Search
  • Follow NativePlanet
Share
» »శ్రీ లక్ష్మీ నృసింహ, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాలు రెండూ ఓకే చోట..ఎక్కడో తెలుసా

శ్రీ లక్ష్మీ నృసింహ, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాలు రెండూ ఓకే చోట..ఎక్కడో తెలుసా

సింగరకొండ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రఖ్యాతి గాంచినవి. సింగరకొండ అద్దంకి నుండి 6 కి.మీ. దూరంలో భవనాసి చెరువు వొడ్డున ఉంది. మొదట్లో సింగన కొండ అని పిలవబడ్డ నరసింహ క్షేత్రం, అయిననూ ఆంజనేయ స్వామి క్షేత్రం గానే ప్రఖ్యాతి గాంచెను. ఆలయంలో కల గరుడ స్తంభంపై గల శాసనం ప్రకారం ఈ ఆలయ పొషకుడుగా 14 వ శతాబ్దంలో దేవరాయలు అనే రాజు కలడు.

ప్రకాశం జిల్లా అడ్డంకి దగ్గర్లో ఉన్న శింగరకొండలో లక్ష్మీ నృశింహ స్వామి, ప్రసన్నాంజనేయ స్వాములదేవాలయాలు ప్రసిద్ధ ఆలయాలు. శింగరకొండపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉండగా కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే భూతప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని స్థానికులు చెప్తారు.

లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని 14వ శతాబ్ధంలో నిర్మించినట్లు

లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని 14వ శతాబ్ధంలో నిర్మించినట్లు

లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని 14వ శతాబ్ధంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ క్షేత్ర మాహత్యాన్ని అనుసరించి, 14వ శతాబ్దానికి చెందినా సింగన్న అనే నృసింహస్వామి భక్తుడు ఉండేవాడు. సింగన్న కూతురు నరసమ్మ. ఆమె రోజూ ఆవులను మేపేందుకు కొండమీదికి వెళ్ళేది. ఆ ఆవుల్లో ఒక ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని సింగన్న గమనించాడు. ఒకటి రెండు రోజులైతే అనారోగ్యం అనుకోవచ్చు కానీ, కొద్ది రోజుల నుండి ఆవు పాలు ఇవ్వకపోవడానికి అసలు కారణం ఏంటని ఆలోచించాడు. అసలు విషయాన్ని కనిపెట్టడానికి పాలు ఇవ్వని ఆవును అనుసరిస్తూ వెళ్ళాడు.

ఆ ఆవు కొండ మీదకి వెళ్ళగానే ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఆగింది

ఆ ఆవు కొండ మీదకి వెళ్ళగానే ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఆగింది

ఆ ఆవు కొండ మీదకి వెళ్ళగానే ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఆగింది. ఆ రాతిలో నుండి ఒక బాలుడు ఉద్భవించి ఆవుపాలను తాగి వెళ్ళడం చూసిన సింగన్న శభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. సంతోషాన్ని పట్టలేకపోయాడు. స్వయంగా తన కళ్ళతో రాతిలో నుండి బాలుడు రావడం చూశాడు కనుక, ఆ రాతిని పరమ పవిత్రంగా భావించి అక్కడే నృసింహ స్వామికి దేవాలయం కట్టించాడు.

ఇక కొండ దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి సంబంధించిన స్థల పురాణం :

ఇక కొండ దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి సంబంధించిన స్థల పురాణం :

తమ్మ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపధం బయలుదేరిన ఆంజనేయుడు, ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారని ఒక నమ్మకం. అందుకే ఇచ్చట ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతారు. అద్దంకి తాతాచార్యులు అని గొప్ప భక్తుడు సింగరకొండలో కొండపై గల నరసింహ స్వామి గుడియంది ధ్వజారొహణ చేయుచుండగా, కొండ క్రింద ఒక దివ్యపురుషుడు ఒక ఆంజనేయ విగ్రహమునకు హారతి ఇచ్చుచూ కనబడెను. పరుగు పరుగున క్రిందకు వెళ్ళిన తాతాచార్యుల వారికి పురుషుడు మాయమై, దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయ విగ్రహం కనపడింది.

శింగరకొండపై లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న దశలో

శింగరకొండపై లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న దశలో

శింగరకొండపై లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న దశలో ఒక మహా యోగి ఆ గ్రామానికి విచ్చేసి, కొండ దిగువన చెరువు గట్టున ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెళ్ళాడు. అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడం కొండమీద ఆలయ పనిలో ఉన్నవారెందరో చూశారు. వాళ్ళు కొండ దిగి వచ్చి చూసేసరికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగిపోతూ కనిపించింది. దాంతో ఆ గ్రామస్తులు, చుట్టుపక్కలవారు కలిసి, లక్ష్మీ నృసింహ దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు.

సమీప దర్శనీయ ఆలయాలు

సమీప దర్శనీయ ఆలయాలు

అయ్యప్పస్వామివారి ఆలయం, షిర్డీ సాయిబాబావారి ఆలయం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం, శ్రీ గాయత్రీమాత ఆలయం, కొండపైనెలకొనియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం, శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం చూడదగ్గవి.

వసతి

వసతి

సింగరకొండ లో వసతి పొందాలనుకునేవారు దేవస్థానం ఏర్పాటు చేసిన కాటేజీలలో బస చేయవచ్చు. కనుక ఇక్కడికి వచ్చే యాత్రికులు మమారుతి భవన్ లో వసతి పొందవచ్చు. అద్దె తక్కువ ధరకే లభిస్తుంది. ఈ భవన్ రెండు అంతస్తుల సముదాయం.

సింగరకొండ ఎలా చేరుకోవాలి ?

సింగరకొండ ఎలా చేరుకోవాలి ?

ఎంత దూరం : హైదరాబాద్ నుండి 290 కిలోమీటర్లు, విజయవాడ నుండి 110 కిలోమీటర్లు, ఒంగోలు నుండి 36 కిలోమీటర్లు, అద్దంకి నుండి 5 కిలోమీటర్ల దూరంలో సింగరకొండ కలదు.

విమాన మార్గం ద్వారా : సమీప విమానాశ్రయం విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్. అక్కడ దిగి క్యాబ్ లేదా టాక్సీ లలో సింగరకొండ చేరుకోవచ్చు.

రైలు మార్గం : ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపాన ఉన్నది. హైదరాబాద్, విజయవాడ నుండి చెన్నై వెళ్ళే ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్ళన్నీ ఒంగోలు స్టేషన్లో ఆగుతాయి.

రోడ్డు/ బస్సు మార్గం : సమీప బస్ స్టాప్ - అద్దంకి. హైదరాబాద్, విజయవాడ, ప్రకాశం నుండి అద్దంకి కి బస్సులు కలవు. ఒంగోలు నుంచి: బస్సు ప్రయాణీకులు అద్దంకి వెల్లు బస్సు ఎక్కవలెను. అద్దంకి నుంచి సింగర కొండకు ప్రతి 30 నిముషములకి బస్సులు ఉన్నాయి. కారు ద్వారా వెళ్ళు యాత్రీకులు అద్దంకి నుంచి సింగర కొండ మార్గంలో వెళ్లవలెను.

Photo Courtesy: Indian7893

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X