Search
  • Follow NativePlanet
Share
» »శివనేరి ఫోర్ట్ - ఛత్రపతి శివాజీ జన్మస్థలం !!

శివనేరి ఫోర్ట్ - ఛత్రపతి శివాజీ జన్మస్థలం !!

శివనేరి కోట జున్నార్ సమీపంలో కలదు. ఇది మరాఠా మహరాజు శివాజీ మహారాజు జన్మస్ధలం. ఈ కోటలో శివాజీ 1630 లో జన్మించాడు.

By Mohammad

చారిత్రక ప్రదేశాలు, వాటి నేపథ్యం గురించి తెలుసుకోవాలనే ఆతృత పర్యాటకులకు ఉండటం సహజం. అలాంటి ప్రదేశాల్లో ఒకటి జున్నార్. ఈ ప్రదేశాన్ని చూస్తే నాటి చరిత్ర గుర్తుకురావటం ఖాయం. ఇక్కడే మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ జన్మించినది. అయన తల్లితండ్రుల పేర్లు : శహాజీ, జీజాబాయి. ఈ పుణ్య దంపతులకే శివాజీ జన్మించినది. జున్నార్ కు సమీపాన ఉన్న ప్రధాన పట్టణం పూణే.

జున్నార్ పూణే మరియు ముంబై నగరాలకు మధ్యలో కలదు. ముంబై నుండి వంద కిలోమీటర్లు, పూణే నుండి తొబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నది. చారిత్రక, పౌరాణిక మరియు మతపర ఆకర్షణలకు ప్రసిద్ధి ఈ ప్రాంతం. ఎన్నో పురాతన దేవాలయాలు, ఆకర్షించే గుహలు, కోటలు ఇక్కడ కలవు. సహ్యాద్రి పర్వత దృశ్యాలు కోటపై భాగం నుండి చూస్తే ఎంతో రమణీయంగా ఉంటాయి. ఈ పట్టణం సముద్రమట్టానికి సుమారు 2260 అడుగుల ఎత్తుకంటే అధికంగా కలదు.

ఇది కూడా చదవండి : తోరన్మల్ - ఆనందం కలిగించే కొండ ప్రాంతం !!

ముంబై, పూణే నగర ప్రజలు వారాంతంలో ఇక్కడ గడపటానికి తరచూ వస్తుంటారు. ఇక్కడికి జాతీయ రహదారి కి చేరువలో ఉన్న జున్నార్ చేరుకోవటం తేలిక. పర్యాటకులు ఒక్కరోజు పర్యటన కొరకు ఇక్కడికి వస్తుంటారు. ట్రెక్కింగ్ చేస్తూ జున్నార్ సైట్ సీఇంగ్ ప్రదేశాలను చూడవచ్చు. ఇక్కడి వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. కనుక పర్యాటకులు ఎల్లప్పుడూ సందర్శిస్తుంటారు. మరి జున్నార్ లో చూడవలసిన ప్రధాన ఆకర్షణలు ఏవి ? వాటి ప్రాముఖ్యత ఏంటి ? అనే అంశాలను ఒకసారి పరిశీలిస్తే ... !

జున్నార్ - ఒక చారిత్రక ప్రదేశం

జున్నార్ - ఒక చారిత్రక ప్రదేశం

జున్నార్ చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. సుమారు వేయి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. ఈ చారిత్రక స్ధలం శివనేరి కోటకు సమీపంలో కలదు. శివనేరి కోట ప్రఖ్యాత మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ రాజ భోస్లే జన్మస్ధలం.

చిత్రకృప : Milind.dumbare

శాతవాహనుల కాలంలోనే బీజం

శాతవాహనుల కాలంలోనే బీజం

జున్నార్ మొదటగా జిమా నగర్ అని పిలువబడేది. శక రాజ వంశ పాలనలో రాజు నహాపాన్ కు ఈ ప్రదేశం ప్రధాన నగరంగా వ్యవహరించింది. తర్వాతి కాలంలో దీనిని శాతవాహన రాజులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఎంతో వ్యూహాత్మకంగా అప్పటి వాణిజ్య మార్గమైన నానేఘాట్ పై ఒక కన్ను వేసి పర్యవేక్షించాలని శివనేరి కోటను నిర్మించాడు.

చిత్రకృప : Ramveeturi

రాతి శిల్పకళా వైభవం

రాతి శిల్పకళా వైభవం

శిల్పకళలకు కేంద్రం జున్నార్ పట్టణం దాని శిల్ప సంపదలతో ప్రసిద్ధి గాంచటానికి, కారణం జున్నార్ గుహలని చెప్పాలి. ఇక్కడ మూడు గుహల సముదాయాలు కలవు. మన్మోడి హిల్ గ్రూప్, గణేష్ లేనా గ్రూప్ మరియు తులిజా లేనా గ్రూప్ అని మూడు గ్రూపుల గుహలు కలవు. అన్ని గుహలలోను అందమైన రాతి శిల్ప కళా వైభవం కనపడుతుంది.

