Search
  • Follow NativePlanet
Share
» »కులు మనాలిలోని సోలాంగ్ వ్యాలీ పారా గ్లైడింగ్..స్కీయింగ్.. చేయడం ఓ అద్భుతం..!!

కులు మనాలిలోని సోలాంగ్ వ్యాలీ పారా గ్లైడింగ్..స్కీయింగ్.. చేయడం ఓ అద్భుతం..!!

సోలాంగ్ వ్యాలి ఓ అద్భుతమైన ట్రెక్కింగ్ స్పాట్. ఆకాశంలోకి ఎగబాకిన పర్వతాల నుండి కిందనున్న లోయల వరకూ సర్వం మంచు మయమే. పాలనురగల్లా మెరిసిపోతున్న మంచును చూసి ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల్లా కేరింతలు కొట్లాల్

కులు మనాలి అంటే తెలియని వారుండరు. ఇది ఎత్తైన కొండలు..మంచు పర్వతాలు..పచ్చని అడవులు..పురాతన దేవాలయాలు..మైమరపించే ప్రకృతి అందాలు దాగి ఉన్న ఒక అందమైన ప్రసిద్ద పర్యాటక ప్రదేశం. శీతాకాలం పర్యాటకులకు ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. కులు మనల్ని మనం మైమరిచిపోయి ఆటపాటల్లో మునిగితేలేలా చేసే చల్లని ప్రాంతం.

హిమాలయాలపై, హిమానీ నదాల పక్కన, పర్వతాల అంచున ప్రయాణం. . కొండ, కోనల నడుమ, ఎత్తైన పర్వతాలపై ట్రెక్కింగ్ చేస్తూ.. పారాచూట్‌లో ఎగిరిపోతూ మిమ్మల్ని మీరు మైమర్చిపోవచ్చు. ఎముకలు కొరికే చలిలో చల్లనినీటిలో నదీయానం..సాహసోపేతంగా ఎన్నో అందమైన అనుభూతుల్ని మనసు గదిలో బంధించి, మనతో తెచ్చుకోవాలంటే ఒక్కసారి పర్యాటక ప్రసిద్ది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ను చుట్టి రావాల్సిందే...

వేసవి కాలంలో హిమాలయాల్లోకి వెలితే చాలా ఆహ్లాదం

వేసవి కాలంలో హిమాలయాల్లోకి వెలితే చాలా ఆహ్లాదం

వేసవి కాలంలో హిమాలయాల్లోకి వెలితే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అయితే చలికాలంలో అదీ గజగజ వనికే చలిలో మంచుకొడల్లోకి వెళితే అది ఒక అద్భుతమైన అనుభవం. మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలో సూర్యుడు ఉదయించాడో లేదో తెలియని పరిస్థిలో మంచులో విహరిస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలా థ్రిల్లింగ్ అవ్వాలంటే మనాలిలోని వ్యాలీని సందర్శించాలి.

Photo Courtesy: Rohan Babu

రోహ్ తంగ్ పాస్

రోహ్ తంగ్ పాస్

వేసవి సీజన్ లో అయితే పర్వతాల్లో విహరించాలంటే 50 కిలోమీటర్ల దూరంలోని రోహ్ తంగ్ పాస్ దాకా వెళ్లాలి. సముద్ర మట్టానికి 4111 మీటర్ల ఎత్తున్నఈ ప్రాంతం నుండి అందమైన పర్వతాలు, ప్రకృతి దృశ్యాలు మరియు గ్లెసియర్ లు కనువిందు చేస్తాయి.

 సోలాంగ్ వాలీ మనాలి లో ఉన్న ప్రముఖమైన ప్రధాన ఆకర్షణ.

సోలాంగ్ వాలీ మనాలి లో ఉన్న ప్రముఖమైన ప్రధాన ఆకర్షణ.

