Search
  • Follow NativePlanet
Share
» » మంచు కొండల మహత్యం - గుల్మార్గ్ !!

మంచు కొండల మహత్యం - గుల్మార్గ్ !!

ఒకప్పుడు గుల్మార్గ్ ప్రదేశం రాజులు, మహారాజులకు వేసవి విడిది ప్రదేశంగా వుండేది. అయితే, సుమారుగా 1985 ల నుండి కాశ్మీర్ ప్రాంతంలోని ఈ భూభాగం ఒక పర్యాటక ఆకర్షణగా రూపు దిద్దుకుంటోంది. గుల్మార్గ్ అందాల సందర్శనకు కాశ్మీర్ కు వచ్చే పర్యాటకులు లేకపోలేదు. కొద్ది సంవత్సరాలు గడిచే సరికి సాహస క్రీడలు ఆచరించే వారికి ఇది ఒక ప్రధాన ప్రదేశంగా రూపు దిద్దుకొంది. పెద్దవైన పర్వత శ్రేణుల మధ్య స్కై ఇంగ్ ఒక ప్రధాన క్రీడగా మారింది. ఒక్కసారి హిమాలయాలలోని ఈ మంచు ప్రాంతాలు సందర్శిస్తే, ఇక అక్కడ నుండి దూరం అవటం అసాధ్యం. ప్రపంచం నలుమూలలనుండి, పర్యాటకులు ఈ ప్రదేశానికి వచ్చి, వారి ఆనందాలు అధికం చేసుకుంటారు. రోజుల తరబడి స్కి ఇంగ్ లో గడుపుతారు. పెద్ద పెద్ద పర్వత శ్రేణుల మధ్య కల గుల్మార్గ్ దానికి అది ఒక ప్రపంచం గా వుంటుంది.

గుల్మార్గ్ ప్రదేశానికి వెళ్ళాలంటే, తాంగ్ మార్గ నుండి పాము మెలికల వంటి ఎన్నో వంపులు తిరగాలి. గుల్మార్గ్ సిటీ లోపలి ప్రాంతం మాత్రం ఎంతో బిజి గాను, రణగొణ ధ్వనులతో నిండి వుంటుంది. ఎన్నో రకాల డాబాలు ఉన్నప్పటికీ సిటీ లోపలికి కార్లు దూసుకు పోతూ వుంటాయి. అనేక రెస్టారెంట్లు కలవు. ఇవి చాలా వరకు వెజిటేరియన్ గా చెప్పబడతాయి. ఇక్కడ దొరికే వసతి కొరకు అంటే చవక తిండ్లు, వసతులు కారణంగా చాలామంది పర్యాటకులు ఇక్కడే వసతి పొందుతారు. ఇక్కడి గోల్ఫ్ కోర్సు పూర్తిగా మంచుతో కప్పబడి వుంటుంది. ఇక్కడ పెద్ద బెడద అంటే అది కోతులు, కుక్కలు. అవి పర్యాటకులను తరుముతూ వుంటాయి.

గుల్మార్గ్ లో ప్రకృతి దృశ్యాలను ఆనందించాలంటే, హోటల్ హై లాండ్స్ పార్క్ పక్కన కల రిసార్ట్ లోని ఎత్తైన ప్రదేశం. మీరు ఇక్కడ నుండి ఈ చారిత్రాత్మక ప్రదేశం చూడవచ్చు. ఇక్కడ కల కేథలిక్ చర్చి 1920 లలో బ్రిటిష్ వారిచే నిర్మించబడింది. బ్రిటిష్ వారు ఈ ప్రదేశానికి స్కి ఇంగ్ కు వచ్చే వారు. సమీపంలో ఒక గురుద్వారా , ఒక టెంపుల్ మరియు మాస్క్ లు కూడా కలవు. ఈ ప్రాంతం చుట్టూ హిమాలయ పర్వత శ్రేణులు కప్పబడి వుంటాయి.

కాశ్మీర్ ప్రాంతం లో కల్లోలం ఉన్నప్పటికీ , అపుడు అపుడు అశాంతి ఇక్కడ కలుగుతున్నప్పటికి, పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చి తమ స్కి ఇంగ్ సాహస క్రీడలను ఆచరించి, పర్యాటక మ్యాప్ లో దీనికి గుర్తింపు ఇస్తున్నారు. నేటికీ ఇక్కడి వసతులు , సౌకర్యాలు అధికంగా వృద్ధి చెందనప్పటికి, గత పది సంవత్సరాలలో ఎన్నో మార్పులు జరిగినట్లు, స్థానికులు చెపుతారు. అనేక మార్పులు ప్రతి సంవత్సరం వెళ్లేవారికి కనపడతాయి. పర్యాటకులకు ప్రాధమిక సౌకర్యాలు కూడా సరిగా లేనప్పటికీ, స్కి పెట్రోల్, హోటల్స్, ఎక్విప్మెంట్ మరియు హెలి స్కై ఇంగ్ లాలో మార్పులు గణనీయం గా కలవు.

