Search
  • Follow NativePlanet
Share
» »పంచగని లో పసందైన విహారం !

పంచగని లో పసందైన విహారం !

మీరు మొదటి సారి పర్యటించే వారా ? లేక నిరంతరం పర్యటించే వారా ? లేక ప్రకృతి ప్రియులా లేదా అడ్వెంచర్ అంటే ఇష్టమా? లేక హాయిగా కొత్త ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి ...అనుకుంటున్నారా ? ఈ కేటగిరి లలో మీరు ఎవరైనప్పటికీ, పంచ గని మిమ్ములను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది.

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ఇండియా లోని అనేక హిల్ స్టేషన్ ల వలెనె, మహారాష్ట్ర లోని పంచ గని కూడా బ్రిటిష్ వారు మనకు అప్పచెప్పి వెళ్ళిన ఒక హిల్ స్టేషన్. నేటికీ ఇక్కడ వలస ప్రభుత్వ ప్రభావం కనపడుతుంది. సముద్ర మట్టానికి సుమారు 4,500 అడుగుల ఎత్తున కల పంచ గని సహ్యాద్రి పర్వత శ్రేనులలో అయిదు కొండల మధ్య భాగంలో కలదు.

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

జంట కొండలుగా చెప్పబడే పంచాగ్ని మరియు మహాబలేశ్వర్ లు మీకు విభిన్న అనుభవాలు అందిస్తాయి. మీరు ప్రకృతి ఆరాధకులితే, సాయంత్రపు నీరెండలో ఈ హిల్ స్టేషన్ లో సంచరించి రుచికరమైన స్ట్రా బెర్రీ లు తింటూ అక్కడి అందమైన దృశ్యాలను ఆస్వాదించండి. కొద్దిపాటి అడ్వెంచర్ కు సిద్ధం అయితే, పారా గ్లైడింగ్ ఆట ఆడేయండి.
Photo courtesy: Wiki Commons

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ప్రకృతికి మరింత సన్నిహితం గా వెళ్ళాలంటే, అక్కడే కల సమీప గ్రామం ధూమ్ డాం కు వెళ్లి హాయిగా కృష్ణ నది ఒడ్డున కూర్చుని చేపలు పట్టి ఆనందించండి. ఇక చాలు అనుకుంటే, ప్రసిద్ధ పార్సీ మరియు సిడ్నీ పాయింట్ లకు వెళ్లి అక్కడి సహజ ప్రకృతి దృశ్యాలు చూడండి. పంచ గని పిక్నిక్ లకు పెట్టింది పేరు.
Photo courtesy: Wiki Commons

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

మీరు వెళ్ళింది, వర్షాకాలం అయితే, అక్కడ కల భిలార్ జలాపాతాలు మీకు కను విందు చేస్తూ, మడుగులో ఈతలు కొట్టేందుకు ఆహ్వానిస్తాయి. ఇక్కడే కల మైదాన ప్రాంతం లో పారా సెయిలింగ్ మరియు హార్స్ రైడింగ్ వంటివి కూడా ఆచరించ వచ్చు.

Photo courtesy: Wiki Commons
ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

కుటుంబ సభ్యులతో వెళ్ళేవారు షేర్ బాగ్ లోని వన్య ప్రదేశంలో అనేక పక్షులకు , కుందేల్లకు, టర్కీ లకు, హంసలకు నివాసంగా కల ప్రదేశాన్ని మరియు పక్కనే కల ఒక పిల్లల పార్క్ లోను తిరిగి ఆనందించవచ్చు. ఇక్కడే కల డెవిల్స్ కిచెన్ మరియు హారిసన్ వాలీ లు చూడటం మరువకండి.


Photo courtesy: Wiki Commons
ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ఇక్కడి వసతి గృహాలు సైతం విభిన్నంగా వుంది బ్రిటిష్ రాజ్ రోజులను గుర్తు చేస్తాయి. నగరాల నుండి దూరంగా వుంది ప్రశాంత జీవనం కొద్ది రోజుల పాటు గడపాలనుకునే వారికి పంచ గని అద్భుత ప్రదేశం.


Photo courtesy: Wiki Commons
ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ఇక్కడ అనేక పార్శి నివాసాలు కూడా కలవు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో ఆరోగ్యాలు సరి లేని వారు సైతం ఇక్కడకు వచ్చి ఆరోగ్యం పొందవచ్చు. ఈ ప్రదేశం వారిని అతి త్వరగా స్వస్తులను చేస్తుంది.

Photo courtesy: Wiki Commons
 ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

పంచ గని ప్రదేశం ముంబై నగరానికి 285 కి. మీ. లు. ముంబై - పూనే ఎక్స్ప్రెస్స్ మార్గం లో అందమైన పరిసరాలు చూస్తీ డ్రైవింగ్ లో గోవా రోడ్ వెంట చేరవచ్చు. ఈ మార్గంలో మీకు ముందుగా మహాబలేశ్వర్ తగులుతుంది.

 ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

పంచాగ్ని సతారా వెళ్ళే మార్గంలో కలదు. మీ బృందం కనుక అధిక సభ్యులు కలిగి వుంటే, పంచా గని - మహాబలేశ్వర్ రోడ్ లో కల అంజుమన్ ఇస్లాం స్కూల్ ఎదురుగా కల బంగాళా ఒకటి బుక్ చేయండి.

 ప్రకృతి ఒడిలో విశ్రాంతి

ప్రకృతి ఒడిలో విశ్రాంతి

పంచ గని సందర్శనకు సెప్టెంబర్ నుండి మే వరకూ అనుకూల సమయం. దీని తర్వాత వర్షాలు ఇక్కడ మొదలవుతాయి. పంచాగ్ని చూసే వారు ఇక్కడ కల మహాబలేశ్వర్ కూడా తప్పక చూడాలి.

మహాబలేశ్వర్ ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X