Search
  • Follow NativePlanet
Share
» »షోలాపూర్ లో ఫేమస్ గోల్ గుంబజ్ తో పాటు మరిన్ని ఆకర్షణీయమైన ప్రదేశాలు..

షోలాపూర్ లో ఫేమస్ గోల్ గుంబజ్ తో పాటు మరిన్ని ఆకర్షణీయమైన ప్రదేశాలు..

షోలాపూర్ పారిశ్రామికంగా అభివృద్ధితో పాటు, ఆధ్యాత్మికంగా కూడా చెప్పుకోదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కల్ కోట మల్లికార్జున ఆలయంలో ప్రతి రోజూ అనేమంది లింగాయత భక్తులు శివుడిని ఆరాధిస్తుంటారు.

మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో బాగా ప్రసిద్ది చెందినది, పేరుగాంచినది షోలాపూర్ జిల్లా ఒకటి. షోలాపూర్ రాష్ట్రంలో భీమా మరియు సీనా నదీమైదానాలా మద్య విస్తరించి ఉంది. సుమారు 14,850 చదరపు కిలోమీటర్ల లలో వ్యాపించిన మహారాష్ట్ర లోని ముఖ్యమైన నగరాలలో ఒకటైన షోలాపూర్ ఉత్తరాన ఉస్మానాబాద్, అహ్మద్ నగర్ జిల్లాలను, పశ్చిమాన సతారా, పూనేలను, దక్షిణాన బీజాపూర్, సాంగ్లీ లను, తూర్పున గుల్బర్గా జిల్లాను కలిగి ఉంది.ఇది మరాఠీ, కన్నడ, తెలుగు మొదలైన వివిధ సంస్కృతులు చెప్పుకోలేనంతగా కలగలిసిన గొప్ప ప్రాంతం.

షోలాపూర్ పారిశ్రామికంగా అభివృద్ధితో పాటు, ఆధ్యాత్మికంగా కూడా చెప్పుకోదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కల్ కోట మల్లికార్జున ఆలయంలో ప్రతి రోజూ అనేమంది లింగాయత భక్తులు శివుడిని ఆరాధిస్తుంటారు.ఇంకా ప్రత్తి మిల్లులకు, మరమగ్గాలకు పస్రసిద్ధి చెందిన పట్టణం. సోలాపూర్ దుప్పట్లు, ఛద్దర్‌లు దేశమంతటా ప్రసిద్ధి చెందాయి.

షోలాపూర్ ను ఆరంభకాలంలో బదామీ చాళుక్యులు పరిపాలించారు. వారి రాజధానులు కన్నడ దేశంలో ఉండేవి. వీరిని కుంతలేశ్వర్లు అని కూడా పిలిచేవారు. షోలాపూర్ చాళుక్యులు, యాదవులు, ఆంధ్ర భ్రుత్యులు, రాష్ట్రకూటులు, బహమనీలు పాలించిన చరిత్రను కలిగిఉంది. బహమనీ రాజుల వద్ద నుండి షోలాపూర్ ను బీజాపూర్ రాజులు వశం చేసుకున్నారు. తరువాతి కాలంలో అది మరాఠా పాలకుల వశమైనది.

సైనా నది ఒడ్డున గల షోలాపూర్

సైనా నది ఒడ్డున గల షోలాపూర్

సైనా నది ఒడ్డున గల షోలాపూర్ మహారాష్ట్రలో ఒక ప్రధాన జైన మతకేంద్రంగా గుర్తింపు పొందింది. హిందీలో సోలా అ౦టే పదహారు, పూర్ అనగా గ్రామం - అనే దాన్నిబట్టి జిల్లాకు ఈ పేరువచ్చిందని చరిత్రకారుల నమ్మకం. కాగా,ముస్లిం పాలకుల కాలంలో షోలాపూర్ సందల్పూర్ గా పిలవబడి౦దని కొందరు అంటారు. అయితే, బ్రిటీష్ పాలకుల వశం అయిన తరువాత నా తీసివేయబడి షోలాపూర్ గా పిలువబడింది. షోలాపూర్ లో చూడదగిన ఆకర్షణీయమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో

PC: Ameyaket

కాశీగా పిలువబడే పంధర్పూర్

కాశీగా పిలువబడే పంధర్పూర్

భారత దేశంలో దక్షిణ కాశీగా పిలువబడుతున్న పంథర్పూర్ గల ప్రాంతంగా సోలాపూర్ ప్రసిద్ది చెందినది. పంథర్పూర్ దేశ వ్యాప్తంగా విఠోబా దేవుని ప్రధాన మత కేంద్రానికి ప్రతీక. కార్తీక, ఆషాడ, ఏకాదశి పర్వదినాల్లో షుమారు నాలుగు నుండి ఐదు లక్షల మంది తీర్థ యాత్రీకులు ఇక్కడి వస్తారు.

