Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశపు బాణాసంచా రాజధాని .. శివకాశి !

భారతదేశపు బాణాసంచా రాజధాని .. శివకాశి !

శివకాశి అనగానే అందరికీ గుర్తొచ్చేది బాణాసంచా. ఇది తమిళనాడు రాష్ట్రంలోని విదురునగర్ జిల్లాలో కలదు. రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటైన కాశి విశ్వనాథ స్వామి ఆలయం ఉన్నది.

By Mohammad

శివకాశి అనగానే అందరికీ గుర్తొచ్చేది బాణాసంచా. ఇది తమిళనాడు రాష్ట్రంలోని విదురునగర్ జిల్లాలో కలదు. రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటైన కాశి విశ్వనాథ స్వామి ఆలయం ఉన్నది. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు కాశి నుండి శివలింగాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుండి ఈ ప్రదేశం శివకాశి గా వాడుకలోకి వచ్చింది.

మీరు చూడని మదురై ... పురాతన చిత్రాలలో !

శివకాశి చరిత్ర 600 ఏళ్ల క్రితం నాటిది. పాండియన్ రాజు ఈ ప్రాంతాన్ని పాలించాడు. అయినా గొప్ప శివభక్తుడు. ఉత్తర భారత యాత్ర లో భాగంగా కాశి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని, వెంట శివలింగం తీసుకొని వచ్చి ప్రతిష్టించాడు. ఆ శివలింగం ప్రాంతమే నేడు విశ్వనాథ స్వామి దేవాలయంగా భక్తులతో, పర్యాటకులతో కిటకిటలాడుతున్నది. శివకాశి చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రధాన ఆకర్షణ విషయానికి వస్తే... !

పరిశ్రమలు

పరిశ్రమలు

శివకాశి పాఠకులకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ బాణాసంచా పరిశ్రమలు, అగ్గిపెట్టె పరిశ్రమలు స్థానికులకు జీవనోపాధిని కల్పిస్తున్నాయి. దేశంలో మొత్తం మీద శివకాశి పటాకులు, అగ్గిపెట్టెలు ఎగుమతి అవుతాయి.

చిత్రకృప : Mathanagopal

 నేన్మేని గ్రామం

నేన్మేని గ్రామం

శివకాశి కి 9 కి. మీ ల దూరంలో నేన్మేని గ్రామం కలదు. ఇక్కడ ప్రవహించే నది వైప్పారు. వరిపంటలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి. కానీ ఇప్పుడు పక్షి ప్రేమికులను కూడా ఆకర్షితున్నది. సీజన్ ల ప్రకారం వచ్చే వలస పక్షలు ఈ ప్రాంతవాసులు, ఇక్కడికి వచ్చే పర్యాటకులను కనువిందు చేస్తుంటాయి.

చిత్రకృప : Kalyanvarma

శ్రీ భద్రకాళీ అమ్మన్ టెంపుల్

శ్రీ భద్రకాళీ అమ్మన్ టెంపుల్

శ్రీ భద్రకాళీ అమ్మన్ ఆలయం శివకాశి లో ప్రసిద్ధి చెందినది. రాష్ట్రంలోని ఎత్తైన రాజగోపురాలలో ఇది ఒకటి. గర్భగుడిలో బంగారు విగ్రహ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శమిస్తారు.

చిత్రకృప : Ssriram mt

పరాశక్తి మారియమ్మన్ గుడి

పరాశక్తి మారియమ్మన్ గుడి

పరాశక్తి మారియమ్మన్ ఆలయం ఉత్సవాలకు ప్రసిద్ధి మరియు యాత్రాస్థలం. ఇక్కడ పంగుని ఉత్తిరమ్ వేడుకలు బాగా జరుగుతాయి. ఈ వేడుకలను సుమారు 21 రోజులు లేదా నెలంతా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహిస్తారు.

చిత్రకృప : Ser Amantio di Nicolao

తిరుతంగల్ కోవిల్

తిరుతంగల్ కోవిల్

తిరుతంగల్ ఆలయం విష్ణుభగవానుని 180 దివ్య ఆలయాలలో ఒకటి. ఇందులో విష్ణుమూర్తి కాంస్య విగ్రహం దర్శనం ఇస్తుంది. పాండ్యుల కాలంలో కట్టించిన ఈ దేవాలయాన్ని క్రీ.శ. 10 వ శతాబ్దంలో నాయక్ ల కాలంలో పునర్నిర్మించారు.

