Search
  • Follow NativePlanet
Share
» »నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

ఆంధ్ర ప్రదేశ్ లోని సిటీ ఆఫ్ పెంషెనర్స్ గా పేరొందిన సముద్రతీర ప్రాంతనగరం కాకినాడ కనుమరుగుకానుందా?కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం.

By Venkatakarunasri

ఆంధ్ర ప్రదేశ్ లోని సిటీ ఆఫ్ పెంషెనర్స్ గా పేరొందిన సముద్రతీర ప్రాంతనగరం కాకినాడ కనుమరుగుకానుందా?అమెరికాఅంతరిక్ష పరిశోధనాసంస్థ నాసా తాజాగా జరిపిన పరిశోధనలప్రకారం మన కాకినాడ త్వరలోనే సముద్రగర్భంలో కలిసిపోయి కనుమరుగుకానుంది. కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. న్యూయార్క్ నగరము మాదిరిగా వీధులు రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ, ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ మద్రాసు గానూ, చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ ముంబయి గానూ, పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్గా పేరొందినది. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి కాకినాడని ఆనుకొనే మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో కె.జి బేసిన్ రాజధానిగా విదేశాలలో ప్రాముఖ్యతని సంతరించుకొంటోంది.

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

కాకినాడ పేరు వెనుక ఇతిహాసం

కాకినాడ అనే పేరు వెనుక అనేక కథలు ఉన్నాయి. కాకినాడ పేరు మొదట కాకి నందివాడ అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడగా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పేరు కొకనాడగా చలామణి అయ్యింది.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

త్రేతాయుగంలో ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వనవాసం చేస్తున్న సీతను కాకి రూపంలో వేధించినపుడు రాముడు అతనిని సంహరించాడు, అతని పేరున ఈ వనమ్ వెలిసినది.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

ఇక్కడకి మొదట డచ్ వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత ఆంగ్లేయులు వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.తరువాత కెనడియన్‌ బాప్తిస్టు క్రైస్తవ మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు కాకినాడ నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కెనడ నగరాన్ని తలపించడంతొ వారు ఈ నగరాన్ని కోకెనడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా వాడుకలోకి వచ్చింది.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

బ్రిటీషువారి కాలంలో కాకెనాడ /కోకనాడ (Cocanada) గా పిలువబడి, స్వాతంత్ర్యం వచ్చాక పేరు కాకినాడగా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు బ్రిటిషు వారి పరిపాలన సమయంలో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకనాడ గానే ఉన్నాయి. ఉదాహరణ- కోకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జె ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు, భారతీయ రైల్వేవారి స్టేషను కోడ్లు - కాకినాడ పోర్టు - COA, కాకినాడ టౌన్ - CCT.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

ఈ ప్రాంతం చెఱువులు ఎక్కువగా ఉండి, అవి ఎర్రకలువ (కోకనదము) లతో నిండి ఉండేవని చరిత్ర చెబుతోంది. బిటీష్‌ వాళ్ళు మనదేశంలోకి కొత్తగా వచ్చిన రోజులలో ఇక్కడ పండే పంటల్నీ, విలువైన వస్తువుల్నీ తమ దేశానికి చేరవేసేందుకు రవాణా సౌకర్యం కలిగిన అనువైన ప్రదేశం కోసం గాలిస్తూండగా ఈ ప్రాంతం వారి దృష్టిలోకి వచ్చింది. సర్వే అధికారులు, పై అధికారులకు రిపోర్టు పంపిస్తూ ` ఇక్కడ కాకులు ఎక్కువగా ఉండటంతో ‘కాకులవాడ' అంటూ పేర్కొన్నారట! కాలక్రమంలో ‘కాకివాడ'గా, ‘కాకినాడ'గా మారిపోయింది!