PC: Uddhavghodake

 అక్కల్ కోట:

అక్కల్ కోట:

దత్తత్రేయుడి అవతారమైన శ్రీ స్వామి సమర్థ మహారాజ్ ఆలయం ఇది. ఇక్కడి వటవృక్ష దేవాలయం, స్వామి మఠం చూడదగినవి. జనవరిలో ఇక్కడ జరిగే "గడ్డ తిరుణాలకు" చాలామంది యాత్రికులు పొరుగు రాష్ట్రాలనుండి కూడా వస్తారు.PC: Vishwasrao

సిద్దేశ్వర ఆలయం :

సిద్దేశ్వర ఆలయం :

సరస్సు మధ్యలో అద్భుతంగా నిర్మించిబడిన ఆలయం సిద్దేశ్వర ఆలయం. సిద్దేశ్వర దేవాలయం ఒక అందమైన సరస్సు మధ్య ఉండి అన్ని వైపుల నీటితో చుట్టబడి ఉంది.

Photo Courtesy : commons.wikimedia.org

సిద్దేశ్వర ఆలయం :

సిద్దేశ్వర ఆలయం :

షోలాపూర్ నగరం మొత్తానికి మనోహర దృశ్యాల పర్యాటక ప్రాంతంగా భావి౦చబడుతుంది.ఈ దేవాలయం శ్రీ మల్లికార్జునుని శిష్యునిచే నిర్మించబడినది. అక్కడ మకర సంక్రాంతికి పెద్దయెత్తున ఉత్సవాలు జరుగుతాయి.

PC: Uddhavghodake

మోగీబాగ్ సరస్సు:

మోగీబాగ్ సరస్సు:

ఇది ఒక అద్భుతమైన ప్రదేశం శీతాకాలంలో వేలా వలస పక్షులు ఇక్కడికి వస్తాయి. మోతీ బాగ్ ను ప్రాంతీయంగా కంబర్ తలావు సరుస్సు అని కూడా అంటారు.ప్రకృతి ప్రియులు ,పక్షులను తిలకించే వారికీ ఎంతో నచ్చే మోతీ బాగ్ సరస్సు ను ఎన్నో వలస పక్షులు తమ తాత్కాలిక నివాసంగా ఏర్పాటు చేసుకొంటాయి.

PC-Dharmadhyaksha

నాల్దర్గ్ కోట

నాల్దర్గ్ కోట

షోలాపూర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో కల నల్దర్గ్ కోట ఒక ప్రసిద్ధ చారిత్రిక కట్టడం. ఇది మహారాష్ట్ర లోని ఒస్మనాబాద్ జిల్లాలో ఉంది. మొఘల్ సామ్రాజ్యానికి వశం కాకముందు గతంలో బహమనీ సుల్తానుల ఆధీనంలో ఉన్నపుడు ఈ కోటను ఎరాల్ గా పిలిచేవారు.

PC-Damitr

గోల్ గుంబద్

గోల్ గుంబద్

షోలాపూర్ నగరం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజాపూర్ గ్రామంలో గోల్ గుంబద్ ఉంది. దీని విశిష్ట మైన వాస్తు శైలి వల్ల భారతదేశ పురాతన సాంస్కృతిక చరిత్ర నందు ఒక అత్యంత ప్రముఖ స్థానాన్ని కల్గి ఉంది. ఈ కప్పు పాదాన్ని తామర, గులాబీ దళాలు చుట్టి అప్పుడే వికసించుచున్న మొగ్గ వలె కనిపించే ఈ గోల్ గుంబద్ అంటే సాహిత్యంలో గులాబీ కప్పు అనే అర్ధం ఉంది. ఆ కాలంలోని ప్రసిద్ధ వాస్తు శిల్పి అయిన యఖూత్ అఫ్ దబుల్ చే 1656 లో నిర్మించబడిన ఈ కట్టడం ప్రధానంగా అప్పటి బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా స్మారకార్థం కట్టిన సమాధి.