ఇండియాలో స్కి ఇంగ్ ఒక కొత్త క్రీడ. అసలు ఉప ఖండంలో ఈ క్రీడ ప్రారంభంలో ఉన్నప్పటికీ, స్కఎర్ లలో చాలామంది విదేసీయులుగా వుంటారు. కాని ప్రతి సంవత్సరం, ఈ శిఖరాల స్కీయింగ్ క్రీడలలో ఇండియన్ లు అధికంగా వుంటున్నారు. గుల్మార్గ్ స్కై ఇంగ్ విజయానికి కారణం విదేశీ పర్యాటకులు మరియు మనో ధృఢ త కల కాష్మీరు ప్రజలు . రాజకీయ పరిస్థితి మారితే , టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని వీరు భావిస్తారు.

గుల్మార్గ్ ప్రాంతం ఒకప్పుడు యూసఫ్ షా చాక్, జహంగీర్ వంటి మొగలాయీ ప్రభువులకు ఒక రిసార్ట్ గా వుండేది. గుల్మార్గ్ కు పాత పేరు "గౌరీ మార్గ" అని చెపుతారు. ఈ పేరు శివ భగవానుడి సతీమణి అయిన పార్వతిది గా కూడా చెపుతారు. యూసఫ్ షా చాక్ రాజు ఈ పేరును గుల్మార్గ్ అంటే గులాబీల రోడ్డు గా మార్చాడు. ఇరవై శతాబ్దపు మొదటి భాగంలో ప్రసిద్ధ సెంట్రల్ ఆసియన్ చరిత్రకారుడు సర్ మార్క్ ఆరేళ్ స్టీన్ (1862 -1943) ఇక్కడ ఒక టెంట్ లో నివసించి పర్వతాల అన్వేషణ చేసేవాడు. ఇండియా లో గుల్మార్గ్ ప్రాంతం యూసఫ్ షా, చాక్, జహంగీర్ వంటి మొగలాయీ ప్రభువులకు ఒక వేసవి విడిది గా వుండేది. తర్వాతి కాలంలో ఈ పట్టణం బ్రిటిష్ వారికి విడిదిగా కలదు. ఈ ప్రదేశం పాకిస్తాన్ కు మనకు గల లైన్ అఫ్ కంట్రోల్ కు కొద్ది మైళ్ళ దూరంలో వుంటుంది. వింటర్ సీజన్లో హిమ పాతం అధికం.


ఈ ప్రాంతంలో ఉగ్రవాదం పెరగటం వలన గుల్మార్గ్ ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా కూడా మారింది. ఇక్కడి ఏటవాలు పర్వతాలు స్కి ఇంగ్ కు అతి ఎత్తైనవి, అతి పొడవైనవి గా చెపుతారు. ఇక్కడి రిసార్ట్ లు సముద్ర మట్టానికి 12,959 అడుగుల ఎత్తులో వుంటాయి. ఇక్కడి స్కై ఇంగ్ ప్రాజెక్ట్ ను కాశ్మీర్ ముఖ్య మంత్రి డిసెంబర్, 25, 2004 లో ఆవిష్కరించారు. ఈ కొండ పూర్తిగా ఎల్లపుడూ సైన్యం చే కాపలా కాయబడుతూ వుంటుంది. గుల్మార్గ్ లో సాధారణంగా నివసించే ప్రజలు, హోటల్ ఉద్యోగస్తులు లేదా, వచ్చిన అతిధులుగా వుంటారు. శాశ్వత నివాసం కల సామాన్య ప్రజలు లేరు.

గుల్మార్గ్ గొందోలా అనేది ఒక కేబుల్ కార్ ప్రపంచంలో ఇది రెండవ ఎత్తైనది. గుల్మార్గ్ కు శ్రీ నగర్ లేదా శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుండి తేలికగా చేరవచ్చు. బస్సు లేదా కార్ లో రెండు గంటల ప్రయాణం. ఒక గంట ప్రయాణంలో తాంగ్ మార్గ చేరవచ్చు. తాన్గ్మార్గ్ నుండి గుల్మార్గ్ ప్రాంతం ముప్పై నిమిషాలలో చేరవచ్చు. గుల్మార్గ్ లో సుమారు 40 హోటళ్ళ వరకు వుంటాయి. ఇవి విదేశీయులకు సైతం సౌకర్యంగానే వుంటాయి. అయిదు నక్షత్రాల హోటళ్ళు కూడా కలవు. గుల్మార్గ్ ప్రాంతం డిసెంబర్ నుండి మార్చ్ వరకూ బిజి గా వుంటుంది. వసతుల ధరలు రూ. 1500 నుండి రూ 6500 వరకూ వుంటాయి. ఈ హోటల్ ధరలు సీజన్లో - ఆఫ్ సీజన్లో మారుతూంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X