Search
  • Follow NativePlanet
Share
» »శ్రీ సౌమ్య నారాయణుడే తిరుకొస్టియూర్ నరసింహ అవతారం..

శ్రీ సౌమ్య నారాయణుడే తిరుకొస్టియూర్ నరసింహ అవతారం..

శ్రీ సౌమ్య నారాయణుడే నరసింహ అవతారం..

తమిళనాడు లో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రాన్ని దేవాలయాల భూమిగా పిలుస్తారు. దాదాపుగా 33,000 ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ 800 నుంచీ 3500 ఏళ్ళ కన్నా ముందువిగా గుర్తించబడ్డాయి. ఈ రాష్ట్రంలో ఎక్కువగా హిందూ దేవాలయాలే ఉండటం విశేషం.

అద్భుతమైన శిల్ప వైచిత్రి, వైవిధ్యమైన నిర్మాణం ఈ ఆలయాల ప్రత్యేకత. వీటిలో లభ్యమయ్యే శాసనాల ద్వారా ప్రాచీన సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ లభ్యమయ్యే శాసనాలు దాదాపు 3,000 ఏళ్ళకు పూర్వానికి చెందినవి కూడా ఉన్నాయి. తమిళనాడు సాంస్కృతిక చిహ్నాలుగా ఈ దేవాలయాలు వెలుగొందుతున్నాయి.

తమిళనాడులో ఎక్కువగా అమ్మవారి దేవాలయాలు, శివాలయాలు, మురగన్ దేవాలయాలు, విష్ణు ఆలయాలున్నాయి. విష్ణు ఆలయాల్లో ఒక ప్రసిద్ది ఆలయం శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయం విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రసిద్దికెక్కిన నూట ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఒకటి తిరుకోష్టియూర్

ప్రసిద్దికెక్కిన నూట ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఒకటి తిరుకోష్టియూర్

వైకుంఠ నాథునికి భూలోకంలో ఉన్న అనేకానేక ఆలయాల్లో ఆళ్వారుల గానంతో దివ్వ దేశాలుగా ప్రసిద్దికెక్కిన నూట ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఒకటి తిరుకోష్టియూర్ .

తొలి యుగం నాటి పౌరాణిక గాధకు , కలిగియుగంలో ప్రసిద్దికెక్కిన వైష్ణవ గురువు శ్రీ శ్రీ రామానుజాచార్యుల జీవిత ముఖ్య ఘట్టాలతో ముడిపడి ఉన్న పవిత్ర క్షేత్రం తిరుకోష్టియూర్.

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం

రాక్షస రాజు వరగర్వంతో సమస్త లోకాలను ఆరడి పెడుతున్న సమయంలో దేవతలు, మునులు , బుుషులు, ఇక్కడ ఉన్న కదంబ మహర్షి ఆశ్రమంలో తలదాల్చుకొన్నారట. కానీ అసురుని ఆగడాలు మితిమీరి పోవడంతో అంతా కలిసి శ్రీ మన్నారాయణుని వద్దకు వెళ్లారట. అప్పుడు ఆయన అందరినీ తీసుకుని ఒక ప్రశాంత వాతావరణంలో చర్చిద్దామని చెప్పి ఈ క్షేత్రానికి తీసుకుని వచ్చారట. ఇక్కడే హిరణ్యకశపుని అంతం చేయడానికి అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఘోష్టి జరగడం వలన తిరు ఘోష్టియూర్ అన్న పేరు ప్రసిద్ది చెందింది.

 ఇక్కడ దేవాలయానికి సౌమ్య నారాయన దేవాలయం అని

ఇక్కడ దేవాలయానికి సౌమ్య నారాయన దేవాలయం అని

కాలక్రమంలో అదే తిరుకోష్టియూర్ గా మారినట్లు తెలుస్తోంది. మదురైని పాలించిన నాయక రాజులు తొలుత ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలియవస్తున్నది. ఇక్కడ దేవాలయానికి సౌమ్య నారాయన దేవాలయం అని పేరు. ఈ దేవాలయం నాలుగు అంతస్థులలో ఉండటం ప్రత్యేకత. ఒక్కో అంతస్థులో స్వామి ఒక్కో భంగిమలో దర్శనమిస్తాడు. ఒక స్వరూపంలో ఆది శేషువు పై శయనించి, ఒక స్వరూపంలో కూర్చొని, ఒక స్వరూపంలో నిలుచొని, ఒక స్వరూపంలో నడుస్తూ, ఒక స్వరూపంలో నాట్యమాడే కృష్ణునిగా ఇలా ఎన్నో చేష్టలతో తన భక్తులను కాపాడుకుంటాడో తెలుపుతూ దర్శనమిస్తాడు స్వామి.