Photo Courtesy : Ashwin Kumar

భుయికోట్ కోట

భుయికోట్ కోట

షోలాపూర్ పరిసరాలలో భుయికోట్ కోట ఒక ప్రధాన ఆకర్షణ. క్రీ.శ. 14 వ శతాబ్దంలో మధ్య యుగంలో బహమనీ వంశ పాలనలోనే దీనిని కట్టారు. ఈ కోట లో ఔరంగజేబు కొంత సమయం గడిపాడనడానికి చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. రెండో పీష్వా బాజీరావు నకు ఈ కోట ను అప్పగించిన తర్వాత అతను ఇక్కడే నివసించాడు.బాతులు, నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు, ఇంకా అనేక జంతువులు కల్గిన జంతువుల పార్క్ కల్గిన ప్రాంతంగా ఈ కోట ప్రసిద్ధి చెందింది.

Photo Courtesy : Glasreifen

కుడల్ సంగం

కుడల్ సంగం

కుడల్ సంగం ఒక చారిత్రక ప్రాధాన్యత కల్గిన తీర్థయాత్ర కేంద్రం షోలాపూర్ జిల్లా లో సైన, భీం నదుల ఒడ్డున గల ఈ ప్రాంతం ఒక ఉత్తమ పర్యాటక ప్రదేశం.ఈ ప్రదేశపు చరిత్ర సుమారు 800 సంవత్సరాల కిందటిది.కుడల్ సంగం నందు హేమండ్పతి శైలిని పోలి పురాతన దేవాలయం ఉంది. భారత దేశం లో మరి ఎక్కడ కనబడని ప్రత్యేకమైన రీతిలో ఇక్కడి లింగం ఉంటుంది.

Photo Courtesy : Dharmadhyaksha

పండరీపురం (లార్డ్ విఠోబా ఆలయం)

పండరీపురం (లార్డ్ విఠోబా ఆలయం)

దేశంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలలో పండరీపురం ప్రత్యేకతను గురించి చెప్పాల్సిన పనిలేదు. లాపూర్‌ నుంచి పడమరగా సుమారు 70కి.మీ దూరంలో పండరీపురం ఉంది. ఆలయం చుట్టూ సుమారు 100 గజాల పొడవు, అంతే వెడల్పు ఉన్న ఎత్తయిన ప్రహరీ గోడ ఉంది. గోడ లోపలి ప్రాంగణంలో పాండురంగని ఆలయం, దాని వెనుకభాగంలో రుక్మిణీదేవి ఆలయం ఉన్నాయి. ఆలయం దగ్గర నుంచి 200మీ. దూరంలో భీమానది ఉంది. పండరీపురం ఊరికి రెండుపక్కలా ఉన్న సరిహద్దుల లోపల నదీ భాగాన్ని మాత్రం చంద్రభాగనది అని పిలుస్తారు.

PC: Parag Mahalley

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

విమాన మార్గం: సోలాపూర్ ఎయిర్ పోర్ట్ బెస్ట్ ఆప్షన్. విమానంలో చేరుకోవాలని కోరుకునే వారికి ఇది ఒక మంచి మార్గం. ఈ ఎయిర్ పోర్ట్ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల నుండి అనుసందానించబడినది.

రోడ్ మార్గం: సోలాపూర్ చేరుకోవడానికి రైల్వే ష్టేషన్ ఉంది. ఈ స్టేషన్ అన్ని సిటీల నుండి లోకల్ మరియు ఔట్ స్టేషన్ల ట్రైయిన్స్ ను మరియు టౌన్ల నుండి కనెక్ట్ చేయబడినది.

రోడ్ మార్గం: సోలాపూర్ కు మహరాష్ట్రాలోని ప్రధాన నగరాల నుండి రోడ్ మార్గం కనెక్ట్ చేయబడినది. సోలాపూర్ కు సుమారు 400కిలోమీటర్ల దూరం ముంబాయ్ ఉంది.. ఇక్కడ నుండి రెగ్యులర్ స్టేట్ సర్వీస్ బస్సులు మరియు టూర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే పూనె, ఔరంగాబాద్, నాగ్ పూర్ ఇతర ప్రదేశాల నుండి రోడ్ మార్గం ఉంది. మెట్రో సిటీస్ అయిన బెంగళూరు మరియు డిల్లీ నగరాలకు కూడా రోడ్ మార్గం ఉంది

PC:: Coolgama

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X