Search
  • Follow NativePlanet
Share
» »పాండవులు స్థాపించిన స్వర్ణప్రస్థ ఇది...

పాండవులు స్థాపించిన స్వర్ణప్రస్థ ఇది...

సోనిపట్, హర్యానాలోని సోనెపట్ జిల్లాకు ఒక ముఖ్య పట్టణం మరియు ప్రధాన కార్యాలయం. సోనీపట్ జిల్లా దక్షిణ సరిహద్దులో కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ఇది దేశ రాజధాని ఢిల్లీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. యమునా నది పట్టణానికి పశ్చిమాన ప్రవహిస్తుంది. మహాభారత కాలంలో ఈ పట్టణాన్ని పాండవులు స్వర్ణప్రస్థగా స్థాపించారు.

జిల్లా పరిపాలక రాజధానిగా వున్న సోనిపట్ పేరును ఈ జిల్లాకు పెట్టారు. సోనిపట్ అనే పేరు అంతకుముందు రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది, ఇది తరువాత స్వర్ణ ప్రస్థ అయింది (గోల్డెన్ సిటీ) స్వర్ణ (గోల్డ్ ) మరియు ప్రస్థ (ప్రదేశం ).కాలాను గుణంగా ఈ పేరు స్వర్ణ ప్రస్థ ఉచ్ఛారణ దాని ప్రస్తుత రూపంలో, సోనిపట్ గా మారినది.

మహాభారతంలో ప్రస్థావన

మహాభారతంలో ప్రస్థావన

PC:Martin Lewison

ఈ నగరం యొక్క సూచన మహాభారతంలో వస్తుంది, మరియు ఆ సమయంలో, అది హస్తినాపూర్ రాజ్యంలో భాగంగా వుండేది. పాండవుల రాయ బార సమయంలో పాండవులు తమకు ఐదు ఊళ్ళు అయినా ఇమ్మని అడిగిన..... ఆ అయిదు ఊళ్ళలో ఇది కూడా ఒకటి.

క్రీ.పూ 600 సంవత్సరాల నాటిది

క్రీ.పూ 600 సంవత్సరాల నాటిది

PC: Last Emperor

ఇతిహాసం ప్రకారం, యుధిష్ఠిరుడు ఈ భూమిని దుర్యోధనుడి నుండి శాంతియుత చర్చల ద్వారా పొందాడు. దీనికి చారిత్రక ఆధారం లేదు. కానీ వ్యాకరణవేత్త పాణిని తన అష్టాధ్యయిలో సోనిపత్ గురించి ప్రస్తావించారు. అంటే ఈ పట్టణం క్రీస్తుపూర్వం 600 నాటిది.

పురాణం ప్రకారం

పురాణం ప్రకారం

Photo Courtesy : Niksng

మహాభారత కాలంలో ఐదుగురు పాండవ సోదరులు స్వర్ణ రాజ్యంగా స్థాపించినట్లు భావిస్తున్నందున సోనిపట్ పురాతన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ పట్టణాన్ని మహాభారత సమయంలో స్వర్ణప్రస్త అనే పేరుతో పాండవులు స్థాపించారు. పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు, శాంతి కోసం ఆ ప్రాంతాన్ని ఇమ్మని దుర్యోధనుడిని కోరాడు.

మరొక పురాణం ప్రకారం,

మరొక పురాణం ప్రకారం,

PC:Martin Lewison

మరొక పురాణం ప్రకారం, ఈ స్థలం పాండవ సోదరులలో ఒకరైన అర్జునుడి పదమూడవ వారసుడు రాజు సోనికి చెందినది.

ఖ్వాజా ఖిజ్ర్ సమాధి

ఖ్వాజా ఖిజ్ర్ సమాధి

PC: Gopal Aggarwal

సోనిపట్ యొక్క ప్రధాన ఆకర్షణ ఖ్వాజా ఖిజ్ర్ సమాధి. ఇది దర్యా ఖాన్ సన్యాసిని సమాధి. అతను ఇబ్రహీం లోఢి పాలనా కాలంనాటి వాడైన దర్యా ఖాన్ కొడుకు, సాధువు చివరి రోజులు గడిపిన ప్రదేశం.

 ఈ సమాధిని క్రీ.శ 1522 మరియు 1525 మధ్య నిర్మించారు

ఈ సమాధిని క్రీ.శ 1522 మరియు 1525 మధ్య నిర్మించారు

PC: Pardeep Dogra

ఈ సమాధిని క్రీ.శ 1522 మరియు 1525 మధ్య నిర్మించారు. ఇది ఎత్తైన పీఠంపై నిర్మించబడింది. ఇది ఎర్ర ఇసుకరాయి మరియు కంకర్ రాళ్లను ఉపయోగించి నిర్మించబడింది. ఈ సమాధి భారతదేశ పురావస్తు పరిశోధన శాఖవారి ఆధీనంలో ఉంది.

సోనిపట్ వాతావరణం

సోనిపట్ వాతావరణం

Photo Courtesy : Martin Lewison

సోనిపట్ వాతావరణం ప్రాధమికంగా సోనిపట్ లో వాతావరణం వేడిగా, పొడిగా ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

Photo Courtesy : Rbnjat

హర్యానాలోని హిసార్, పానిపట్, కర్నాల్ సిరాసా, భివానీ, బహదూర్గా, జింద్ మరియు గుర్గావ్ వంటి నగరాలు మరియు పట్టణాలకు సోనిపట్ అనుసంధానించబడి ఉంది. ఇది న్యూ ఢిల్లీలోని జిటి కర్నాల్ రోడ్ నుండి 20 కి.మీ ప్రభుత్వ రవాణా, ప్రైవేట్ బస్సులు హర్యానాకు వెళ్తాయి.

ప్రధాన రైల్వే స్టేషన్ సోనిపట్ వద్ద ఉంది. ఇది అమృత్సర్, ఉదయపూర్, జైపూర్, పూనా, న్యూ ఢిల్లీ, బహదూర్గా, జింద్ మరియు పానిపట్ లతో బాగా అనుసంధానించబడి ఉంది.

సమీప విమానాశ్రయం న్యూ ఢిల్లీ విమానాశ్రయం. ఇక్కడ నుండి, మీరు సోనీపట్ కి టాక్సీ లేదా పబ్లిక్ / ప్రైవేట్ బస్సులో వెళ్ళవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X