చలికాలమైతే కేవలం 14కిలోమీటర్లు దూరంలో ఉన్న సోలాంగ్ వ్యాలీ వెళితే సరిపోతుంది. సోలాంగ్ లోయ, మనాలి కి వాయువ్య దిశలో 14 కి. మీ. దూరంలో ఉంటుంది. ఇది స్నో పాయింట్ కు ప్రసిద్ధి చెందినది.
300 మీటర్ల హై స్కై లిఫ్ట్ కి స్కైయర్స్ లో పొందిన సోలాంగ్ వాలీ మనాలి లో ఉన్న ప్రముఖమైన ప్రధాన ఆకర్షణ. సోలాంగ్ విలేజ్ మరియు బీస్ కుండ్ మధ్యలో ఇది ఉంది.

Photo Courtesy: Raman Virdi

జోర్బింగ్ బాల్‌లో తలక్రిందులవుతూ ప్రపంచాన్ని చూడడం

జోర్బింగ్ బాల్‌లో తలక్రిందులవుతూ ప్రపంచాన్ని చూడడం

ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఉండే సహజమైన అందమైన ప్రాంతం సోలాంగ్ వ్యాలీ. కానీ, ఆసక్తికరమైన భౌగోళిక ప్రాంతమే కాక, పచ్చికమైదానాల్లో జోర్బింగ్‌ను అనుభవించడానికి సరైన ప్రదేశం. జోర్బింగ్ బాల్‌లో తలక్రిందులవుతూ ప్రపంచాన్ని చూడడం నిజంగానే అద్భుతంగా ఉంటుంది. అందుకు ఒక వ్యక్తికి రూ.500 ఉంటుంది.

pc: Ankur P

శీతాకాలంలో ప్రతి యేటా నిర్వహించే శీతాకాల స్కైంగ్ ఫెస్టివల్

శీతాకాలంలో ప్రతి యేటా నిర్వహించే శీతాకాల స్కైంగ్ ఫెస్టివల్

శీతాకాలంలో ప్రతి యేటా నిర్వహించే శీతాకాల స్కైంగ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఏంతో మంది పర్యాటకులు తరలి వస్తారు. స్కైంగ్, జోర్బింగ్, పారాగ్లైడింగ్ మరియ గుర్రపు స్వారీ వంటి ఎన్నో ఆక్టివిటీస్ సోలాంగ్ వాలీ ని సందర్శించిన పర్యాటకులు చేపట్టొచ్చు. మనాలీకి కొంత దూరంలో ఉన్న సోలాంగ్‌ వ్యాలీలో చేరుకున్నాక... హిమగిరుల చెంతకు సైతం గుర్రాలపైనే వెళ్ళాలి. కుఫ్రీలో హార్స్‌ రైడింగ్‌కి ఒక్కక్కొరికీ రూ. 350 నుంచి రూ. 500, సోలాంగ్‌ వ్యాలీలో రూ. 750 నుంచి రూ. 1000 ఉంటుంది.

Photo Courtesy: Saurc zlunag

సోలాంగ్ వ్యాలి ఓ అద్భుతమైన ట్రెక్కింగ్ స్పాట్

సోలాంగ్ వ్యాలి ఓ అద్భుతమైన ట్రెక్కింగ్ స్పాట్

సోలాంగ్ వ్యాలి ఓ అద్భుతమైన ట్రెక్కింగ్ స్పాట్. ఆకాశంలోకి ఎగబాకిన పర్వతాల నుండి కిందనున్న లోయల వరకూ సర్వం మంచు మయమే. పాలనురగల్లా మెరిసిపోతున్న మంచును చూసి ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల్లా కేరింతలు కొట్లాల్సిందే. అయితే మంచులోకి దిగాలన్నా...స్కీయింగ్ చేయాలన్నా..ప్రత్యేకంగా తయారుచేసిన లెదర్ బూట్లు లాంగ్ కోట్లు వేసుకోవాల్సిందే. కాకపోతే అద్దె మాత్రం కొంచెం ఎక్కువే.

