Search
  • Follow NativePlanet
Share
» »ఆషాడ ఏకాదశి విశేషం: పండరిపురంలో శ్రీ పాండురంగస్వామి యాత్ర చూడటానికి రెండు కళ్లు సరిపోవు !

ఆషాడ ఏకాదశి విశేషం: పండరిపురంలో శ్రీ పాండురంగస్వామి యాత్ర చూడటానికి రెండు కళ్లు సరిపోవు !

ఆషాడ ఏకాదశి విశేషం: పండరిపురంలో శ్రీ పాండురంగస్వామి

మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే..ఎందుకంటే ప్రతి మాసంలో అతి విత్రమైన పండగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ది. ప్రస్తుతం ఆషాడ మాసం . ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో నాల్గవ మాసం. అమ్మవారి ఆరాధనకు శ్రేష్ఠమైనది ఆషాఢ మాసం. అయితే ఈమాసంలో సాధారణంగా శుభ కార్యాలు, శుభాలనిచ్చే ఇతర కార్యక్రమాలు ఈ నెలలో తలపెట్టరు. గృహ నిర్మాణాదులు ప్రారంభించరు. అయితే ఆధ్యాత్మిక పరంగా చూస్తే మాత్రం అత్యంత శక్తివంతమైనదీ ఈ మాసం. అమ్మ వారి ఆరాధనకు ఉద్ధిష్టమైన మాసమిది. అతివలు గోరింటాకు పెట్టుకుని అరవిరిసిన అరచేతులను చూసుకుని మురిసిపోయేది ఆషాఢంలోనే.

భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానికి ఉన్నది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 'విఠోబా' పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉంది.

మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్వక్షేత్రం పండరీపురం. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు. ఓం నమో పాండురంగాయ..ఓం నమో పుండరీక వర్మయా..ఓం నమో నారాయణాయ..ఓం నమో ఆశ్రుత జన రక్షకాయ..అంటూ శ్రీ పాండురంగ స్వామి వారు లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం.

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో శ్రీ పాండుగ స్వామి వారి క్షేత్రం

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో శ్రీ పాండుగ స్వామి వారి క్షేత్రం

దేశంలోని సుప్రసిద్ద పాండురంగని క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం పాండురంగడు లీలలతో..ఆ స్వామి భక్తుల భక్తి ప్రపత్తులతో విరాజిల్లుతోంది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఈ దివ్వ క్షేత్రం ఉంది. శ్రీ పాండుగ స్వామి వారి లీలా విశేషాలకు నిదర్శనంగా భక్తుల పాలిటి స్వర్గ దామంగా విరాజిల్లుతున్న పండరీపురం దివ్వ క్షేత్రం చేరుకున్న భక్తులు ముందుగా ఈ పుణ్య క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న భీమా నదిలో స్నానమాచరిస్తారు.

PC:YOUTUBE

శ్రీ పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలుస్తారు.

శ్రీ పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలుస్తారు.

శ్రీ పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలుస్తారు. శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షసిద్దిని ప్రసాధించడానికి గాను ఇక్కడ ఈ పండరీపుర క్షేత్రంలో పాండురంగడుగా అవతరించడాని పురాణాల ద్వారా అవగతం అవుతున్నది.

Balkrishna Kulkarni

 భీమా నదిలో పవిత్ర స్నానాలు

భీమా నదిలో పవిత్ర స్నానాలు

ఇక్కడ ఈ ప్రాంత ప్రజలచే చంద్రభాగా నదిగా పిలవబడుతున్న భీమా నదిలో పవిత్ర స్నానాలచరించడం ద్వారా సకల పాపాలను పక్షాళింప చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు.చంద్రబాగ నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికీ సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు. శ్రీ పాండురంగ స్వామి వారు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉండటానికి పుండరీకుడే కారణంగా చెబుతుంటారు.

పాండురంగడి భక్తుడైన పుండరీకుడిని దర్శించుకుంటే.

పాండురంగడి భక్తుడైన పుండరీకుడిని దర్శించుకుంటే.

పాండురంగడి భక్తుడైన పుండరీకుడిని దర్శించుకుంటే.. స్వామిని స్వయంగా దర్శించుకున్న ఫలితం లభిస్తుందని చెబుతారు. ఆ కారణం చేతన స్నానాధికాలు చేసిన భక్తులు మొదటగా పుండరీకున్ని దర్శించుకుంటారు. పాండుగరండి ఆలయానికి సరిసమానంగా ఉన్న పుండరీకుని మందిరం శోభ మనోహరంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు పుండలీకుని భక్తితో ధ్యానించుకుని తరిస్తారు.

Parag Mahalley

శ్రీ పాండురంగడు స్వామి ఆలయానికి

శ్రీ పాండురంగడు స్వామి ఆలయానికి

శ్రీ పాండురంగడు స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. 18వ శతాబ్దం కాలం నుండే ఈ ఆలయాన్ని అభివ్రుద్ది చేసినట్లు తెలుస్తోంది.'

