Search
  • Follow NativePlanet
Share
» »పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేసే స్నోవ్యూ పాయింట్

పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేసే స్నోవ్యూ పాయింట్

పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేసే స్నోవ్యూ పాయింట్

ఉత్తరాఖండ్ లోని పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేసే స్నోవ్యూ పాయింట్ గురించి తెలుసా. ఆ హిమగిరులు అందాలను కళ్ళకు కట్టినట్లు చూడాలంటే స్నో వ్యూ పాయింట్ చేరుకోవాల్సిందే..

భారత దేశపు సరస్సుల జిల్లా గా పిలువబడే నైనిటాల్ హిమాలయ శ్రేణులలో కలదు. దేశ రాజధానికి సుమారు 330 కిలో మీటర్ల దూరంలో ఉత్తరాఖంఢ్ రాష్ట్రం లో ఉంది నైనితాల్. దేశవిదేశాలలో పేరుపొందిన వేసవి విడిది.హిమాలయ శ్రేణుల్లో కుమావోన్ హిల్స్ మధ్య భాగంలో ఉన్న ఈ ప్రదేశం అందమైన సరస్సులను కలిగి ఉంది. నైనీతాల్ పేరులోని నైనీ అంటే నయనం..తాల్ అంటే సరస్సు. భారత దేశంలో ప్రసిద్ద హిల్ స్టేషన్ మాత్రమే కాదు పుణ్య క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ది చెందినది. ఇది సముద్ర మట్టానికి సుమారు 6,840 అడుగుల ఎత్తులో వుంది.

నైనితాల్ కంటి ఆకారం కలిగి ఉన్న పర్వతశిఖరాల మద్యనున్న ప్రదేశంలో ఉపస్థితమై ఉంది. ఈ ప్రాంతానికి నైనితాల్ అనే పేరు రావడం వెనుక ఉన్న చరిత్ర స్కందపురాణంలో పొందుపరచబడినది.నైనీతాల్ పేరులోని "నైనీ" అంటే నయనం మరియు "తాల్" అంటే సరసు. నైనీతాల్ ప్రసిద్ధ హిల్ స్టేషనే కాక పుణ్యా క్షేత్రాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాంచింది.

నైనితాల్ సరస్సు

నైనితాల్ సరస్సు

స్కందపురాణంలోని మానస ఖండ్ లో నైనితాల్ ను ముగ్గురు బుుషుల సరస్సు లేదా ముగ్గురు బుుషుల సరోవరం అని పిలుస్తారు. ఆ ముగ్గురు బుషుల పేర్లు అత్రి, పులస్త్య, పులాహ. వీరు ముగ్గురు తమ దాహం తీర్చుకనేందుకు నైనితాల్ వద్ద ఆగారు. ఈ ప్రదేశంలో నీరుకోసం ఎంత వెదికనప్పటికీ వారికి నీరు దొరకలేదు. దాంతో వారు ముగ్గురు కలిసి వెంటనే ఒక పెద్ద గొయ్యి తవ్వడం ప్రారంభించారు. దానిలోకి మానస సరోవరం నీటిని నింపి వారు తమ దాహం తీర్చుకుననారు. ఈ విధంగా నైనితాల్ సరస్సు మానవ నిర్మితంగా సృష్టించబడినది. మరో కథనం ప్రకారం ఇక్కడ శివుడి భార్య అయిన సతి ఎడమ కన్ను పడిన ప్రదేశంగా అప్పటి నుండి నైని సరస్సును సృష్టింబడింది.

PC:Ekabhishek

అద్భుత హిమాలయ పర్వత శ్రేణులు

అద్భుత హిమాలయ పర్వత శ్రేణులు

నైనితాల్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో స్నోవ్యూ పాయింట్ ఉంది. రోప్ వే కేబుల్ కార్ ద్వారా స్నో వ్యూ తేలికగా చేరవచ్చు. స్నోవ్యూ నుండి హిమాలయాల అందాలు అద్భుతంగా కనపడతాయి. నడిచిగాని , లోకల్ టాక్సీలలో గాని ప్రయాణించి యీ ప్రదేశం చేరుకోవచ్చు, యిక్కడనుంచి మంచుతో కప్పబడ్డ పర్వత శిఖరాలను చూడొచ్చు. స్నో దృశ్యం లేదా వ్యూ అనేది సముద్ర మట్టానికి 2270 మీటర్ల ఎత్తున కల ఒక అందమైన ప్రదేశం. ఇది నైనిటాల్ టవున్ కు 2.5 కి.మీ.ల దూరంలో ఉంది. పర్యాటకులు ఇక్కడకు చేరాలంటే రోప్ వే లేదా వెహికల్ పై చేరవచ్చు. ఇది షేర్ -క- దండ అనే ఎత్తైన చిన్న కొండ పై వుంది అద్భుత హిమాలయ పర్వత శ్రేణులను చూపి పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది.

