Search
  • Follow NativePlanet
Share
» »ఈ దేవాలయాన్ని బ్రిటీష్ వారు ఎందుకు నిర్మించారో తెలుసా

ఈ దేవాలయాన్ని బ్రిటీష్ వారు ఎందుకు నిర్మించారో తెలుసా

భారత దేశాన్ని సుమారు 300 ఏళ్లు పరిపాలించిన ఆంగ్లేయులు ఇక్కడ సంస్కతిని సంప్రదాయాలను నాశనం చేసిన విషయం మనకు తెలుసు. అయితే అగర్ మాల్వ అనే చోట ఒక దేవాలయాన్ని నిర్మించిన విషయం చాలా మందికి తెలియదు. ఆ దేవాల

By Beldaru Sajjendrakishore

భారత దేశాన్ని సుమారు 300 ఏళ్లు పరిపాలించిన ఆంగ్లేయులు ఇక్కడ సంస్కతిని సంప్రదాయాలను నాశనం చేసిన విషయం మనకు తెలుసు. అయితే అగర్ మాల్వ అనే చోట ఒక దేవాలయాన్ని నిర్మించిన విషయం చాలా మందికి తెలియదు. తన భర్త ప్రాణాలు కాపాడటానికి పరమశివుడు స్వయంగా తిగివచ్చి, ఆఫ్ఘన్లతో యుద్ధం చేశాడని భావించిన ఒక ఆంగ్లేయ యువతి ఇక్కడ వైద్యనాథేశ్వర ఆలయాన్ని పున: నిర్మించింది. ప్రస్తుతం ఇది ప్రముఖ పుణ్యక్షేత్రంగా పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది.

1. వైద్యనాధుడు పేరుతో

1. వైద్యనాధుడు పేరుతో

Image source

మధ్యప్రదేశ్ లోని అగర్ మల్వా అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది. అక్కడ ఉన్న చిన్న కొండ పై శివుడి గుడి ఉంటుంది. స్థానికులు ఇక్కడి లయకారుడిని వైద్యనాధుడిగా కొలుస్తారు. ఇక్కడ ఉన్న ఓ శిలాశాసనం భక్తుడి అసాధరణ భక్తిని దేవుడి అస్తిత్వాన్ని తెలియజేస్తుంది.

2. ఇది చరిత్ర

2. ఇది చరిత్ర

Image source

ఇక చరిత్ర విషయానికి వస్తే అది 1839 వ సంవత్సరం. ఆంగ్లేయులు అఖండ భారతావని పై పట్టు సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారికి ఆఫ్ఘన్ల నుంచి తీవ్ర ప్రతి ఘటన ఎదురవుతూ ఉంటుంది. ఈ సమయంలో ఆంగ్లేయులు ఆఫ్ఘన్ల తో యుద్ధం తప్పక చేయాలని నిర్ణయించుకుంటారు.

3. ఇలా ఆఫ్ఘన్లు ఓడిపోయారు

3. ఇలా ఆఫ్ఘన్లు ఓడిపోయారు

Image source

దీంతో 1839 నుంచి 1842 వరకూ ఆంగ్లేయులకు, ఆఫ్ఘన్లకు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. చివరికి 1842 లో ఆఫ్ఘన్లు ఓటమి పాలవుతారు. ఆతర్వాత కూడా ఆఫ్ఘన్లు ఇక్కడి కొండ, కోనల్లో ఉంటూ చరుతూ ఆంగ్లేయుల పై దాడులు చేస్తూ వారిని హతమార్చేవారు.

4. మార్టిన్ ఇంగ్లాండ్ నుంచి వచ్చారు.

4. మార్టిన్ ఇంగ్లాండ్ నుంచి వచ్చారు.

Image source

ఇదే సమయంలో ఇంగ్లాండ్ నుంచి లెఫ్ట్ నెంట్ కల్నల్ మార్టిన్ ఆయన భార్య మిసెస్ మార్టిన్ భారత దేశానికి వచ్చి ఆఫ్ఘన్ కు సైన్యాధికారిగా వెళ్లాడు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా భార్యను మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా అనే ప్రాంతం లో విడిచి పెట్టి వెళ్లడు.