pc:: Rajat

గుట్టల్లా ఏర్పడ్డ మంచుపై మేఘాలు మనల్ని తాకుతూ వెళ్ళాలంటే

గుట్టల్లా ఏర్పడ్డ మంచుపై మేఘాలు మనల్ని తాకుతూ వెళ్ళాలంటే

గుట్టల్లా ఏర్పడ్డ మంచుపై మేఘాలు మనల్ని తాకుతూ వెళ్ళాలంటే... మధ్యలో వచ్చే చలిగాలులకు చేయి అందించాలంటే... పక్షిలా ఆకాశంలో రౌండ్లు కొట్టాలంటే... ఒక్కసారి పారా గ్లైడింగ్‌ చేయాల్సిందే. మనాలీ (రోహ్‌తంగ్‌, సోలాంగ్‌ వ్యాలీ), కులు, సిమ్లాలో ఈ సాహస క్రీడ చేసే వీలుంది. కాళ్లకు బ్లేడ్స్, చేతుల్లో స్టిక్స్ తో బ్యాలెన్స్ చేసుకుంటూ మంచులో కిందకు జారుతుంటే మనసు గాల్లో తేలిపోతుంది. మొదట ఒకటీ రెండు సార్లు కిందపడినా నెమ్మదిగా అలవాటుపడి స్వయంగా చేయగలుగుతాం. ఆ మంచులో ఎంతసేపు ఆడుతున్నా టైమే తెలీదు.

కులులో, మనాలీలో పారా గ్లైడింగ్‌ ఎన్నటికీ మరువలేని అనుభూతి

కులులో, మనాలీలో పారా గ్లైడింగ్‌ ఎన్నటికీ మరువలేని అనుభూతి

కులులో, మనాలీలో పారా గ్లైడింగ్‌ ఎన్నటికీ మరువలేని అనుభూతిని అందిస్తుంది. రోహ్‌తంగ్‌లో మంచు కొండల మధ్య, ముఖ్యంగా కులు పర్వతాల మీదుగా చేసే పారా గ్లైడింగ్‌ ది బెస్ట్‌. పక్షిలా తిరిగిన భావన కలుగుతుంది. కులులో ఒక్కొక్కొరికీ రూ. 1500 నుంచి రూ. 2500, సోలాంగ్‌ వ్యాలీలో రూ. 2500 నుంచి రూ. 3000 తీసుకుంటారు. మనాలీలో పారా గ్లైడింగ్‌ పాయింట్‌కి రోప్‌ వే ద్వారా చేరుకొనే సౌకర్యం కూడా ఉంటుంది. దానికి అదనంగా డబ్బులు చెల్లించాలి.

సోలాంగ్ వ్యాలీలో మధ్యాహ్నం వెండికొండల్లా తెల్లగా మెరిసిపోయే హిమాలయాలు

సోలాంగ్ వ్యాలీలో మధ్యాహ్నం వెండికొండల్లా తెల్లగా మెరిసిపోయే హిమాలయాలు

సోలాంగ్ వ్యాలీలో మధ్యాహ్నం వెండికొండల్లా తెల్లగా మెరిసిపోయే హిమాలయాలు, సాయంకాలం అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు పడి బంగారురంగులో మెరిసిపోతూ కనువిందు చేస్తాయి.

pc: Denise M

సోలాంగ్ వ్యాలీ రోప్ వే

సోలాంగ్ వ్యాలీ రోప్ వే

అలాగే తాడు సాయంతో వేలాడుతూ నదిని దాటే సాహస క్రీడ ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇది కాకుండా బోటింగ్ కూడా ఆహ్లాదాన్ని ఇస్తుంది. రోజంతా టూరు ముగించుకుని సాయంత్రానికి మాల్ రోడ్డుకు చేరుకుంటే మరో విభిన్నమైన అనుభూతి కలుగుతుంది.

PC: Ankur Dauneria

మనాలిలో టూరిస్టులంతా ఒకే చోట చేరే కాంప్లెక్స్

మనాలిలో టూరిస్టులంతా ఒకే చోట చేరే కాంప్లెక్స్

మనాలిలో టూరిస్టులంతా ఒకే చోట చేరే కాంప్లెక్స్ ఇది. ఇక్కడ ప్రధానంగా హోటళ్లు, షాపింగ్ సెంటర్లున్నాయి. అక్కడే తింటూ షాపింగ్ చేస్తూ వందలాది మంది టూరిస్టులు కనిపిస్తుంటారు.

