Search
  • Follow NativePlanet
Share
» »కడపలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్న700ఏళ్ళ నాటి ప్రసిద్ది చెందిన సిద్దవటం కోట

కడపలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్న700ఏళ్ళ నాటి ప్రసిద్ది చెందిన సిద్దవటం కోట

కడపలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్న700ఏళ్ళ నాటి ప్రసిద్ది చెందిన సిద్దవటం కోట

వాగ్గేయకారులు, కాలజ్ఞానులకు పురిటి గడ్డ కడప జిల్లా. మత సామరస్యానికి ప్రతీకలుగా నిలిచే ఆధ్యాత్మిక ప్రదేశాలూ, ఉరకలెత్తే పెన్నా నదీ తీరంలో ఆహ్లాదాన్ని కలిగించే ప్రాంతాలూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కడప జిల్లాలోని ఎన్నో చారిత్రక ప్రదేశాలు మన గత వైభవానికి చిహ్నాలుగా నిలిచాయి. రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్దిగాంచిన ఈ సిద్దవటం కోట మన చారిత్రక సంపదల్లో ఒకటిగా విరాజిల్లుతోంది.

విజయనగర రాజుల కాలం నుంచీ చారిత్రక ప్రాధాన్యత కలిగిన రెండు కొండల గండికోట ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రతిబింబమై ఉంది. చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు పరిపాలించిన సిద్ధవటం కోట చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలను తనలో దాచుకుని మతసామరస్యానికి వేదికై నిలిచింది. మరి అలాంటి కోట యొక్క విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

All Images Courtesy: https://www.facebook.com/pg/manarayalaseema

పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో సిద్ధులు ఎక్కవుగా నివసించేవారు.

పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో సిద్ధులు ఎక్కవుగా నివసించేవారు.

పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో సిద్ధులు ఎక్కవుగా నివసించేవారు. వారు నివాసం ఉండే వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతానికి సిద్దవటం అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు.సిద్దవటం పరిసరప్రాంతాల్లో జైనులు కూడా నివసించేవారు.

మొదట్లో 1807 నుంచి 1812వరకు జిల్లాకు కేంద్రంగా

మొదట్లో 1807 నుంచి 1812వరకు జిల్లాకు కేంద్రంగా

మొదట్లో 1807 నుంచి 1812వరకు జిల్లాకు కేంద్రంగా ప్రసిద్ది చెందింది. అయితే పెన్నానది ఉప్పొగిన ప్రతి సారి బటయ ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో జిల్లా కేంద్రాన్ని అక్కడి నుండి కడపకు మార్చారు.

శత్రుదుర్భేద్యమైన కోట పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది

శత్రుదుర్భేద్యమైన కోట పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది

అయినప్పటికీ తనలో ఇముడ్చుకున్న చారిత్రక సాక్ష్యాలతో సిద్దవటం మరింత ప్రఖ్యాతి చెందినది. ఈ ప్రదేశంలో నిర్మించిన శత్రుదుర్భేద్యమైన కోట పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్దిగాంచిన ఈ కోటను 1956లో పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది.

ఈ ప్రదేశం కేవలం కోటలకే కాదు, ఆలయాకలు ప్రసిద్ది

ఈ ప్రదేశం కేవలం కోటలకే కాదు, ఆలయాకలు ప్రసిద్ది

ఈ ప్రదేశం కేవలం కోటలకే కాదు, ఆలయాకలు ప్రసిద్ది చెందినది. ఈ కోటకు సమీపంలో ఏటి పొడవునా దేవాలయాలుండడం విశేషం. ఈ కోట ప్రాంతంలో రంగనాయక ఆలయం, సిద్దేశ్వర ఆలయం, బాలబ్రహ్మ ఆలయం, దర్గా, సభామండపం చూపరులను కట్టిపడేస్తాయి.

