Search
  • Follow NativePlanet
Share
» »ఒక కన్య అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలసిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం-పెనుగొండ

ఒక కన్య అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలసిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం-పెనుగొండ

పెనుగొండలో వాసవీ అనే కన్య -శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ అవతారం ఎత్తడం వెనుక అసలు రహస్యం

దేవతల లోకకళ్యాణం కోసం అవతారాలు ఎత్తుతుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తుదని చెబుతుంటారు. అలాంటి వాటిలో 'శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి' రూపానికి ఎంతో విశిష్టత వుంది. కన్య పరమేశ్వరి దేవిగా అవతరించి అక్కడి వైశ్యులకి కులదేవతగా మారింది. ఈ రూపంలో అమ్మవారు కొలువుదీరిన ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని 'పెనుగొండ'లో విలసిల్లుతోంది. మరి ఈ వాసవీ అనే కన్య ఆ పరమేశ్వరి అవతారం ఎత్తడం వెను పురాణగాథ ఏంటి? ఎందుకు అలా అవతారం ఎత్తాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ ఆలయ పురాణాగాథ ప్రకారం

ఈ ఆలయ పురాణాగాథ ప్రకారం

ఈ ఆలయ పురాణాగాథ ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండ అనే గ్రామంలో కుసుమ శ్రేష్టి, కౌసుంబి అనే వైశ్య దంపుతులుండేవారు. వీరికి పెళ్ళై ఎన్ని ఎళ్ళు గడిచినా సంతానం కలగలేదు. అందుకని కుసుశ్రేష్టి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి, రెండు ఫలములను ప్రసాధించి కౌసుంబిన తినమని చెపింది. ఆ ఫలం భుజించిన తర్వాత ఆ దంపతులకు వాసవీ అనే కన్య జన్మించింది. ఆమె ఎంతో గుణవంతురాలు, అపురూప సౌదర్యవతి. అయితే ఆమెని విష్ణువర్డనుడను రాజు చూసి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

వెంటనే మంత్రిని పిలిపించి పెనుగొండకు వెళ్ళి కుసుమశ్రేష్టిని కలిసి

వెంటనే మంత్రిని పిలిపించి పెనుగొండకు వెళ్ళి కుసుమశ్రేష్టిని కలిసి

వెంటనే మంత్రిని పిలిపించి పెనుగొండకు వెళ్ళి కుసుమశ్రేష్టిని కలిసి, వాసవిని పెళ్ళి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకుని రమ్మని పంపాడు విష్ణువర్థనుడు. అయితే వైశ్యకుటుంబంలో జన్మించిన వాసవికి , క్షత్రియ కులానికి చెందిన రాజుతో వివాహాన్ని నిరాకరించడా కుసుమశ్రేష్టి.

అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు, పెనుగొండ ప్రజలు

అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు, పెనుగొండ ప్రజలు

అయితే ఆవిషయం తెలుసుకున్న విష్ణువర్థనుడు కోపోద్రోక్తుడై, ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికైనా వెనుకాడనని మళ్లీ రాయబారానికి మంత్రిని పంపాడు.

అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు, పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. రాజుకు వాసవితో వివాహం జరిపించడం కొంత మంది సమర్థించగా, ఎంతటి రాజైనా సరే కులగౌరవం కాపాడుకోవడం కోసం మరోకులానికి చెందని వారికి వాసవిని ఇచ్చి పెళ్లి చేయడం సంప్రదాయ, ఆచారాలను మర్చిపోకూడదన్న అభిప్రాయాన్ని తెలిపారు మరికొందరు. అంతలోనే సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకుని పోయి వివాహానికి సిద్దమయ్యేడు విష్ణువర్థనుడు.

ఈ విషయం తెలుసుకున్న కుసుమశ్రేష్టి,

ఈ విషయం తెలుసుకున్న కుసుమశ్రేష్టి,

ఈ విషయం తెలుసుకున్న కుసుమశ్రేష్టి, పెనుగొండ ప్రజలు వాసవికి అగ్నిప్రవేశం చేయడమే మార్గం అని సూచించారు. ఆ విషయం వాసవికి తెలియజేయగా, అందుకు, తండ్రితో ఇలా అన్నంది. తండ్రి! అంబిక అంశమైన నేను మానవ మాత్రులను వివాహమాడలేను. అందుకే జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులుపడకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనం ఇచ్చింది.