చిత్రకృప : Prabhat8051

అటవీ ప్రాంతం

అటవీ ప్రాంతం

ఈ గుహలే కాక, ఇక్కడే కల మరో 30 లేన్యాద్రి గుహలు ఈ ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయం చేశాయి. జున్నార్ ఆకర్షణ వెనుకగల వాస్తవం ఏమంటే, ఈ ప్రాంతంలో చిరుత పులులు అధికంగా నివసిస్తాయి. షుమారు 500 చ.కి.మీ. ల పరిధిలో ఇవి సంచరిస్తూ ఉంటాయి.

చిత్రకృప : Ramveeturi

శివనేరి ఫోర్ట్

శివనేరి ఫోర్ట్

శివనేరి కోట జున్నార్ సమీపంలో కలదు. ఇది మరాఠా మహరాజు శివాజీ మహారాజు జన్మస్ధలం. ఈ కోటలో శివాజీ 1630 లో జన్మించాడు. ఇక్కడ జన్మించటమే కాదు, ఈ కోటలో ఒక సైనికుడిగా శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ కోటలోకి ప్రవేశించాలంటే, సుమారు ఏడు గేట్లు దాటి వెళ్ళటం పర్యాటకులకు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది.

చిత్రకృప : Sanket Patil

తలాబ్, టెంపుల్

తలాబ్, టెంపుల్

ఈ కోటలో మధ్యగా బాదామి తాలాబ్ అనే చిన్న చెరువు కూడా కనపడుతుంది. శివాజీ తల్లి జీజాబాయి విగ్రహం మరియు శివాజీ విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు. కోట సమీపంలోనే ఒక దేవాలయం కూడా ఉంది. దీని ప్రధాన దైవం శివని దేవత. ఈ ప్రదేశానికి వచ్చే వారు ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించాలి.

చిత్రకృప : Ramveeturi

ప్రధాన ఆకర్షణ

ప్రధాన ఆకర్షణ

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో కల జున్నార్ గుహలు పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ గుహలను సుమారు 2 వ లేదా 3వ శతాబ్దంలో కనుగొన్నారు. పురావస్తు శాఖకు మరియు చరిత్ర పట్ల ఆసక్తి కలవారికి ఈ ప్రదేశం ఎంతో సమాచారాన్నిస్తుంది.

చిత్రకృప : Miline

శిల్పాలు, చెక్కడాలు

శిల్పాలు, చెక్కడాలు

ఎన్నోశిల్పాలు, మరియు చెక్కడాలు ఇక్కడ కనపడతాయి. జున్నార్ గుహలను మూడు భాగాలుగా విభజించారు. అవి మన్మోడి హిల్ గ్రూప్, గణేశ లేనా గ్రూప్ మరియు తుల్జా లేనా గ్రూప్ అని వ్యవహరిస్తారు.

చిత్రకృప : Abhijit.more14

గుహలు

గుహలు

మన్మోడి హిల్ గ్రూప్ అదే పేరుగల కొండలో ఉండటంచే మరింత ప్రసిద్ధి గాంచాయి. అద్భుత శిల్పకళా చతురత వీటిలో కనపడుతుంది.

తుల్జా గ్రూప్ అద్భుతమైన దాని గుండ్రటి డోమ్ సీలింగ్ కారణంగా చైత్య హాలు కు ప్రసిద్ధి గాంచింది.

గణేశ లేనా గ్రూపు గుహలు జున్నార్ నుండి 4 కి.మీ.ల దూరంలో దక్షిణ దిక్కుగా ఉండి వివిధ విహారాలు, గదులు కలిగి ఉంటాయి. ఆరవ చైత్య గుహ మరియు గణేశ లేనా గుహలు కూడా ఎంతో ప్రసిద్ధి గాంచినవి.

చిత్రకృప : Ramveeturi

జున్నార్ చేరుకోవడం ఎలా ?

జున్నార్ చేరుకోవడం ఎలా ?

సమీప విమానాశ్రయం : పూణే దేశీయ విమానాశ్రయం, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం

సమీప రైల్వే స్టేషన్ : పూణే రైల్వే స్టేషన్, ముంబై రైల్వే స్టేషన్

రోడ్డు మార్గం : ముంబై, పూణే మధ్య తిరిగే అన్ని ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు జున్నార్ లో ఆగుతాయి. పూణే నుండి ప్రతి గంటకు జున్నార్ పట్టణానికి బస్సులు కలవు.

చిత్రకృప : Truptis Sudhakar Sarode

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X