Search
  • Follow NativePlanet
Share
» »సోలాపూర్ సిద్దేశ్వర దేవాలయం !!

సోలాపూర్ సిద్దేశ్వర దేవాలయం !!

భారత దేశం దక్షిణ కాశీగా పిలువబడే పంధర్పూర్ గల ప్రాంతంగా షోలాపూర్ ప్రసిద్ది చెందింది. పంధర్పూర్ దేశ వ్యాప్తంగా విఠోబా దేవుని ప్రధాన మతకేంద్రానికి ప్రతీక.

By Mohammad

పర్యాటక ప్రదేశం : సోలాపూర్

రాష్ట్రం : మహారాష్ట్ర

ప్రసిద్ధ ఆకర్షణలు : సిద్ధేశ్వర్ ఆలయం, గ్రేట్ ఇండియన్ బస్టర్ అభయారణ్యం, హజ్రత్ షా దర్గా, గోల్ గుమ్మద్, భుయికోట్ కోట, బారా కమాన్ మొదలగునవి.

మహారాష్ట్ర లోని ముఖ్యమైన నగరాలలో ఒకటైన సోలాపూర్ ఉత్తరాన ఉస్మానాబాద్, అహ్మద్ నగర్ జిల్లాలను, పశ్చిమాన సతారా, పూనేలను, దక్షిణాన బీజాపూర్, సాంగ్లీ లను, తూర్పున గుల్బర్గా జిల్లాను కలిగి ఉంది.

సైనా నది ఒడ్డున గల సోలాపూర్ మహారాష్ట్ర లో ఒక ప్రధాన జైన మతకేంద్రంగా గుర్తింపు పొందింది. హిందీలో సోలా అ౦టే పదహారు, పూర్ అనగా గ్రామం - అనే దాన్నిబట్టి జిల్లాకు ఈ పేరువచ్చిందని చరిత్రకారుల నమ్మకం.

ఇది కూడా చదవండి : మహారాష్ట్ర లోని సాంగ్లీ లో తప్పక చూడవలసిన ప్రదేశాలు !!

భారత దేశం లో దక్షిణ కాశీగా పిలువబడే పంధర్పూర్ గల ప్రాంతంగా సోలాపూర్ ప్రసిద్ది చెందింది. పంధర్పూర్ దేశ వ్యాప్తంగా విఠోబా దేవుని ప్రధాన మతకేంద్రానికి ప్రతీక. కార్తీక, ఆషాద ఏకాదశి పర్వ దినాల్లో షుమారు నాలుగు నుండి ఐదు లక్షల మంది తీర్థ యాత్రీకులు ఇక్కడికి వస్తారు.

బారా కమాన్

బారా కమాన్

బారాకమాన్ అనే సమాధిని 1672 లో నిర్మించారు. గతంలో దీనిని అలీ రోజా గా పిలిచేవారు. 12 స్మారక కట్టడాలను కల్గి ఉండటంతో అతని కాలంలో దీని పేరును బార కమాన్ గా మార్చాడు. జుమ్మా మసీదు, జల మంజిల్,సత మంజిల్ ఇక్కడి చూడదగ్గ ఇతర ఆకర్షణీయ ప్రదేశాలు.

చిత్రకృప : Mashalti

భుయికోట్ కోట

భుయికోట్ కోట

సోలాపూర్ పరిసరాలలో భుయికోట్ కోట ఒక ప్రధాన ఆకర్షణ. క్రీ.శ. 14 వ శతాబ్దంలో మధ్య యుగంలో బహమనీ వంశ పాలనలోనే దీనిని కట్టారు. బాతులు, నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు, ఇంకా అనేక జంతువులు కల్గిన జంతువుల పార్క్ కల్గిన ప్రాంతంగా ఈ కోట ప్రసిద్ధి చెందింది.

చిత్రకృప : vivek Joshi

గోల్ గుంబద్

గోల్ గుంబద్

సోలాపూర్ నగరం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజాపూర్ లో గోల్ గుంబద్ ఉంది. దీని విశిష్ట మైన వాస్తు శైలి వల్ల భారతదేశ పురాతన సాంస్కృతిక చరిత్ర నందు ఒక అత్యంత ప్రముఖ స్థానాన్ని కల్గి ఉంది.

చిత్రకృప : Bharat Galagali

హజ్రత్ షా జాహుర్ దర్గా

హజ్రత్ షా జాహుర్ దర్గా

ప్రసిద్ధి చెందిన ముస్లిం సాధువు అయిన హజ్రత్ షా జ్ఞాపకార్థం మతపరమైన మసీదయిన హజ్రత్ షా జాహుర్ దర్గాను నిర్మించారు. హజ్రత్ షా అనేక మహిమలు కల్గి ఉండటం వల్ల ప్రసిద్ధి చెందారు.

