Search
  • Follow NativePlanet
Share
» »సకల దేవుళ్ళు కొలువైన క్షేత్రం .. సురేంద్రపురి !

సకల దేవుళ్ళు కొలువైన క్షేత్రం .. సురేంద్రపురి !

By Mohammad

మీరెప్పుడైనా సంపూర్ణ భారతదేశ యాత్రకు వెళ్ళారా ? వెళ్లకపోతే ... తప్పక వెళ్ళిరండి. హైదరాబాద్ నుండి కేవలం 58 కిలోమీటర్ల దూరంలో,యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో సురేంద్రపురి క్షేత్రం కలదు. ఇదొక స్వర్గ కళాధామం. భారత దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల నకళ్ళు ఇక్కడ నిర్మించడం విశేషం! అందుకే దీనిని సకలదేవతలు కొలువైన క్షేత్రం గా అభివర్ణిస్తారు. సంపూర్ణ భారతదేశ యాత్ర చేయలేనివారు సురేంద్ర పురిని ఒక్కసారి దర్శిస్తే వారికి ఆ లోటు తీరిపోతుంది.

కనుక చెప్పొచ్చేదేంటంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడదగ్గ ప్రదేశం సురేంద్రపురి. నేటి పిల్లలకు బుక్కులు, ఇంటర్నెట్ లే ప్రపంచం. బొత్తిగా పురాణాల మీద ఇంట్రెస్ట్ చూపించటం లేదు. చక్కటి శిల్పాల ద్వారా ఆసక్తి కలిగించేలా పిల్లలకు మన పురాణాలను ఇక్కడ వివరించవచ్చు.

దిగువ పేర్కొన్న ఫోటోల చిత్ర కృప : surendrapuri.in

హనుమదీశ్వర ఆలయం

హనుమదీశ్వర ఆలయం

సురేంద్రపురిలో చెప్పుకోదగిన వాటిలో మొదటిది హనుమదీశ్వర ఆలయం. ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక్కడ పంచముఖాంజనేయుడై , సువర్చలా సమేతుడై దర్శనం ఇవ్వటం విశేషము.

చిత్ర కృప : Arkrishna

పంచముఖ శివుడు

పంచముఖ శివుడు

ఐదు ముఖములతో అలరారు హనుమంతుని విగ్రహముతో పాటు అదే ఆవరణలో పంచముఖ విశ్వరూపుడైన శివుడు కొలువై ఉన్నాడు .ఆ శివలింగం నేపాల్ లోని పశుపతినాధ లింగాన్ని పోలి ఉండటం విశేషం.

చిత్ర కృప : subash BGK

నవగ్రహ ఆలయాలు

నవగ్రహ ఆలయాలు

ప్రపంచంలో మొదటిసారిగా నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధి దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా తొమ్మిది ఆలయాలను ఇక్కడ నిర్మించారు. దేవాలయంలోపల హుండీలను చాలా కళాత్మకంగా కలశాలను పోలినట్లుగా తీర్చిదిద్దారు. ఆలయంలో పుట్టమన్నుతో చేసిన శివలింగాలను అర్చించినట్లయితే గ్రహదోశాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.

చిత్ర కృప : Arkrishna

నాగకోటేశ్వరాలయం

నాగకోటేశ్వరాలయం

సురేంద్రపురి క్షేత్రంలో ఉన్న మరో ఆలయం నాగకోటేశ్వరాలయం. ఇందులో కోటి పార్థివ లింగాలను నాగ ప్రతిమతో చేసిన కోటి సర్పాల ప్రతిమలు ఉన్నాయి.

చిత్ర కృప : subash BGK

కుందా సత్యనారాయణ కళాధామం

కుందా సత్యనారాయణ కళాధామం

ఇక్కడి మరో ఆకర్షణ ఆలయం ప్రక్కనేవున్న కుందా సత్యనారాయణ కళాక్షేత్రము. దీనిని కనీసం రెండుగంటలు పడుతుంది. లోపలకు కెమేరాలను అనుమతించరు.

చిత్ర కృప : Arkrishna

కుందా సత్యనారాయణ కళాధామం

కుందా సత్యనారాయణ కళాధామం

అమ్మవారి వాహనం సింహం నోటినుండి కళాధామంకు ప్రవేశమార్గం ఏర్పాటు ఉంటుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నప్రధాన దేవాలయాల సూక్ష్మ రూపాలు ఉన్నాయి.

చిత్ర కృప : Phani Kumar

కుందా సత్యనారాయణ కళాధామం

కుందా సత్యనారాయణ కళాధామం

ఇందులో బాలభారతం, బ్రహ్మ లోకం , విష్ణులోకం , శివలోకం , నాగలోకం , ఇంద్రలోకం ,యమలోకం ,నరకలోకం...శిక్షలు , పాతాళ లోకం ,....క్షీరసాగర మధనం , గజేంద్రమోక్షం , కాళీయ మర్దనం , గోవర్ధన గిరి ధారణం , విశ్వరూప సందర్శనం , పద్మవ్యూహం మొదలైన శిల్పాలతోపాటు .....రామాయణ , మహాభారత , భాగవతాలలోని ముఖ్య ఘట్టాలనూ అపూర్వంగా మలిచారు.

