Search
  • Follow NativePlanet
Share
» »సంస్కృతి ప్రాముఖ్య‌త‌ను తెలిపే కొన్ని పురాత‌న న‌గ‌రాలు

సంస్కృతి ప్రాముఖ్య‌త‌ను తెలిపే కొన్ని పురాత‌న న‌గ‌రాలు

ప్రపంచంలోని పురాతన నాగరికతలలో మ‌న దేశం ఒకటిగా నిలుస్తూ మ‌న సంస్కృతి ప్రాముఖ్య‌త‌ను చాటిచెబుతోంది.

దేశం న‌లుమూల‌లా చాలా ప్రదేశాలలో చెప్పుకోడానికి అనేక కథలు ఉన్నాయి.

సంస్కృతి ప్రాముఖ్య‌త‌ను తెలిపే కొన్ని పురాత‌న న‌గ‌రాలు

సంస్కృతి ప్రాముఖ్య‌త‌ను తెలిపే కొన్ని పురాత‌న న‌గ‌రాలు

ఈ పురాతన నగరాలను సందర్శించడం వల్ల మీ స‌హ‌జ‌ జ్ఞానాన్ని మెరుగుపరచుకోవడంలో సహాయపడటమే కాకుండా వాటి చరిత్రను, వాటి గొప్ప‌త‌నాన్ని భ‌విష్య‌త్తు త‌రాల‌కు అందించ‌వ‌చ్చు. ఈ పురాతన నగరాలు కేవలం చారిత్ర‌క విశేషాల ద‌గ్గ‌రే నిలిచిపోలేదు. అవి వాణిజ్యం, కళలు, వాస్తుశిల్పం, సంస్కృతి, విద్యలాంటి అనేక సామాజిక అంశాల‌తో ముడిప‌డిన ముఖ్యమైన కేంద్రాలుగా నిలిచిపోతాయి.
భారతదేశంలోని కొన్ని అత్యుత్తమ పురాతన నగరాల జాబితాను చూద్దాం.

వారణాసి

వారణాసి

11వ శతాబ్దానికి చెందిన చరిత్రతో, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా సందర్శించాల్సిన‌ పురాతన నగరం. దీనిని భారతదేశం యొక్క ఆధ్యాత్మిక రాజధాని అని కూడా పిలుస్తారు. ఈ పవిత్ర నగరాన్ని సందర్శించడానికి ప్రపంచ నలుమూలల నుండి యాత్రికులు వ‌స్తూ ఉంటారు. వారణాసిలో ఉన్నప్పుడు, సాయంత్రం గంగా హారతి మీరు మిస్ చేయకూడని అనుభవమ‌నే చెప్పాలి. ఇక్క‌డి ఘాట్‌ల ప్రాముఖ్య‌త జీవితాంతం మరచిపోలేని అనుభూతుల‌ను మిగుల్చుతుంది.

ఉజ్జ‌యిని

ఉజ్జ‌యిని

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పురాతన ఆలయ పట్టణం. దీనికి ఐదు వేల సంవత్సరాలకు పైగా పురాత‌న చ‌రిత్ర ఉన్న‌ట్లు చెబుతారు. అంతటి పురాతనమైన ఈ నగరానికి ఎన్నో మనోహరమైన కథలు ప్ర‌చారంలో ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని కూడా ఒకటి. ఇందులో అతి ముఖ్యమైనది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఐదు జంతర్ మంతర్లలో ఒకటి కూడా ఇక్కడే ఉంది. మహారాజా జై సింగ్ II ఉజ్జయిని గవర్నర్‌గా ఉన్నప్పుడు, 18వ శతాబ్దపు అబ్జర్వేటరీ అయిన ఉజ్జయిని జంతర్ మంతర్‌ను నిర్మించాడు. ఇది ఇప్పటికీ సంద‌ర్శ‌నీయంగా ఉంది. ఇది సందర్శించే వారిని ఆకర్షించేలా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్తరూపు సంత‌రించుకుంటోంది.