భవిష్యత్తులో జరగబోవు దృశ్యాలను కుసుమ శ్రేష్టికి చూపింది వాసవి

భవిష్యత్తులో జరగబోవు దృశ్యాలను కుసుమ శ్రేష్టికి చూపింది వాసవి

భవిష్యత్తులో జరగబోవు దృశ్యాలను కుసుమ శ్రేష్టికి చూపింది వాసవి. అగ్నిప్రవేశం, రాజు మరణం, విష్ణువు యొక్క అంశమైన విరూపాక్షుడు పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం కావడం లాంటి దృశ్యాలను చూసిన కుసుమ శ్రేష్టి ఖిన్నుడయ్యాడు.

అన్నీ తెలుసుకున్న కుసుమశ్రేష్టి అగ్నిప్రవేశానికి

అన్నీ తెలుసుకున్న కుసుమశ్రేష్టి అగ్నిప్రవేశానికి

అన్నీ తెలుసుకున్న కుసుమశ్రేష్టి అగ్నిప్రవేశానికి హోమగుండాలను తయారు చేయించాడు. అందులో అగ్నిదేవుడిని ఆవాహన చేశారు. రాజుకు వాసవినిచ్చి పెళ్లి చేయడానికి సమర్ధించిన కొంతమంది ప్రజలు రాజు పెనుగొండ వద్దకు వచ్చాడని తెలియగానే ఊరు వదిలి వెళ్లిపోయారు. కులగౌరవం కాపాడడానికి రాజుతో వివాహం జరగకూడదని చెప్పినవారందరూ అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యారు.

వాసవి వారికి దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనవసరంలేదు.

వాసవి వారికి దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనవసరంలేదు.

వాసవి వారికి దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనవసరంలేదు. ఒక్కోక్క కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసింది. అందరు అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండం లోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి.

అంబిక తన విశ్వరూపాన్ని చూపింది

అంబిక తన విశ్వరూపాన్ని చూపింది

అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. "ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను, నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టీశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయినవారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి.

విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోనికి ప్రవేశించాడు. వాసవి అగ్నిప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రమ చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై, రాజును తన ఖడ్గంతో సంహరించింది.

విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు

విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు

విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజనరేంద్రుడు క్రుంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సణరించ్బడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్ధించాడు. విరూపా్క్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు.
పెనుగొండ ప్రజలు దేవిఉ ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట కావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటిచెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేం.

ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా రెండు నందులు.

ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా రెండు నందులు.

ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా రెండు నందులు. ధ్వజస్తంభం. దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగవిగ్రహం ప్రతిష్టించారు. విశాలమైన ప్రాకారం ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు. ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి. ఆ తర్వాత తోరణమండపం వెనుకవైపు ద్వారం కనిపిస్తుంది.

వెంకటేశ్వరస్వామికి ప్రత్యేకమైన సన్నిధి చిన్న గోపురం వున్న ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ట చేశారు. పుట్టలో వున్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం, తర్వాత ఆంజనేయస్వామి విగ్రహం.

ప్రధాన మండపంలో మూడు గర్భ గుడులు వరుసగా వున్నాయి

ప్రధాన మండపంలో మూడు గర్భ గుడులు వరుసగా వున్నాయి

ప్రధాన మండపంలో మూడు గర్భ గుడులు వరుసగా వున్నాయి. ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువైయ్యాడు. ఎడమవైపున గర్భగుడిలో మహిషాసురమర్ధిని విగ్రహం దర్శించగలం.

ఈశ్వరుడికి కుడివైపున వాసవి దేవి కొలువైంది. ఒకచేత చిఉలుక, మరొక చేత వీణ, మరో రెండు చేతులలో తామరపువ్వు పాశము వున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్య ప్రకాశంతో జ్వలిస్తోంది.

వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి

వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి

వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి ఆ వాసవి దేవి, వంశప్రతిష్గ్ట కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్దపడిన వాసవిదేవి త్యాగానిరతి కొనియాడబడినది.

లక్ష్మీ జనార్ధనస్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో, దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం గురించిన పురాణకధ తెలిసి మాటలు రాక సంభ్రమాశ్చర్యాలకు లోనౌతారు. ఆ తల్లి త్యాగం తెలిసిన తర్వాత ఎటువంటి వారైన కన్నీటి పర్వంతమౌతారానడం అతిశయోక్తి కాదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X