Search
  • Follow NativePlanet
Share
» »పాండిచ్ఛేరిలోని శ్రీ కోకిలాంబల్ సమేత తిరుకామేశ్వరార్ దేవస్థానం దర్శిస్తే..

పాండిచ్ఛేరిలోని శ్రీ కోకిలాంబల్ సమేత తిరుకామేశ్వరార్ దేవస్థానం దర్శిస్తే..

పాండిచ్ఛేరిలోని శ్రీ కోకిలాంబల్ సమేత తిరుకామేశ్వరార్ దేవస్థానం దర్శిస్తే..పాండిచేరి ప్రాంతమే అయిన విల్లియానూర్లో పురాతన శివాలయము ఉంది. విజయనగర రాజుల ప్రాపకము సంపాదించిన గుడి. శివుడు తిరుకామేశ్వరుడు,

పాండిచేరి ప్రాంతమే అయిన విల్లియానూర్లో పురాతన శివాలయము ఉంది. విజయనగర రాజుల ప్రాపకము సంపాదించిన గుడి. శివుడు తిరుకామేశ్వరుడు, అమ్మవారు కోకిలాంబ. పక్కనే ఈ మధ్య కట్టిన విష్ణుమూర్తి ఆలయము ఉంది. వరదరాజ స్వామి ఆయన పేరు. పక్కనే భూ, శ్రీ దేవులుంటారు.

కుష్టు వ్యాధి నివారణకు మరియు సురక్షితమైన ప్రసవం జరగాలన్నా పాండిచేరిలో ఉన్న కోకిలాంబల్ తిరుకామేశ్వర ఆలయం సందర్శించాలి. ఈ ఆలయం తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం యొక్క చరిత్ర, ఆకర్షణలు మరియు ప్రత్యేకతల గురించి తెలుసుకోండి...

కోకిలాంబల్ తిరుకమేశ్వర ఆలయం ఎక్కడ ఉంది?

కోకిలాంబల్ తిరుకమేశ్వర ఆలయం ఎక్కడ ఉంది?

PC: Ssriram mt

విల్లినూర్ రైల్వే స్టేషన్ నుండి 750 కిలోమీటర్లు మరియు పాండిచేరి బస్ స్టాండ్ నుండి 8 కిలోమీటర్లో ఉండే శ్రీ కోకిలాంబల్ తిరుకామేశ్వర ఆలయం, , పాండిచేరిలోని విల్లియన్నూర్ లో ఉన్న ఒక పురాతన ఆలయం. ఈ ఆలయాన్నే విల్లియన్నూర్ దేవాలయంగా పిలవబడుతున్నది.

ఇతిహాసం ప్రకారం

ఇతిహాసం ప్రకారం

PC: Ssriram mt

ఈ ఆలయాన్ని క్రీ.శ 12 వ శతాబ్దంలో చోళ రాజు నిర్మించాడు. ఇతిహాసాల ప్రకారం, రాజు కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు మరియు ఆ సమయంలో ఈ ఆలయంలో ఆ పరమేశ్వరుడిని పూజించి వ్యాధిని నయం చేసుకున్నట్లు ఇతిహాసాల ప్రకారం తెలియుచున్నది.

విల్లియన్నూర్ అనే పేరు ఎలా వచ్చింది

విల్లియన్నూర్ అనే పేరు ఎలా వచ్చింది

PC: Ssriram mt

రాజు ఈ ప్రదేశంలో ఒక పట్టణాన్ని నిర్మించాడు, ఇది మొదట విల్వా (బెల్) చెట్ల అడవి మరియు పుణ్యక్షేత్రాన్ని నిర్మించి దానికి విల్వానల్లూర్ అని పేరు పెట్టారు, ఇది క్రమంగా విల్లియన్నూర్ అయ్యింది.

మట్టి లింగం

మట్టి లింగం

PC: Ssriram mt

ఈ ఆలయాన్ని తిరుకామేశ్వర రూపంలో శివుడికి అంకితం చేశారు మరియు ఈ ఆలయంలో ఉన్న దేవిని కోకిలాంబల్ అని పిలుస్తారు. లింగం మట్టితో తయారవుచేయబడినది మరియు మట్టి లింగం కారణంగా ఈ లింగానికి నేరుగా అభిషేకాలు చేయబడవు. అందుకు బదులుగా అభిషేయం చేయడానికి ముందు లింగాన్ని ఇత్తడి కవచంతో కప్పబడి ఉంచి దాని మీద నుండి అభిషేకించడం జరుగుతుంది.

 ప్రసూతి నంది

ప్రసూతి నంది

PC: Ssriram mt

పాల్గున నెలలో (మార్చి / ఏప్రిల్) సూర్యకిరణాలు ప్రధాన దేవుడిపై పడతాయి. ఈ ఆలయంలోని నందిని ప్రసవ నంది అని పిలుస్తారు మరియు స్త్రీలు ప్రసవానికి ముందు ఈ నందిని ప్రార్థిస్తారు, ఇది ఆలయంలోని ముఖ్యమైన లక్షణంగా ఉంది.

ఇతర దేవాలయాలు

ఇతర దేవాలయాలు

PC: Ssriram mt

నందిని సాధారణంగా శివుడి ముందు ఉంచినప్పటికీ, ఈ భారీ నంది ముందు మరొక చిన్న నంది ఉంచబడియున్నది. మురుగన్, బ్రహ్మ, నరసింహ, ఆదిశేషుడు మరియు గోవింద వంటి దేవుళ్ళుకు ఈ ఆలయంలో ఇతర ఉప దేవాలయాలున్నాయి.

రథాన్ని లాగితే కోరికలు..ఆశలు నెరవేరుతాయి

రథాన్ని లాగితే కోరికలు..ఆశలు నెరవేరుతాయి

Pc: Ssriram mt

ఆలయంలో చెక్కబడిన చిత్రాలతో అనేక అందమైన స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయంలో రెండు గంభీరమైన గోపురాలు ఉన్నాయి. ఇది అద్భుతమైన రూపకల్పన మరియు శిల్పాలు చెక్కబడినవి. ఈ ఆలయం వార్షిక ఉత్సవాలకు చాలా ప్రసిద్ది చెందింది. మే నుండి జూన్ వరకు పది రోజులు జరుపుకుంటారు. దేవతను 15 మీటర్ల ఎత్తైన రథంలో మెరువునకు రేగింపుగా తీసుకువెళతారు. రథాన్ని లాగితే తమ కోరికలు, ఆశయాలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. భక్తులు పెరుగు, గంధపు చెక్క, మజ్జిగను దేవునికి అర్పిస్తారు.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

విల్లియనూర్ రైల్వే స్టేషన్ మరియు పుదుచ్చేరి రైల్వే స్టేషన్ దగ్గరి రైల్వే స్టేషన్లు. విల్లియానూర్ (1 కి.మీ), కొట్టైమెడు (1 కి.మీ), కుప్పక్కం (1 కి.మీ), సుల్తాన్ పేట్ (1 కి.మీ), మరియు విల్లియానూర్ సమీప గ్రామాలు. విల్లియానూర్ చుట్టూ అరియాంకుప్పం నగరం, తూర్పున పాండిచేరి నగరం, దక్షిణాన బాహూర్ నగరం మరియు పశ్చిమాన కండమంగళం నగరం ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X