Photo Courtesy : Shubhankar Sakalkale

మనలి, కులు, సోలాంగ్,రోతాంగ్ వంటి ట్రెక్కింగ్ ప్రదేశాలు వీక్షించడానికి

మనలి, కులు, సోలాంగ్,రోతాంగ్ వంటి ట్రెక్కింగ్ ప్రదేశాలు వీక్షించడానికి

మనలి, కులు, సోలాంగ్ రోతాంగ్ వంటి ట్రెక్కింగ్ ప్రదేశాలు వీక్షించడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే వచ్చే వాళ్ళు మాత్రమే కాదు, విదేశీ టూరిస్ట్ లు కనిపిస్తారు. ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు - ఏప్రిల్ నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్

Photo Courtesy: Sabyasachi Baidya

ఇతర ఆకర్షణలు :

ఇతర ఆకర్షణలు :

హిందూ దైవం అయిన శివుడికి అంకితమివ్వబడిన ఒక ఆలయం పర్వతం పైన ఉంది. సముద్ర మట్టానికి 2460 మీ. ఎత్తులో ఉంటుంది. కులు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ శివాలయం యాత్రికులను కనువిందు చేస్తుంది. పక్కనే ఉన్న కులు లోయలో మీ సాహస క్రీడల సరదా తీర్చుకోవచ్చు.
చిత్ర కృప : Jorge Q

కులు-మనాలీ:రివర్‌ రాఫ్టింగ్‌

కులు-మనాలీ:రివర్‌ రాఫ్టింగ్‌

కులు, మనాలీ మధ్య దూరం సుమారు 40 కిలోమీటర్లు. రెండూ వేర్వేరు ప్రాంతాలు అయినప్పటికీ... కులు-మనాలీగా ప్రసిద్ధి చెందాయి. మనాలీ వెళ్తూ వెళ్తూనో, వెళ్ళి వస్తూనో కులులో రివర్‌ రాఫ్టింగ్‌, షాపింగ్‌ చేయడం పర్యాటకులకు రివాజు. రాఫ్టింగ్‌తో పాటు మనాలీలో సాహస క్రీడల్లో పాల్గొంటారు. బర్డ్‌ శాంక్చ్యురీ, దేవాలయాలను సందర్శిస్తారు. కులు మనాలీకి కసోల్‌, మణికరణ్‌ ప్రాంతాలు దగ్గరే!

సిమ్లా:

సిమ్లా:

హనుమ దేవాలయం, చర్చిల సందర్శన, మాల్‌ రోడ్డులో షాపింగ్‌. పర్వతాల్లో నెలవైన షోఘి పట్టణం, కుఫ్రీ... ఇవన్నీ సిమ్లాకు దగ్గరలోనే ఉంటాయి.

Photo Courtesy: sahil

కులు మనాలి ఎలా చేరుకోవాలి ?

కులు మనాలి ఎలా చేరుకోవాలి ?

కులు మనాలి కి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి .

సమీప ఏర్ పోర్ట్ : భుంతర్ విమానాశ్రయం (మనాలి నుండి 50 కి. మీ దూరంలో, కులు నుండి 10 కి. మీ. దూరంలో)

సమీప రైల్వే స్టేషన్ : జోగీందర్ నగర్ రైల్వే స్టేషన్ (మనాలి నుండి 135 కి. మీ. దూరంలో, కులు నుండి 125 కి. మీ. దూరంలో). మనాలి కి 300 కి. మీ. దూరంలో ఉన్న చండీఘర్ రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే జంక్షన్.

రోడ్డు మార్గం : ఢిల్లీ నుండి, సిమ్లా నుండి ప్రతి రోజూ కులు మనాలి కి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

pc : Suresh Kumawat

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X