PC: Ashray1999

Cable car

కేబుల్ కార్ :

ఏరియల్ కేబుల్ కార్ మిమ్మల్ని మాల్ రహదారి నుండి స్నోవ్యూ పాయింట్ కు కనెక్ట్ చేస్తుంది. కేబుల్ కార్ నుండి చూస్తూ అందమైన నగరం కనబడుతుంది. నైనిటాల్ రోప్ వే మరోకి ప్రసిద్ధ టూరిస్ట్ ఆకర్షణ. ఇది కుమావొన్ మండల వికాస్ నిగం చే నిర్వహించబడుతోంది. ఇది ఇండియాలో స్థాపించ బడిన మొదటి కేబుల్ కార్. సుమారు 705 మీటర్ల దూరం 300 మీ.ల ఎత్తున కవర్ చేస్తుంది. ప్రతి కేబుల్ కార్ 825 కే.జి.ల బరువు అంటే 12 వ్యక్తులను మోయ ఉంది.ఈరోపే వే స్నో వ్యూను నైనిటాల్ టవున్ కు కలుపుతుంది. రోప్ వే సెకండుకు 6 మీ.ల దూరం కదులుతుంది. ఈ ప్రయాణంలో టూరిస్టులు అద్భుత దృశ్యాలను చూడడానికి అవకాశం ఉంది. స్నో వ్యూ పాయింట్ లో కేబుల్ కార్ లో ప్రయాణిస్తూ నగరాన్ని దగ్గర నుండి వీక్షించడం వల్ల రామ, సీత, లక్ష్ముణ, హనుమంతుడి విగ్రహాలతో ఒక చిన్న దుర్గా దేవి మరియు శివ మందిరాన్ని సందర్శించవచ్చు.

స్నోవ్యూ పాయింట్ లో కొన్ని ఫేమస్ యాక్టివిటీస్ :

స్నోవ్యూ పాయింట్ లో కొన్ని ఫేమస్ యాక్టివిటీస్ :

లీసర్స్, పిక్నిక్ స్పాట్స్, వ్యూ పాయింట్ చాలా ప్రసిద్ది చెందినది. కొన్ని ఆహ్లాదరకమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. వ్యూ పాయింట్ వెలుపల రెండు రైఫిల్ షూటింగ్ దుకాణాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఖాళీతుపాకులకు బుల్లెట్లతో నింపడానికి 30రూపాలయ చెల్లించి మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి 6 అవకాశాలు కల్పిస్తారు.

PC: Ekabhishek

సేల్స్ స్టోర్స్

సేల్స్ స్టోర్స్

పిల్లల కొరకు వివిధ రకాల ఆర్కేడ్లు మరియు సరదా ఆటలు కూడా ఈ పాయింట్ లో నిర్వహిస్తారు. వివిధ రకాల బొమ్మలతో ఆటలు ఆడవచ్చు. ఖాలీ ప్రదేశంలో టీ, కాఫీ, హాట్ చాక్లెట్ క్యాండీఫ్లోస్ మరియు అప్పటికప్పుడు మ్యాగీ నూడిల్స్ తయారుచేసి అమ్ముతుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బెంచీలలో కూర్చొని తింటూ వ్యూ పాయింట్ అందాన్ని ఆస్వాదించవచ్చు.

PC: youtube

స్నోవ్యూ పాయింట్ సందర్శించడానికి మంచి సమయం:

స్నోవ్యూ పాయింట్ సందర్శించడానికి మంచి సమయం:

పర్యటనకు ఉత్తమ సమయం నైనిటాల్ కు సంవత్సరంలో ఎపుడైనా అనుకూలమే. అయితే వేసవి కాలంలో వాతావరణం ఆహ్లాదకరం కనుక సందర్శన అనుకూలంగా వుండి సైట్ సీయింగ్ మరింత అనుకూలిస్తుంది.సంవత్సరమంతా అనుకూలమైన వాతావరణం కలిగిన నైనిటాల్ పట్టణం సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఔఇనప్పటికీ పర్యటన చేయడానికి వేసవి కాలం అనుకూలంగా ఉంటుంది. వేసవి నైనిటాల్ లో వేసవి మార్చిలో మొదలై మే వరకూ కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠం 27 డిగ్రీలు కనిష్ఠం 10 డిగ్రీలుగా వుంటుంది. మొత్తంగా వాతావరణం ఎంతో ఆహ్లాదంగా వుంది పర్యాటకులను ఆనందింప చేస్తుంది.

PC : Teesta31

Misc. trains

నైనిటాల్ చేరుకోవడం ఎలా ?

నైనిటాల్ చేరేందుకు టూరిస్టులు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ఉపయోగించవచ్చు. ప్రైవేట్ వోల్వో బస్సులు కూడా ఢిల్లీ నుండి ఉంటాయి. ఢిల్లీ నుంచి రైలుమార్గం ద్వారా ' కాఠ్ గోదాం ' వరకు వుంది . నైనితాల్ వెళ్లదల్చుకున్నవారు ట్రైన్ లో కాఠ్ గోదాం ' వరకు వచ్చి అక్కడనుంచి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులలో కాని టాక్సీ లలో గాని ప్రయాణించి చేరుకోవచ్చు . అల్మోర, రానిఖేట్, బద్రినాథ్ ల నుండి నైనిటాల్ కు సెమి డీలక్స్, మరియు డీలక్స్ బస్సులు కూడా ఉన్నాయి. అక్కడి నుండి స్నోవ్యూ పాయింట్ 3కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని రోడ్ మార్గం, ట్రెక్ , పోనీ లేదా రోప్ వే ద్వారా చేరుకోవచ్చు,.నైనిటాల్ కు సుమారు 23 కి. మీ.ల దూరం లోని కాత్గోడం రైల్వే స్టేషను సమీప రైలు స్టేషను. ఈ రైలు స్టేషను నుండి లక్నో, ఆగ్రా మరియు బారేలీ లకు ట్రైన్ లు ఉన్నాయి. రైలు స్టేషను నుండి నైనిటాల్ కు టాక్సీ లలో చేరవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X