Search
  • Follow NativePlanet
Share
» »సకల సిద్ధులను ప్రసాదించు తల్లి సిద్ధిధాత్రి ఆలయం దర్శించండి

సకల సిద్ధులను ప్రసాదించు తల్లి సిద్ధిధాత్రి ఆలయం దర్శించండి

సకల సిద్ధులను ప్రసాదించు తల్లి సిద్ధిధాత్రి ఆలయం దర్శించండి

ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోక కల్యాణం కోసం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది సర్వస్వరూపాలను ధరించి అసుర సంహారం చేస్తూ వచ్చింది. సాధుజనుల జీవితం ప్రశాంతంగా కొనసాగడానికిగాను వారికి రక్షణగా అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించింది. ఇలా తొమ్మది రూపాల్లో ఆవిర్భవించిన అమ్మ తొమ్మిదో రూపం సిద్ధి దాత్రి. సిద్ధిదాత్రికి పాయసం అత్యంత ప్రీతికరం. సిద్ధి దాత్రిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడమే కాకుండా, తమకి ఎంతో ఇష్టమైన పదార్థమైన పాయసంను నైవేద్యంగా సమర్పించడం వలన సకల శుభాలను ప్రసాదిస్తుంది. మరి ఆ తల్లి కథనం ఏంటో, ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం..

నవదుర్గలలో అమ్మవారు సిద్దదాత్రిగా

నవదుర్గలలో అమ్మవారు సిద్దదాత్రిగా

నవదుర్గలలో అమ్మవారు సిద్దదాత్రిగా దర్శనం ఇస్తారు. సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి.

పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని

పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని

పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడినది. అలాగే మార్కండేయ పురాణంలో అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అని సిద్ధులు అష్టవిధాలుగా పేర్కొనబడినవి.

ఈమె పరమశివునిపై దయదలచి,

ఈమె పరమశివునిపై దయదలచి,

ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలిచింది. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహని. ఈమె కమలముపై ఆసీనురాలై ఉండును.

ఈమె కుడివైపున ఒకచేతిలో

ఈమె కుడివైపున ఒకచేతిలో

ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మరొకచేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక చేతిలో శంఖమును, మరియొక చేతిలో కమలమును ఉంటుంది. సిద్ది దాత్రిని నిష్ఠతో ఆరాధించు వారికి సకల సిద్ధులు కలుగుతాయని చెబుతారు.

ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక

ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక

ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు.

అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును.

అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును.

అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.

నవరాత్రుల్లో తొమ్మిదో రోజును సిద్ధిదాత్రికి అంకితమివ్వబడినది.

నవరాత్రుల్లో తొమ్మిదో రోజును సిద్ధిదాత్రికి అంకితమివ్వబడినది.

నవరాత్రుల్లో తొమ్మిదో రోజును సిద్ధిదాత్రికి అంకితమివ్వబడినది. సిద్ది దాత్రి దేవి విజ్ఞానం ప్రసాదిస్తుంది. ప్రతి భక్తుని యొక్క ఆత్మను స్వచ్చంగా చేస్తుంది. అమ్మను పూజించే వారు తెలుపు, ఎరుపు రంగుల దుస్తులు ధరించి భక్తి శ్రద్దలతో కొలుస్తారు.

సకల సిద్ధులు ప్రసాధించే సిద్ధి దాత్రి దేవాలయం

సకల సిద్ధులు ప్రసాధించే సిద్ధి దాత్రి దేవాలయం

సకల సిద్ధులు ప్రసాధించే సిద్ధి దాత్రి దేవాలయం వారణాసిలో ఉంది. ఈ పవిత్ర దేవాలయం దేవ్ పహారి చత్తీస్ ఘడ్, సాత్నా , మధ్యప్రదేశ్ లో ఉంది. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో ఈ దేవీ దేవాలయం ఉంది. సాత్నాకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

సాగర్ లోని ఈ ఆయల దర్శనంతో పాటు

సాగర్ లోని ఈ ఆయల దర్శనంతో పాటు

సాగర్ లోని ఈ ఆయల దర్శనంతో పాటు వారణాసిలో మరియు వారణాసి చుట్టూ కొన్ని పర్యాటక ప్రదేశాలున్నాయి. వారణాసి ఆధ్యాత్మిక భావనను అందిస్తుంది.

