Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడులోని ఆరు దివ్య మురుగన్ క్షేత్రాలు !

తమిళనాడులోని ఆరు దివ్య మురుగన్ క్షేత్రాలు !

By Mohammad

శివ పార్వతుల రెండవ కుమారుడైన కుమారస్వామి కి మహా దేశంలో ఆలయాలకు కొదువలేదు. కుమార స్వామి కి గల ఇతర పేర్లు "సుబ్రమణ్య స్వామి", "మురుగన్". తమిళనాట కుమార స్వామి ని మురుగన్ అని పిలుస్తారు, పూజిస్తారు. మురుగన్ అంటే మేనల్లుడు అని అర్థం. విష్ణువుకు మేనల్లుడు కనుక స్వామి ని మురుగన్ గా కొలుస్తారు.

ఇది కూడా చదవండి : పెళ్లికాని వారికి 'కళ్యాణ క్షేత్రాల' పర్యటన!

తమిళనాట మురుగన్ ఆలయాలకు, అలాగే శివ దేవాలయాలకు కొదువలేదు. ఈ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆరు మురుగన్ క్షేత్రాలు ఉన్నాయి. వీటిని 'అఱుపడై వీడుగళ్' అని పిలుస్తారు. అవేంటో, ఎక్కడ ఉన్నాయో చూసొద్దాం పదండీ ..!

తిరుచెందూర్

తిరుచెందూర్

తిరుచెందూర్ క్షేత్రం తిరునల్వేలి కి 60 km ల దూరములో కలదు. కుమార స్వామి ఇక్కడ బాలుని రూపంలో దర్శనమిస్తాడు. ఎక్కడా లేనివిధంగా స్వామి వారు తిరుచెందూర్ లో సముద్ర తీరాన కొలువై ఉన్నాడు. ఈ టెంపుల్ లో మురుగన్ తో పాటు అతని భార్యలు అయిన వల్లి మరియు దేవసేన లు కూడా కొలువు తీరి వుంటారు.

చిత్ర కృప : vaikundaraja.s

తిరుప్పరంకుండ్రం

తిరుప్పరంకుండ్రం

ఈ క్షేత్రంలో సుబ్రమణ్య స్వామి, ఇంద్రుని కుమార్తె దేవయాని(దేవసేన) తో వివాహం జరిగింది. మధురై కి 5 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇక్కడి ప్రత్యేకత స్వామి వారు కూర్చొని దర్శనం ఇవ్వడం. మిగితా అన్ని చోట్ల స్వామి వారి నిలబడి ఉండే ప్రతిమలే దర్శనమిస్తాయి.

చిత్ర కృప : Ssriram mt

పరముదిర్చొలై

పరముదిర్చొలై

పరముదిర్చొలై క్షేత్రం మధురై కు 24 కిలోమీటర్ల దూరంలో కొండ మీద కలదు. ఇక్కడ కుమారా స్వామి చిన్నతనంలో ఆడుకొనేవారని ప్రతీతి. మాత కూడా ఇక్కడే ఉండేదని చెబుతారు.

చిత్ర కృప : Raji.srinivas

పళని

పళని

మధురై కి 120 కిలోమీటర్ల దూరంలో పళని మురుగన్ ఆలయం కలదు. మిగితా 5 సుబ్రమణ్య క్షేత్రాల కన్నా ఇది మహిమకలదని భక్తుల భావన. ఇక్కడ స్వామి వారు కౌపీనంతో కనపడతారు. పళని అంటే జ్ఞానం ఇచ్చే క్షేత్రం. ప్రఖ్యాత కావిడి ఉత్సవం మొదలైంది ఇక్కడే.

చిత్ర కృప :Ranjithsiji

స్వామిమలై

స్వామిమలై

స్వామిమలై క్షేత్రం కుంభకోణం సమీపంలో 8 km ల దూరంలో కలదు. స్వామిమలై అంటే దేవుని పర్వతం అని అర్థం. ఇక్కడ ప్రణవ రహస్యాన్ని శివుడికి చెప్పాడట మురుగన్.

చిత్ర కృప : Ravichandar84

తిరుత్తణి

తిరుత్తణి

మురుగా భక్తులకు తిరుత్తణి ఒక పవిత్ర భూమి. ఈ క్షేత్రంలో స్వామీ వారు వల్లీ దేవసేన సహితంగా కొలువయ్యారు. స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి కటాక్షిస్తాడని, అందుకే ఈ క్షేత్రానికి తిరుత్తణి అనే పేరొచ్చిందని అంటారు. దీనికి చెన్నై సమీప రైల్వే స్టేషన్.

చిత్ర కృప : రవిచంద్ర

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X