చిత్రకృప : M a razvi

మోతీ బాగ్ సరస్సు

మోతీ బాగ్ సరస్సు

సోలాపూర్ జిల్లాలోని పక్షులను తిలకించే కేంద్రమైన మోతీ బాగ్ ను ప్రాంతీయంగా కంబర్ తలావు సరుస్సు అని కూడా అంటారు.ప్రకృతి ప్రియులు ,పక్షులను తిలకించే వారికీ ఎంతో నచ్చే మోతీ బాగ్ సరస్సు ను ఎన్నో వలస పక్షులు తమ తాత్కాలిక నివాసంగా ఏర్పాటు చేసుకొంటాయి.

చిత్రకృప : Dharmadhyaksha

కుడల్ సంగం

కుడల్ సంగం

కుడల్ సంగం ఒక చారిత్రక ప్రాధాన్యత కల్గిన తీర్థయాత్ర కేంద్రం సోలాపూర్ జిల్లా లో సైన, భీం నదుల ఒడ్డున గల ఈ ప్రాంతం ఒక ఉత్తమ పర్యాటక ప్రదేశం. కుడల్ సంగం నందు హేమండ్పతి శైలిని పోలి పురాతన దేవాలయం ఉంది.

చిత్రకృప : Siddhartha8

రేవణ సిద్దేశ్వర మందిర్

రేవణ సిద్దేశ్వర మందిర్

సోలాపూర్ జిల్లా లోని మోతీ బాగ్ తలావు లేదా సరస్సు, నన్నాజ్ లోని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంక్చురి దగ్గరలోని పురాతన దేవాలయమైన రేవణ సిద్దేశ్వర మందిర్ ఉంది. ఇక్కడ మకర సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

చిత్రకృప : Coolgama

నన్నాజ్ _ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అభయారణ్యం

నన్నాజ్ _ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అభయారణ్యం

సోలాపూర్ జిల్లాలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం వలన ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది.భారత బట్టమేక పిట్ట, సాధారణ ముంగీస, భారత నక్క, హైనా, క్రిష్ణ జింక , తోడేలు ఈ సంరక్షణకేంద్రం పరిసరాలలో కనబడే కొన్ని జంతువులు.

చిత్రకృప : Madhukar B V

నాల్దర్గ్

నాల్దర్గ్

సోలాపూర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో కల నల్దర్గ్ కోట ఒక ప్రసిద్ధ చారిత్రిక కట్టడం. ఇది మహారాష్ట్ర లోని ఒస్మనాబాద్ జిల్లాలో ఉంది. మహారాష్ట్ర అంతటా వ్యాపించిన అనేక కోటలలో ఈ కోటలోని వాస్తు శైలి కనివిని ఎరుగని ఒక విశిష్టత ను కల్గి ఉంది.

చిత్రకృప : Siddhartha8

వేల పుర

వేల పుర

వేల పుర అనే చిన్న గ్రామం షోలాపూర్ జిల్లా లో పంధర్ పుర నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ గ్రామానికి ఈశాన్య దిక్కున చారిత్రికంగా ప్రాధాన్యత కల్గిన ఒక ముఖ్య దేవాలయం ఉంది. ఇది హేమండ్పతి వాస్తు శైలి లో నిర్మించబడి పురాతన అందానికి తార్కాణంగా కలదు.

చిత్రకృప : Coolgama

అసర్ మహల్

అసర్ మహల్

అసర్ మహల్ అప్పటి రాజుల కాలంలో న్యాయస్థానంగా వాడారు. 1646 లో మొహమ్మద్ ఆదిల్ షా నేతృత్వంలో దీనిని నిర్మించారు. నిర్మాణం సుమరు మూడున్నర శతాబ్దాల కిందటిది.

చిత్రకృప : Alende devasia

సిద్దేశ్వర్ దేవాలయం

సిద్దేశ్వర్ దేవాలయం

సిద్దేశ్వర దేవాలయం ఒక అందమైన సరస్సు మధ్య ఉండి అన్ని వైపుల నీటితో చుట్టబడి ఉంది.ఈ దేవాలయం శ్రీ మల్లికార్జునుని శిష్యునిచే నిర్మించబడినది. సిద్దేశ్వర విగ్రహం అదే పేరుతో గల పరమశివుని, విష్ణుదేవుని పవిత్ర అవతారాలను తెలియ చేస్తుంది.

చిత్రకృప : Dharmadhyaksha

చాంద్ బావడి

చాంద్ బావడి

ఆదిల్ షా 1557 లో చాంద్ బాడి చెరువును నిర్మించాడు. బీజాపూర్ కు తూర్పు సరిహద్దున కల ఈ చెరువు నిర్మించడానికి సుమారు మూడు సంవత్సరాలు పట్టింది. రాజకుటుంబీకులు తమ వినోదానికి విరామ సమయాన్ని గడపడానికి తర్వాత దీనిచుట్టు ఒక సంక్లిష్ట సున్నిత నిర్మాణం కట్టారు.

చిత్రకృప : Manoj saini12345

ఏక్ రుఖ్ హిప్పర్గ తలావు

ఏక్ రుఖ్ హిప్పర్గ తలావు

ఎకరుఖ్ హిప్పర్గ తలావు వాస్తవానికి హిప్పర్గ తలావ్ గా పిలువబడే హిప్పర్గ సరస్సు ఎక్ రుఖ సరస్సుల కలయికతో ఏర్పడినది. ఎకరుఖ్ చెరువు ఈ సరస్సుకు అనుకొని ఉంది.

