచ్చటి చిరపుంజి యొక్క సహజ దృశ్యాలు ఉదయం వేళలలో వర్షాలు పొందుతాయి. ఈ భూమి అందం దేనితోను పోల్చ దగినది కాదు. ప్రకృతి పచ్చదనం ఇక్కడి ప్రజలకు తోడై వుంటుంది.

మబ్బుల్లో పర్యటన

మబ్బుల్లో పర్యటన

ఇక్కడి ప్రజలు పెంచిన లివింగ్ రూట్ బ్రిడ్జి ఒక సహజ వండర్ గా వుంటుంది. ఈ ప్రాంతంలో 500 సంవత్సరాల నాటి బ్రిజ్ లు కూడా కలవు. అవి ఇప్పటికి బలమైనవి. పెంచేందుకు 10 - 15 సంవత్సరాలు పడుతుంది. ఇవి ఎప్పటికి పర్యాటకులకు ఒక ఆశ్చర్యమే.

మబ్బుల్లో పర్యటన

మబ్బుల్లో పర్యటన

నోసిన్గితింగ్ ఫాల్స్, వీటినే సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ మరియు మావ్స్మై ఫాల్స్ అని కూడా అంటారు. ఇవి ఏడు భాగాలుగా ఖాసి హిల్స్ నుండి కింద పడతాయి. వీటి అందాలు పర్యాటకులు రెప్ప వేయకుండా చూడాల్సిందే.

మబ్బుల్లో పర్యటన

మబ్బుల్లో పర్యటన

ఇక్కడ పడే వర్షపాతం కారణంగా, ఈ ప్రదేశంలో అనేక జలపాతాలు కలవు. వీటిలో నోహ్కాలికాయ్ ఫాల్స్ ఇండియా లోనే అతి పొడవైనవి. చిరపుంజి సందర్శనకు వర్ష రుతువు మంచి సమయం ఆ సమయంలో ఇక్కడ కల జలపాతాలు కన్నుల విందు చేస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X