RashT27

పుండలీకుని దర్శించుకున్న తర్వాత

పుండలీకుని దర్శించుకున్న తర్వాత

పుండలీకుని దర్శించుకున్న తర్వాత భక్తులు ప్రధాన ఆలయం పాండురంగడి దేవాలయానికి చేరుకుంటారు,. ప్రధాన ఆలయానికి వెలుపలి భాగంలో స్వామి వారికి నైవేద్యం సమర్పించడానికి అవసరమైన పూజాద్రవ్వాలన్నింటిని సేకరించుకుని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయానికి ముందు భాగంలో సంత్ నామ్ దేవ్ మహాద్వారం ముందుగా దర్శనం ఇస్తుంది. ప్రధాన ద్వారానికి ముందు భాగంలో కుడువైపున చౌకమేళ మందిరం దర్శనం ఇస్తుంది. పాండురంగ స్వామి వారి భక్తుడైన చౌకమేళ భక్తుల కోరికలను స్వామి వారికి చేరవేస్తారని చెబుతుంటారు..

Redtigerxyz

చౌకమేళ మందిరిలో చౌకమేళ మూర్తి దర్శించుకున్న భక్తులు

చౌకమేళ మందిరిలో చౌకమేళ మూర్తి దర్శించుకున్న భక్తులు

చౌకమేళ మందిరిలో చౌకమేళ మూర్తి దర్శించుకున్న భక్తులు తర్వాత ప్రదాన ద్వారం వెలుపలి బాగానికి చేరుకుంటారు. ప్రధాన ద్వారానికి ముందు మద్య భాగంలో నాం దేవ్ మహరాజ్ సుందర రూపం దర్శనమిస్తుంది. పండరీపురం శ్రీ పాండురంగ స్వామి వారి దర్శన కోసం వచ్చే భక్తులు ముందుగా నామ్ దేవ్ మహారాజ్ వారి మూర్తిని దర్శించుకుంటేనే పాండురంగ స్వామి వారిని దర్శించుకున్న ఫలం దక్కుతుందని చెబుతారు. ఆ కారణంగానే భక్తులు ముందుగా నామ్ దేవ్ మహారాజు వారి మూర్తి రూపాన్ని దర్శించుకుని తరిస్తారు. నామ్ దేవ్ మహా రాజు సమీపంలో నామ్ దేవ్ మహారాజ్ మెట్లు దర్శనమిస్తాయి.ఉత్సవాలప్పుడు ఈ మెట్ల మార్గం ద్వారానే ప్రధాన ఆలయంలోకి చేరుకుంటారు.

శ్రీ పాండురంగస్వామి కొలువుదీరడం వెనుక ఒక పురాణగాథే

శ్రీ పాండురంగస్వామి కొలువుదీరడం వెనుక ఒక పురాణగాథే

పండరీపురంలో శ్రీ పాండురంగస్వామి కొలువుదీరడం వెనుక ఒక పురాణగాథే ఉంది. పుండరీకుడు అనే వాడు ఇహ భోగాలకు మోహితుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడట. అప్పుడు అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకుని, తమ కొడుకు బుద్ది మార్చమని అర్థించేవారట. కాలక్రమంలో వేశ్యాలయుడైన పుండరీకుడు తల్లిదండ్రులను, భార్యను కూడా ఇంట్లో నుండి గెట్టివేశాడట.

Balkrishna Kulkarni

అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఝానోదయమై

అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఝానోదయమై

అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఝానోదయమై అహో రాత్రులు అన్నపానీయాలు మానుకుని ప్రశ్చ్యాతాప హృదయంతో తమ తల్లిదండ్రులకు సేవచేశాడట. పాండురంగ భక్తుడైన పుండరీకున్ని శ్రీ హరి పరీక్షించదలచి, పుండరీకుడి దగ్గరకు వచ్చి, తాను వచ్చానని చెప్పాడట. అంతలో పుండరీకుడు తాను తన తల్లిదండ్రుల సేవలో ఉన్నాని, అతని వద్దకు ఒక ఇటుకను విసిరి అక్కడ దాని మీద ఆసీనులు కండి అని చెప్పాడట.పుండరీకుడు వచ్చేవరకు శ్రీకృష్ణుడు ఆ ఇటుకరాయి మీద నిలబడి వుంటాడు. అంతట శ్రీహరి అక్కడే శిలారూపుడైయడని స్థల పురాణం చెబుతున్నది. శ్రీహరి అలా శిలారూపుడైన దివ్వ క్షేత్రమే పండరీపురం.

Redtigerxyz

శ్రీకృష్ణుడు అతని పితృభక్తికి మెచ్చి ఏదయిన వరం కోరుకోమనగా

శ్రీకృష్ణుడు అతని పితృభక్తికి మెచ్చి ఏదయిన వరం కోరుకోమనగా

శ్రీకృష్ణుడు అతని పితృభక్తికి మెచ్చి ఏదయిన వరం కోరుకోమనగా పుండరీకుడు శ్రీకృష్ణనుని అక్కడే వుండిపొమ్మని కోరతాడు.శ్రీకృష్ణుడు అలాగే అని ఆ ఇటుక మీదనే నిలబడివుంటాడు.మధురలో వున్న రుక్మిణీదేవి కృష్ణుడు కనుపించక పోవటంతో ఆయనను వెదుక్కుంటూ వచ్చి న రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు పండరీపురంలో నిలబడి వుంటం చూచి తాను కూడ ఇక్కడినే వుండిపోయిందట.కాని తనతో చెప్పకుండ కృష్ణడు వచ్చినందుకు అలిగిన రుక్మణీదేవి ఆయనప్రక్కన కాకుండ కొంత దూరంగా వుండి పోయింది అని చెబుతారు.అందువలననే కాబోలు పాండురంగ ఆలయం ఉన్న ప్రాంగణంలోనే వెనుక ప్రక్క రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది.