చిత్రకృప : Ameyaket

భాగ్వంత్ దేవాలయం

భాగ్వంత్ దేవాలయం

సోలాపూర్ జిల్లాలోని ప్రధాన కేంద్రమైన బర్షి నందు భాగ్వంత్ దేవాలయం ఉంది. భారతదేశంలో భగ్వ౦త్ పేరున హిందూ దేవుడైన మహావిష్ణునకు నిర్మించిన ఒకే ఒక్క దేవాలయమని నమ్ముతారు.

చిత్రకృప : Dharmadhyaksha

ఇంద్ర భవన్

ఇంద్ర భవన్

ఇంద్ర భవనం 1907 లో ఒక శతాబ్దం క్రితం నిర్మించి ప్రారంభించబడినది. దీనిని దివంగత శ్రీ అప్పసాహేబ్ వరద్ ఏర్పాటు చేసారు.ఈ ఆకర్షణను ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చూడవచ్చు.

చిత్రకృప : Coolgama

కర్మల

కర్మల

మతపరంగా ప్రాముఖ్యత కల్గిన అనేక దేవాలయాలు కల్గిన గ్రామం కర్మల. బర్షి, మంగల్వేద తో కలిపి ఈ మూడు ప్రాంతాలు చారిత్రిక ప్రాధాన్యత కల్గి ఇక్కడ నివసించిన చాల మంది సాధువుల వలన తీర్థ యాత్ర స్థలాలుగా అభివృద్ధి చెందాయి. కర్మలలో దేవాలయ వాస్తు శైలి ఒక విశిష్టత ను కల్గి ఉంటుంది.

చిత్రకృప : Aakashsadekar

హోతగి

హోతగి

మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాకు దగ్గరగా ఉన్న హోతగి ఒక అందమైన చిన్న నగరం. ఇక్కడ హిందూ భక్తులలో ఎంతో ప్రసిద్ధి చెందిన సాయి బాబా దేవాలయం ఉంది. ఇతర తీర్థయాత్ర ప్రాంతాలైన తుల్జాపూర్, పంధర్ పుర, ఉస్మానాబాద్ దగ్గరలో ఉన్నాయి.

చిత్రకృప : Shikhaverma117

రామలింగేశ్వర మందిర్

రామలింగేశ్వర మందిర్

సోలాపూర్ జిల్లాకు 70 కిలోమీటర్ల దూరంలో అందమైన రామలింగేశ్వర మందిర్ ఉంది.ఈ గొప్ప దేవాలయ పరిసర ప్రాంతాలు తమ కుటుంబ సభ్యులతో మీ విలువైన సమయాన్ని గడపడానికి, వినోదాన్ని పొందడానికి ఎంతో ఉత్తమమైనవి.

చిత్రకృప : Siddhartha8

శ్రీ దాహిగాన్ తీర్థం

శ్రీ దాహిగాన్ తీర్థం

తుల్జాపూర్ గ్రామంలో గల తీర్థం వలె శ్రీ దాహిగాన్ తీర్థ్ కూడా సోలాపూర్ జిల్లాలో అదే పేరుతో గల గ్రామంలోని ఒక ప్రసిద్ధ జైన తీర్థయాత్ర ప్రాంతం. ఈ ప్రార్ధన మందిరం 244 సెంటిమిటర్ ఎత్తుగల నల్ల రంగు భగవాన్ మహావీరుని విగ్రహాన్ని కల్గి ఉంది.

చిత్రకృప : Nvvchar

మంగళ వేదనకు చెందిన సంత్ దమజి

మంగళ వేదనకు చెందిన సంత్ దమజి

సోలాపూర్ జిల్లాలో పశ్చిమాన 55 కిలోమీటర్లదూరంలో మరొక తీర్థ్ ప్రాంత౦ పంధర్పుర్ నకు 25 కిలోమీటర్ల దూరంలో గల మంగళ వేద నగరంలో ఈ దేవాలయం ఉంది.

చిత్రకృప : vivek Joshi

సోలాపూర్ ఎలా చేరుకోవాలి ?

సోలాపూర్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం : సోలాపూర్ లో విమానాశ్రయం కలదు. ఇక్కడికి ముంబై, నాగ్ పూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి విమానాలు వస్తుంటాయి. ఎయిర్ పోర్ట్ బయట క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని నగరంలోకి ప్రవేశించవచ్చు.

రైలు మార్గం : సోలాపూర్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి ముంబై, పూణే, నాగ్ పూర్, హైదరాబాద్, గుల్బర్గా ప్రాంతాల నుండి తరచూ రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం : మహారాష్ట్ర లోని అన్ని ప్రధాన నగరాలతో సోలాపూర్ చక్కగా కనెక్ట్ చేయబడింది. హైదరాబాద్ - పూణే - ముంబై హై వే మీద సోలాపూర్ కలదు. బస్సులు హైదరాబాద్ నుండి కూడా వెళుతుంటాయి.

చిత్రకృప : Coolgama

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X