చిత్ర కృప : surendrapuri

కుందా సత్యనారాయణ కళాధామం

కుందా సత్యనారాయణ కళాధామం

ఇంకా ఏముంటాయాంటే ... ప్రత్యేకంగా ఆకట్టుకునే శిల్పకళా నమూనాలు. కన్యాకుమారి, శృంగేరీ శారదాంబ-జగద్గురు శంకరాచార్యుడు, కనకమహాలక్ష్మీ, శ్రీ మంజునాథుడు, తిరుమల వేంకటేశ్వరుడు, సింహాచల వరాహ నరసింహస్వామి, శ్రీ కాళహస్తీశ్వరుడు తో పాటు ..

చిత్ర కృప : surendrapuri

కుందా సత్యనారాయణ కళాధామం

కుందా సత్యనారాయణ కళాధామం

హరిద్వార్, కాశీ, కేదార్‌నాథ్, అమర్‌నాథ్, భద్రాచల సీతారాములు, ఆండాళ్ అమ్మవారు, కాళీ, తుల్జా భవానీ, షిరిడీ సాయిబాబా, అమృత్‌సర్ స్వర్ణదేవాలయం, శబరిమలై అయ్యప్ప, మేడారం సమ్మక-సారక్క మొదలైనవి ఉంటాయి.

చిత్ర కృప : surendrapuri

సురేంద్రపురి - అద్భుత మ్యూజియం

సురేంద్రపురి - అద్భుత మ్యూజియం

భారతదేశంలో ఉన్నప్రఖ్యాతమైన మరియు ముఖ్యమైన ఆలయాల మినియెచర్ లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. ఈ వైవిధ్యమైన అంశం సందర్శకులని అమితంగా ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : surendrapuri

సురేంద్రపురి - అద్భుత మ్యూజియం

సురేంద్రపురి - అద్భుత మ్యూజియం

ప్రముఖమైన ఆలయాల యొక్క ఖచ్చినమైన ప్రతిరూపాలని తయారు చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఆలయాల పైన ఉండే శిల్పకళలూ నిర్మాణ శైలి ఇలా ప్రతి విషయం గురించి తగిన జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ మినీయెచర్ ఆలయాలని అద్భుతంగా తయారు చేసారు.

చిత్ర కృప : surendrapuri

సురేంద్రపురి - అద్భుత మ్యూజియం

సురేంద్రపురి - అద్భుత మ్యూజియం

హిందువుల దేవుళ్ళని, దేవతలని వర్ణించే శిలావిగ్రహాలు, చిత్రలేఖనాలు ఈ మ్యూజియంలో గమనించవచ్చు. ఈ మ్యూజియాన్ని ఒక్క సారి సందర్శిస్తే భారత దేశ పురాణాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

చిత్ర కృప : surendrapuri

ఆలయ వేళలు

ఆలయ వేళలు

ఆలయాలను ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు (సోమ - శుక్రవారం వరకు) దర్శించవచ్చు. మరియు శని, ఆది వారాలు, పబ్లిక్ హాలిడేస్ లలో ఉదయం 6:30 నుండి రాత్రి 8:00 వరకు తెరిచే ఉంచుతారు.

చిత్ర కృప : surendrapuri

కుందా సత్యనారాయణ కళాధామం

కుందా సత్యనారాయణ కళాధామం

టికెట్ బుకింగ్ టైమింగ్స్ : ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 వరకు
సందర్శించు వేళలు : ఉదయం 9:00 నుండి రాత్రి 7 :00 వరకు(ప్రతిరోజూ )

చిత్ర కృప : surendrapuri

టికెట్ ధరలు

టికెట్ ధరలు

సురేంద్రపురి ప్రవేశం ఫ్రీ
కుందా సత్యనారాయణ కళాధామం లోకి ప్రవేశం : పెద్దలకు 300, 5-10 సంవత్సరాల పిల్లలకు 250/- ( 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఫ్రీ)

చిత్ర కృప : surendrapuri

సదుపాయాలు

సదుపాయాలు

వీల్ చైర్ లు వృద్దులకు, వికలాంగులకు మ్యూజియం వద్ద అందుబాటులో ఉంటాయి. వీటికి ధర చెల్లించాలి.

చిత్ర కృప : surendrapuri

నిషేధం

నిషేధం

పాన్, గుట్కా, సిగరెట్ మరియు ఆల్కాహాల్ మొదలైనవి సురేంద్రపురి క్షేత్రంలో నిషేధం. ఫోన్లు, కెమెరాలు సురేంద్రపురి లో అనుమతిస్తారు కానీ కుందా సత్యనారాయణ కళాధామం లో అనుమతించరు. వీటిని భద్రపరుచుటకు క్లాక్ రూమ్ లు ఉన్నాయి.

చిత్ర కృప : surendrapuri

భోజనం

భోజనం

బయట ఫుడ్ ను కుందా సత్యనారాయణ కళాధామం లో అనుమతించరు.
వెజిటేరియన్ ఫుడ్ కుందా సత్యనారాయణ కళాధామం లో లభిస్తుంది.
నాన్ - వెజ్ ఫుడ్ సురేంద్రపురి లో నిషేధం.

చిత్ర కృప : surendrapuri

రవాణా వ్యవస్థ సురేంద్రపురి ఎలా చేరుకోవాలి ?

రవాణా వ్యవస్థ సురేంద్రపురి ఎలా చేరుకోవాలి ?

హైదరాబాద్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సురేంద్రపురికి సమీపాన రాయగిరి రైల్వేస్టేషన్‌ కలదు. యాదాద్రికి వచ్చే అన్ని బస్సులు సురేంద్రపురి మీదుగానే వెళతాయి. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

చిత్ర కృప : Arkrishna

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X