చిత్రకృప : Ssriram mt

పిలవక్కల్ ఆనకట్ట

పిలవక్కల్ ఆనకట్ట

పిలవక్కల్ ప్రసిద్ధ విహార స్థలం. ఇక్కడ వినోదాలతో నిండి ఉన్న పిల్లల పార్క్ సైతం ఉన్నది. డ్యామ్ లో బోట్ షికారు చేయటానికి పర్యాటకశాఖ వారు అనుమతిస్తారు.

చిత్రకృప : Sthang

కాశి విశ్వనాథ ఆలయం

కాశి విశ్వనాథ ఆలయం

కాశి విశ్వనాథ ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందినది. మధురై పాలకుడు అయిన హరికేసరి పరాక్రమ పాండియన్ కాశి నుండి తీసుకొచ్చిన పవిత్ర లింగాన్ని ఇక్కడ ప్రతిష్టించాడు. ఆలయం వద్ద జాతరలు, ఊరేగింపులు, ఉత్సవాలు జరుపుతారు.

చిత్రకృప : Ssriram mt

అయ్యనార్ జలపాతం

అయ్యనార్ జలపాతం

శివకాశి కి సమీపంలో ఉన్న రాజపాలయం కు పశ్చిమ దిక్కున 12 కి. మీ ల దూరంలో ఈ జలపాతం ఉన్నది. పశ్చిమ కనుమల్లో పుట్టిన ఈ జలపాతం 15 అడుగుల ఎత్తు నుండి కింద పడుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. సమీపంలో ఉన్న అయ్యనార్ దేవాలయం చూడదగ్గది.

చిత్రకృప : tamilnadu tourism

తిరువల్లిపుత్తూర్ ఆండాళ్ కోవిల్

తిరువల్లిపుత్తూర్ ఆండాళ్ కోవిల్

తిరువల్లిపుత్తూర్ ఆండాళ్ కోవిల్ శివకాశి కి 20 కి. మీ ల దూరంలో కలదు. ఇది దేశంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. శ్రీరంగం లో ఉన్నట్లుగా ఇక్కడ అరయర్ సేవ ఉంది.

చిత్రకృప : Ssriram mt

తిరుచులి

తిరుచులి

తిరుచులి శివకాశి కి సమీపాన ఉన్నది. ఇక్కడ తిరుమేనినాథ స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. అంతేకాదు ప్రముఖ సెయింట్ రమణ మహర్షి పుట్టిన స్థలం కూడా ఇదే!

చిత్రకృప : chennaitian

సత్తూర్

సత్తూర్

సత్తూర్ పూర్వ నామం సతనూర్. ఇది అయ్యానార్ టెంపుల్ లేదా సతురప్పన్ కోయిల్ కు ప్రసిద్ధి చెందినది మరియు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నది.

చిత్రకృప : Mathanagopal

వెంబకొట్టై

వెంబకొట్టై

వెంబకొట్టై శివకాశి సరిహద్దులో ఉన్న రిజర్వాయర్. దీని చుట్టూ ఉద్యానవనాలు, పిల్లలు ఆడుకోవటానికి పార్కులు ఉన్నాయి. సాయంత్రంవేళ స్థానికులు పిక్నిక్ కు వస్తుంటారు. బోటింగ్ సౌకర్యం కూడా కలదు.

చిత్రకృప : Srinivasan KB

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

వెంకటాచలపతి ఆలయం, కుల్లూర్ సందై రిజర్వాయర్, ముథలియర్ ఒత్తు, కచకర అమ్మన్ కోయిల్, పెరుమాళ్ కోయిల్ మొదలగునవి చూడదగ్గవి.

చిత్రకృప : Pragadeeshraja

హోటళ్ళు

హోటళ్ళు

శివకాశి లో పర్యాటకులు స్టే చేయటానికి హోటళ్లు, లాడ్జీలు, డార్మిటాలజీ లు ఉన్నాయి. తమిళ సంప్రదాయ వంటకాలను రుచి చూడవచ్చు.

చిత్రకృప : Ryan

రవాణా సదుపాయాలు

రవాణా సదుపాయాలు

విమాన మార్గం : సమీపాన 70 కి. మీ ల దూరంలో మధురై విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి శివకాశి చేరుకోవచ్చు. ఇక్కడికి దేశంలో వివిధ ప్రాంతాల నుండి విమానాలు వస్తుంటాయి.

రైలు మార్గం : శివకాశి లో రైల్వే స్టేషన్ కలదు. చెన్నై, తిరునల్వేలి, మధురై, కన్యాకుమారి తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లు స్టేషన్ లో ఆగుతాయి.

రోడ్డు మార్గం : మధురై, చెన్నై, తిరునల్వేలి మొదలగు ప్రాంతాల నుండి శివకాశి కి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X