రాజ్‌గిర్

రాజ్‌గిర్

బీహార్‌లోని ఈ పురాతన నగరం నలంద జిల్లాలో ఉంది. హిందువులు, బౌద్ధులు మరియు జైనుల యొక్క అనేక పురాతన గ్రంథాలు ఇక్క‌డ నిక్షిప్తం చేయ‌బ‌డ్డాయి. రాజ్‌గిర్ హర్యంకాలు, ప్రద్యోతలు, మౌర్యుల వంటి శక్తివంతమైన రాజవంశాలకు ముఖ్యమైన స్థానం రాజ్‌గిర్‌. రాజ్‌గిర్‌లో నలంద పురాతన విశ్వవిద్యాలయం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

అయోధ్య

అయోధ్య

ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య శ్రీరాముడితో అనుబంధం కలిగి ఉందనే విస్వాసం భార‌తీయుల్లో ఉంది. అందుకే దీనిని రామ జన్మభూమి లేదా రామ జన్మస్థలం అని కూడా పిలుస్తారు. అయోధ్య భారతదేశంలోని హిందువులకు అత్యంత ముఖ్యమైన ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటి.

మధురై

మధురై

పురాతన గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్ యొక్క ప్రయాణ కథనాలతోపాటు వివిధ పరిశోధనల ప్రకారం, మదురై చరిత్ర 3వ శతాబ్దం నాటిది. ఈ పురాతన ఆలయ పట్టణం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన హిందూ తీర్థయాత్రలలో ఒకటి. ఇక్కడ గంభీరమైన మీనాక్షి అమ్మన్ ఆలయం ఆకట్టుకునేలా ద‌ర్శ‌నిమిస్తోంది! ఇక్క‌డ చూడ‌ముచ్చ‌ట‌గొలిపే చక్కటి హస్తకళ, నిర్మాణ నైపుణ్యాలు భారతదేశంలో మరెక్కడా క‌నిపించ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

వైశాలి

వైశాలి

బీహార్‌లోని వైశాలి జిల్లా 600 BC నాటి చరిత్రతో మహాభారత కాలం నాటి పురాతన నగరంగా పేరుగాంచింది. జైనమతం మరియు బౌద్ధమతం యొక్క ప్రాచీన గ్రంథాల ప్రకారం, 6వ శతాబ్దంలో, వైశాలి గణతంత్ర రాజ్యంగా స్థాపించబడింది. ఇది ప్రపంచంలోని పురాతన రిపబ్లిక్‌లలో ఒకటిగా నిలిచింది. జైనులు మరియు బౌద్ధులు ఇద్దరికీ వైశాలి ఒక ముఖ్యమైన తీర్థయాత్రా స్థ‌లం. చివరి జైన తీర్థంకర భగవానుడు మహావీర్ జన్మస్థలం వైశాలి. ఇక్క‌డే బౌద్ధులకు బుద్ధుడు తన చివరి ఉపన్యాసం ఇవ్వ‌డంతోపాటు జ్ఞానోదయం పొందినట్లు ప్రకటించాడు.

తంజావూరు

తంజావూరు

తంజావూరు భారతదేశంలోని పురాతన న‌గ‌రం. అంతేకాదు, అత్యంత గొప్ప సాంస్కృతిక న‌గ‌రంగా కూడా పేరుగాంచింది. ఈ నగరం దక్షిణ భారత కళ, వాస్తుశిల్పం మరియు మతానికి ముఖ్యమైన కేంద్రం. తంజావూరు పెయింటింగ్, కర్ణాటక సంగీతానికి విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. చోళుల కాలం నాటి అనేక దేవాలయాల నిల‌యం కావ‌డంతో గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్ అని పిలుస్తారు. దీంతోపాటు తంజావూరు అనేక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు నిలయంగా ఉంది.

Read more about: varanasi ujjain
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X