Search
  • Follow NativePlanet
Share
» »మంచుప‌ర‌దాలు క‌ప్పుకున్న శిఖ‌రాగ్రాలు.. ధంక‌ర్ సొంతం

మంచుప‌ర‌దాలు క‌ప్పుకున్న శిఖ‌రాగ్రాలు.. ధంక‌ర్ సొంతం

మంచుప‌ర‌దాలు క‌ప్పుకున్న శిఖ‌రాగ్రాలు.. ధంక‌ర్ సొంతం

ప‌చ్చ‌ని ఎత్తుప‌ల్లాల కొండ‌కోన‌ల మ‌ధ్య‌ ప్ర‌యాణం కోరుకునేవారు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని ధంక‌ర్‌కు చేరుకుంటారు. ఎటు చూసినా మంచుప‌ర‌దాలు క‌ప్పుకున్న శిఖ‌రాగ్రాలు ప‌ర్యాట‌క ప్రేమికుల మ‌న‌సును క‌ట్టిప‌డేస్తాయి.

ప్రేమ‌ను పంచే బౌద్ధ చిహ్నాల‌కు నిల‌యంగా ఈ ప్రాంతం ప్ర‌సిద్ధి చెందింది. ఇక్క‌డి రాతి నిర్మాణ శైలి ప్ర‌పంచ ఖ్యాతి పొందాయి. మ‌రెందుకు ఆల‌స్యం ధంక‌ర్ ప‌ర్యాట‌క విశేషాల‌ను తెలుసుకుందాం రండి.

ధంకర్ సరస్సు

ధంకర్ సరస్సు

ధంకర్‌లోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాల గురించి చెప్ప‌కునే ముందు ఇక్క‌డి స‌హ‌జ‌సిద్ధ ధంకర్ సరస్సు పేరు ఖచ్చితంగా ప్ర‌స్తావించాలి. సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ సరస్సు చాలా ప్రసిద్ధి చెందింది. శీతాకాల‌ సమయంలో ఈ సరస్సు అందం రెట్టింపు అవుతుంద‌ని చెబుతారు. ఈ సరస్సు చుట్టూ ఉన్న ఎత్త‌యిన‌ పర్వతాలు తెల్లటి మంచుతో కప్పబడినప్పుడు ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు రెండు క‌ళ్లూ స‌రిపోవు. నిత్యం జాలువారే మంచు తుంప‌రులు విదేశాల‌లో ఉన్న అనుభూతిని అందిస్తాయి.

ధంకర్ మఠం

ధంకర్ మఠం

ధంకర్ మొనాస్టరీ లేదా మఠం మ‌న‌దేశంలోనే కాకుండా చైనా, జపాన్ వంటి అనేక ఇతర దేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. ధంకర్ మఠం ఎంతో పవిత్రమైన‌దిగా భావించే దేశ, విదేశీ సంద‌ర్శ‌కులు ఇక్క‌డికి వ‌స్తూ ఉంటారు. ఈ మఠం బుద్ధునికి అంకితం చేయబడింది. చాలా మంది పర్యాటకులు డిసెంబర్ మరియు జనవరి సీజన్‌ల‌లో ఇక్క‌డికి ఎక్కువ‌గా వ‌స్తుంటారు. ఎందుకంటే ఈ రెండు నెలల్లో అందమైన హిమపాతం ఆస్వాదించే అవ‌కాశం ఉంటుంది. ఇక్కడ మీరు టిబెటన్ కమ్యూనిటీ ప్రజల సంస్కృతిని కూడా ద‌గ్గ‌ర‌గా చూడ‌వ‌చ్చు.

పిన్ వ్యాలీ

పిన్ వ్యాలీ

ధంకర్ నుండి 39 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న పిన్ వ్యాలీ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి గొప్ప ప్రదేశంగా చెబుతారు. పిన్ వ్యాలీ పచ్చని పచ్చికభూములు మరియు ఎత్త‌యిన పర్వతాలకు ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, ఈ ప్ర‌దేశం అనేక అరుదైన మొక్కలు మరియు మంచు చిరుతపులుల‌కు నిల‌యంగా గుర్తింపు పొందింది. శీతాకాల‌ సమయంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ధంకర్‌తోపాటు పిన్ వ్యాలీని సందర్శించడానికి చేరుకుంటారు. పిన్ వ్యాలీని పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు.

ధంకర్‌లో ధంకర్ సరస్సు, ధంకర్ మొనాస్టరీ మరియు పిన్ వ్యాలీలను సందర్శించడమే కాకుండా అనేక ఇతర అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఉదాహరణకు కుంగ్రి గొంప, పరాశర్ సరస్సు, సంగం మొనాస్టరీ మరియు షాషుర్ మఠం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. అంతేకాదు, ధంకర్‌లో అనేక సాహస కార్యకలాపాలను కూడా ఆస్వాదించవచ్చు.

ధంకర్‌ని ఎలా చేరుకోవాలి

ధంకర్‌ని ఎలా చేరుకోవాలి

ధంకర్‌ని చేరుకోవడం చాలా సులభం. చండీగఢ్, సిమ్లా, కులు లేదా మనాలి నగరానుంచి ఇక్క‌డికి చేరుకోవ‌చ్చు. ఢిల్లీ నుండి సిమ్లా లేదా మనాలి చేరుకున్న తర్వాత, అక్క‌డి నుండి బస్సులో చేరుకోవచ్చు. విమానంలో వెళ్లాలనుకుంటే, సమీపంలోని విమానాశ్రయం భుంటార్‌కు చేరుకోవాలి. అక్కడి నుండి స్థానిక టాక్సీ లేదా బస్సులో ధంకర్‌ని సందర్శించవచ్చు. రైలులో అయితే, కల్కాజీ రేవాల్ స్టేషన్‌కు చేరుకోవాలి. ఇక్కడ నుండి టాక్సీ లేదా బస్సులో సిమ్లాకు జ‌ర్నీ చేయాలి. సిమ్లా నుండి ధంకర్ వరకు బస్సులో చేరుకోవచ్చు.

Read more about: dhankar himachal pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X