PC: YOUTUBE

వారనాసిలో ప్రధాన అంశం అనేక ఘాట్స్

వారనాసిలో ప్రధాన అంశం అనేక ఘాట్స్

వారనాసిలో ప్రధాన అంశం అనేక ఘాట్స్ (గంగా నది జాలాలు దారితీసే మెట్టపై)ఉండటమే. వాటిలో ముఖ్యంగా హనుమాన్ ఘాట్ , మన్ మందిర్ , దర్భాంగా ఘాట్, దశాశ్వమేధ ఘాట్ ముఖ్యమైనవి.

Photo Courtesy: Abhishek

 వారణాసిని డెత్ టూరిజం

వారణాసిని డెత్ టూరిజం

ఈ ప్రపంచం మొత్తంలో బహుశా వారణాసిని డెత్ టూరిజం అని పిలుస్తారు. గంగానదిలో ఉన్న మణికర్ణిక ఘూట్ లో ముందుగా మృతదేహాలను పూర్తి దృష్టిలో దహనం మరియు అస్థికలు నిమజ్జనం చేస్తారు.

PC: Navaneeth Kishor

వారణాసిలోని విశ్వనాథ్ ఆలయం

వారణాసిలోని విశ్వనాథ్ ఆలయం

వారణాసిలోని విశ్వనాథ్ ఆలయం ఆ పరమశివుడికి అంకితం చేయబడినది. వారణాసిలో శివుని దేవాలయాలు అధికంగా ఉండటం వల్ల శివుని నివాసంగా చెబుతుంటారు.

దుర్గా దేవి ఆలయాలు

దుర్గా దేవి ఆలయాలు

ఇంకా ఇతర దేవాలయాలైన తుల్సి మానస్ ఆలయం మరియు దుర్గా దేవి ఆలయాలు కూడా ఉన్నాయి. జైన దేవాలయాల్లో జైనులు ఉపశమనం పొందుతారు. ముస్లింలు ఆలంగీర్ మసీదులో ప్రాతినిధ్యం కనుగొంటారు.

Photo Courtesy: Henk Kosters

దశాశ్వమేధ ఘాట్ :

దశాశ్వమేధ ఘాట్ :

కాశీ విశ్వనాధ మందిరం పక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాశిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనది. ఈ ప్రదేశం పూజారులతో ఎప్పుడూ రద్దీగా కనబడుతుంది. ఫోటోలు తీసుకునే వారికి చాలా ప్రియమైన స్థలం. అనేక మందిరాలు దర్శనమిస్తుంటాయి.

PC : Ekabhishek

మణికర్ణికా ఘాట్:

మణికర్ణికా ఘాట్:

మణికర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుందర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దాని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండల(మణికర్ణిక )అందులో పడింది. అప్పటి నుండి మణికర్ణికా ఘాట్ గా పేరు పొందినది.

Photo Courtesy: Ekabhishek

మన మందిర్ ఘాట్:

మన మందిర్ ఘాట్:

ఇది జైపూర్ రాజు మహారజా జైసింగ్ ఈ మన మందిర్ ఘాట్ ను యాత్రా మందిరాన్ని నిర్మింపజేశాడు. యాత్రా మందిరం రాజస్థాన్-ఢిల్లీ శైలిలో చక్కని అలంకృత గవాక్షాలతో ఉంటుంది. ఇక్కడ భక్తులు సోమేశ్వరుని ఆరాధిస్తారు.

Image Courtesy:Nandanupadhyay

లలితా ఘాట్:

లలితా ఘాట్:

ఇది నేపాల్ రాజుచే నిర్మిపంజేయబడింది. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించిన గంగా కేశవ మందిరం ఉంది. ఈ విశిష్ట ఆలయంలో పాశుపతేశ్వర స్వామి విగ్రహం ఉంది.

Photo Courtesy: Bijaya2043

అస్సీ ఘాట్

అస్సీ ఘాట్

ఇది చాలా సుందరమైనది. అన్ని ఘాట్‌లకు చివర ఉంది. ఇది ఫొటోగ్రాఫర్లు, చిత్రకారులు, వాద్య బృందకారులతో కోలాహలంగా ఉంటుంది.

Photo Courtesy: Nandanupadhyay

వారణాసికి ఎలా వెళ్ళాలి?

వారణాసికి ఎలా వెళ్ళాలి?

వారణాసికి రోడ్డ్, రైలు, విమాన సౌకర్యం ఉంది. సొంత అంతర్జాతీయ విమానశ్రయం ఉంది.

PC: globalreachent

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X