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

హోప్ ఐలాండ్

కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ (హోప్ ద్వీపం) (వికీమాపియాలో హోప్ ఐలాండ్) చేత పరిరక్షింపబడుతున్నది. సముద్రపు (బంగాళా ఖాతము) ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

ఈ హోప్ ఐలాండ్ తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉంది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగల్గుతున్నాయి. మహాలక్ష్మీ పర్యాటకం, చొల్లంగిపేట వారి హోప్ ఐలాండ్ విహార యాత్ర మట్లపాలెంలో ఉంది.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

ప్రశాంతమయిన పరిసరాలు కలిగి ఉండడము చేత రాష్ట్రం నలు మూలల నుంచి రిటైర్డ్ ఉద్యొగులు ఎందరో వచ్చి కాకినాడలో స్థిరపడుతున్నారు. అందుకే ఈ నగరాన్ని "పెన్షనర్స్ ప్యారడైజ్" అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

అడ్డు ఆపు లేని నగరీకరణం వలన పర్యావరణం పైన విపరీతమైన భారం కలిగి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో పరిస్థితి భరించలేని రీతిలో ఉంది. చెట్లు విపరీతంగా నరకడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

గ్లోబల్ వార్మింగ్ కారణంగా అంటార్కిటికాలోమంచు ఫలకాలు కరిగి ప్రపంచంలోని 240ప్రధాన పోర్ట్ నగరాలకు ముప్పుందని నాసా హెచ్చరించింది. భారత్ లోని ముంబాయ్,మంగళూర్ నగరాలతో పాటు కాకినాడ కనుమరుగుకావటం ఖాయమని ఓ నివేదికలో తేల్చిజెప్పింది.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

భారతదేశంలో వ్యాపారావాణిజ్యాలకు కేంద్రప్రాంతంగా నిలిచిన తీరప్రాంతాలు అతిత్వరలో కనుమరుగుకానున్నాయి.ఎప్పుడు ద్వాపరయుగంలో సముద్రగర్భంలో కలిసిపోయిన ద్వాపరనగరానికి మాదిరిగా అతిత్వరలో మరెన్నో నగరాలు జలసమాధి కానున్నాయి.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

ఇవి పుక్కిటిపురాణాలో,కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాలో కావు. 100కి 100పాళ్ళు శాస్త్రీయపరిశోధనల ఆధారంగా చెబుతున్న వాస్తవం. అమెరికా అంతరిక్షపరిశోధనాసంస్థ నాసాచేసిన వాదనలలో భారత తీరప్రాంత నగరాలు సముద్రంలో కలవనున్నాయని స్పష్టంగా తేలింది.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

వ్యాపారవాణిజ్యాలకు కేంద్రబిందువులుగా చెప్పుకుంటున్న ముంబాయ్, మంగళూరు, కాకినాడ నగరాలు అతిత్వరలో జలఖడ్గ ప్రవాహానికి బలికాకతప్పదని నివేదికలు చెబుతున్నాయి.దీంతో ఆయా నగరాలు ముంపు భయంతో వణికిపోతున్నాయి.గ్లోబల్ వార్మింగ్ కారణంగా అంటార్కిటికాఖండంలోని అతిభారీ మంచుఫలకాలు వేగంగా కరుగుతున్నాయి.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

ఈ కరిగిన మంచు పెద్దఎత్తున సముద్రాల్లోకి వచ్చిచేరుతోంది.దీంతో సముద్రాలనీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.అతిత్వరలోనే ఇది ప్రమాద స్థాయికి చేరనున్నట్లు నాసా అంచనా వేస్తోంది.దీని వల్ల ప్రపంచంలోని 293ప్రధాన పోర్టునగరాలకు ముప్పువాటిల్లనున్నట్లు తెలిసింది.నాసా ఈ మధ్యే GFMగా పిలుస్తున్న గ్రేడియంట్ ఫింగర్ ప్రింట్ మాపింగ్ అనే ఒక కొత్తపరికరం కనిపెట్టింది.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

దానిద్వారా ఏ ఏ ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా వుండబోతోందని అంచనావేస్తోంది.గ్రీన్ లాండ్, అంటార్కిటికాలో మంచుశిలలు కరిగిపోతే న్యూయార్క్, లండన్, ముంబైలాంటి మహానగరాలకు వాటిల్లే ముప్పుకంటే కర్ణాటకలోని తీరప్రాంతనగరం మంగళూరుకే ఎక్కువగా ముంపు పొంచివుందనితెలిసింది.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

ఇప్పటికేకాకినాడలోని ఉప్పాడలో సముద్రం ముందుకొస్తున్నసంగతి తెలిసిందే. భారతతీర ప్రాంతాలకు ముప్పు వెంటనే రావచ్చులేదా ఆలస్యంగా రావచ్చు. కాని ఎప్పటికికైనా ముంపుప్రమాదం తప్పదని తెలిపింది.రానున్న వందేళ్ళలో సముద్రమట్టం ఎంతస్థాయిలో పెరగనుందో పరిశోధకులు అంచనావేసినట్లు చెప్పింది.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

