Search
  • Follow NativePlanet
Share
» »మహా కుంభ మేళా ఆ నాలుగు చోట్లే ఎందుకు జరుపుతారో తెలుసా?

మహా కుంభ మేళా ఆ నాలుగు చోట్లే ఎందుకు జరుపుతారో తెలుసా?

అన్ని మతాలలోనూ దేవుడు, దేవుని ఆరాధనా వుంది. సాంప్రదాయాలు, కొలిచే విధాణాలు వేరువేరుగా వున్నాయి కానీ మూలం, అర్ధం, పరమార్ధం ఒక్కటే. దేవుడున్నాడా లేదా అన్నది ఎవ్వరికీ తెలీదు. అది ఒక నమ్మకం మాత్రమే.

By Venkatakarunasri

ప్రపంచంలో రెండవ అతి పెద్దదైన గోడ ఎక్కడ వుంది మీకు తెలుసా ?ప్రపంచంలో రెండవ అతి పెద్దదైన గోడ ఎక్కడ వుంది మీకు తెలుసా ?

పది తలల రావణాసురుడికి ప్రత్యేకమైన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా?పది తలల రావణాసురుడికి ప్రత్యేకమైన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా?

గోవా గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు !

అన్ని మతాలలోనూ దేవుడు, దేవుని ఆరాధనా వుంది. సాంప్రదాయాలు, కొలిచే విధాణాలు వేరువేరుగా వున్నాయి కానీ మూలం, అర్ధం, పరమార్ధం ఒక్కటే. దేవుడున్నాడా లేదా అన్నది ఎవ్వరికీ తెలీదు. అది ఒక నమ్మకం మాత్రమే. పూర్వం ఆదిమానవుడు ప్రకృతిలో వుండే భీభత్సాలు, ఉరుములు, మెరుపులు, గాలివానలు, సునామీలు, వరదలు, చీకటి, వెలుతురు, చలి, ఎండ, వానల నుంచి భయపడి అప్రయత్నంగా అమ్మో నాన్నో అని అరిచేవాడు. చనిపోయిన అమ్మానాన్నలను తలచుకుని ధైర్యం తెచ్చుకునేవాడు. ఆ ధైర్యంతోనే జీవనాన్ని గడిపేవాడు.రక్షణ కోసం ఏ చెట్టునో,రాయినో, పుట్టనో ఆశ్రయించేవాడు. తనకు రక్షణనిచ్చే ఆ చెట్టును గానీ,రాయిని గానీ, పుట్టను గానీ తనను కాపాడే శక్తి లేదా దేవుడుగా భావించేవాడు లేదా పూజించేవాడు. అమ్మ నుంచి పుట్టింది అమ్మోరు.

నాన్న నుంచి పుట్టిందే నారాయణ. చెట్టే అమ్మోరు.పుట్టే నారాయణుడు. దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు.ఆధ్యాత్మికత వుంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది. నమ్మకమే జీవితమనే నావకు దిక్సూచి. ఈ విశ్వంలో రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు,మనిషికీ మనిషికీ తేడా మనసుకీ మనసుకీ తేడా వుంటుంది. మనసు + శరీరం కలిస్తేనే మానవజీవి.ప్రాణం గాలి నుంచి,శరీరం భూమి నుంచి పుడతాయి.పంచభూతాల మిళితమే ఈ విశ్వంలోని జీవుల తయారి. అయితే ఈ పంచభూతాలు అసలేంటి?అసలెలా ఉద్భవించాయి. అసలెందుకుద్భావించాయి. అనేది ఎవ్వరికీ తెలీదు. ప్రతీ వస్తువుకీ ప్రాణం వుంటుంది.కొన్నిటికి అంతర్గతంగాను, కొన్నిటికి బహిర్గాతంగాను.అంతర్గతంగా జీవం వున్న వస్తువులను మనిషి జీవం లేనివిగా భావిస్తాడు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

కుంభమేళా

కుంభమేళా

ఎందుకంటే తానో బహిర్గతంగా జీవం వున్నవాడుగా. ఇప్పుడు మనం కుంభమేళా గురించి తెలుసుకుని,ఆనందించి జీవిత విధివిధానంలో మన పాత్రేమిటో తెలుసుకుందాం.

PC: youtube

 మహాక్రతువు

మహాక్రతువు

దేశం నలుమూలలనుంచే కాక,ప్రపంచం అంతట్నుంచీ తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలాచరించే మహాక్రతువు కుంభమేళా. త్రివేణీ సంగమ క్షేత్రంలో జరిగే మహాక్రతువు కుంభమేళా.

PC: youtube

ప్రయాగ

ప్రయాగ

ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం. హిందూ సంస్కృతిలో నదులన్నిటినీ దేవతలుగా భావిస్తారు. మన దేశంలో వున్న 7 ముఖ్యమైన తీర్ధ క్షేత్రాలలో ఒకటి ప్రయాగ.

