Search
  • Follow NativePlanet
Share
» »కోలార్ లో సోమేశ్వర దేవాలయం గొప్ప ఆకర్షణ..

కోలార్ లో సోమేశ్వర దేవాలయం గొప్ప ఆకర్షణ..

కోలార్ లో సోమేశ్వర దేవాలయాలు గొప్ప ఆకర్షణ..

ఇండియాలో గోల్డెన్ సిటీగా పిలవబడుతున్నది. కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లా ఉంది. ఈ ప్రదేశం గోల్డ్ మైనింగ్ కు చాలా ప్రసిద్ది. కోలార్ సిల్క్, పాలు, మామిడిపండ్లు మరియు బంగారానికి ప్రసిద్ది. కోలార్ చుట్టు ప్రక్కల మైదానాల్లో బంగారు గనులు ఉండటం వల్ల ఈ ప్రదేశానికి గోల్డెన్ సిటి అని, ఎక్కువగా పండ్లు దొరకడం వల్ల నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. కోలార్ సిటిలో సోమేశ్వరస్వామి దేవాలయం మరియు కోలారమ్మ దేవాలయం చాలా ప్రసిద్ది. కోలారమ్మనే కోలార్ నగరంగా పరిగణించబడుతోంది.

కోలార్ పట్టణంలోని ఆలయాలలో కొలరమ్మ ఆలయం మరియు సోమేశ్వరాలయం ప్రధానమైనవి

కోలార్ పట్టణంలోని ఆలయాలలో కొలరమ్మ ఆలయం మరియు సోమేశ్వరాలయం ప్రధానమైనవి

కోలార్ పట్టణంలోని ఆలయాలలో కొలరమ్మ ఆలయం మరియు సోమేశ్వరాలయం ప్రధానమైనవి. శక్తి ప్రధానదైవంగా ఉన్న ఈ ఆలయం 2వ శతాబ్దంలో గంగాచక్రవర్తులు చోళసంప్రదాయం అనుసరించి విమానగోపురంతో నిర్మించారు. 10వ శతాబ్దంలో ఈ ఆలయం మొదటి రాజేంద్రచోళుని కాలంలో మరియు 15వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తులు పునరుద్ధరించబడింది. సోమేశ్వరాలయం 14వ శతాబ్ధపు విజయనగర సామ్రాజ్య నిర్మాణవైభవానికి చిహ్నంగా ఉంది.

కోలార్ జిల్లాలో సోమేశ్వర దేవాలయాన్ని తప్పక చూడదగ్గ

కోలార్ జిల్లాలో సోమేశ్వర దేవాలయాన్ని తప్పక చూడదగ్గ

కోలార్ జిల్లాలో సోమేశ్వర దేవాలయాన్ని తప్పక చూడదగ్గ వాటిలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ ఉన్న సోమేశ్వరుడిని శివుని యొక్క అవతారాలలో ఒకటిగా భావిస్తారు, ఈ ఆలయం కోలార్ పట్టణానికి మధ్యలో ఉంది. ఈ యాత్రాస్థలం విజయనగర నిర్మాణ శైలితో 14 వ శతాబ్దంలో నిర్మించబడింది.

విజయనగర నిర్మాణ శైలిలో కోలార్ పట్టణానికి

విజయనగర నిర్మాణ శైలిలో కోలార్ పట్టణానికి

విజయనగర నిర్మాణ శైలిలో కోలార్ పట్టణానికి మధ్యలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆలయం లోపల పాశ్చాత్య దేశాల నిర్మాణ శైలి ని పోలి ఉండే కళ్యాణ మండపం, స్తంభాలు గమనించవచ్చు.

ఈ స్థలం లోపల ఒక కళ్యాణ మండపం ఉంది,

ఈ స్థలం లోపల ఒక కళ్యాణ మండపం ఉంది,

ఈ స్థలం లోపల ఒక కళ్యాణ మండపం ఉంది, దాని స్తంభాలు ఎంతో క్లిష్టమైన చేక్కుడుతో చాల అందంగా ఉంటాయి. ఈ స్తంభాలపై కనిపించే చెక్కుడు చైనీస్, యురోపియన్, థాయి నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. కళ్యాణ మండపం పైభాగం చైనీస్ శైలిలో రూపకల్పన చేయబడింది.

సోమేశ్వర దేవాలయం వద్ద భారతదేశ, విదేశీ భూముల

సోమేశ్వర దేవాలయం వద్ద భారతదేశ, విదేశీ భూముల

సోమేశ్వర దేవాలయం వద్ద భారతదేశ, విదేశీ భూముల నిర్మాణ శైలుల సమ్మేళనం వలన విజయనగర సామ్రాజ్య సమయంలో వ్యాపారానికి వున్న ప్రాముఖ్యతని తెలియచేస్తుంది.

