Search
  • Follow NativePlanet
Share
» »ద్వారపుడి పాలరాతి శివాలయం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు

ద్వారపుడి పాలరాతి శివాలయం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు

ద్వారపూడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం రాజమండ్రి నగరానికి 18.6 కిలోమీటర్ల దూరంలో ఉండి, కేవలం అర్ధగంటలో(30 నిమిషాల్లో) చేరుకొనే విధంగా ఉంటుంది. రాజమండ్రి నుండి ద్వారపూడి కి ఏ పి ఎస్ ఆర్ టీ సి బస్సులు నిత్యం తిరుగుతుంటాయి. ద్వారపూడి గ్రామంలో ఫెమస్ ఏంటిది అంటే ఆది అయ్యప్ప స్వామి ఆలయమనే చెప్పాలి.

అందుకే ద్వారపూడి అయ్యప్ప స్వామి పుణ్య క్షేత్రం గా వెలుగొందుతుంది. ఇక్కడున్న అయ్యప్ప ఆలయం గర్భగుడి, కేరళ లోని శబరిమలై తరహాలో ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. ద్వారపూడి దగ్గర అన్ని దేవాలయాలను ఒకచోట చేర్చి కట్టడంతో ద్వారపూడి ఎంతో పవిత్ర స్థలంగా మారింది. ముఖ్యంగా ఇక్కడ పాలరాతితో నిర్మించిన శివాలయం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, నయనానందకరం. మరి ఈ ఆలయ విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

ఒకే ప్రాంగణంలో సుమారు పది పెద్ద దేవాలయాలు

ఒకే ప్రాంగణంలో సుమారు పది పెద్ద దేవాలయాలు

కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రీ వైపు వెళ్ళే కెనాల్ రోడ్డు ప్రక్కన ద్వారపూడి ఉంది. ఇక్కడ ఒకే ప్రాంగణంలో సుమారు పది పెద్ద దేవాలయాలు ఉన్నాయి.

పాలరాతితో నాలుగు అంతస్తులుగా నిర్మించిన శివాలయం:

పాలరాతితో నాలుగు అంతస్తులుగా నిర్మించిన శివాలయం:

పాలరాతితో నిర్మించిన శివాలయంలో స్తూపాకారంగా క్రిందనుంచి నాలుగవ అంతస్తువరకూ వ్యాపించిన శివలింగం ఉంది. రెండవ, మూడవ అంతస్తులలో ప్రదక్షిణ మార్గం చుట్టూ పురాణగాధలో సన్నివేశాలని తెలియజేసే విగ్రహాలను ఏర్పాటుచేశారు.

 దేవాలయాన్ని అష్ఠాదశ(18) ఉమా సోమేశ్వరదేవాలయం

దేవాలయాన్ని అష్ఠాదశ(18) ఉమా సోమేశ్వరదేవాలయం

నాలుగవ అంతస్తులో, శివలింగ శిఖరానికి అబిషేకం చేస్తే, అబిషేక జలం క్రిదకి వచ్చే మార్గంలో ప్రధాన లింగానికి అనుసంధానం చేసిఉన్న 18 చిన్న లింగాలని తాకుతూ క్రిందకి వస్తుంది. ఈ దేవాలయాన్ని అష్ఠాదశ(18) ఉమా సోమేశ్వరదేవాలయం అంటారు. ప్రధాన శివలింగానికి పోసే అభిషేక జలం లింగంపై పడటంతో పాటు, ఒక్కసారిగా మిగిలిన లింగాలపై అభిషేకించడం ముగ్థమనోహరం... నయనాదకరం.

శివాలయానికి ఎదురుగా నటరాజస్వామి

శివాలయానికి ఎదురుగా నటరాజస్వామి

శివాలయానికి ఎదురుగా నటరాజస్వామి, రెండువైపులా హనుమంతుడు, నందీశ్వరులు తమ తమ హృదయాలలో శ్రీరామ పట్టాభిషేకాన్ని చూపిస్తూ పెద్ద విగ్రహాలు ఉన్నాయి.

నందీశ్వరుడి గుండెల్లో సీతారాములు

నందీశ్వరుడి గుండెల్లో సీతారాములు

ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది శివాలయం ఎదురుగా హనుమంతుడి విగ్రహం ఉంచడం..., అలాగే నందీశ్వరుడి గుండెల్లో సీతారాములు ఈ రెండు విషయాలు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తాయి.

శివాలయం ప్రక్క ప్రవేశద్వారానికి ఎదురుగా మహానంది

శివాలయం ప్రక్క ప్రవేశద్వారానికి ఎదురుగా మహానంది

శివాలయం ప్రక్క ప్రవేశద్వారానికి ఎదురుగా మహానంది ఉంది. ఆలయం నాలుగవ అంతస్తు కిటికీ నుంచి కనిపించేలాగ దీనిని నిర్మించారు.దేవాలయ ముఖద్వారం లో ఏనుగులు తోండంతో పూలహారాన్ని పట్టుకొని నిలబడి ఉన్న బొమ్మలు ఉన్నాయి. శివాలయానికి ఒక పక్క నంది విగ్రహం, ఎదురుగా నటరాజ విగ్రహం మరియు వెనకవైపున యగ్ఞాలు, యాగాలు నిర్వహించుకొనేందుకు యాగశాల ఉన్నాయి.