ఆలయ విశేషాలు:

ఆలయ విశేషాలు:

తిరుకోష్టియూర్ లోని ఆలయ నిర్మాణమే ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తూర్పు ముఖంగా ఉన్న రాజగోపురం దాటి ప్రాంగణంలోనికి అడుగు పెడితే ఎన్నో ఉపాలయాలు కనపడతాయి. ఎడమవైపునకు తిరిగి ప్రదక్షిణ ఆరంభించగానే తొలి సన్నిధి శ్రీ శ్రీ రామానుజాచార్యులది. పక్కనే ఉన్న మరో సన్నిధి ఆయనకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించిన గురు దేవులు శ్రీ తిరు కోష్టియూర్ నంబి.

ఆలయ విశేషాలు:

ఆలయ విశేషాలు:

చిన్నదైన ఇందులో అర్థ మంటపం, మున్మండపం, గర్భ గృహం. మున్మండపంలో ఉన్న అద్దాల అరలో నమ్బిగల్ ఉత్సవ మూర్తి పక్కనే ఆయన పూజించిన ఆంజనేయ, సీత లక్షణ సమేత శ్రీ రామచంద్రులు విగ్రహాలున్నాయి.

ఆలయ విశేషాలు:

ఆలయ విశేషాలు:

దర్శనం తర్వాత లోపలికి ముందుకు వెళితే ఏకాదశి మండపం, బలిపీఠం, ధ్వజస్తంభం తర్వాత కళ్యాణ మండపం వస్తాయి. కళ్యాణ మంటపంలో చక్కని శిల్పాలున్నాయి. అక్కడే లింగ రూపంలో కైలాసనాథుడు కొలువుతీరి ఉన్నారు. ఈ కారణం చేతనే తిరుకోష్టియూర్ ఆలయం శివ కేశవ నిలయంగా పుర్కొనవచ్చును. ప్రధాన ద్వారం గుండా గర్భాలయం వైపునకు వెలితే మధ్యలో ఆళ్వార్ సన్నిధిని సందర్శించుకోవచ్చును.

తిరుకోష్టియూర్ అంటే

తిరుకోష్టియూర్ అంటే

తిరుకోష్టియూర్ అంటే తిరు అంటే మూడు, కోష్టి అంటే సమూహం లేదా గ్రూప్ యూర్ అంటే స్థలం. ఈ ప్రదేశంలో ముగ్గురు మూర్తులు కలిసిన ప్రదేశంగా తమిళంలో చెబుతారు. తిరుకోష్టియూర్ ఆలయ విమానం అరుదైన అష్టాంగ విమానం. ఇది మదురైలోని కూడల్ అజఘర్ ఆలయం వల్లే మూడు అంతస్తులుగా ఉంటుంది. ఈ ఆలయ ప్రత్యేతక ఈ ఆలయ గోపురం నీడ ఎప్పటికీ కనబడదు.

మొదటి అంతస్తును భూలోకంగాను

మొదటి అంతస్తును భూలోకంగాను

మొదటి అంతస్తును భూలోకంగాను, రెండో అంతస్తును పాల కడలిగాను, ఆ పై అంతస్తును శ్రీ వైకుంఠముగా పేర్కొంటారు. ఇలాంటిదే మదురై నగరంలో ఉన్న కూడళ్ పెరుమాళ్ ఆలయం. ఇక్కడ అడుగు భాగంలో శ్రీ రుక్మిణి సత్యభామా సమేత నర్తన కృష్ణ ఉన్నారు.

తొలి అంతస్తుకు సోపాన మార్గంలో చేరుకుంటే

తొలి అంతస్తుకు సోపాన మార్గంలో చేరుకుంటే

తొలి అంతస్తుకు సోపాన మార్గంలో చేరుకుంటే శ్రీ అనంత శయనుడు నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. స్వామి పాదాల వద్ద శ్రీ దేవి, భూదేవి, శిరస్సు వద్ద కదంబ మహర్షి, ఎదురుగా బ్రహ్మ, ఇంద్రుడు , సూర్యచంద్రులు ఇంకా కొన్ని విగ్రహమూర్తులున్నారు.

చతుర్భుజ శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్

చతుర్భుజ శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్

ఈ మూర్తిని శ్రీ ఉరగ మేళ్ళ నయన్ పెరుమాళ్ లేక శ్రీ పన్నగ సాయి అని పిలుస్తారు. చతుర్భుజ శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్ ఉత్సవ మూర్తి ఉంటుంది.

శంఖు చక్రాలను వెనక హస్తాలలో

శంఖు చక్రాలను వెనక హస్తాలలో

శంఖు చక్రాలను వెనక హస్తాలలో ధరించి, ముందరి కుడి చేతిని దాన ముద్రలోనూ, ఎడమ చేతిని కటి హస్త ముద్రలోనూ ఉండే సుందర రూప స్వామిని ఇంద్రాది దేవతలు ఆరాధించేవారు. తర్వాత ఇంద్రుడు కదంబ మునికి ఇచ్చారని తెలుస్తోంది. ఈ కారణంగా ఇక్కడ ఇంత మంది విగ్రహాలున్నాయి.