 ఈ దేవాలయంలో ప్రధానంగా వినాయకుడు, సోమేశ్వర స్వామిగా పూజింపబడుతున్న

ఈ దేవాలయంలో ప్రధానంగా వినాయకుడు, సోమేశ్వర స్వామిగా పూజింపబడుతున్న

విజయనగర సామ్రాజ్యం కాలం నాటి నిర్మించన ఆలయం ఇది. విజయనగర కాలం నాటి కళాకారులు అద్భుతమైన నైపుణ్యంతో నిర్మింపబడిన ఈ దేవాలయంలో ప్రధానంగా వినాయకుడు, సోమేశ్వర స్వామిగా పూజింపబడుతున్న ఆ పరమశివుడు కొలువుతీరి ఉన్నారు.

 పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా

పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా

పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా విభాగం ద్వారా ఈ దేవాలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా పరిగణించబడుతుంది. ఆ ఆలయం ఉదయం 7 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరవబడి ఉంటుంది.

కొలరామా దేవాలయం

కొలరామా దేవాలయం

కొలరామా దేవాలయం సోమేశ్వర దేవాలయం నుండి సుమారుగా 8 మీటర్ల దూరంలో ఉంది. గంగా రాజవంశం సమయంలో ఈ ఆలయం 100 శతాబ్దంలో నిర్మించబడింది అని నమ్ముతారు.
గంటలు: 5.30 నుండి 13.30 వరకు మరియు 17.00 నుండి 20.00 వరకు.

సోమేశ్వర దేవాలయంలో హిందువుల దైవం శివలింగం

సోమేశ్వర దేవాలయంలో హిందువుల దైవం శివలింగం

సోమేశ్వర దేవాలయంలో హిందువుల దైవం శివలింగం ఉంటుంది. ఎంతో మహిమాన్విత లింగంగా భక్తులు దీనిని ఆరాధిస్తారు. ఈ దేవాలయ ఆవరణలో ఇంకా చిన్న గుళ్ళ శిధిలాలు కనపడుతూంటాయి. రికార్డులమేరకు ఈ దేవాలయం చోళ రాజుల కాలంలో నిర్మించబడింది. దేవాలయం పై చెక్కడాలు చరిత్ర ప్రసిద్ధి గాంచిన తండ్రి కుమారులైన జక్కనాచారి అతని కుమారుడు డంకనాచారి నిర్వహించారు. అన్నిటికంటే విశేషమైన అంశం ఏమంటే, ఈ దేవాలయం పూర్తిగా రాళ్ళతోనే చెక్కబడింది. దీనికి పునాదులు లేవు.

కోలార్ లో ఇతర ఆకర్షణలు

కోలార్ లో ఇతర ఆకర్షణలు

కోటి లింగేశ్వర టెంపుల్ : కోలార్ గోల్డ్ మైనింగ్ ఫీల్ట్స్ కు 6కిలోమీటర్ల దూరంలో కోటిలింగేశ్వర ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో శివుడు ప్రధాన దేవుడు. ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న ఆలయం. ఈ ఆలయంలో 108 అడుగుల పొడవున్న శివలింగంతో పాటు వేల కొద్ది చిన్న చిన్న శివలింగాలు నిర్మితమై పర్యాటకులను ఒక్కసారిగా భక్తిభావంలోనికి తీసుకెళుతుంది. అలాగే శివలింగానికి ఎదురుగా 35అడుగుల ఎత్తులో నంది విగ్రం నిర్మితమైంది. వివిధ పరిమాణాల్లో అనేక లింగాలు ఈ క్షేత్రంలో ఉండటం వల్ల కోటిలింగేశ్వర ఆయలయంగా పేరు పొందినది. ఆ కోటిలింగేశ్వర క్షేత్రం పర్యాటకుల ఆధ్యాత్మిక చింతనకు, ఆహ్లాదానికి చక్కటి ప్రదేశం
Photo Courtesy : Ramesh Kumar R

గోల్డ్ మైనింగ్ లాండ్స్:

గోల్డ్ మైనింగ్ లాండ్స్:

