Search
  • Follow NativePlanet
Share
» »పెరెన్ - ప్రకృతిచే దీవించబడ్డ 'భూమి' !

పెరెన్ - ప్రకృతిచే దీవించబడ్డ 'భూమి' !

By Mohammad

ఇండియాలోని అత్యంత చిన్న రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్ ఈ విశ్వంలో ప్రకృతి ప్రేమికులకు ఎప్పుడూ ఒక అద్భుతంగానే ఉంటుంది. పూర్తిగా సంస్కృతి వారసత్వ సంప్రదాయాల తో నిండిన ఈ చిన్న ప్రదేశాన్ని 'స్విట్జర్లాండ్ అఫ్ ఈస్ట్' గా పిలుస్తుంటారు. ఈ భూమి అంతా ఎన్నో సుందర దృశ్యాలు, పచ్చటి ప్రదేశాలు, అందమైన సూర్యోదయ సూర్యాస్తమయాలు కలదిగా మీరు గుర్తించవచ్చు. కనుక మీరు ప్రకృతి పర్యటన పట్ల ఆసక్తి కల వారైతే, అందమైన నాగాలాండ్ పర్యటనకు మించినది వేరు ఏమీ లేదని భావించండి.

నాగాలాండ్ లో ఇప్పటివరకు చూడని అటవీ ప్రదేశాలు అనేకం. ఈ ప్రదేశాలను అటవీ వాసులు ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. అందులో పెరెన్ ఒకటి.

ఇది కూడా చదవండి : ప్రకృతి వర్ణాల సోయగం .. కొహిమా నగరం !

పెరెన్ దట్టమైన అటవీ భూమి. అందమైన ప్రకృతి దృశ్యాలతో, పర్వత శ్రేణులతో ప్రకృతి ప్రియులకు స్వర్గం వలే ఉంటుంది. ఇక్కడ దట్టమైన వృక్ష సంపద, వివిధ రకాల పక్షులు, జంతువులు, గలగలపారే సెలయేర్లు, నదులు కలవు. సందర్శించటానికి ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలలో లోపలి వెళ్ళాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి !

పెరెన్ గుహలు

పెరెన్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుఇల్వా గ్రామం వద్ద పెరన్ గుహలు కలవు. నాగాలాండ్ ప్రజలు వీటిని ఎంతగానో ప్రేమిస్తారు. బ్రిటిష్ పాలనలో, విప్లవ రాణి గైదినిల్లు గుహలలో దాగుకొని ఆశ్రయం తీసుకుందని, అప్పటి నుండి ఈ ప్రదేశం నాగా ప్రజలకు ఒక చారిత్రక మరియు ఇతిహాస ప్రదేశంగా మారిందని స్థానికులు చెబుతుంటారు.

పెరెన్ గుహలు

పెరెన్ గుహలు

చిత్ర కృప : Markus Lerner

పుఇల్వా గ్రామంలో గుహలు అనేకం. పర్యాటకులు రోజంతా గుహలను నెమ్మదిగా ఒకదాని తర్వాత మరొకటి చూస్తూ ఆనందించవచ్చు. ఇక్కడి గ్రామస్థులతో కలిసిపోయి వారి జీవన స్థితి గతులను, సంస్కృతిని అడిగి తెలుసుకోవచ్చు.

మౌంట్ పౌనా

మౌంట్ పౌనా పెరెన్ లో ఉన్న ఎత్తైన శిఖరం. పెరెన్ నుండి అటు ఇటుగా 35 కి. మీ ల దూరంలో ఉంటుంది. ఈ శిఖరం బరైలీ పర్వత శ్రేణుల్లో ఎత్తైనది. శిఖరం మీద నుండి అందమైన లోయ దృశ్యాలను చూడవచ్చు మరియు శిఖరానికి వెళ్ళే మార్గంలో ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలను ఆనందించవచ్చు.

మౌంట్ కీసా

పేరెన్ జిల్లాలోని నజాఉన విలేజ్ లో ఈ కీసా పర్వతం కలదు. దీనిని 'మౌంట్ కిషా' గా కూడా పర్యాటకులు పిలుస్తారు. పీరెన్ నుండి 28 కి.మీ.ల దూరంలో కల ఈ ప్రదేశం తేలికగా చేరవచ్చు.

మౌంట్ కీసా పర్వతం

మౌంట్ కీసా పర్వతం

చిత్ర కృప : noshtradamus

ఇక్కడ నుండి వాలీ లోని ప్రదేశాలు మరియు ఇతర శిఖరాలను పర్యాటకులు చూసి ఆనందించవచ్చు. ఇక్కడి అడవులు దట్టంగా వుండి వివిధ రకాల వృక్ష, జంతు జాలాలతో నిండి ఉండి, పర్యాటకులను ఆకర్షిస్తోంది.

నితాంగ్ కి నేషనల్ పార్క్

ఇతంకి నేషనల్ పార్క్ గా కూడా పిలువబడే నితాంగ్ కి నేషనల్ పార్క్ పెరెన్ కు 40 కి. మీ ల దూరంలో కలదు . ఈశాన్య భారతదేశంలో ఉత్తమ పార్క్ గా గుర్తించబడ్డ ఇతంకి పార్క్ పక్షులకు, సర్ప జాతులకు, మమ్మల్ కు నివాసంగా ఉన్నది. ఇక్కడ గల కొండలు ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉన్నాయి. నాగాలాండ్ లోనే చూడగలిగే కొన్ని జంతువులు ఇక్కడ ఉన్నాయి.

ఖడ్గ మృగం, నితాంగ్ కి నేషనల్ పార్క్

ఖడ్గ మృగం, నితాంగ్ కి నేషనల్ పార్క్

చిత్ర కృప : Satish Krishnamurthy

పెరెన్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

పెరెన్ కు సమీపాన 70 కిలోమీటర్ల దూరంలో దిమాపూర్ విమానాశ్రయం కలదు. కోల్కతా, గౌహతి నుండి రెగ్యులర్ గా విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి పెరెన్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

పెరెన్ కు సమీపాన దిమాపూర్ రైల్వే స్టేషన్ కలదు. గౌహతి, కోల్కతా నుండి రెగ్యులర్ గా ట్రైన్ లు వస్తుంటాయి. బస్సు లేదా ఏదేని ప్రవేట్ వాహనంలో ఎక్కి పెరెన్ వెళ్ళవచ్చు.

బస్సు / రోడ్డు మర్గం

దిమాపూర్, కొహిమా, కిఫిరె ప్రాంతాల నుండి పెరెన్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

రోడ్డు మర్గం, పెరెన్

రోడ్డు మర్గం, పెరెన్

చిత్ర కృప : Amos Teo

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X