PC: youtube

త్రివేణీ సంగమం

త్రివేణీ సంగమం

ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్ధం.గంగ,యమునా,సరస్వతి నదులు ఈ క్షేత్రంలోనే సంగమించటం వల్ల దీనికి త్రివేణీ సంగమం అని పేరు వచ్చింది.

PC: youtube

పుణ్య స్నానాలు

పుణ్య స్నానాలు

దేశం నలుమూలల నుంచే గాక ప్రపంచం అంతటినుంచీ తండోపతండాలుగా వచ్చి భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించే మహాక్రతువు కుంభమేళా.

PC: youtube

గంగానదీ

గంగానదీ

కనుక దీన్నిబట్టి నదినీటినీ,అందులోను గంగా నదినే మనం ప్రథమంగా స్మరిస్తాం. సమస్త దేవతలూ నివశించే స్థలం జలం. మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ. పావనత్వం,కోమలత్వం,శీతలత్వం గంగానదీ నీటి యొక్క ప్రత్యేకత.

PC: youtube

సరస్వతీ నది

సరస్వతీ నది

విష్ణువు పాదాల నుంచి నేరుగా భూమి పైకొచ్చిందని దీనిలో స్నానం ఆచరిస్తే హిందువుల యొక్క పవిత్రమైన భావన. ప్రయాగలో గంగా యమునా నదులు ప్రవహిస్తూవుంటాయి. అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ప్రవహిస్తూవుంది.

PC: youtube

త్రివేణీ సంగమ తీరం

త్రివేణీ సంగమ తీరం

అందుకే ఈ తీరాన్ని త్రివేణీ సంగమ తీరంగా పిలుస్తూంటాం.పర్వదినాలలో ఈ నదిలో స్నానమాచరిస్తే పాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.అంతేకాకుండా కుంభమేళాలో పుణ్యస్నానం చేస్తే మోక్షం లభిస్తుందని పునర్జన్మ వుండదని భక్తులు విశ్వశిస్తారు.

PC: youtube

అమృతం

అమృతం

అయితే ఈ కుంభమేళా ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. కుంభమేళా కు హిందూ పురాణాలలో ప్రత్యేక కధనం వుంది. అసురులచేతుల్లో సర్వం కోల్పోయిన ఇంద్రుడు తిరిగి పూర్వ వైభవం కోసం విష్ణువునాశ్రయిస్తాడు. అమృతం కోసం సాగర మధనం చేయాలని దానితో తిరుగుండదని విష్ణువు సలహా ఇస్తాడు.

PC: youtube

అమృత కలశం

అమృత కలశం

దేవదానవులు సముద్రమథనం చేస్తుండగా అమృత కలశం ఒకటి బయటికొస్తుంది. అమృతం కోసం దేవదానవులు 12 రోజులు,12 రాత్రులు అంటే మనుష్యుల ప్రకారం 12సంవత్సరాలు.ఘోరయుద్దం చేశారు.

PC: youtube

విష్ణువు

విష్ణువు

దీనిని రాక్షసులు గనక తాగితే అజేయులౌతారని భావించిన రాక్షసులు మహా విష్ణువును ప్రార్థించగా స్వామి మోహినీ అవతారం ఎత్తుతారు.విష్ణువు చేతిలోని కలశం నుండి నాలుగు అమృతపు చుక్కలు అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలోని పుణ్యనదులలో పడ్డాయని భాగవతం, విష్ణు పురాణం, మహాభారతం, రామాయణం తదితరాల పురాణాల కధనం.

PC: youtube

సాగరమథనం

సాగరమథనం

మరో కధ కూడా వుంది. సాగారమథనంలో ఉద్భవించిన అమృతకలశాన్ని మోహినీ అవతారంలో విష్ణువు తన వాహనమైన గరుడునికిచ్చి బద్రపరచమంటాడు.గరుడుడు తన కలశాన్ని తీస్కువెళ్తుండగా 4 చోట్ల ఈ చుక్కలు పడతాయట.

PC: youtube

కుంభమేళ

కుంభమేళ

ఈ నాలుగు చోట్లే ప్రయాగ (అలహాబాద్), హరిద్వార్ (ఉత్తరప్రదేశ్), నాసిక్ (మహారాష్ట్ర), ఉజ్జయిని(మధ్యప్రదేశ్). అందుకే ఈ నాలుగుచోట్ల కుంభమేళాలు జరుగుతాయి.ప్రతీ 3 ఏళ్ల కొకసారి కుంభమేళ జరుగుతుంది. అంటే ఒక్కోచోట ప్రతి 12 ఏళ్ళకొకసారి కుంభమేళ జరుగుతుంది.

PC: youtube

చరిత్ర,విశిష్టత

చరిత్ర,విశిష్టత

కుంభం అనగ కుండ అంటే కలశం అని అర్థం. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి. మేళ అంటే కలయిక లేదా జాతర అని అర్థం. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీనిని కుంభమేళ గా పిలుస్తారని హిందూధర్మ శాస్త్రాలు తెలుపుతున్నాయి.

PC: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X