Search
  • Follow NativePlanet
Share
» »శివ ఖొరి - మిస్టరీ గుహాలయం !

శివ ఖొరి - మిస్టరీ గుహాలయం !

By Mohammad

శివుడు వివిధ రూపాలలో ఆరాధించబడుతుంటాడు. అందులో శివలింగం ప్రత్యేకమైంది. శివుడు తొలిసారిగా దర్శనమిచ్చింది శివలింగ రూపం లోనే. శివలింగాలు స్వయంభూ లింగాలు. అంతేకాదు దేవతలు, ఋషులు కూడా కొన్ని కొన్ని చోట్ల శివలింగాలను ప్రతిష్టించారు.

శివ ఖొరి హిందూ దేవుడు శివ భగవానుడికి అంకితం చేయబడిన గుహ. ఈ గుహ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని రేసై జిల్లాలోని కాట్రా కు 70 కిలోమీటర్ల దూరంలో రన్సూ గ్రామంలో కొండపై కలదు. శివ ఖొరి కి గల మరొక పేరు దేవుళ్ళ ఇల్లు. ఇక్కడ శివలింగం సహజసిద్ధంగా ఏర్పడిందని చెబుతారు.

శివ ఖొరి గుహాలయం

శివ ఖొరి గుహాలయం

చిత్ర కృప : Daily Excelsior

ఇక్కడున్న హిందూమత పవిత్ర స్థలాలలో లార్డ్ శివకు అంకితం చేయబడిన గుళ్ళు, గోపురాలతో ఇదే అతిపెద్ద ఆకర్షణ. శివ ఖొరి నిజంగా ఒక అద్భుతం, ఆశ్చర్యం. గుహలు యొక్క పొడవు దాదాపు అర కిలోమీటరు వరకు విస్తరించి ఉంటుంది మరియు అందులో స్వయంభూ గా వెలసిన శివలింగం 4 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది.

సహజసిద్ధ శివలింగం

సహజసిద్ధ శివలింగం

చిత్ర కృప : Daily Excelsior

శివ ఖొరి గుహాలయాన్ని సందర్శిస్తే, కొన్ని అద్భుతమైన ఘట్టాలను మీరు చూసినవారవుతారు. శివుడు అభిషేక ప్రియుడు కనుకే స్వయంభూ గా వెలసిన శివలింగం, ఎల్లప్పుడూ సీలింగ్ పై నుండి పడే తెల్లని ద్రవంతో తడుస్తూ ఉంటుంది. ఇంకో విషయం, అదేమిటంటే ఈ తెల్లని ద్రవం పవిత్ర గంగా నది నుండి జాలువాలుతూ వచ్చి శివలింగం పై పడుతుందని భక్తుల భావన.

గుహ గోడలపై దేవుళ్ళ చిత్రాలు

గుహ గోడలపై దేవుళ్ళ చిత్రాలు

చిత్ర కృప : sach_238

శివ ఖొరి గుహ గోడలపై చిత్రీకరించిన వివిధ దేవుళ్ళ, దేవతల చిత్రాలను పరిశీలించవచ్చు. గుహ యొక్క రెండు చివరలు వెడల్పుగా మరియు మధ్యలో విశాలంగా ఉంటుంది. గుహా లోనికి ప్రవేశించేటప్పుడు వెడల్పు కాస్త ఇబ్బందిని కలిగించే అంశం. ఒక్కొక్కరుగా లోనికి వెళ్ళవలసి ఉంటుంది. గుహకు మెట్ల మార్గం ద్వారా చేరుకోవచ్చు.

ఇది కూడా చదవండి : అమర్నాథ్ యాత్ర - సాహసోపేత ట్రెక్కింగ్ మార్గాలు !

పండుగలు

శివ ఖొరి లో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆనాడు శివలింగాన్ని దర్శించుకొనేందుకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు.

శివ ఖొరి లో వసతి

రన్సూ వసతి కై సూచించదగినది. నిత్యం వచ్చే పర్యాటకుల రద్దీ దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పర్యాటక సంస్థ ఇక్కడ హోటల్ ను నిర్మించింది. ఇక్కడ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఇంతేకాకుండా ప్రవేట్ హోటళ్లు మరియు గెస్ట్ హౌస్ లు కూడా అద్దెకు లభిస్తాయి.

శివరాత్రి నాడు భక్తుల రద్దీ

శివరాత్రి నాడు భక్తుల రద్దీ

చిత్ర కృప : Daily Excelsior

శివ ఖొరి ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం : జమ్మూ ఎయిర్ పోర్ట్ శివ ఖొరి కి సమీపాన కలదు. ఇది 140 km ల దూరంలో ఉన్నది. ఎయిర్ పోర్ట్ నుండి దేశంలోని వివిధ ప్రదేశాలకు విమాన సర్వీసులు కలవు. క్యాబ్ లేదా టాక్సీ ఎక్కి శివ ఖొరి చేరుకోవచ్చు.

రైలు మార్గం : జమ్మూ స్టేషన్ మరియు ఉధంపూర్ స్టేషన్ లు శివ ఖొరి కి సమీపాన కలవు. అక్కడి నుండి యాత్రికులు బస్సులలో లేదా ప్రవేట్ టాక్సీ లలో శివ ఖొరి కి చేరుకోవచ్చు.

రోడ్డు/బస్సు మార్గం : శివ ఖొరి కి వెళ్లే మార్గంలో అందమైన దృశ్యాలను , జలపాతాలను చూడవచ్చు. రేసై నుండి 43 km, కాట్రా నుండి 80 km, ఉధంపూర్ నుండి 120 km, జమ్మూ నుండి 140 km మరియు అమృత్సర్ నుండి 300 km ల దూరంలో శివ ఖొరి కలదు. జమ్మూ రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు ఇతర ప్రాంతాల నుండి అందుబాటులో కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X