బెంగళూరు నుండి వీకెండ్ గేట్ వే ల్యాండ్ ఆఫ్ గోల్డ్ మైన్స్ కోలర్. వీకెండ్ లో పర్యాటకులకు ఒక చక్కటి ప్రదేశం. బెంగలూరు నుండి దాదాపు 69కిలోమీటర్ల దూరంలో ఉంది. గోల్డ్ ఫీల్డ్స్ కు రోబర్ట్ సోన్ పేట్ హెడ్ క్వాటర్స్ గా ఉంది. Photo Courtesy : Shyamal

కోలారమ్మ టెంపుల్:

కోలారమ్మ టెంపుల్:

కొన్ని వేల సంవత్సరాల నాటి ఆలయం కోలారమ్మ ఆలయం. ఈ ఆలయాన్ని చోళులు నిర్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. స్వయంగా పార్వతి దేవియే ఇక్కడ కొలారమ్మగా వెలిసినట్లు చెబుతారు. కోలార్ నగరాన్ని కోలారమ్మ రక్షింపబడుతోందని ఇక్కడి భక్తులు నమ్ముతారు. ఇంకా కోలారమ్మే చేలమ్మగా భక్తులు పూజిస్తారు. ఈ దేవత విషసర్పాల కాటులను నయం చేస్తుందని, ఇక్కడ ప్రజలు విశ్వస్తారు. కోలార్ బస్ స్టాండ్ నుండి 1.6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.

PC : Hariharan Arunachalam ( NIC )

అంతర్ గంగే గుహలు:

అంతర్ గంగే గుహలు:

కోలార్ ప్రధాన బస్ స్టాండ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంరరగగే గుహలు కోలార్ లో తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ కు ఔత్సాహికులకు అనుకూలంగా ఆకర్షిస్తుంటుంది. అంతర్ గంగే గుహలు శత్రుశుంగా పర్వతంపై ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్న ఒక అద్భుతమైన దేవాలయంను తప్పక సందర్శించాలి. దేవాలయానికి వెళ్ళే మార్గం చాలా నిటారుగా ఉంటుంది. దేవాలయం చుట్టూ కోనేరు నిండా నీటితో నిండి పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. కోనేరులోని నీరు నందిని నోటి నుండి నిరంతరం ప్రవహిస్తుంటుంది. కానీ ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో అది ఇప్పటికీ ఎవరూ కనుక్కోలేకపోతున్నారు. ఈ ఆలయం చుట్టు ప్రక్కల గుహలు ఉండటం వల్ల అంతరగంగే గుహలుగా పిలవబడుతోంది. ఈ ప్రదేశంలో ఉండే గ్రానైట్ శిలలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. PC : Vedamurthy J

ఆవని :

ఆవని :

ఒక కొండపై ఉన్న సీత ఆలయయానికి ప్రసిద్ధి చెందినది ఆవని. ఇండియాలో సీతా దేవికి అంకితం చేయబడిన ఆలయాల్లో ఒకటి ఆవని. దక్షిణ భారతదేశంలో దీనిని గయా అని కూడా పిలుస్తారు. నోలంబ రాజవంశం కాలానికి చెందిన రామలింగేశ్వర, లక్ష్మనేశ్వర, భరతేశ్వర మరియు శత్రుగనేశ్వర పురాతన దేవాలయాలు ఉన్నాయి. సీతా దేవికి లవ కుశలు జన్మించిన ప్రదేశంగా చెప్పబడుతుంది. ఈ ప్రదేశం కోలార్ జిల్లాకు సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ములబాగల్ తాలూకాలో ఉంది. Photo Courtesy : Dineshkannambadi

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

కోలార్ చేరుకోవటానికి బెంగళూరు నుండి చక్కటి రోడ్డు మార్గం కలదు. రైలు, విమాన మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
విమాన మార్గం 65 కి. మీ. దూరంలో ఉన్న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కోలార్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం. దేశ, విదేశాల నుండి ఇక్కడికి విమాన సౌకర్యాలు ఉన్నాయి. ట్యాక్సీ లేదా క్యాబ్ లలో ప్రయాణించి కోలార్ చేరుకోవచ్చు.
రైలు మార్గం కోలార్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇది పట్టణం నుండి 2 కి. మీ. దూరంలో కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఈ రైల్వే స్టేషన్ కలుపబడింది. అటోలలో ప్రయాణించి కోలార్ చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం కోలార్ గుండా జాతీయ రహదారి 4 వెళుతుంది. రాష్ట్ర సర్వీస్ బస్సులు మరియు ఇతర ప్రవేట్ సర్వీస్ బస్సులు బెంగళూరు, చిక్కబల్లాపూర్ ప్రాంతాల నుండి నిత్యం కోలార్ కు బయలుదేరుతుంటాయి. చిత్ర కృప : Somasekhar L

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X