5. మూడు రోజులకు ఒక ఉత్తరం

5. మూడు రోజులకు ఒక ఉత్తరం

Image source

ఇక ఆఫ్ఘన్ లో జరిగే ప్రతి విషయాన్ని కనీసం మూడు రోజులకు ఒకసారైనా ఉత్తరం రూపంలో తన భార్యకు తెలియజేసేవాడు. ఈ నేపథ్యంలో ఒకసారి మార్టిన్ నుంచి ఆయన భార్యకు రెండు నెలలకు పైగా ఎటువంటి లేక అందలేదు.

6. చిన్న వెలుగు కనబడింది

6. చిన్న వెలుగు కనబడింది

Image source

దీంతో విచారంలో ఉన్న అతని భార్య ఒకసారి గుర్రం ఎక్కి గ్రామ శివారుకు వెళ్లింది. అలా వెలుతుండగా సూర్యాస్తమయం సమయంలో కొండ పై నుంచి గంటల శబ్దం, ఒక చిన్న వెలుగు కనిపించింది.

7. అక్కడకు వెళ్లిన మిసెస్ మార్టిన్

7. అక్కడకు వెళ్లిన మిసెస్ మార్టిన్

Image source

దీంతో అక్కడకు వెళ్లగా శిథిలా వస్థలో ఉన్న ఓ దేవాలయంలో ఓ పూజారి పూజ చేస్తూ కనిపించాడు. అతడు పూజ ముగించుకుని వచ్చి చూడగ గుడి బయట విచార వదనంతో మిసెస్ మార్టిన్ కనిపించింది.

8. జరిగిన విషయం మొత్తం వివరించింది.

8. జరిగిన విషయం మొత్తం వివరించింది.

Image source

అమ్మ నీవు ఎవరు, ఎందుకు ఏడుస్తున్నవాని అడుగగా ఆమె తన పరిస్థితి మొత్తాన్ని వివరించింది. దీంతో పూజారి బాధపడవద్దని ఓం నమ:శివాయ అనే మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా పఠిస్తే నీకు మంచి జరుగుతుందని చెప్పాడు.

9. వారం పాటు గదిలో ఒంటరిగా

9. వారం పాటు గదిలో ఒంటరిగా

Image source

దీంతో ఆమె తిరిగి తన ఇంటికి వెళ్లి సదరు మంత్రాన్ని పఠిస్తూ కొన్ని రోజుల పాటు ఒక గదిలో ఉండిపోయింది. దాదాపు వారం ఓ పనిమనిషి లేఖను తీసుకుని వచ్చి మీ భర్త నుంచి వచ్చిందని చెబుతుంది. ఆ లేఖను తెరిచి చూడగా తాను క్షేమంగా ఉన్నానని త్వరలో నీ దగ్గరకు వస్తానని అందులో ఉంది.

10.తిరిగి వచ్చిన భర్త

10.తిరిగి వచ్చిన భర్త

Image source

అన్నట్టుగానే కొన్ని రోజుల తర్వాత మార్టన్ అక్కడకు వచ్చి తనకు ఎదురైన ఘటనను ఆమెకు వివరిస్తాడు. మా శిభిరం పై ఆఫ్ఘన్లు ఒక రోజు రాత్రి విరుచుకు పడ్డారు. మాకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ఆఫ్ఘన్లు మా వాళ్లందరిని చంపేశారు.

11. పులి చర్మం...త్రిశూలం

11. పులి చర్మం...త్రిశూలం

Image source

నాతో పాటు మిగిలిన పదిమంది ప్రాణాలను అరచేతిలో పట్టుకుని వారితో పోరాడుతున్నామనా్నరు. ఆ సమయంలో మొలకు పులి చర్మం, చేతిలో త్రిశూలంతో ఓ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చి వారి పై విరుచుకు పడ్డాడు.

