Search
  • Follow NativePlanet
Share
» »విశ్వామిత్రుడు ప్రతిష్టించిన ఈ కాళిని సందర్శిస్తే భూత, ప్రేత పిచాచాలన్నీ బలాదూర్

విశ్వామిత్రుడు ప్రతిష్టించిన ఈ కాళిని సందర్శిస్తే భూత, ప్రేత పిచాచాలన్నీ బలాదూర్

గుజరాత్ లోని పావగడ్ గుట్ట పై ఉన్న మహాకాళి దేవాలయానికి సంబంధించిన కథనం.

భారత దేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క దేవాలయానిది ఒక్కొక్క చరిత్ర. కొన్ని దేవాలయాల్లోని ఆచార వ్యవహారాలు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలుగ చేస్తాయి. ఇటువంటి ఆలయాలు ఎక్కువగా మనకు శైవ ధర్మంలో కనిపిస్తాయి. ఇక శైవ ధర్మంలోనే అఘోరాల విషయం కూడా ప్రస్తావనకు వస్తుంది. ఈ అఘోరాలు పూజించే దేవాలయాలు మనకు చూడటానికి చాలా చిన్నవిగా కన్పించిన గొప్ప శక్తివంతమైన దేవాలయాలుగా కనిపిస్తాయి. అటువంటి కోవకు చెందిన ఓ దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం....

లవ కుశలు ఆంజనేయుడిని బంధించిన క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా?లవ కుశలు ఆంజనేయుడిని బంధించిన క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా?

ఇక్కడికి వెళ్లి భోలో భారాత్ మాతాకి జైఇక్కడికి వెళ్లి భోలో భారాత్ మాతాకి జై

ఏడాదిలో నాగపంచమి రోజు మాత్రమే తెరిచే దేవాలయం, సందర్శిస్తే సర్పదోషాలన్నీ మాయంఏడాదిలో నాగపంచమి రోజు మాత్రమే తెరిచే దేవాలయం, సందర్శిస్తే సర్పదోషాలన్నీ మాయం

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube

గుజరాత్ లోని బరోడాకు సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రమే పావగడ. ఇక్కడ కాళీ మాత ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయాన్ని విశ్వామిత్రుడు నిర్మించాడని పురాణ కథనం.

24 గంటలూ గన్ మెన్లతో సెక్యూరిటీ పొందుతున్న అత్యంత పవిత్రమైన వృక్షం24 గంటలూ గన్ మెన్లతో సెక్యూరిటీ పొందుతున్న అత్యంత పవిత్రమైన వృక్షం

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
సాక్షాత్తు ఆయన స్వహస్తాలతో ఈ దేవాలయంలోని విగ్రహాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. ఈ దేవాలయం ఇక్కడ ఉన్న ఒక చిన్నపర్వతం పై ఉంది. ఈ పర్వతం పై విశ్వామిత్రుడికి ఒక ఆశ్రమం కూడా ఉంది.

ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
కొండ దిగువన ఒక నది కూడా ఉంది. దీనిని విశ్వామిత్ర నది అనే పేరుతోనే పిలుస్తారు. ఎత్తైన కొండ పై వెలసిన ఈ ఆలయానికి వెళ్లడానికి ఐదు కిలోమీటర్ల దూరం మెట్ల దారిలో వెళ్లాల్సి ఉంటుంది.

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
అమ్మవారి విగ్రహం రక్త వర్ణంలో విప్పారిన నేత్రాలతో చాలా భయంకరంగా ఉంటుంది. మూల విరాట్టుకు ఒక వైపున పాలరాతి విగ్రహం, మరొక వైపు పాలరాయి పై చెక్కిన శక్తి యంత్రం దర్శనమిస్తాయి.

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
నవ రాత్రుల సమయంలో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. నవ రాత్రుల సమయంలో భక్తులు మట్టి కుండలో నవధాన్యాలను మొలకెత్తించి తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు.

