» »ఆహ్లాదపరిచే కసౌలి ప్రకృతి అందాలు !!

ఆహ్లాదపరిచే కసౌలి ప్రకృతి అందాలు !!

Written By:

హిల్ స్టేషన్ : కసౌలి

జిల్లా : సోలన్

రాష్ట్రం : హిమాచల్ ప్రదేశ్

కసౌలి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్ జిల్లాలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి సుమారు 1800 అడుగుల ఎత్తులో కలదు. ఈ ప్రదేశం గురించి రామాయణ కావ్యంలో పేర్కొనబడింది. అదేమిటంటే, హిందువుల ఆరాధ్య దైవం ఆంజనేయస్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చేటప్పుడు ఈ ప్రదేశంలో అడుగు పెట్టాడని చెబుతారు.

ఇది కూడా చదవండి : చంబా - ఉత్తర భారతదేశంలో అత్యుత్తమ ప్రదేశం !!

కసౌలి అనే ప్రదేశానికి ఆ పేరు అక్కడ గల కౌసల్య జలపాతం నుండి వచ్చింది. ఇది కసౌలి మరియు జాబలి ప్రదేశాల మధ్య కలదు. కసౌలి అందమైన ప్రకృతి అందాల మధ్య కలదు. ఇక్కడ చూడవలసిన కొన్ని ప్రధాన ఆకర్షణలను ఒకసారి పరిశీలిస్తే ..

దాగ్శై

దాగ్శై

డాగ్శై ప్రదేశం సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తున శివాలిక్ కొండల దిగువ భాగంలో కలదు. ఈ ప్రదేశం బ్రిటిష్ వారు రాక ముందు పాటియాలా మహారాజ్ పాలనలో వుండేది. ఇక్కడ కల రోమన్ కాథలిక్ చర్చి మరియు బ్రిటిష్ సైనికుల సమాధులు కొన్నిఆకర్షణలు.

చిత్రకృప : Pankajchib2507

మంకీ పాయింట్

మంకీ పాయింట్

కసౌలి టవున్ లోని బస్సు స్టాండ్ నుండి 4 కి.మీ.ల దూరం లో అత్యధిక ఎత్తు లో మంకీ పాయింట్ కలదు. ఈ ప్రదేశం నుండి సట్లేజ్ రివర్, హన్దిగర్ మరియు మంచుతో నిండిన హిమాలయ దిగువ ప్రాంత చూర్ చాంద్ ని శిఖరం వంటివి చక్కగా చూడవచ్చు.

చిత్రకృప : Koshy Koshy

బాబా బోలాక్ నాథ్ టెంపుల్

బాబా బోలాక్ నాథ్ టెంపుల్

బాబా బాలక నాథ్ టెంపుల్ ఒక గుహ దేవాలయం. కసౌలి కి సుమారు ౩ కి.మీ.ల దూరం లో గార్నర్ కొండపై వుంటుంది. కసౌలి లో ప్రసిద్ధి గాంచిన మత పర ప్రదేశం. ఈ టెంపుల్ లో హిందువుల దేముడు శివుడి గొప్ప భక్తుడైన బాబా బాలక నాథ్ ఉంటాడు.

చిత్రకృప : Harvinder Chandigarh

బాప్టిస్ట్ చర్చి

బాప్టిస్ట్ చర్చి

బాప్టిస్ట్ చర్చిని బ్రిటిష్ వారు 1923 లో అందమైన ఇండియా మరియు గోతిక్ శిల్ప శైలిలో నిర్మించారు. ఈ చర్చి ఎంతో పురాతనమైనది. ప్రకృతి ఒడిలో కలదు. ఇక్కడ కల ప్రశాంత వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది.

చిత్రకృప : ßlåçk Pærl

క్రిస్ట్ చర్చి

క్రిస్ట్ చర్చి

క్రిస్ట్ చర్చి టవున్ లోని ఒక ప్రసిద్ధ మత పర సంస్థ. మాల్ రోడ్ లో కలదు. 1884 లో నిర్మించిన ఈ చర్చి గోతిక్ శిల్ప శైలి లో వుంటుంది. ఈ చర్చి సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్, బార్నబాస్ ల గౌరవార్ధం నిర్మించారు. హిల్ టవున్ లో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.

చిత్రకృప : Ankit Jain

గురుద్వారా శ్రీ గురు నానక్ జి

గురుద్వారా శ్రీ గురు నానక్ జి

గురుద్వారా శ్రీ గురు నానక్ జి ఒక పురాతన సిక్కుల మతపర కేంద్రం. ఈ గురుద్వారా మందిరంలో ప్రతి ఆదివారం ఒక ప్రోగ్రాం నిర్వహిస్తారు. దాని తర్వాత కారా అనే ప్రసాదాన్ని పంచిపెడతారు. ఈ గురుద్వారా లో వసతి సదుపాయాలూ కూడా కలవు.

చిత్రకృప : Harvinder Chandigarh

గూర్ఖా ఫోర్ట్

గూర్ఖా ఫోర్ట్

గూర్ఖా కోట సముద్ర మట్టానికి 1437 మీటర్ల ఎత్తున సుబతు కంటోన్మెంట్ టవున్ లో కలదు. దీనిని గూర్ఖాలు 19 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ కోటలో సుమారు 180 సంవత్సరాల నాటి ఫిరంగులు కలవు. సుబాతులో ఇపుడు 14 గూర్ఖా ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ లు కలవు.

చిత్రకృప : Sgt. Michael J. MacLeod

కసౌలి బ్రూవరీ

కసౌలి బ్రూవరీ

కసౌలి బ్రూవరిని 1820 లలో ఎడ్వర్డ్ డయ్యర్ నిర్మించారు. ఇది ప్రపంచం లోనే అత్యధిక ఎత్తులో అంటే సముద్ర మట్టానికి సుమారు 6000 అడుగుల ఎత్తున నిర్మించారు. ఇది ఆసియ లోనే పురాతన డిస్టిలరీగా పేరు గాంచింది.

చిత్రకృప : Fibonacci100

కృష్ణ భవన్ మందిర్

కృష్ణ భవన్ మందిర్

కృష్ణ భవన్ మందిర్ టవున్ మధ్యలో కల ఒక అందమైన దేవాలయం. దీనిలో కృష్ణ విగ్రహం వుంటుంది. ఈ టెంపుల్ వాస్తు శాస్త్ర కు అనుగుణంగా నిర్మించ బడింది. ఆనాటి పాలకులు, నిపుణులు, శిల్పులు, సహాయకులు కలసి దీనిని నిర్మించారు.

చిత్రకృప : Jashprithwish wikimedia

కసౌలి ఎలా చేరుకోవాలి ?

కసౌలి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : 59 కి.మీ. ల దూరంలో చందిఘాట్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. ఇక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని కసౌలి చేరుకోవచ్చు.

రైలు మార్గం : 40 కి.మీ. ల దూరంలో కలకా రైల్వే స్టేషన్ కలదు. స్టేషన్ బయట టాక్సీ లేదా ప్రభుత్వ బస్సులలో ఎక్కి కసౌలి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం : కసౌలి చేరుకోవటానికి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ప్రభుత్వ, ప్రవేట్ బస్సులు కలవు. ఢిల్లీ, శ్రీనగర్ తదితర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి బస్సులు వస్తుంటాయి.

చిత్రకృప : Ankit Jain

Please Wait while comments are loading...