Search
  • Follow NativePlanet
Share
» »ఈ నగరాలకు వెలితే అటువైపు అసలు వెళ్లకండి ఎందుకంటే ‘సుఖాల ఊబి’ఉంది

ఈ నగరాలకు వెలితే అటువైపు అసలు వెళ్లకండి ఎందుకంటే ‘సుఖాల ఊబి’ఉంది

భారత దేశంలో వేశ్య వృత్తి జరిగే ప్రాంతాలకు సంబంధించి

By Kishore

పుణ్యాత్ముల పై మాత్రమే నీళ్లు చిలకరించే జలపాతం.పుణ్యాత్ముల పై మాత్రమే నీళ్లు చిలకరించే జలపాతం.

యుగాంతాన్ని ఈ క్షేత్రంలో చీమలు, ఈగలు ముందుగా చెబుతాయియుగాంతాన్ని ఈ క్షేత్రంలో చీమలు, ఈగలు ముందుగా చెబుతాయి

భారత దేశంలో వ్యభిచారం చట్టబద్ధం కాదు. అయినా కూడా కొన్ని నగరాల్లో ఈ వేశ్య వృత్తి బహిరంగంగానే జరుగుతూ ఉంటుంది. మీరు ముఖ్యంగా యువకులు ఆయా నగరాలకు పర్యాటకానికి వెళ్లినప్పుడు పొరపాటున కూడా అక్కడకు వెళ్లకండి. వెలితే ఏమవుతుంది. మేము నిగ్రహ శక్తి ఉన్నవాళ్లమనే మీ సమాధానం అయితే సంతోషమే. అయితే మనిషిని కొన్ని పరిసర ప్రాంతాలు కొన్ని సార్లు బలహీనున్ని చేస్తాయి. ఆ సమయంలో మన మనస్సు మన వశం తప్పి తత్కాలిక 'సుఖాల'ల వెంట పరుగెడుతుంది. అలాంటి సమయంలో మీరు మీకు తెలియకుండానే ఆ 'సుఖాల ఊబి'లో దిగిపోతారు. ఈ కథనంలో అటువంటి చోటు ఉన్న ప్రదేశాలు మీ కోసం అంటే తప్పు చేయకుండా ఉండటం కోసమే గుర్తుంచుకోండి.

1. కామటిపుర ముంబై

1. కామటిపుర ముంబై

Image Source:

ముంబైలో తరతరాలుగా వేశ్య వృత్తి జరుగుతున్న ప్రాంతం. దీనిని ఇప్పుడు రెడ్ లైట్ ఏరియా అని పిలుస్తున్నా చాలా మందికి అది కామటి పురగానే పరిచయం. ఆసియాలోనే ఇది అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా. ఇక్కడ క్రిమినల్ క్రిమనల్ కార్యకలాపాలు కూడా ఎక్కువే.

2. జీబి రోడ్ ఢిల్లీ

2. జీబి రోడ్ ఢిల్లీ

Image Source:

ఢిల్లీలో వాణిజ్య పరంగా ఫేమస్ అయిన ప్రాంతం గాస్టిన్ బాస్టియన్ రోడ్. అయితే దీనిని జిబీ రోడ్ అనే పేరుతోనే ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. అనేక మాల్స్ ఇక్కడ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ వేశ్య వృత్తి కూడా ఎక్కువగానే జరుగుతుంది.

3. నాట్ పూర్వ ఉత్తరప్రదేశ్

3. నాట్ పూర్వ ఉత్తరప్రదేశ్

Image Source:

ఉత్తరప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామం పేరే నాట్ పూర్వ. ఇక్కడ వేశ్య వృత్తి తరతరాలుగా సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడ సుమారు 5వేల మంది తమ జీవనోపాధి కోసం ఈ వేశ్య వృత్తి ఎంచుకున్నారు. అన్నట్టు ఇక్కడ భర్తలే భార్యలకు వీటులను సరఫరా చేస్తారు. చాలా మంది పిల్లలకు ఇక్కడ తమ తండ్రి ఎవరన్న విషయం కూడా తెలియదు.

4. వాడియా, గుజరాత్

4. వాడియా, గుజరాత్

Image Source:

గుజరాత్ లోని ఈ ప్రాంతంలో మహిళలు తమ కుటుంబ పోషణ కోసం ఈ వేశ్య వృత్తి ఎంచుకున్నారు. వారి భర్తలే ఇక్కడ పింప్ లుగా అంటే వీటులను సరఫరా చేసేవారిగా ఉంటారు. ఇక్కడ ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తున్నా ఇప్పటికీ చాలా మంది దీనిని తమ కుల వ`త్తిగా భావిస్తున్నారు.

5. శివదాస్ పుర, వారణాసి

5. శివదాస్ పుర, వారణాసి

Image Source:

వారణాసి హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయితే అదే పుణ్యక్షేత్రంలో ఈ శివదాస్ పురలో చాలా కాలంగా వేశ్య వృత్తి నడుస్తోంది. ఈ ప్రాంతం వారణాసి రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ సుమారు 30 వేల మందికి పైగా ఈ వ`త్తిలో ఉంటారు.

6. సోనాగంజ్ కొలకత్తా

6. సోనాగంజ్ కొలకత్తా

Image Source:

భారతదేశంలో వేశ్య వృత్తి కి సోనాగంజ్ కు విడదీయలేని బంధం ఉంది. ఆసియా ఖండంలో అత్యంత రద్దీగా ఉండే రెడ్ లైట్ ఏరియాలో ఇది కూడా ఒకటి. ఇక్కడకు వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి అమ్మేస్తుంటారు. అంటే బలవంతంగా ఈ వేశ్య వృత్తి లాగుతున్నారు.

7. ఉత్తరకర్ణాటక ప్రాంతం, కర్ణాటక

7. ఉత్తరకర్ణాటక ప్రాంతం, కర్ణాటక

Image Source:

కర్ణాటకలోని ఉత్తర కర్ణాటక ప్రాంతంలో దేవదాసి పద్దతి ఇప్పటికీ ఉంది. ఈ విధానంలో మహిళలు ‘దేవుడి సేవకు' అన్న పేరుతో దేవుడితో వివాహం చేయిస్తారు. దీంతో వారు వారికి తెలియకుండానే ఈ వ`త్తిలోకి దిగుతున్నారు. కేవలం ఇక్కడ చెప్పబడిన ప్రాంతాలే కాకుండా గోవ వంటి చోట్ల కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు వేశ్య వృత్తికి పెట్టింది పేరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X