రానున్నరోజుల్లో కాకినాడలో 17.16సెం.మీలు,మంగళూరులో 15.98సెం. మీలు.ముంబైలో 15.26, న్యూయార్క్ లో 10.65సెం. మీలచొప్పున సముద్రమట్టం పెరుగుతోందని పేర్కొంది.కరాచీ, చిట్టగాంగ్, కొలంబో పట్టణాలకు కూడామునిగిపోయే ప్రమాదం వుందని నాసాహెచ్చరిస్తోంది. క్రమేణా పెరిగే నీటిమట్టాలవల్ల ఈ తీరప్రాంత నగరాలు కనుమరుగయ్యేప్రమాదం పొంచివున్నట్లు స్టడీ వివరించింది.

PC:youtube

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

ఎలా వెళ్ళాలి?

రైలు సదుపాయం

కాకినాడ మిగిలిన పట్టణాలతో సామర్లకోట -కాకినాడ లూప్-లైన్ ద్వారా కలుపబడి ఉంది. కాకినాడ స్టేషనులలో రైలుబళ్ళన్నీ కాకినాడ నుండే బయలుదేరుతాయి. కాకినాడ నగరంలో నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాకినాడ పోర్ట్, కాకినాడ న్యూపోర్ట్, కాకినాడ టౌన్, సర్పవరం. ఇందులో కాకినాడ పోర్ట్ స్టేషను పూర్తిగా గూడ్స్ బళ్ళకు కేటాయించబడింది. కాకినాడ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి 564 కి మీ ల దూరంలో ఉంది.

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

చెన్నై - కోల్కతా రైలు మార్గంలో సామర్లకోట దగ్గర బండి మారాలి. ఈ మార్గంలో వెళ్లే బళ్ళలో సుమారుగా అన్నీ సామర్లకోట వద్ద ఆగుతాయి. సామర్లకోట నుండి కాకినాడ ప్రధాన బస్టాండ్ కి ఆం.ప్ర.రా.రో.ర.సం బస్సులు అన్ని వేళలా ఉంటాయి. దూరం 10 కి.మీ.ప్రస్తుతం హైదరాబాదు, చెన్నై (మద్రాసు), షిర్ది, ముంబాయి, బెంగుళూరు లకు నేరుగా రైలు సదుపాయముంది.

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

రోడ్డు సదుపాయం

214 నెంబరు జాతీయ రహదారి నగరం గుండా పోతుంది. రాజమండ్రి, జిల్లాలోని ఇతర పట్టణలను కలుపుతూ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. కాకినాడ ఓడరేవు, శివారు పారిశ్రామిక ప్రాంతాలైన వాకలపూడి, వలసపాకల, సామర్లకోట, పెద్దాపురం లను 5వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానిస్తూ ఆసియా అభివృద్ధి బ్యాంకు (Asian Development Bank) నిధులతో నిర్మించిన ADB రోడ్డు ఉంది.

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

కాకినాడ నుండి ద్వారపూడి, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, ఖమ్మం మీదుగా సూర్యాపేటకి పోయే రాష్ట్ర రహదారిని, జాతీయ రహదారిగా గుర్తించి, నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలున్నాయి. ఇవే కాకుండా, విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, కాకినాడ నుండి విశాఖపట్నం వరకూ, సముద్ర తీరం వెంబడి నాలుగు-ఆరు వరుసల రహదారిని నిర్మించే ప్రతిపాదన ఉంది.

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

విమాన సదుపాయం

కాకినాడకు 65 కి మీ దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంది. ఇది చెన్నై, హైదరాబాద్, విజయవాడ, బెంగుళూర్ లకు విమానయాన సేవలను కలిగి ఉంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, జెట్ ఎయిర్ వేస్ మరియు స్పైస్ జెట్ ఇక్కడ ఆపరేటింగ్ ఎయిర్ లైన్స్.

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

నాసా హెచ్చరిక.. కనుమరుగు కానున్న కాకినాడ !

ఇతర సమీప ప్రధాన విమానాశ్రయం కాకినాడ నుండి 145 కి మీ దూరంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, పిఠాపురం వద్ద కార్గో రవాణా కోసమై మరో విమానాశ్రయాన్ని నిర్మించే ప్రతిపాదనలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X