Search
  • Follow NativePlanet
Share
» »ఆ సొరంగంలోనికి వెళ్ళినవారు మళ్ళీ ఎప్పటికీ తిరిగిరారు.....

ఆ సొరంగంలోనికి వెళ్ళినవారు మళ్ళీ ఎప్పటికీ తిరిగిరారు.....

By Venkatakarunasri

సొరంగం మార్గాలు అంటే సామాన్యంగా ప్రతీఒక్కరికి ఆశక్తిదాయకంగా వుంటుంది. అక్కడ ఏముంటాయి? ఆ సొరంగం గుండా వెళితే ఎక్కడకు చేరుతాం? అని మనకు ఎన్నో సందేహాలు కలుగుతాయి. ఇతిహాసాన్ని కలిగిన కోటలు, దేవాలయాలు, గుహలలో ఇలాంటి సొరంగాలను చూడవచ్చును. అట్లయితే ఒక మహిమాన్వితమైన దేవాలయం వుంది.

ఆ గుహ దేవాలయం నుంచి అమరనాథదేవాలయానికి సొరంగమార్గం వుందంట, అయితే దానిని నిషేదించటం జరిగింది. ఇంతే కాదు ఈ గుహ దేవాలయంలో 2పావురాళ్ళు కూడా వున్నాయి. అవి పుణ్యం చేసినవారికి మాత్రం కనిపిస్తుందంట.

ఇంతకూ ఆ దేవాలయంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. ఆ సొరంగమార్గం ద్వారా వెళ్ళినవారు ఎందుకు తిరిగి రారు? అనే అనేకమైన నిగూఢవాద ప్రశ్నకు సమాధానం వ్యాసంద్వారా సంపూర్ణంగా తెలుసుకుందాం.

ఎక్కడుంది ఆ దేవాలయం?

ఎక్కడుంది ఆ దేవాలయం?

ఆ దేవాలయం పేరు శివఖోరి. ఈ దేవాలయం జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలోని రీసి జిల్లాలో వున్న ఒక హిందూదేవాలయం. ఇక్కడ మహాశివుడు వెలసియున్నాడు.ఈ దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం.ప్రతి నిత్యం వేల కొలది భక్తులు ఇక్కడకు తరలి వస్తారు.

Sahuajeet

గుహాలయం

గుహాలయం

ఖోరి అంటే గుహ మరియు శివ అంటే ఆ పరమశివుడు. ఆ విధంగా ఈ గుహ దేవాలయాన్ని శివుని గుహ అని పిలుస్తారు.ఈ సహజమైన గుహ సుమారు 200మీల పొడవు వున్నది.ఇక్కడ స్వయం నిర్మిత శివ లింగం ఉంది.

Sahuajeet

ప్రవేశం

ప్రవేశం

ఈ గుహ దేవాలయం ఎంత పెద్దదిగావుందంటే 300మంది భక్తులు ఒక్కసారిగా గర్భగుడి ప్రాంగణంలో ఆ పరమశివుని దర్శించుకొనవచ్చును. ఇక్కడి గమ్మత్తు ఏంటంటే, భక్తులు అధికసంఖ్యలో దర్శించుకొనుటకు అవకాశం కల్పించేంత విశాలంగా వుంది.గుహ లోపలిభాగం చిన్నదిగా వుంది.

Devika Robin Singh

సొరంగ మార్గం

సొరంగ మార్గం

ఆశ్చర్యం ఏంటంటే మంచుతో సహజంగా ఉద్భవించిన శివలింగం అమరనాథ గుహ దేవాలయాన్ని ఈ శివఖోరి గుహ కలుపుతుంది.ఆ కనెక్షన్ విశేషంగా సొరంగ మార్గమై వుంది.శివుణ్ణి ఆరాధించే సాధువులు ఎక్కువగా ఈ గుహ దేవాలయానికి వెళ్తూవుంటారు.

Itzseoprasoon

సాధువులు

సాధువులు

ఆ సాధువులు ఈ శివఖోరి గుహ దేవాలయం నుంచి అమరనాథ దేవాలయానికి వెళ్ళే సొరంగ మార్గమిది. ఆ సొరంగం మూలంగా వెళ్ళిన సాధువులు ఎప్పటికీ తిరిగి రాలేదంట. ఆ విధంగా ఆ సొరంగ మార్గం ప్రస్తుతం మూసివేయబడినది.

సహజంగా

సహజంగా

సహజంగా ఉద్భవించిన పరమశివుడినే కాకుండా ఇతర దేవతలను కూడా దర్శించుకోవచ్చును. ఇక్కడ పార్వతి, గణేష్ మరియు నంది మొదలైన దేవతలను పోలి ఉండే కొన్ని సహజంగా ఉద్భవించిన విగ్రహాలను కూడా చూడవచ్చును..

Sahuajeet

పాము నిర్మాణం

పాము నిర్మాణం

గుహ పైకప్పు పాము నిర్మాణాల చేత చెక్కబడింది. ఇది సహజమైనది కాదు, మానవ నిర్మిత శిల్పాలు కాదు. ఆశ్చర్యం ఏంటంటే గుహ పైకప్పు నుండి ప్రతిరోజు శివుని మీద నీరు పడుతూవుంటుంది. దీని నుండి శివునికి ఎల్లప్పుడూ అభిషేకం చేస్తూ వుంటుంది.