12. వందల మందితో ఒక్కడే

12. వందల మందితో ఒక్కడే

Image source

ఒక్కడే దాదాపు వందల మంది ఉన్న ఆఫ్ఘన్లతో పోరాడి వారందరినీ చంపేశాడు. అటు పై ఒక్క నిమిషంలో మాయమై పోయాడు. దీంతో మేము ప్రాణాల నుంచి భయటపడ్డాం. అటు పై చుట్టు పక్కల ఎంత గాలించినా అతను దొరకలేదు. అని భార్యకు జరిగిన మొత్తం ఘటనను వివరించాడు.

13 తిరిగి దేవాలయానికి వెళ్లింది

13 తిరిగి దేవాలయానికి వెళ్లింది

Image source

దీంతో మిసెస్ మార్టిన్ తన భర్తను వెంటబెట్టుకుని కొండ పై ఉన్న దేవాలయానికి వెళ్లింది. అక్కడి పూజారికి తన భర్తకు ఎదురైన అనుభవాన్ని వివరించగా నీ పార్థన ఫలించి ఆ పరమశివుడే నీ భర్త ప్రాణాలను కాపాడటానికి స్వయంగా వచ్చాడని చెప్పాడు.

14. సొంత నిధులతో

14. సొంత నిధులతో

Image source

దీంతో భార్య భర్తలు ఇద్దరూ ఆ పరమశివుడిగా భక్తులుగా మారి పోయారు. అప్పట్లోనే దాదాపు రూ.15వేలు ఖర్చుపెట్టి సదరు దేవాలయాన్ని పున: నిర్మించారు. అంతేకాకుండా భక్తి తత్వం గురించి స్థానికంగా ప్రచారం కూడా చేశారు.

15. విదేశాల్లో కూడా

15. విదేశాల్లో కూడా

Image source

అటు పై దంపతులు లండన్ వెళ్లే సమయంలో ఒక శివ లింగాన్ని తమతో పాటు తీసుకెళ్లి విదేశాల్లో కూడా శైవతత్వాన్ని ప్రచారం చేసేవారు. అక్కడ కూడా తమ ప్రవచనాలతో ఎంతో మందిని శివ భక్తులుగా మార్చారని చెబుతారు.

16. శిలా ఫలకం పై

16. శిలా ఫలకం పై

Image source

ఈ విషయాలన్నీ ఆ దేవాలయం ప్రాగణంలో ఉన్న శిలాఫలకం పై చెక్కించారు.ఇలా భారత దేశంలో ఆంగ్లేయులు నిర్మించిన మొదటి, ఏకైక దేవాలయంగా అగర్ మాల్వాలోని వైద్యనాథాలయం చరిత్రలో నిలిచి పోయింది.

17. ప్రత్యేక పూజలు

17. ప్రత్యేక పూజలు

Image source

ఇప్పటికీ తీరని సమస్యలతో బాధపడే వారు ఇక్కడికి వస్తే కష్టాలు తొలిగి పోతాయని నమ్ముతారు. ప్రతి శివరాత్రి, శివుడికి ఎంతో ఇష్టమైన పున్నమి తదితర పర్వదినాన ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి.

18. ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి..

18. ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి..

Image source

మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వ ఉంది. ఇండోర్ ఎయిర్ పోర్టుకు అగర్ మాల్వకు 117 కిలోమీటర్లు. అదే విధంగా అగర్ మాల్వాకు దగ్గరగా యుజ్జయిన్ రైల్వేస్టేషన్ ఉంది. ఈ రెండింటి మధ్య ధూరం 62 కిలోమీటర్లు. ఇక ఇక్కడకు దగ్గరగా జాల్వార్, కోట తదితర పట్టణాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి అగర్ మాల్వాకు బస్సు సర్వీసులు ఉన్నాయి.

19 మరికొన్ని పర్యాటక ప్రాంతాలు..

19 మరికొన్ని పర్యాటక ప్రాంతాలు..

Image source

అగర్ మాల్వాలో మోతీ సాగర్, రత్న సాగర్ అనే రెండు సరస్సులు చూడదగిన ప్రాంతాలు. వీటితో పాటు ఇక్కడి కాళిసింద్ నది అందాలతో పాటు అనేక దేవాలయాలను చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X