» »హైదరాబాద్ నుండి చిన్న వారాంతపు విహారాలు

హైదరాబాద్ నుండి చిన్న వారాంతపు విహారాలు

By: Venkata Karunasri Nalluru

హైదరాబాద్ కు కుతుబ్ షాహీ పాలనలో, మొఘలుల మరియు నిజాముల పాలనలో గొప్ప చరిత్ర ఉంది. ఈ నగరంలో

అనేక చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని హైదరాబాద్ నుండి వారాంతపు విహారాలలో

చూడవచ్చును.

వెనుకటి కాలంలో కాకతీయ, శాతవాహన రాజవంశం, నిజాములు మరియు అనేక ఇతర పాలకులు వారి పరిపాలనకు గుర్తుగా వివిధ స్మారకాలను నిర్మించారు. చిన్న వారాంతపు విహారాలు హైదరాబాద్ నుండి 100 - 200 కి.మీ వుంటాయి. సులభంగా వారాంతంలో ఈ ప్రయాణాలు చేయవచ్చు.

కోటలు, దేవాలయాలు, మసీదులు, ఆనకట్టలు, జైన్ దేవాలయాలు, మొదలైనవి ఈ ప్రదేశం యొక్క గత వైభవాన్ని వివరిస్తాయి. హైదరాబాద్ చుట్టూ గల ఈ ప్రదేశాలకు ప్రయాణం మరలా మీరు కరెక్ట్ సమయానికి తిరిగి వచ్చేటట్లు చేస్తుంది.

హైదరాబాద్ నుండి చిన్న వారాంతపు విహారాలు:

1. వరంగల్:

దూరం: 144 కి.మీ

Short Weekend Getaways From Hyderabad

Photo Courtesy: abhinaba

తెలంగాణ రాష్ట్రంలో గల "వరంగల్ లేదా ఓరుగల్లు" చారిత్రకంగా ప్రసిద్ధిగలిగినది. ఓరుగల్లు అనగా లిఖితపూర్వకంగా "ఒకే రాతి" అనే అర్థం వస్తుంది. అందుకే "ఓరుగల్లు" ను ఏకశిలా నగరం అని అంటారు.

వరంగల్ 12 - 14 శతాబ్దాలలో కాకతీయ స్థావరంగా ఉండేది. తరువాత, అది బహమనీ సుల్తానుల మరియు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలోకి వచ్చింది. వేయి స్తంభాల దేవాలయం, వరంగల్ కోట, రామప్ప ఆలయం, కుష్ మహల్, భద్రకాళి ఆలయం, ఎత్రుంగరం అనేవి వరంగల్ లో ప్రధాన పర్యాటక ప్రదేశాలలో కొన్ని.

2. నల్గొండ:

దూరం: 100 కి.మీ

Short Weekend Getaways From Hyderabad

Photo Courtesy: siddharthav

నల్గొండకు ఒక గొప్ప చారిత్రక గతి ఉంది. దీనిని వివిధ రాజవంశాలవారు పరిపాలించారు. ఆ కాలంలో ఉన్నటువంటి ఎన్నో నిర్మాణాలు ఇప్పుడు ప్రధాన పర్యాటక స్థలాలుగా ఉన్నాయి. నల్గొండ పట్టణం తెలంగాణలో ఉన్న పురాతన స్థలాలలో ఒకటిగా చెబుతారు. నాగార్జున సాగర్, భువనగిరి కొండ, నందికొండ, శ్రీ జైన్ మందిర్ (కొలనుపాక) వంటి ప్రముఖ ప్రదేశాలు నల్గొండ జిల్లాలో సందర్శించవచ్చు.

3. మహబూబ్ నగర్:

దూరం: 109 కి.మీ

Short Weekend Getaways From Hyderabad

Photo Courtesy: Kkkishore

మహబూబ్ నగర్ ను హైదరాబాద్ నిజాములు చాలా కాలం పరిపాలించారు. 5వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు శాతవాహన మరియు చాళుక్య రాజవంశాలు పరిపాలించాయి. ఇక్కడ ఉమమహేశ్వరాలయం, ఆలంపూర్ యొక్క జోగులాంబ ఆలయం, గద్వాల కోట, పిల్లలమర్రి (బిగ్ బానియన్ ట్రీ), సోమేశ్వర స్వామి ఆలయం, కొల్లాపూర్ ప్యాలెస్ ప్రధాన పర్యాటక ప్రదేశాలు.

4. నిజామాబాద్:

దూరం: 175 కి.మీ

Short Weekend Getaways From Hyderabad

Photo Courtesy: Rizwanmahai

నిజామాబాద్, తెలంగాణ రాష్ట్రంలో 3 వ అతిపెద్ద పర్యాటక నగరం. ఇక్కడ పర్యాటక ప్రదేశాలు నోరూరించే వంటకాలకు ప్రసిద్ధి. పర్యాటకులు ఇక్కడ నిజామాబాద్ కోట, శ్రీరామ్ సాగర్ ఆనకట్ట, బడపహాడ్ దర్గా, ఆలీసాగర్ పార్క్ మరియు అనేక ఇతర ప్రదేశాలు చూడవచ్చు.

5. బీదర్

దూరం: 145 కి.మీ

Short Weekend Getaways From Hyderabad

Photo Courtesy: Madhavi Kuram

బీదర్ కర్నాటకలో ఉన్న ఒక నగరం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నది.

ఇటీవలి సంవత్సరాలలో, బీదర్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మేజర్ ఫిల్మ్ షూటింగ్ లొకేషన్ గా ఉంది.

వివిధ రాజవంశాల పాలకులు ఈ నగరంలో వారి అద్భుత నిర్మాణాలను వదలి వెళ్ళిపోయారు.

బీదర్ ఫోర్ట్, చౌబారా (టవర్), పాప్ నాష్ శివ టెంపుల్, సమాధులు, నరసింహ జార్ని, మొదలైన స్థలాలు బీదర్ లో సందర్శించవచ్చ.

6. శ్రీశైలం:

దూరం: 213 కి.మీ

Short Weekend Getaways From Hyderabad

Photo Courtesy: itsmaheshdesu

ఆంధ్ర ప్రదేశ్ లో గల కర్నూలు జిల్లాలో "శ్రీశైలం" ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలసింది. ఇది నల్లమల కొండలలో శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయం (జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి)గా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలంలో గల ముఖ్యమైన ఆకర్షణలు అక్కమహాదేవి గుహలు మరియు పాతాళ గంగ.

Please Wait while comments are loading...