Shail112

పావురం

పావురం

ఇక్కడ మరో విశేషం ఏంటంటే పావురాళ్ళు.అమరనాథ్ లోని పావురాళ్ళలాగా ఇక్కడ కూడా 2పావురాళ్ళను చూడవచ్చును. ఆ పావురాళ్ళు పుణ్యంచేసిన వారికి మాత్రం దర్శనం ఇస్తుందంట.

Alan D. Wilson, www.naturespicsonline.com

సృష్టి నియమం

సృష్టి నియమం

పావురం గురించి తెలుసుకోవాలంటే ఈ పురాణంలో ఒక కథను మీరు తప్పక తెలుసుకోవాలి. అదేంటంటే పార్వతి దేవి ఒక సారి శివునికి సృష్టి నియమాలను తెలియచెప్పమని కోరుతుంది. వెంటనే మహా శివుడు ఒక స్థలానికి తీసుకుని వెళ్తాడు.

Rohin.koul

సకల జీవులను నశింపజేయటం

సకల జీవులను నశింపజేయటం

ఆ స్థలమే ప్రస్తుతమున్న అమరనాథ్ దేవాలయం. పార్వతి దేవికి ఆ సృష్టి రహస్యం తెలియచెప్పే సమయంలో ఏ ఒక్క జీవి కూడా వుండకూడదు అని అగ్నిని సృష్టించి అక్కడవున్న సకల జీవులను నశింపజేస్తాడు.

Bhargavinf

2 పావురాళ్ళు

2 పావురాళ్ళు

అయితే అక్కడ వున్న 2 పావురాళ్ళు మాత్రం ఇంకా జీవించేవున్నాయి.ఈ విషయం తెలీని మహాశివుడు పార్వతీదేవికి సృష్టి రహస్యం గురించి వివరించే సమయంలో ఆ 2 పావురాళ్ళు దాక్కొని శివుని మాటలన్నీ దొంగతనంగా వింటాయి.

Pankaj goutam

అమరనాథ దేవాలయం

అమరనాథ దేవాలయం

ఆ పావురాళ్ళే అమరనాథ్ దేవాలయంవుండేవి అని నమ్ముతారు. ఆ పవిత్రమైన పావురాళ్ళు శివఖోరి గుహదేవాలయంలో కూడా చూడవచ్చును.ఆ పావురాళ్ళను దర్శించుకొనుట అంట సులభం కాదు.బదులుగా జీవితంలో ఎంతో పుణ్యం చేసిన వారికి మాత్రమే ఆ పావురాళ్లు కనిపిస్తాయి.

Niharika Krishna

శివఖోరి

శివఖోరి

సుమారు 40నుంచి 50 సంల ముందు మాత్రం కొంతమంది భక్తులకు మాత్రం శివఖోరి దేవాలయం గురించి తెలుసు.అయితే ఇది దశాబ్దంలోనే అత్యంత ఎక్కువగా ప్రసిద్ధిచెందింది.

ఎందుకంటే ఇంతకు ముందు కాలంలో యాత్రికుల సంఖ్య కేవలం వెయ్యిమంది మాత్రమే వుండేవారు.

Sahuajeet

మహాశివరాత్రి

మహాశివరాత్రి

మహాశివరాత్రి సమయంలో శివఖోరి దేవాలయంలో 3 రోజులపాటు నిరంతరాయంగా పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆ సమయంలో వేల కొలది భక్తులు దేశవిదేశాల నుంచి తరలి వస్తారు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రహదారి మార్గం

కత్రా నుంచి కేవలం 70కిమీ ల దూరంలో ఈ మహిమాన్వితమైన శివుని దేవాలయం వుంది. ఇక్కడి నుంచి అనేక ప్రభుత్వ లేదా ప్రైవేట్ బస్సుల సౌకర్యం వుంది.ఇక్కడి నుంచి సులభంగా శివఖోరి దేవాలయానికి వెళ్ళవచ్చును.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రైలు మార్గం

ఈ దేవాలయానికి సమీపంలో వున్న రైల్వేస్టేషన్ ఏదంటే అది జమ్మువిన తావి రైల్వేస్టేషన్. ఇది జమ్మూకాశ్మీర్ యొక్క అనేక నగరాలకు అనుసంధించబడి వున్నది. ఈ రైల్వేస్టేషన్ నుంచి శివఖోరి దేవాలయానికి సుమారు 107కిమీ ల దూరంలో వుంది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

విమాన మార్గంలో

ఈ శివఖోరి దేవాలయం చేరుటకు సమీపవిమానాశ్రయం ఏదంటే అది జమ్మూ విమానాశ్రయం. ఇక్కడి నుంచి సుమారు 130కిమీ ల దూరంలో వుంది. ఇక్కడి నుంచి ప్రైవేట్ బస్సుల లేదా టాక్సీల ద్వారా సులభంగా చేరుకొనవచ్చును.

చనిపోయిన వారిని బ్రతికించే పవిత్రమైన స్థలమిది...

దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి ఇది ఒక మంచి నిదర్శనం.....

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X