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
ఎనిమిదో రోజున ఇక్కడ తొమ్మిది మంది పండితులు నవ చండీ యాగాన్ని నిర్వహిస్తారు. అటు పై పదో రోజున ఈ కుండలను ఆలయ సమీపంలో ఉన్న దుదియా తలావ్ అనే సరస్సులో నిమజ్జనం చేస్తారు.

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
ఈ సరస్సులోని నీరు తెల్లగా పాలవలే కనిపిస్తాయి. కొండ పైకి వెళ్లడానికి రోప్ వే మార్గం కూడా ఉంది. కొండ శిఖరాన దిగువన భద్రకాళి ఆలయం కనిపిస్తుంది. ఇది చిన్నాగా ఉన్నా చాలా అందంగా ఉంటుంది.

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
ఇందులోని విగ్రహం దక్షిణ ముఖంగా ఉండగా ఎగువన ఉన్న ఆలయం మహాకాళి మూలవిరాట్ మాత్రం ఉత్తరాభిముఖంగా ఉండటం విశేషం. ఈ ప్రాంతం కొద్ది కాలం ముస్లీం పాలనలో ఉండటం వల్ల అనేక ముస్లీం కట్టడాలు మనకు కనిపిస్తాయి.

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
సాధారణంగా ఇక్కడ తాంత్రిక పూజలు ఎక్కువగా జరుగుతాయి. అమావస్య పౌర్ణమి రోజుల్లో అఘోరాలు ఇక్కడకు వచ్చి రహస్యంగా ఈ పూజలు చేస్తారని చెబుతారు. అందువల్లే చాలా మంది ఆ సమయంలో ఇక్కడికి వెళ్లరు.

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
సాదారణంగా కాళికా దేవిని అనంత శక్తి దాయనిగా పూజిస్తారు. కాళిక పేరుకు కాల అనగా నలుపు, కాలం, మరణం, శివుడు మొదలైన అర్థాలు ఉన్నాయి. చాలా మంది ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్జానాన్ని కలిగించేదిగా ఆరాదిస్తారు.

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
ఈమెను కొందరు భవతారిణిగా కొలుస్తారు. కాళికాదేవిని శివుని భార్యగా పేర్కొంటారు. మరికొందరు కాళికా మాతే త్రిమూర్తులను సృష్టించిందని చెబుతారు. కాళీ తంత్రాలు మహాశక్తి వంతమైనవిగా పేర్కొంటారు. కాళీ విద్యలను మహాదేవి అవతారంగా చెబుతారు.

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
ఇదిలా ఉండగా పావగడా పేరుతోనే మరొక పుణ్యక్షేత్రం ఉంది. అది కర్నాటకలో ఉంది. ఇక్కడ శనీశ్వరుడి ఆలయం ఉంది. ఇక్కడున్న శనీశ్వరాలయం అత్యంత ప్రసిద్ధి చెందినది.

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
అతి పెద్దదైన ఈ ఆలయం గుండ్రంగా ఉంటుంది. మిగిలిన ఆలయాలతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడి పూజా విధానం కూడా కొంత వైవిద్యంగా ఉంటుంది.

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
శనీశ్వరుడి పూజకు కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడే దొరుకుతాయి. ఈ దేవాలయం మిగిలిన దేవాలయాల వలే ఎత్తైన గోపురాలు, శిల్ప కళా తోరాణాలతో ఉండదు. అయినా కూడా కళాత్మకంగానే ఉంటుంది.

కాళీ మాత ఆలయం

కాళీ మాత ఆలయం

P.C: You Tube
ఇక్కడ పూజలు చేసిన వారికి శని దోషాలు తొలిగి పోతాయని చెబుతారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నందు వల్ల ఈ ఆలయానికి తెలగు వారు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. పావగడ కోట కూడా చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందినది.

శ్రీ కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రాంతం ఓ పెద్ద పుణ్యక్షేత్రం మీకు తెలుసా?శ్రీ కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రాంతం ఓ పెద్ద పుణ్యక్షేత్రం మీకు తెలుసా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X