 రంగనాథస్వామి ఆలయం ఎంతో కీర్తిగడించింది

రంగనాథస్వామి ఆలయం ఎంతో కీర్తిగడించింది

ఇందులో రంగనాథస్వామి ఆలయం ఎంతో కీర్తిగడించింది. ఇక్కడి స్మశానవాటికలో భాకరాపంతులు పేరుతో నిర్మించిన 16 స్తంభాల మంటపం ఎంతో విశిష్టమైనది. ఇవి సందర్శకులను ఆకర్షించడంలో ప్రధానపాత్ర పోషిస్తున్నాయి.

తొలుత రాయల వంశం సామంతులు

తొలుత రాయల వంశం సామంతులు

తొలుత రాయల వంశం సామంతులు, తరువాత శ్రీకృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు, తరువాత మట్లి యల్లమరాజు, అతని కుమారుడు అనంతరాజు సిద్ధవటం కోటను పాలించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.

పలువురు ముస్లిం పాలకుల చేతులు మారిన ఈ కోట

పలువురు ముస్లిం పాలకుల చేతులు మారిన ఈ కోట

అనంతరం ఔరంగజేబు సేనాని మీర్‌ జుమ్లా, ఆర్కాట్‌ నవాబులు, కడప పాలకుడు అబ్దుల్‌ నబీఖాన్‌... ఇలా పలువురు ముస్లిం పాలకుల చేతులు మారిన ఈ కోట 1799లో ఈస్టిండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది.

 టిప్పు సుల్తాన్‌ సమీప బంధువు బిస్మిల్లాఖాన్‌ షావలి దర్గా

టిప్పు సుల్తాన్‌ సమీప బంధువు బిస్మిల్లాఖాన్‌ షావలి దర్గా

ఈ కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, కామాక్షిమాత ఆలయం, రాణిదర్బార్‌, ఈద్గా మసీద్‌, నగారా ఖానా, కోనేరు ఉన్నాయి. టిప్పు సుల్తాన్‌ సమీప బంధువు బిస్మిల్లాఖాన్‌ షావలి దర్గా కూడా ఉంది.

సిద్దవటం కోటకు రెండు ద్వారాలు

సిద్దవటం కోటకు రెండు ద్వారాలు

సిద్దవటం కోటకు రెండు ద్వారాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి. అలాగే తూర్పు దిశలో ఎంతో పటిష్టంగా నిర్మించిన ముఖ ద్వారానికి ఆంజనేయస్వామి, గరుత్మంతుడి శిల్పాలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. ఈ రెండు ద్వారాల శిల్పనైఫుణ్యం అప్పటి పాలకుల కళాభిరుచికి అద్దం పుడుతున్నాయి. ఈ శిల్పాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం ఉన్నాయి.

పశ్చిమ ద్వారం లోపలి పైభాగంలో

పశ్చిమ ద్వారం లోపలి పైభాగంలో

పశ్చిమ ద్వారం లోపలి పైభాగంలో రాహువు గ్రహణం పట్టడం నుండి వీడే వరకు అన్ని దశలు ఇక్కడ ద్రుశ్యరూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. మతసామరస్యానికి ప్రతీక అని చెప్పేందుకు తూర్పు ద్వారానికి సమీపంలో బిస్మిల్లా షావలి దర్గా ఉంది. దీనిని టిప్పు సుల్తాన్ కాలంలో నిర్మించారు.

సొరంగం నది మధ్యవరకు

సొరంగం నది మధ్యవరకు

ఈ దర్గా పక్కన మసీదు ఉంటుంది. మసీదుకు తూర్పుగా కోటగోడలో సొరంగ మార్గం ఉంటుంది. ఈ సొరంగం నది మధ్యవరకు ఉంటుందని చెప్తారు.

ఎలా వెళ్ళాలంటే...

ఎలా వెళ్ళాలంటే...

జిల్లా కేంద్రం కడప నుండి భాకరాపేట మీదుగా బద్వేలు వెళ్లే మార్గంలో పెన్నా నది ఒడ్డున సిద్ధవటం ఉంది. కడప నుంచి ఇక్కడికి 20 కి.మీ. దూరం. హైదరాబాద్ నుండి కడప వరకు విరివిగా నడిచే బస్సులతో పాటు రైలు సౌకర్యం కూడా ఉంది.

దూరప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయామలు కడప, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X