గర్భగుడిలో ఎతైన అరుగు మీద పాండురంగ స్వామి

గర్భగుడిలో ఎతైన అరుగు మీద పాండురంగ స్వామి

గర్భగుడిలో ఎతైన అరుగు మీద పాండురంగ స్వామి రెండుచేతులు నడుం మీద పెట్టుకుని ఠీవిగా నిల్చుని వున్న స్వామి వారి అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు చాలవు. పాండురంగస్వామివారి పాదాలపై మన శిరస్సు పెట్టి నమస్కరించుకుంటాము..పాండు రంగ స్వామి వారి పాదాలను స్పర్శించి నప్పుడు మనకు ఎంతో ఆనందంగా; ఏదోతెలియని తృప్తి కలుగుతుంది. పుండరీకుడి కోసం వచ్చి ఎండలో నిలబడి , నిలబడి ఎంత నల్లగా అయ్యావు తండ్రీ అని అనిపిస్తుంది.భక్తుల మీద ఆయనకున్న ప్రేమకు ఆనందంతో మన కళ్ళు చెమరిస్తాయి.ఇక్కడ స్వామివారిని తులసీదళాలతో పూజిస్తారు.

Balkrishna Kulkarni

ప్రక్కన వున్న ఉపాలయాల్లో రుక్మణి,సత్యభామ

ప్రక్కన వున్న ఉపాలయాల్లో రుక్మణి,సత్యభామ

ప్రక్కన వున్న ఉపాలయాల్లో రుక్మణి,సత్యభామ ,రాదధాదేవి ,కాలభైరవుడు,దత్తాత్రేయుడు,సూర్యనారాయణుడు ,మహాలక్ష్మీ,వేంకటేశ్వరస్వమి వున్నారు.
ఇక్కడ ఉన్న దేవతామూర్తల పాదాలు స్పృశించి నమస్కరించు కోవచ్చు.రుక్మణీదేవి ఆలయంలో కుంకుమ పూజ చేసుకున్నాము.అమ్మ రుక్మిణీదేవి ఆలయంలో వున్న రుక్మిణిదేవి పాదాలు స్పృశించవచ్చు.

శుద్ధ ఏకాదశికి ఉత్సవాలు

శుద్ధ ఏకాదశికి ఉత్సవాలు

పండరిపురం ఆలయంలో ఆషాడ శుద్ధ ఏకాదశికి,కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్సవాలు జరుగుతాయి.ఆషాఢ శుద్ధ ఏకాదశి మొత్తం ఏకాదశుల్లో తొలిది. అంటే ఇది ప్రథమేకాదశి. ఈనాటి రాత్రి వైష్ణవాలయాల్లో విష్ణు శయన వ్రతాలు ఆచరిస్తారు. విష్ణు విగ్రహాన్ని ఆభరణాదులతో అలంకరించి, జాజిపువ్వులతో పూజిస్తారు. పవళింపు సేవ చేస్తారు. కీర్తనలు పాడతారు. చంద్రభాగ నదీ తీరాన పండరిపురం (మహారాష్ట్రలో ఉంది) కొలువైన విఠలుని వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలి. అక్కడ ఈ తిథి నాడు గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశినే శయనైకా దశి అనీ అంటారు. సతీ సక్కుబాయి ముక్తి పొందినది ఈ ఏకాదశి నాడే.

van j

 భీమానది

భీమానది

పూర్వం త్రిపురాసురుడునే రాక్షసుడు మదాంధుడై దేవతలను ,మునులను ,ప్రజలను భాధిస్తూ వుండేవాడు .అతడు పెట్టె బాదలను భరించలేక దేవతలు ,మునులు వెళ్లి శివుణ్ణి శరణువేడారు .శివుడి కి త్రిపురాసురుడికి చాలరోజులపాటు భీకర యుద్ధంజరిగింది .చివరకు పరమేశ్వరుడు త్రిపురసురుడిని వధించి ముల్లోకాలకు విముక్తి కలిగించాడు .ఆసమయంలో మహాదేవునికి చాల అలసట కలిగింది సహ్యాద్రి పర్వత శ్రేణులలోని ఈ ఎతైన శిఖరాలకు వచ్చాడు .అప్పడు ఆయన శరీరంనుండి చెమట ధారలుగా ప్రవహించింది .ఆ ధారలన్ని ఒక ప్రవాహంగా వచ్చి కొలనుగా మారాయి .అక్కడి నుంచి పుట్టిన నది పేరు భీమానది .

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X