స్వామిని సేవించుకుని తిరిగి మెట్ల మార్గంలో

స్వామిని సేవించుకుని తిరిగి మెట్ల మార్గంలో

స్వామిని సేవించుకుని తిరిగి మెట్ల మార్గంలో రెండో అంతస్తుకు చేరుకుంటే అక్కడ శ్రీ ఉపేంద్ర నారాయణ స్థానక భంగిమలో శ్రీదేవి, భూదేవి సమేతులై దర్శనమిస్తారు. ఈ ఆలయంలోని గోడలకు ఇంద్రలోకం వంటి బ్యాక్ రౌండ్ సహజ వర్ణాలతో చిత్రించిన భాగవత ఘట్ఠాలుంటాయి.

 శ్రీ దేవి భూదేవి సమేత పరవాసుదేవుని

శ్రీ దేవి భూదేవి సమేత పరవాసుదేవుని

ఆ తర్వాత మూడవ అంతస్తుకు చేరుకుంటే అక్కడ శ్రీ దేవి భూదేవి సమేత పరవాసుదేవుని సందర్శించుకోవచ్చును. ఈ ఆలయంలో నారసింహుడు మూడు అవతారాల్లో దర్శనభాగ్యం కలిగిస్తాడు. ఉగ్ర నరసింహ, యోగ నరసింహ, లక్ష్మీ నరసింహ అవతారాల్లో నారసింహుడిని దర్శించుకోవచ్చు.

అక్కడ దర్శనానంతరం క్రిందకు వస్తే

అక్కడ దర్శనానంతరం క్రిందకు వస్తే

అక్కడ దర్శనానంతరం క్రిందకు వస్తే అక్కడ తిరుమంగై తాయారు, శ్రీభూదేవి సమేత చుతుర్భుజ శ్రీ నృసింహ, సుదర్శన, శ్రీనివాస, శ్రీ వరద రాజ, శ్రీరామ, యోగ నారసింహ, శ్రీ చక్రత్తి ఆళ్వార్ సన్నిదులుంటాయి. ఆలయ ఉత్తర భాగంలో వెలుపల ఉంచిన రెండు నారసింహ, ఒక చక్రత్తి ఆళ్వార్ విగ్రహాలున్నాయి.

శ్రీ శ్రీ రామానుజాచార్య:

శ్రీ శ్రీ రామానుజాచార్య:

అపర ఆదిశేష అవతారంగా పేర్కొనే అద్వైత సిద్ధాంత రూపరక్త, నిరంతర విష్ణు సేవాతత్పరులు, గురు దేవులు శ్రీశ్రీ రామానుజాచార్యులు నేటి చెన్నై నగర సమీపంలోని శ్రీ పెరంబూర్లో జన్మించారు.

ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత ఉంది. శ్రీరామానుజాచార్యులవారు మన బాగుకోరి తానేమైనా పరవాలేదు, లోకంలో ప్రతి ఒక్కరి క్షేమమే తనకు ప్రధానమని భావించి ఈ ఆలయ గోపురాన్ని ఎక్కి మంత్రాలని, మంత్రార్థాలని చాటాడు. ఇదీ ఈ క్షేత్ర గొప్పతనం.
Debanjon

దివ్య దేశం:

దివ్య దేశం:

పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ఆరుగురు ఆళ్వారులు కలిపి నలభై ఎనిమిది పాశురాలు గానం చేసి తిరుకోష్టియూర్ కు శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటిగా శాశ్విత స్థానం ప్రసాధించారు.

పూజలు - ఉత్సవాలు :

పూజలు - ఉత్సవాలు :

ఉదయం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల కొరకు తెరచి ఉండే శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్ ఆలయంలో ఎన్నో నిత్య పూజలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు, నృసింహ జయంతి, శ్రీ రామ నవమి ఇలా ప్రతి రోజూ పండగ వాతావరణం ఇక్కడ నెలకొని ఉంటుంది. భక్తుల విరాళాలతో ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు.

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:

ఇంతటి ప్రముఖ పుణ్య క్షేత్రం సందర్శించుకోవాడానికి మదురై నుండి సులభంగా బస్సులో చేరుకోవచ్చు.ఈ ఆలయం శివగంగ జిల్లాలో కొలువుదీరి ఉంది. తిరుపట్టూర్ నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పుదుకొట్టై, మదురై మరియు కరైకుడికి సమీపంలో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అక్కడి నుండి తిరుపట్టూర్ నుండి ఆటోలు, బస్సులు రవాణా సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. మదురైకి సుమారు 75కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X