Search
  • Follow NativePlanet
Share
» »రూప్ కుండ్ - ఆస్థి పంజరాల సరస్సు !

రూప్ కుండ్ - ఆస్థి పంజరాల సరస్సు !

By Mohammad

భారతదేశంలో ఏదైనా ఒళ్ళు జలదరించే ప్రదేశం ఉందా ? అంటే అది రూప్ కుండ్. ఇదొక సరస్సు. హిమాలయాలలో ఉంటుంది. ఇక్కడికి వెళితే ఎవ్వరికైనా ఒళ్ళు గగుర్పొడుతుంది. ఇక్కడ రాత్రుళ్ళు ఎవ్వరూ నివసించరు. సరే మీ ఇష్టం మీకు వెళ్లాలని ఆసక్తిగా ఉంటె ఉదయం పూట వెళ్లిరండి ! ఇంతకీ ఇది ఎక్కడ ఉంది ? ఎలా చేరుకొవాలి ?

ఇది కూడా చదవండి : హిమాలయాల్లో అంతుచిక్కని రహస్యాలు !

హిమాలయాలలో

హిమాలయాలలో

రూప్ కుండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న మంచు సరస్సు. ఈ సరస్సు హిమాలయాలలో దాదాపు 5000 మీటర్ల ఎత్తులో కలదు. ప్రస్తుతం ఇది ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నది.

చిత్ర కృప : Schwiki

రూప్ కుండ్ చేరుకోవటానికి

రూప్ కుండ్ చేరుకోవటానికి

రూప్ కుండ్ చేరుకోవటానికి రెండు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా, అధిరోహణ మరియు సాహసాలు చేసేవారు రోడ్డు మార్గం ద్వారా లోహజంగ్ లేదా వాన్ ప్రయాణిస్తారు. అక్కడ నుండి, వాన్ వద్ద మిట్టను ఎక్కుతారు మరియు రాణీ కీ ధార్ చేరతారు. అక్కడ కొంత బల్లపరుపు ప్రాంతం కూడా ఉంది, ఇక్కడ అధిరోహణ చేసేవారు రాత్రివేళలో బసచేయవచ్చు. ఒకవేళ ఆకాశం స్పష్టంగా ఉంటే, బెడ్ని బుగ్యల్ మరియు త్రిశూల్ చూడవచ్చును.

చిత్ర కృప : Schwiki

బెడ్ని బుగ్యల్

బెడ్ని బుగ్యల్

తరువాత బసచేసే ప్రాంతం బెడ్ని బుగ్యల్ వెళతారు. ఇది వాన్ నుండి 12-13 కి. మీ ఉంటుంది. గుర్రాలు, గొర్రెలు మరియు కంచరగాడిదల కొరకు అతిపెద్ద గడ్డి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ ఉన్న రెండు దేవాలయాలు మరియు ఒక చిన్న సరస్సు ఆ ప్రాంతం యొక్క అందాన్ని ఇనుమడింపచేస్తున్నాయి.

చిత్ర కృప : Schwiki

భాగువబాస

భాగువబాస

బెడ్ని బుగ్యల్ నుండి హిమాలయాల శిఖరాన్ని చూడవచ్చు. అధిరోహణ చేసేవారు అక్కడ నుండి భాగువబాస వరకూ వెళతారు, అది బెడ్ని బుగ్యల్ నుండి 10-11 కి. మీ ఉంటుంది. త్రిశూల్ మరియు 5000ల మీటర్ల కన్నా ఎత్తున్న ఇతర శిఖరాలను ఇక్కడ నుండి దగ్గరగా చూడవచ్చు. చుట్టూ ఉన్న పర్వతాల యొక్క ఏటవాళ్ళ మీద అనేక జలపాతాలను మరియు భూపాతాలను చూడవచ్చును.

చిత్ర కృప : Djds4rce

రూప్‌కుండ్

రూప్‌కుండ్

భాగువబాస నుండి, అధిరోహకులు రూప్‌కుండ్ వెళతారు లేదా శిలా సముద్రకు (శిలల సముద్రం) జునర్గాల్లి కోల్ పాస్ ద్వారా వెళతారు (ఇది సరస్సుకు కొంచం పైన ఉంటుంది) మరియు అక్కడ నుండి అధిరోహణాన్ని హొంకుండ్ వరకూ సాగిస్తారు.

చిత్ర కృప : Schwiki

త్రిశూల్

త్రిశూల్

రూప్‌కుండ్ అనేది హిమాలయాలలోని ఒక సుందరమైన మరియు అందమైన పర్యాటక కేంద్రం, ఇది రెండు హిమాలయాల పర్వత శిఖరాల అడుగున ఉంది, అవి త్రిశూల్ (7120 మీ) మరియు నంద్‌ఘుంగ్టి (6310 మీ).

చిత్ర కృప : Abhijith Shastry

అస్థిపంజర సరస్సు

అస్థిపంజర సరస్సు

సంవత్సరంలో చాలా భాగంలో అస్థిపంజర సరస్సు మంచుతో కప్పబడి ఉంటుంది. అయినప్పటికీ, రూప్‌కుండ్ కు వెళ్ళే ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. దారంతటా అన్ని వైపులా పర్వత శ్రేణులతో నిండి ఉంటుంది.

చిత్ర కృప : http://roopkund.com/

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

ఈ మానవ అస్థిపంజరాలు సైన్టిఫిక్ పరంగానే కాక పురాణ పరంగా కూడా వివరణ కలిగివున్నాయి. ధైర్యం గలవారు మాత్రమే ఈ సరస్సు వద్దకు వెళతారు. సరస్సు క్రీ.శ. 800-900 మధ్య కాలం నాటిదిగా చెబుతారు. అయితే ఇక్కడ అస్థిపంజరాలు ఎలా వచ్చాయో ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టడం లేదు.

చిత్ర కృప : Schwiki

సంప్రదాయ ఉత్సవం

సంప్రదాయ ఉత్సవం

బెడ్ని బుగ్యల్ యొక్క ఎత్తైన పచ్చిక బయళ్ళ వద్ద ప్రతి ఆకురాలు కాలంలో సమీపాన ఉన్న గ్రామాలు సంప్రదాయ ఉత్సవం జరుపుకుంటారు. రూప్‌కుండ్ వద్ద పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నందా దేవి రాజ్ జాట్ అనే అతిపెద్ద ఉత్సవం జరుగుతుంది.

చిత్ర కృప : Abhijeet Rane Follow

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X