పురాణాలలో నందీశ్వరుడికి సంబంధించిన

పురాణాలలో నందీశ్వరుడికి సంబంధించిన

పురాణాలలో నందీశ్వరుడికి సంబంధించిన మూడునాలుగు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ప్రతీశివాలయంలోనూ శివలింగానికి అభిముఖంగా నందిని చూస్తుంటాం. నంది శివుని వాహనంగా మనకి తెలుసు. కానీ లింగపురాణంలో నంది సాక్షాత్తూ శివుని అవతారం అని చెప్పబడింది. శిలాదుడు అనే మహర్షి అమరుడైన(మరణం ఉండబోని చిరంజీవి అయిన) ఒక పుతృనికోసం శివునికి తపస్సుచేస్తాడు.

శివుడు అతని తపస్సుకి మెచ్చి తానే అతనికి పుత్రునిగా

శివుడు అతని తపస్సుకి మెచ్చి తానే అతనికి పుత్రునిగా

శివుడు అతని తపస్సుకి మెచ్చి తానే అతనికి పుత్రునిగా జన్మిస్తానని వరం ఇచ్చి, అలాగే చేస్తాడు. అంతేకాకుండా కైలాసంలో శివునికి ద్వారపాలకులిగా ఉండే ఇద్దరిలో ఒకరు నంది, రెండవవాడు మహాకాళి.

నందికి దివ్యత్వం, బలం, అధికారమే కాకుండా తెలివి కూడా

నందికి దివ్యత్వం, బలం, అధికారమే కాకుండా తెలివి కూడా

శివుని ప్రమదగణాలకు అధిపతికూడా నందీశ్వరుడే. నందికి దివ్యత్వం, బలం, అధికారమే కాకుండా తెలివి కూడా ఉందని చెప్పే కథ ఏమిటంటే - ఈయన పురాణాలలో చెప్పబడిన ప్రధమగురువులలో ఒకడట. ఈ సారి ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు నందిని కేవలం ఒక వాహనంగానే కాకుండా, ఇంకా మిగిలిన అంశాలుకూడా దృష్ఠిలో ఉంచుకొని చూడండి.

భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం:

భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం:

శివాలయానికి ఎడమవైపు భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం ఉంది. వెండి శివలింగం భారతదేశం మొత్తానికి ఇక్కడే ఉందట. దర్శనానికి ఆడవారు చీరలో, మగవారు పంచలో సాంప్రదాయబద్దంగా వెళ్ళాలి. లేకపోతే అనుమతించరు. బయట మగవాళ్ళకి పంచలు రెండురూపాయలకి అద్దెకి ఇస్తున్నారు. అందరికీ అవే ఇస్తూ ఉంటారు కనుక ఎవరైనా అద్దెకితీసుకొని లోనికి వెళ్ళవచ్చు. ఇక్కడే విష్ణుమూర్తి యొక్క దశావతార దేవాలయం నిర్మాణంలో ఉంది.

ద్వారపూడి మరిన్ని దృశ్యాలతో ..

ద్వారపూడి మరిన్ని దృశ్యాలతో ..

శివాలయం, వేంకటేశ్వరుని ఆలయం ఒకే చోట ఉన్నాయని చెప్పే దృశ్యం చిత్ర కృప : Palagiri

ద్వారపూడి మరిన్ని దృశ్యాలతో ..

ద్వారపూడి మరిన్ని దృశ్యాలతో ..

ముగ్ధమనోహరమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఆలయం

చిత్ర కృప : Bhaskaranaidu

ద్వారపూడి కి ఎలా చేరుకోవాలి ?

ద్వారపూడి కి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం
ద్వారపూడి కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి విమానాశ్రయం దగ్గరలో గలదేశీయ విమానాశ్రయం. ఇక్కడి నుండి దేశంలోని అన్ని నగరాలకు ప్రయాణించవచ్చు. క్యాబ్ వంటి ప్రవేట్ వాహనాల మీద ద్వారపూడి చేరుకోవచ్చు
రైలు మార్గం
ద్వారపూడి లో రైల్వే స్టేషన్ ఉంది. కానీ ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వచ్చే ప్రయాణీకులు రాజమండ్రి లేదా సామర్లకోట రైల్వే స్టేషన్ లలో దిగి ఆటో లు, ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం
ద్వారపూడి చక్కటి రోడ్డు సదుపాయాన్ని కలిగి ఉంది. రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ వంటి సమీప పట్టణాల నుండి నేరుగా ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. బస్సులు ఆగేందుకై ఇక్కడ బస్సు షెల్టర్ కూడా నిర్మించడం జరిగింది.
చిత్ర కృప : Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X