Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ కలలో ఆపిల్ కనిపిస్తే మగపిల్లాడు, బెండకాయ కనిపిస్తే...

ఇక్కడ కలలో ఆపిల్ కనిపిస్తే మగపిల్లాడు, బెండకాయ కనిపిస్తే...

సంతాన సాఫల్యాన్ని కలిగించే సింస్సామాత దేవాలయానికి సంబంధించిన కథనం.

మన భారత దేశంలో అనేక మహిమాన్విత దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానిది ఒక్కొక్క ప్రత్యేకత. అందుకే భారత దేశ సంస్కతి సంప్రదాయాల్లో ఆలయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అదే విధంగా హిందూ సంప్రదాయంలో వివాహం కూడా ఒక భాగం. వివాహం తర్వాత పిల్లలు కలగక పోతే ఆ దంపతుల బాధ వర్ణనాతీతం. అందుకే వివాహం అయ్యి పిల్లలు కలగని వారు చాలా మంది వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి తమకు సంతానం కలిగించాలని ఆ దేవుడిని వేడుకొంటూ ఉంటారు. అటు వంటి కోవకు చెందిన ఓ దేవాలయం గురించిన పూర్తి వివరాలు మీ కోసం...

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

ఈ దేవాలయంలో పూజలు కూడా చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక రోజు పాటు నిద్రిస్తే చాలు మహిళలు కలుగుతారని నమ్ముతారు. ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష ఉదాహరణలు కూడా ఎన్నో ఉన్నాయి.

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
దీనిని మూడ నమ్మకంగా కొట్టేసిన వారు కూడా ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనల అనంతరం తమ అభిప్రయాన్ని మార్చుకున్నారు. అంతేకాకుండా వారే ఈ దేవాలయ మహత్త్యం గురించి మిగిలిన వారికి కూడా చెబుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
ఈ దేవాలయం హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాల్లో లడ్ బరోల్ అనే చిన్న పట్టణం శివారులోని సిమాస్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం సమ్సా. ఈ దేవతను ధాత్రి పేరుతో కూడా స్థానికులు పూజిస్తూ ఉంటారు.

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
కేవలం హిమాచల్ ప్రదేశ్ లోనే కాకుండా చుట్టు పక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ సిమ్సా దేవతను పూజించేవారు ఉన్నారు. ముఖ్యంగా దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ దేవాలయాన్ని దర్శించేవారి సంఖ్యల ఎక్కువగా ఉంటుంది.

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
ఆ సమయంలో హర్యాణ, చండీఘడ్, పంజాబ్ నుంచి కూడా పిల్లలు లేని వారు ఎక్కువ సంఖ్యలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. వారు ఆ సమయంలో ఒక రోజురాతరి ఈ దేవాలయంలోని నేల పై నిద్రిస్తారు.

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
దేవత పై నమ్మకంతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించిన వారికి ఈ సిమ్సా దేవత కలలో కనిపిస్తుందని చెబుతారు. అంతే కాకుండా కలలో పువ్వును కానుకగా స్వీకరించి త్వరలో నీకు సంతానం యోగం కలుగుతుందని చెబుతుంది.

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

సిమ్సా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
అంతేకాకుండా అదే కలలో మగపిల్లాడు పిడుతాడా? లేక ఆడపిల్ల పుడుతుందా అన్న విషయం కూడా కొన్ని సూచనల ద్వారా ఇక్కడి అమ్మవారు చెబుతుంది. కలలో ఆపిల్ కనిపిస్తే మగపిల్లాడు, బెండకాయి కనిపిస్తే ఆడపిల్ల పుడుతుందని చెబుతారు.

<strong></strong>రావణాసురుడు తన తలలను తెగ నరుక్కొన్నది ఇక్కడే...రావణాసురుడు తన తలలను తెగ నరుక్కొన్నది ఇక్కడే...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X