Search
  • Follow NativePlanet
Share
» »మహిళలూ ఒంటరి ప్రయాణమా?

మహిళలూ ఒంటరి ప్రయాణమా?

ప్రపంచం అంతా మహిళలు పర్యటనకు, కొత్త ప్రదేశాల అన్వేషణకు మక్కువ చూపుతారు. కాని వారి ట్రావెల్ ఆసక్తి అడ్డగిస్తూ అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే, కొద్దిపాటి జాగ్రత్తలతో వారు చేసే ట్రావెల్ ఎంతో తేలిక, ఆనందం అని అనుభవాలు చెపుతాయి. ఎనిమిది సంవత్సరాల వయసు నుండి ఎనభై సంవత్సరాల వయసు వరకు మహిళా పర్యాటకులు ప్రపంచం లోని కొత్త ప్రదేశాలను అన్వేషించేందుకు ఇష్ట పడతారు. మరి ఏ ఆటంకం లేని సురక్షితమైన, ఆనందించ దాగిన పర్యట నలకోసం వారు కొన్ని జాగ్రత్తలు పాటించ వలసి వుంది. అవి ఏమిటో పరిశీలిద్దాం.
ఇండియాలో మహేళా పర్యాటకులు దేశం అంతా పర్యటించేందుకు కొంత అసాధారణ బలం, ధైర్యం పొందాలి. దీనికి కారణం, వారిని అడ్డగించే పురుషులు, సామాజిక కట్టుబాట్లు. ఏ కష్టం అయినా సరే ఎదురొడ్డి నిలిచేలా వుండాలి. అందుకు గాను కొన్ని చిట్కాలు దిగువ పేర్కొంటున్నాం చూడండి.

మహిళలకు ట్రావెల్ చిట్కాలు !

మహిళలకు ట్రావెల్ చిట్కాలు
సొమ్ము వ్యహారాలు

మీ ట్రావెల్ కు మనీ అవసరం ఎంతో వుంది. మహిళలు, ఒంటరి ప్రయాణంలో వున్నా లేక ఒక గ్రూప్ లో వున్నా సరే వారి మనీ పర్స్ పట్ల జాగ్రత్త వహించాలి. ఈ చర్య అనేక ఇబ్బందుల నుండి కాపాడుతుంది.

ప్రయాణ వాహనం

మహిళలు పర్యటించే ముందు సరైన ప్రయాణ వాహనం అంటే, బస్సు, రైల్, విమానం మొదలైనవి ముందస్తుగా ఎంపిక చేసుకోవాలి. వాటి వేళల గురించి తెలుసుకోవాలి. వీలైతే, టికెట్ లు అడ్వాన్సు బుకింగ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ జర్నీ లో ఒంటరిగా ప్రయాణిస్తూ వుంటే, మరొక మహిళ సహకారం పొందాలి.

సరైన దుస్తులు ధరించండి

పర్యటనలో మహిళలు ధరించే దుస్తులు వారి కదలికలకు అనుకూలంగా వుండాలి. జర్నీ అంతా సౌకర్యంగా భావించాలి. బిగువైన, పొట్టి దుస్తులు వదలటం మంచిది. స్కార్ఫ్ వంటి బట్టను వెంట ఉంచుకోండి.

పురుషులతో వ్యవహారం

పురుషులతో వ్యవహరించేటపుడు, ధైర్యంగా, విశ్వాసంగా వ్యవహరించండి. మొదటి సారి ఒంటరిగా ప్రయాణించే మహిళలకు సమస్యగా వుంటుంది. కాని వారు ఆత్మ విశ్వాసంతో వ్యవహరించాలి. ఆగంతకులను దూరంగా వుంచండి. ప్రపంచంలో జరిగే విషయాలను తెలుసుకుంటూ తెలియని వారిని దూరంగా వుంచండి. ఎంతో అవసరం అయితే తప్ప మీ వ్యక్తి గత సమాచారం వెల్లడించ వద్దు.

లగేజ్ తక్కువ

ఇండియా లో మహిళలు అధిక లగేజ్ ప్లాన్ చేస్తారు. ఇది మానుకోవాలి. తక్కువ లగేజ్ సౌకర్యంగా వుంటుంది. లగేజ్ ఎక్కువైన కొలది పర్యటనలో మీ శ్రద్ధ అంతా వాటిపై పెట్ట వలసి వస్తుంది.

మీరు పర్యటించే కొత్త ప్రదేశాలలో కల వీధుల పేర్లు తెలుసుకోండి. ఆయా ప్రాంతాల రక్షణ తెలుసుకోండి. అందుకు గాను ఒక మ్యాప్ ఆప్రాంత మార్గదర్శక సూచనలు వుండాలి.

వస్తువుల భద్రత

మీ పట్ల జాగ్రత్త వహించటమే కాదు, మీ వ్యక్తిగత వస్తువుల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. హోటల్ వద్ద ఆగినా, లేక షాపింగ్ లో వున్నా, మీ వస్తువుల సంఖ్యను సరి చూసుకోండి. ఇండియా లో పర్యాటకులకు దొంగతనాలు అధికంగా జరుగుతూంటాయి.

ఒంటరిగా ఉండకండి

మీరు ఒంటరిగా ప్రయానిస్తున్నప్పటికి తోటి వారితో కలసి మెలగండి. పర్యటనలో తోటి ప్రయాణికులపై గమనం పెట్టండి.
రబ్బర్ డోర్ స్టాప్, సేఫ్టీ విజిల్, పేపర్ నైఫ్, పెప్పర్ స్ప్రే వంటివి మీ ఒంటరి ప్రయాణంలో తప్పక ఉంచుకోండి. ఒక ట్రావెల్ గైడ్, మ్యాప్ జర్నీలో తప్పక వుండాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X